మూలం : ఎ.మంజునాథ్
అనువాదం : కల్లూరు జానకి రామారావు
‘నవ్వు’ అనే రెండక్షరాల పదం ఎంత మధురం!
జీవనపు వివిధ దశల వివిధ రకాల నవ్వులలో ఎంత మాధుర్యం!
ప్రసవసమయంలో తల్లి అనుభవించిన యాతన
పసివాడి ఆగమనాన మరపించి, ఆనందింపజేసే ఆ నవ్వు
వసివాడని, వన్నెతరగని దా నవ్వు
చిరుత ప్రాయాన జతగాండ్ర గూడి ఆడిన ఆ సంతోష
కర సమయాన నవ్విన ఆ నవ్వు వత్సరాలు గడిచిపోయినా
మరలమరల గురుతుకు తెచ్చే ఆ నవ్వు మహత్యం అంతటిది
యవ్వనాన ఓ యువతి/ యువకుడు చూచి నవ్విన నవ్వు
ఆ ఉదయించే చక్కలిగిలి పులకింత, ఆ నవ్వు సుఖంబు
జీవనంబెల్ల అనుభవించక నుండెడి వారెవరు!
వివాహానంతరం ఇల్లాలి సుందర దరహసితంబునకు
వివశుడై జీవితాంతం ఆమె ఆరాధనలోనే జీవనంబు గడుపు
నవ్వది తన యభిలాషలన్నింటి తీర్చుకోగలిగిన కొంటెనవ్వు
తాత అవ్వల బోసి నోటినుంచి వెల్వడు ఆ నవ్వు
ప్రీతిన్ మనుమలు హాస్యమాడ పంచెడి ఆ నవ్వు
అతి జీవనోత్సాహంబిచ్చి పరవశింపజేయు
![]()
జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.




Discussion about this post