• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి

చింతకుంట్ల సంపత్ రెడ్డి by చింతకుంట్ల సంపత్ రెడ్డి
August 10, 2026
in అనువాద కవితలు
0
ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి

మూలం : థామస్ హార్డీ
అనువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి

 

నేను… 

దట్టంగా లతలు, దుబ్బులు పెరిగి ఉన్న 

ఓ గేటుకు అనుకుని నిలబడి ఉన్నాను.  

నీరసించిపోతున్న పగటి కంటిలో 

బూడిద రంగు దెయ్యంలా కనపడుతున్నది… మంచు. 

శీతాకాలపు గురుతులు విచారం నింపినవి.

విరిగిపోయిన వీణతీగల్లా పైకి ఎగసిన లతల రెమ్మలు 

ఆకాశాన్ని చీలుస్తున్నవి.

దెయ్యం పట్టిన ఆ వేళ… ఇరుగుపొరుగు వారందరూ  

తమ ఇళ్లల్లో… నెగళ్ల శరణుజొచ్చారు. 

ప్రస్పుటంగా… ఆ భూమి రూపం

కాళ్ళు చేతులు చాచి పడి ఉన్న శవంలా ఉంది 

మబ్బులు నిండిన ఆకాశం అతని శవపేటికలా రూపుదాల్చింది

గాలి… అతని మరణ గీతికలా వీస్తున్నది. 

సృష్టి, పుట్టుకల పురాతన జీవశక్తి కృశించి, నిర్జీవమైంది

భూమ్మీద ప్రాణులన్నీ నావలెనే ఉత్సాహం మందగించి ఉన్నాయి.

 

అంతలోనే… ఒక్కసారిగా ఎండిన  పైకొమ్మల్లో నుండి

ఓ మధురమైన స్వరం వినిపించింది.

అపరిమితమైన ఆనందంతో నిండిన

ఒక సాయంకాలపు ప్రార్థన గీతంలా అది కొనసాగింది.

చెదిరిన ఈకలతో, వయసు పైబడి, బలహీనమైన, సన్నని, చిన్నని పక్షి ఒకటి

తన ఆత్మను పూర్తిగా అర్పిస్తూ… 

పెరిగిపోతున్న ఆ చీకటిలోకి తన గానాన్ని విసిరింది. 

 

దూరంలో గాని, దగ్గర్లో గాని… ఈ భూమండలంలోనే 

అంతటి అమందానందమైన భక్తి గీతాలను రాసేందుకు 

కారణమేమీ అంతుచిక్కలేదు.

కానీ… సంతోషకరమైన ఆ రాత్రి వీడ్కోలు పాటలో 

ఆశీర్వదించబడిన ఆశ ఏదో దాగివుందని నేను అనుకున్నాను. 

దాని గురించి ఆ పక్షికి తెలుసు 

కానీ… నేనే గ్రహించలేకపోయాను.

చింతకుంట్ల సంపత్ రెడ్డి
చింతకుంట్ల సంపత్ రెడ్డి

73 ఏళ్ల సంపత్ రెడ్డి ఎం.ఏ (హిస్టరీ), ఎం.ఏ (ఇంగ్లిష్), పి.జి.సి.టి.ఐ (CIEFL) చదివారు. సాంకేతిక విద్యాశాఖలో ఇంగ్లిష్ లెక్చరర్ గా చేసి… 2011 లో హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్ గా రిటైరయ్యారు. పుస్తకాలు చదవడం, అనువాదాలు చేయడం, ఫోటోగ్రఫీ ఆయన వ్యసనాలు
అత్యధికంగా అమ్ముడయే గ్రామర్ పుస్తకాల్లో ఒకటైన English Grammar Fundas (తెలుగు వివరణలతో) ప్రచురించారు. అనువాదాలు.. 1. మనుబెహన్ గాంధీ రచన బాపు-నా మాతృమూర్తి, 2. భిన్న దేశాల విభిన్న ఉత్తరాలు-ఉపన్యాసాలు (32 ఉత్తరాలు-32 ఉపన్యాసాల సంకలనం) 3. భిన్న దేశాల విభిన్న కవిత్వం (అనువాద కవితల సంకలనం) 4. హిందువులకో ఉత్తరం- లియో టాల్స్టాయ్ 5. సామ్యవాదం నుండి సర్వోదయ వరకు- లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ వెలువడ్డాయి.
ఫోటోగ్రఫీ ఆసక్తి: తెలుపునలుపు ఛాయాచిత్రపు రోజుల్లో ఏతావాతా తీసిన ఫోటోలు కొన్ని భారతదేశంలోని అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్స్ లో ప్రదర్శితమయ్యాయి. 1982 లో ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ (FIP) వారు నెలనెలా నిర్వహించిన మెంబర్స్ మంత్లీ కాంపిటేషన్ ‘బిగినర్స్ సెక్షన్’ ఫోటో పోటీలో “గ్రాండ్ అవార్డ్” (సిల్వర్ మెడల్) అవార్డు. 1984 లో ‘Decade of the Girl Child (1975-85) కార్యక్రమాల్లో భాగంగా UNICEF నిర్వహించిన Focus on the Girl Child ఫోటో పోటీలో 2200 మంది ఫోటోగ్రాఫర్లు పంపిన 6500 చిత్రాలలో మొత్తం 150 చిత్రాలు ఎంపిక కాగా, నా చిత్రాలు మూటికి మూడు (3) “గ్రాండ్ జ్యూరి అవార్డ్” గెలుచుకున్నాయి. అక్టోబర్, 2025 లో ప్రపంచ వన్యప్రాణి సంస్థ (WWF), తెలంగాణా అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలో రెండవ బహుమతి.

Previous Post

ఇంగ్లిషు కవిత :  కోరిక

Next Post

సమీక్ష: విస్మృతికి లోనవుతున్న సుగుణాన్ని గుర్తు చేసే పుస్తకం

Next Post
సమీక్ష: విస్మృతికి లోనవుతున్న సుగుణాన్ని గుర్తు చేసే పుస్తకం

సమీక్ష: విస్మృతికి లోనవుతున్న సుగుణాన్ని గుర్తు చేసే పుస్తకం

Subscribe
Login
Notify of
guest
Required
guest
1 Comment
Oldest
Newest Most Voted
కొల్లూరి సోమ శంకర్
కొల్లూరి సోమ శంకర్
1 month ago

థామస్ హార్డీ గారి The Darkling Thrush కవిత అనువాదంలో చక్కగా ఒదిగింది. మంచి కవితకి చక్కని అనువాదం. చింతకుంట్ల సంపత్ రెడ్డి గారికి అభినందనలు.

Mobile
9948464365
0
Reply

ఈ సంచికలో…

  • కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 
  • మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • ఒరియా కథ : పులి 
  • హిందీ కథ:  ఆత్మ గీతం
  • కాశ్మీరీ కథ: అపరిచితుడు
  • హిందీ కథ : పింఛను
  • పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 
  • హిందీ కథ : కొత్త గాలి
  • జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!
  • మళయాళ చిన్న కథలు
  • బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 
  • హిందీ కథ : ఓడిపోయాను 
  • రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది
  • కన్నడ కథ : చావు
  • ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
  • తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

అభిప్రాయాలు

  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ : భీమ వచ్చింది

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
1
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply