తెలుగు సాహిత్యం తెలుగు అనువాద సాహిత్యాన్ని మరింత విస్తృతంగా పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించిన వెబ్ సాహిత్య మాసపత్రిక kathavasudha.com. తెలుగులో అనువాద సాహిత్యానికి సరైన, నిర్దిష్టమైన వేదిక లేకుండాపోయిందనే ఉద్దేశంతో ప్రతినెల పబ్లిష్ అయ్యే ఈ వెబ్ మేగజైన్ కేవలం మూడు వర్గాల సాహిత్యానికి మాత్రం పరిమితమై ఉంటుంది. అనువాద కథ, అనువాద కవిత, సాహిత్య వ్యాసం మాత్రమే ఇందులో ఉంటాయి.
1) ఇందులో అనువాద కథ, అనువాద కవిత, సాహిత్య వ్యాసం తరగతులు మాత్రమే ఉంటాయి. వీటన్నింటినీ పాఠకులు text ఫార్మాట్‌లో చదువుకోవచ్చు. మొబైల్‌కు కూడా తగిన విధంగా వెబ్‌సైట్ responsive గానే రూపొందుతున్నందున.. మొబైల్, ట్యాబ్, డెస్క్‌టాప్ అన్ని ఫార్మాట్లలోను చదువుకోవడానికి పాఠకులకు అనువుగా ఉంటుంది.
2) వీడియోలు అనే కేటగిరీ కింద.. యూట్యూబ్ వీడియోల లింక్‌లు అందుబాటులో ఉంటాయి. అందులో సాహిత్య కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు, ఈ kathavasudha.com తెలుగు అనువాద సాహిత్య మాసపత్రికలో వచ్చిన కథనాల ఆడియో/వీడియో రూపాలు అందుబాటులో ఉంటాయి.
3) సంచికలు అనేది kathavasudha.com తెలుగు అనువాద సాహిత్య మాసపత్రిక పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్న సదుపాయం. ప్రతి నెలా ప్రచురించిన అన్ని రచనలను ఒక పీడీఎఫ్ పుస్తక రూపంలో అందించడం జరుగుతుంది. సాహిత్యాన్ని పత్రికల రూపంలోనే చదవడం పట్ల ఆసక్తి ఉండే పాఠకులకోసం, అదనపు శ్రమకోర్చి చేస్తున్న ప్రయత్నం ఇది. మేగజైన్‌గా రూపొందించి.. flip book ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మొబైల్ మీద గానీ, డెస్క్‌టాప్ మీద గానీ.. పేజీలను చేత్తో తిప్పుతున్నట్టుగా.. పుస్తకం చేతిలో ఉన్న అనుభూతితో చదువుకోవచ్చు.
ఫ్లిప్ బుక్ రూపంలో చదవడం కొందరికి ప్రత్యేకంగా నచ్చుతుంది. ఫ్లిప్‌బుక్‌ను ఆన్‌లైన్‌లో మాత్రమే చదవగలరు. కాబట్టి.. పాఠకుల సౌకర్యార్థం దీనిని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. ఫ్లిప్‌బుక్ డౌన్లోడ్ చేసుకుంటే.. అది పీడీఎఫ్ రూపంలో మీకు అందుబాటులోకి వస్తుంది. ఆఫ్‌లైన్ లో కూడా చదువుకోవచ్చు.
4) ఆ రకంగా.. kathavasudha.com తెలుగు అనువాద సాహిత్య మాసపత్రిక, ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌లోను, ఆఫ్‌లైన్‌లోను కూడా చదువుకోవడానికి పాఠకులకు అవకాశం కల్పిస్తున్న పత్రిక.
5) రచయితలు అనే ట్యాబ్‌లో.. kathavasudha.com వెబ్ సాహిత్య మాసపత్రిక కోసం రాస్తున్న రచయితల అందరి ప్రొఫైల్స్ వరుసగా ఉంటాయి.
6) పత్రికలు అనే ట్యాబ్ కింద.. తెలుగు సాహిత్యాన్ని పాఠకులకోసం అందిస్తున్న అన్ని ఇతర ఆన్‌లైన్ మేగజైన్ల లింక్‌లను పొందుపరచడం జరిగింది. పాఠకులు kathavasudha.com తెలుగు అనువాద సాహిత్య మాసపత్రిక తో పాటు నేరుగా తెలుగు సాహిత్యం అందిస్తున్న అన్ని వెబ్ పత్రికలను అందుబాటులో ఉంచుతున్నాం. సాహిత్యం మరింత పరిపుష్టిగా వర్ధిల్లడానికి.. వెబ్ ఫార్మాట్లలో జరుగుతున్న అందరి ప్రయత్నాలను పాఠకులకు చేరువ చేయడానికే ఈ ఏర్పాటు.
7) పాఠకులకు మంచి తెలుగు అనువాద సాహిత్యాన్ని అందించడానికి, ఇతర భాషల్లో వస్తున్న ఉత్తమ సాహిత్యాన్ని అందించడానికి జరుగుతున్న ప్రయత్నం kathavasudha.com తెలుగు అనువాద సాహిత్య మాసపత్రిక. చదివిన రచనల గురించి.. మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మీ అభిప్రాయాలు తెలుసుకుంటుండడం వల్ల.. పాఠకాభిరుచుల మేరకు మరింత మంచి సాహిత్యాన్ని అందించడానికి వీలవుతుంది.
9) kathavasudha.com తెలుగు అనువాద సాహిత్య మాసపత్రిక ఆదరించండి. చదివిన రచనలను మిత్రులకు ఫార్వర్డ్ చేయండి.. విస్తృతంగా అందరికీ అందుబాటులోకి తీసుకెళ్లడానికి సహకరించండి. ప్రతి రచనకు దిగువన Social sharing icons ఉంటాయి. వాటిని ఉపయోగించుకుని మీ మిత్రులకు, సాహిత్య గ్రూపులకు పంపండి. నచ్చిన రచనలను మీ ఫేస్‌బుక్, ట్విటర్ ల ద్వారా కూడా షేర్ చేసి.. మంచి రచనలు పదుగురికీ తెలియజేయండి. లింకులను ఫార్వార్డ్ చేయండి.
తెలుగు అనువాద రచనలను ఆస్వాదిస్తూ.. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసుకుందాం. మన ఆలోచనల విస్తృతిని పెంచుకుందాం.
కృతజ్ఞతలు.