1) ‘kathavasudha.com తెలుగు అనువాద సాహిత్య మాసపత్రిక’కు పంపే రచయితలు తమ రచనల్ని యూనికోడ్ తెలుగు ఫాంట్‌లో టైపు చేసి. ఓపెన్ ఫైల్ గా మాత్రమే పంపాలి. వర్డ్ డాక్యుమెంట్, టెక్ట్స్ ఏ రూపంలో అయినా పంపవచ్చు. తమ రచనలో కొన్ని వాక్యాలకు నిర్దిష్టమైన formatting (bold, italics) ఉండాలని కోరుకునే వాళ్లు.. అవి స్పష్టంగా తెలిసేలా ఓపెన్ ఫైల్ తో పాటు, పీడీఎఫ్ రూపంలో కూడా పంపితే బాగుంటుంది.
2) రచనలను kamspillai@gmail.com మెయిల్ ఐడీకి మాత్రమే పంపాలి. వాట్సప్‌లో పంపే రచనలను పరిశీలించడం కష్టం. కావాలిస్తే మెయిల్ పంపిన విషయం, వాట్సప్ ద్వారా తెలియజేయవచ్చు.
3) వయస్సులో పెద్దవారు, తెలుగు టైపింగ్, కంప్యూటర్ అవగాహన లేని పెద్దవాళ్లకు మాత్రం వెసులుబాటు ఉంటుంది. వారు తమ రచనను మొబైల్‌లో ఫోటో తీసి, వాట్సప్ ద్వారా కూడా పంపవచ్చు. అవి ప్రచురణార్హంగా ఉంటే టైపు చేయించి వాడుతాము. అనివార్యం అయితే తప్ప రాతప్రతులను పోస్టుద్వారా పంపవద్దు.
4) వెబ్ ఫార్మాట్‌లో ప్రచురించడం, ఫ్లిప్‌బుక్/పీడీఎఫ్ బుక్ మేగజైన్‌గా ప్రచురించడం, కొన్ని రచనలను ఆడియో, వీడియో రూపాల్లో అందించడం వరకు ‘kathavasudha.com తెలుగు అనువాద సాహిత్య మాసపత్రిక’కు పూర్తి అధికారం ఉంటుంది.
5) రచయితలు తమ రచన చివర్న తమ పేరుతోపాటు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, సోషల్ మీడియా హ్యాండిల్స్ వివరాలు కూడా ఇస్తే.. వాటిని కూడా ప్రచురించడం జరుగుతుంది. తమ ఫోటోతో పాటు, వ్యక్తిగత వివరాలను సంక్షిప్తంగా పంపితే వాటిని కూడా ప్రచురిస్తాం. ఇష్టంలేని వారు ఇవ్వక్కర్లేదు.
6) ప్రచురితమైనవి, ఇతర పత్రికలు, వెబ్ పత్రికల పరిశీలనలో ఉన్నవి, బ్లాగులు, సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫాం లలో ఇప్పటికే ప్రచురించినవి దయచేసి పంపవద్దు. అలా పంపినట్లుగా గుర్తిస్తే.. ప్రచురించిన పోస్టులను తొలగించడం జరుగుతుంది.
7) మూలరచన వివరాలు (భాష, రచయిత పేరు) ఖచ్చితంగా ఇవ్వాలి. ఇతర పత్రికలలో, ఆన్‌లైన్‌లో ఎక్కడా ప్రచురణ కాలేదని రచయితలు హామీపత్రం ఇవ్వాలి.
8) ‘kathavasudha.com తెలుగు అనువాద సాహిత్య మాసపత్రిక’ ప్రచురించిన రచనలను రచయితలు తమ సొంత బ్లాగులు, ఫేస్ బుక్ అకౌంట్లు, సోషల్ మీడియాలో షేర్ చేసేప్పుడు.. తమ రచన text ఫార్మాట్‌లో కాకుండా.. వెబ్ లింక్‌ను మాత్రమే షేర్ చేస్తే బాగుంటుంది. ‘kathavasudha.com’ గురించి కొత్తవాళ్లకు కూడా తెలుస్తుంది.
9) సమీక్షకు పుస్తకాలను కింది చిరునామాకు పంపాలి.
కె.ఎ. మునిసురేష్ పిళ్లె,
సంపాదకుడు, ‘kathavasudha.com’,
ఫ్లాట్ 501, అన్నమయ్య రెసిడెన్సీ, రోడ్ నెం.38,
ప్లాట్ నె.727, అయ్యప్ప సొసైటీ, మాధాపూర్,
హైదరాబాద్, 500 081
mobile : 99594 88088