• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఉర్దూ కథ: భ్రమ

చింతపట్ల సుదర్శన్ by చింతపట్ల సుదర్శన్
August 10, 2026
in అనువాద కథలు
0
ఉర్దూ కథ: భ్రమ

ఉర్దూ కథ: మహమ్మద్ మన్షా యాద్
అనువాదం : చింతపట్ల సుదర్శన్

ఎగ్జిబిషన్ కి వెళ్లాల్సిన రోజు దగ్గర పడింది. అమ్మాయి ఇంట్లో ఉంది కానీ నక్క ఇంకా దొరకనే లేదు అద్దెకు ఒకదాన్ని సంపాదించాలి అనుకున్నాడు ఖైరుద్దీన్. “నక్క లేకుండా ఎగ్జిబిషన్ కి వెళ్లలేం” అంటూ నిట్టూర్చాడు.

“ఎందుకు వెళ్ళలేం అబ్బా!” అడిగాడు ఫీకా.

“జనానికి మనమేక మీద ఆసక్తి పోయింది దాని అరుపులు విని విని విసుగెత్తిపోయారు ఇక మేకతో లాభం లేదు.”

“పోనీ ఓ కొండచిలవో, పామో తీసుకెళ్దాం”

ఎలాగైనా ప్రదర్శనకు పోవాలని ఫీకా తాపత్రయం.

“అవి ఇప్పుడు పాతబడి పోయినవి” అన్నాడు ఖైరుద్దీన్.

నక్క దొరకలేదని తెలిసి షాహిదాకు హాయిగా ఉంది. తన మనసులో తండ్రికి నక్క దొరకనే కూడదని అల్లాను ప్రార్థించింది. కానీ ఆమె ప్రార్థనన అల్లాకు చేరినట్టు లేదు. ప్రదర్శనకి మూడు నాలుగు రోజుల ముందు అవసరమైన డబ్బు ఇచ్చి ఇంటికి ఒక నక్కను తీసుకువచ్చాడు ఖైరుద్దీన్. తను అనుకున్నది సాధించానన్న ఆనందంతో పెద్దగా, లౌడ్ స్పీకర్ లో ప్రకటిస్తున్నట్టుగా “రండి రండి! అందరూ రండి! త్వరగా తయారవ్వండి మనం ప్రదర్శనకి వెళ్తున్నాం” అన్నాడు.

ఈ అరుపులకు షాహిదా తల తిరిగింది. ప్రదర్శనలో చప్పుళ్ళు, అలజడి ఆమె చెవుల్ని బద్దలు కొట్టేటట్టు వినబడ్డాయి. మృత్యుకూపంలో మోటార్ బైక్ మీద తిరుగుతున్నట్టు అనిపించింది. చాలా సంవత్సరాలు ఆమె ఎగ్జిబిషన్ లో ఒక ప్రదర్శన వస్తువుగా ఉండింది. ప్రతిసారి ఏదో ఒక శరీరానికి తన తలను తగిలించి ప్రదర్శించే వాడు తండ్రి. ఒకసారి మేకకి తలగా ఒకసారి పాముకి తలగా ఒకసారి నక్కకి తలగా ఉండేది. అలా ఒకే పొజిషన్లో గంటల తరబడి కూర్చోవలసి ఉండడం వల్ల వచ్చే వీపు నొప్పితో బాధపడేది, కాళ్లు తిమ్మిర్లు పట్టేవి. తన శరీరం పాముగా నక్కగా మేకగా మారకపోయినా పూర్తిగా రాయిగా మారిపోతుందని అనుకునేది. ఆమెకు తన అందమైన ముఖం అంటే గర్వంగా ఉండేది. కానీ తన చక్కని ముఖం మాత్రం కనిపించి మిగిలిన శరీరం పరదా వెనుక కనిపించకుండా ఉండడం నచ్చేది కాదు. ఎగ్జిబిషన్ కి అన్ని రకాల మనుషులు వచ్చేవారు.కానీ పిల్లలకు మాత్రమే తన ముఖం ఆశ్చర్యం కలిగించేది. ముసలి వాళ్లు ఆమె వైపు కామంతో ఆశగాచూసేవాళ్ళు. యువకులు కొందరు కన్ను కొడుతూ ఈల వేసేవారు. కొందరైతే అసభ్యంగా సైగలు చేసేవారు. ఆమె అవమానంతో చితికిపోయేది.

కానీ తనకు చెప్పిన విధంగా ఉండడానికి, చిరునవ్వు చెదరకుండా కూర్చునేది. అవతలి వాళ్ళ ప్రభావం తన మీద పడకుండా చూసుకునేది. ఒక విగ్రహంలా కూర్చోవడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. సర్కస్ లో, రంగస్థలం మీద నిజంగా ప్రదర్శనలు ఇచ్చే గాయకులు, నర్తకులు, విన్యాసాలు చేసే వారిపై ఈర్ష్య కలిగేది. ఎక్కడైనా మనుషులు ఏదో ఒక పని చేస్తూ కనిపించేవారు. కానీ తను ఒక్కతే రాయిలా కూర్చొని ఎంత విసుగు వచ్చినా తనకు ఏమాత్రం లేని ఉల్లాసాన్ని నటించాల్సి వచ్చేది. జనం విసిరే చెడు మాటల్ని చేసే అసహ్యపు సైగల్ని చిరునవ్వుతో భరించాల్సి వచ్చేది, చిరాకు పుట్టించే ముఖాలని చిరునవ్వుతో భరిస్తూ రాత్రి పొద్దు పోయేదాకా నటిస్తూ ఉండేది. ఒక్కోసారి ఎంతో విసుగు వచ్చి అలసిపోయిన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఉబికి వచ్చేవి. తను పిచ్చిది కాకుండా ఉండడానికి తన మనసులో ఆలోచనలను ఎక్కడెక్కడికో పంపేది. తన షో కోసం మోగే సినిమా పాటలు వింటూ తన్ను తాను మరిచిపోయేది. గుంపులుగా వస్తున్న జనంలో తన మనస్సుకి నచ్చే ముఖం ఏదైనా కనిపిస్తుందేమోనని చూసేది. గంటల తరబడి పగలు పగటి కలలు కంటూ సమయాన్ని మర్చిపోయేది. ఈ విధంగా తప్పించుకునే మార్గాలు వెతుక్కోవడం వీలు కాకపోతే ఈపాటికి ఎక్కడికైనా పారిపోయేది లేదా పిచ్చిదై పోయేది.

“షాహిదా ఈసారి ప్రదర్శనకు రాదు” అంది తల్లి.

“ఎందుకు రాదు?” ఖైరుద్దీన్ అన్నాడు కోపంగా.

” ఇప్పుడు అది పెద్దదయింది”

“ఒక ఏడాదికే”

“అవును. పోయిన ఏడు చిన్నపిల్లే. కానీ ఇప్పుడు పెద్దదయింది. ఆడపిల్లలు ఇట్టే ఎదిగిపోతారు.”

“చాలు చాల్లే ఎక్కువ మాట్లాడకు. దాన్ని తయారు చెయ్యి.”

“నా మాట విను. దానిమీద ఏమాత్రం ప్రేమ లేదు నీకు.”

“దానికి ఏం కాదు. అరవకు.”

“దాన్ని ఒంటరిగా పంపను. నేను వెంట వస్తాను.”

“వచ్చి…వచ్చి ఏం చేస్తావ్?”

“దాన్ని చూసుకుంటాను”

ఖైరుద్దిన్ ఫక్కున నవ్వాడు “విన్నావా ఫీకా మీ అమ్మ షాహిదాకు కాపలా కాస్తుందట. మనకు అసలు షాహిదా ఏమీ కానట్టు. దాన్ని అన్నా తండ్రీ కాక ఇంకెవరు బాగా చూసుకోగలరు. మీ అమ్మకు వెర్రాపిచ్చా”

“ఎదిగిన ఆడపిల్లని తల్లి మాత్రమే చూసుకోగలదు.”

“అంటే మేం ఇన్నాళ్ళ నుంచి చూసుకోలేదా?’’ ఫీకా అన్నాడు “ఏమైంది తనకిప్పుడు”

“నువ్వు ఊరుకో!” అని గద్దించింది తల్లి కొడుకుని.

“ఫీకా అన్న దాంట్లో తప్పేమీ లేదు. ఇప్పటిదాకా నువ్వే వెంట ఉండి చూసుకున్నావా?”

“అరే.. ఇప్పటి సంగతి వేరు ఇప్పుడు అది చిన్న పిల్ల కాదు.”

“పెద్దమ్మాయి అయితే ఏంటి ఏం చేయమంటావు ఇప్పుడు”

“చాలు! చాలు! అనవసరంగా మాట్లాడకు. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించు”

“నోరు ముయ్యి. సిగ్గులేదా నీకు. ఆడపిల్ల సంపాదన మీద బ్రతకడానికి?”

“ఎందుకు సిగ్గుపడాలి? మన కోసమే కదా మనం కష్టపడుతున్నాం”.

“అర్థం లేకుండా మాట్లాడకు. నువ్వు ఏమనుకుంటున్నావ్? జనం అక్కడికి షో చూడటానికి ఆ మాటకొస్తే నీ మేకని నక్కని చూడడానికి వస్తారని అనుకుంటున్నావా? వాళ్ళు నీ అందమైన కూతురు ముఖం చూడడానికి వస్తారు.”

“వాళ్ళు చూసినంత మాత్రాన నీ కూతురు ముఖం అపవిత్రమైపోతుందా?”

“అవునమ్మా! ఏమవుతుంది? జనం వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు. నష్టం ఏమిటి?’’

“సిగ్గులేని పోరడా!”

“నువ్వేం బెంగ పెట్టుకోకు. దాన్ని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాం సరేనా!”అన్నాడు ఖైరుద్దీన్.

“అవునమ్మా భద్రంగా తీసుకువస్తాం.”

‘‘నీకు అసలు సిగ్గే లేదు రా!”

“ఇందులో సిగ్గుపడాల్సిందేముందమ్మా. నక్క శరీరం అక్క ముఖం అంతే! జనానికి భ్రమ కలిగించే షో మాత్రమే. కూటికోసం కోటి విద్యలన్నారు కదమ్మా” ఫీకా అన్నాడు.

“ఆహా ఆ కోటి విద్యల్లో మరొకటి ప్రయత్నించవచ్చు కదా!”

“సరే సరే తర్వాత చూసుకుందాం ఇప్పటికైతే తయారవు ఫీకా” అన్నాడు తండ్రి.

ఏర్పాట్లు మొదలయ్యేయి. ఒక సూట్ కేసులో కొన్ని గిన్నెలు, కూతురు బట్టలు సర్దింది తల్లి. వాతావరణం వేడిగా ఉంది. ఉక్కపోస్తుంది. ఇది మందమైన పరదా వెనుక గంటలకొద్దీ కూర్చోవాలి. గాలి ఆడదు అని తల్లి ఇంటి పనులు అన్నీ పక్కన పెట్టి, పల్చటి గుడ్డతో షాహిదాకు సౌకర్యంగా ఉంటుందని పొడుగాటి చొక్కా కుట్టింది. ఫీకా టెంట్ మూట కట్టి, టేబుల్, స్టూల్ ఇతర సామాగ్రి సిద్ధం చేశాడు. మర్నాటి ఉదయం నలుగురూ బయలుదేరారు ఖైరుద్దిన్, ఫీకా, షాహిదా, షో కోసం తెచ్చిన నక్క.

ఎగ్జిబిషన్‌లో మొట్టమొదటి రోజు స్త్రీలకు పిల్లలకు ప్రత్యేకంగాకేటాయించబడింది. కానీ ఎందరో మగవాళ్లు లోపలికి చొరబడ్డారు. పిల్లలు ఆడపిల్ల మొహంతో ఉన్న నక్కతో మాట్లాడ్డానికి చాలా ఉత్సాహ పడ్డారు. రోజంతా టికెట్లు అమ్ముడుపోయాయి. ఖైరుద్దీన్ చాలా సంతోషపడ్డాడు. మంచి తిండి ఏర్పాటు చేశాడు. షాహిదాకు ఐస్క్రీం ఇప్పించాడు. గాజులు, కాటుక కొనుక్కోవడానికి డబ్బు ఇచ్చాడు. మర్నాడు రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. వ్యాపారం జరగలేదు. షాహిదాకు మాత్రం విశ్రాంతి దొరికింది.

ఇక మూడవరోజు విపరీతమైన ఎండ ఉంది,కానీ జనం వచ్చారు. మధ్యాహ్నం కల్లా ప్రదర్శన మైదానం జనంతో కిటకిటలాడింది. నడవడానికి జాగా లేక ఒకళ్ళని ఒకళ్ళు ఢీకొట్టుకున్నారు. ఫుడ్ స్టాల్స్ లో జనమే జనం. గారడీ వాళ్ళు పాములాడించేవాళ్ళు, పోట్లాడే ఎలుగుబంట్లు, కామోద్దీపన కలిగించే మందులు అమ్ముకునేవాళ్లు, పీకినట్టు ఏమాత్రం తెలియకుండా దంతాలు పీకుతామనే నకిలీ దంత వైద్యులు అందరి చుట్టూ జనం గుంపులు గుంపులుగా చేరారు. థియేటర్లు కూడా నిండాయి. వాటి లోపలి నుంచి పాటలు, మాటలు బయట వరకు వినిపించ సాగాయి. ఒకచోట ప్రదర్శనలో జానపద నర్తకి హీర్ సియల్ నడుము తిప్పడం ఉర్రూతలూగించింది. మరొకచోట మజ్నూ పిచ్చిపిచ్చిగా లైలా ఓ లైలా అని కేకలు పెట్టాడు. సర్కస్ చూస్తున్న వారు ఆడవాళ్ళ విన్యాసాల కన్నా వాళ్ళ కాళ్ళను, బిగుతు శరీరాలను, అందమైన ముఖాలను ఆసక్తిగా చూడసాగారు. సర్కస్ కు థియేటర్ లకు టికెట్లు పెట్టి కొని వెళ్లడానికి సరిపడా డబ్బు లేని వాళ్ళు ఇతర వినోదాలను వెతుక్కోసాగారు. ఎత్తైన వేదికల మీద నవ్వే హాస్యగాళ్లను, ఆడవాళ్ళ దుస్తుల్లో సినిమా పాటలకు డ్యాన్సులు చేసే కొజ్జాలను, మృత్యుకూపంలో మోటార్ సైకిల్ తిప్పే మొనగాళ్లను చూడటానికి విరగబడ్డారు. ఆరోజు ఎగ్జిబిషన్ కు మగవాళ్లే అధికంగా వచ్చారు. జిప్సీలు, బిచ్చగత్తెలు వంటి కొద్దిమంది ఆడవాళ్లు లేకపోలేదు. సర్కస్ లో, థియేటర్లలో ఆడి పాడే ఆడవాళ్లు ఉన్నారు. ఇవాళ చాలా టికెట్లు అమ్ముడు పోతాయి అనుకున్న ఖైరుద్దీన్ నిరాశకు గురయ్యాడు. మైదానం నిండా జనం ఉన్నారు కానీ ఆడపిల్ల ముఖంతో ఉన్న నక్కను చూసే టెంటు వైపు రావడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు.

“ఏరా ఫీకా జనం ఇక్కడికి ఎందుకు రావడం లేదు? అడిగాడు కొడుకుని.

“జనానికి నక్కను చూడాలని ఆసక్తి లేకుండా పోయినట్టుంది” అన్నాడు ఫీకా సిగరెట్టు వెలిగిస్తూ.

“ఎందుకు ఫీకా? ”

“ఎందుకంటే ఈరోజుల్లో ప్రతి మనిషీ నిజానికి ఓ నక్కే కదా అబ్బా!”

“అదెలా?”

“నీకు తెలుసు కదా మేక- నక్క కథ. జనం మరీ జిత్తుల మారులుగా తయారయ్యారు. అవతలి వాళ్లను గోతిలోకి దించి వాళ్ళ భుజాల మీద ఎక్కి పైకి చేరుకోవాలి అనుకుంటున్నారు, సరిగ్గా నక్క మేకను మోసం చేసినట్టు చేయాలనుకుంటున్నారు. ”

“మరి మొదటి రోజు మన వ్యాపారం బాగానే జరిగింది కదా!”

ఆరోజు స్త్రీలకు పిల్లలకు మాత్రమే కేటాయించబడింది కనుక అబ్బా”

“ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఇంకేదైనా విద్యను ఎంచుకోవాలి మీ అమ్మ ఆ మాటే అంది కదా.”
కాలువ దగ్గరికి పోతూ ఖైరుద్దీన్ నక్క మీద ఎంత ఖర్చయిందో లెక్క చూసుకున్నాడు. మొట్టమొదటిసారిగా జీవితంలో మరే పనైనా చేయాలన్న ఆలోచన మొదలైంది. ఆ మధ్యాహ్నం ఒక విచిత్రం జరిగింది. ఎండ మండిపోతున్నది. హఠాత్తుగా జనం గుంపులు గుంపులుగా వచ్చారు. టికెట్లు అమ్ముడుపోవడం మొదలైంది. మొదట్లో ఖైరుద్దీన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కానీ లోపలికి వెళ్ళిన జనం ఎవరూ బయటకు రావడం లేదు. ఫీకా టెంటు లో జనం నిండిపోయారని వాళ్ళని బలవంతంగా బయటకు పంపితే, బయటకు వచ్చినవాళ్లు మళ్ళీ టికెట్లు తీసుకొని లోపలికి వెళ్తున్నారు. తండ్రి ఫీకాను అడిగాడు జనానికి హఠాత్తుగా తమ షో మీద ఎందుకు ఆసక్తి వచ్చిందని.

ఫీకా నవ్వాడు “అది ఓ భ్రమ! వ్యామోహం! గాలి ఎటు వీస్తే అటు వెళ్తారు జనం. ఇలా ఇదివరకు కొన్నిసార్లు జరిగింది. ఒక్కోసారి ఏ ప్రత్యేక కారణం లేకుండానే జనం విరగబడి వస్తారు. జనం రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలుసు” అన్నాడు. సంతోషంగా టికెట్లు అమ్మసాగాడు ఖైరుద్దీన్. క్షణక్షణానికి జనం ఎక్కువయ్యారు. మొట్టమొదటిసారి టెంట్ ముందు పొడుగాటి క్యూలో నిలబడ్డారు జనం. ఖైరుద్దీన్ కు అంతా అయోమయంగా ఉంది. ఫీకాని పిలిచాడు.

“అంతా బాగానే ఉందా? ఏం జరుగుతున్నది?”

“అంతా బాగుంది. అంతా మన మంచికే అబ్బా”

“కానీ ఏదో కారణం ఉండాలి కదా!”

“ఏముంటుంది? బాగా వేడిగా ఉంది.” అంటూ నవ్వాడు ఫీకా.

“అయితే టెంట్ లో మంచు కురుస్తున్నదా?”

“మాట్లాడకుండా టికెట్లు అమ్మ రాదూ!”

“కానీ ఫీకా ఎందుకలా హఠాత్తుగా జనం ఎగబడుతున్నారు.”

‘‘ఏం లేదు అబ్బా! ఒట్టి భ్రమ అంతే!” నవ్వుతూ లోపలికెళ్ళాడు ఫీకా. కొడుకు నవ్వు చూస్తే ఏదో అనుమానం కలిగింది. టికెట్లు అమ్మడం ఆపి జనంలో కలిసి లోపలికి వెళ్లాడు ఖైరుద్దీన్. లోపల చూసినదానికి నివ్వెరపోయాడు. నక్క శరీరంతో పాటు అమ్మాయి ముఖం మాత్రమే కాక మెడ భుజాలతో పాటు వక్షం కనబడుతున్నది. పరదా కిందికి జారి ఉంది. షాహిదా అజాగ్రత్తగా ఉందనుకున్నాడు. జనాన్ని పట్టించుకో కుండా నిర్లక్ష్యంగా నిర్లజ్జగా ఉందనుకున్నాడు. అప్పుడు మరో విషయం గమనించాడు. ఆమె తొడుక్కున్న పల్చటి షర్టు చెమటతోపూర్తిగా తడిసిపోయింది. షర్ట్ లోపల షాహిదా ఏమీ తొడుక్కోలేదు, ఎండ భరించడం కోసం. కానీ షోలో ఆమె ముఖం మాత్రమే కనిపించాలి కదా! ఖైరుద్దీన్ భయంతో వణికిపోయాడు, దిగ్బ్రాంతికి గురయ్యాడు. విపరీతంగా కోపం వచ్చింది . ఫీకాను తిట్టి, పరదా సరిగ్గా వేయమని అనాలనుకున్నాడు. షో ని ఆపేయాలి అనుకున్నాడు.

అప్పుడు అతని దృష్టి క్యూలో పెరిగిపోతున్న జనం మీద పడింది. ఉత్సాహంగా వెంటనే మళ్ళీ టికెట్లు అమ్మడానికి బయటకు వెళ్లిపోయాడు.

చింతపట్ల సుదర్శన్

1952లో జన్మించిన చింతపట్ల సుదర్శన్ కృష్ణాపత్రిక, విశాలాంధ్రల్లో 1972లో కవితలతో రచనలు ప్రారంభించారు. హైదరాబాదు పాతనగరంలో ‘ఉషస్సు’ లిఖితపత్రిక సంపాదకుడిగా నడిపారు. 1973లోనే హైదరాబాదు పాతనగరం రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘వేదిక’ లిఖిత పత్రికర సంపాదకుడిగా ఉన్నారు. 1982 నుంచి వివిధ పత్రికల్లో 1500కు పైగా కాలమ్స్ ప్రచురితం అయ్యాయి. కాలమ్, క్రిటికాలమ్, హాట్ కేక్, మాయాబజార్, కానికాలమ్, నాశనగాలమ్, వలపులవల, క్విక్ బాక్సింగ్, కలంకారీ, చల్తే చల్తే, చౌరస్తా, రంగస్థలం వంటివి ప్రముఖమైనవి.
అద్దం, క్రిటికాలమ్, సుదర్శన్ సెటైర్స్, తెలంగాణ.కాం, అమృతం కురవని రాత్రి (కథలు), పగలే వెన్నెల (నవల) ప్రచురించారు. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనేక అనువాద రచనలు చేశారు. ముల్క్ రాజ్ ఆనంద్- అంటరానివాడు, రవీంద్రనాధ్ టాగోర్- శిలావిలాపం, ఆదిశంకరాచార్య- భజగోవిందం, ఆర్కే నారాయణ్- మాల్గుడి నవలలు లాంటివి ముఖ్యమైనవి.

Previous Post

హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి

Next Post

ఉర్దూ కథ : పీరున్

Next Post
ఉర్దూ కథ : పీరున్

ఉర్దూ కథ : పీరున్

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 
  • మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • ఒరియా కథ : పులి 
  • హిందీ కథ:  ఆత్మ గీతం
  • కాశ్మీరీ కథ: అపరిచితుడు
  • హిందీ కథ : పింఛను
  • పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 
  • హిందీ కథ : కొత్త గాలి
  • జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!
  • మళయాళ చిన్న కథలు
  • బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 
  • హిందీ కథ : ఓడిపోయాను 
  • రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది
  • కన్నడ కథ : చావు
  • ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
  • తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

అభిప్రాయాలు

  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ : భీమ వచ్చింది

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply