• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

హిందీ కథ : ఓడిపోయాను 

వెన్నా వల్లభరావు by వెన్నా వల్లభరావు
September 10, 2026
in అనువాద కథలు
0
హిందీ కథ : ఓడిపోయాను 

హిందీ మూలం : శ్రీమతి మన్ను భండారి
అనువాదం : డా. వెన్నా వల్లభరావు, 94903 37978

కవి సమ్మేళనం పూర్తయిందో లేదో సభాస్థలి అంతా నవ్వులు, కేరింతలు, చప్పట్లతో మారుమోగి పోయింది. ఆ చివరి కవిత విని నాకు మాత్రం కోపంతో ఒళ్ళు మండిపోయింది. కవిత పేరు ‘కొడుకు భవిష్యత్తు’. క్లుప్తంగా కవిత సారాంశం చెపుతాను, వినండి : ఒక తండ్రి తన కుమారుని భవిష్యత్తు అంచనా వేయటం కోసం అతని గదిలో ఒక అందమైన సినీనటి ఫోటో, ఒక బ్రాందీ సీసా, భగవద్గీత ఉంచుతాడు. కొడుకు ఏకాంతంలో ఏం చేస్తాడో చూద్దామని గదిలోనే కర్టెన్ చాటున దాక్కొని ఉంటాడు. కొడుకు గదిలోకి రావడమే  తడవుగా సినీనటి ఫోటోను చేతిలోకి తీసుకుంటాడు. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. ఫోటోను గుండెలకు హత్తుకుంటాడు. ముద్దు పెట్టుకుంటాడు. తరువాత బ్రాందీ సీసా మూత తెరిచి నాలుగు గుక్కలు తాగుతాడు. పిమ్మట భగవద్గీత చేతిలో పెట్టుకుని చాలా గంభీరంగా గది బయటకు వెళతాడు. కొడుకు ప్రవర్తన గమనించిన తండ్రి అతని భవిష్యత్తుని అంచనా వేసి ‘ఈ వెధవ, రాజకీయ నాయకుడవుతాడు’ అని తీర్మానించుకుంటాడు.

కవిగారు ఈ చివరి పంక్తి చదివాడో లేడో సభాస్థలిలో ఒక మూల నుంచి మరో మూలకి నవ్వుల అల పరుగు తీసింది. నాకైతే నాయకుల్ని అవమానించిన తీరు చూసి పట్టరాని కోపం వచ్చింది. దానికి తోడు నాతో వచ్చిన స్నేహితురాలు వ్యంగ్యంగా నాతో ‘నీకు ఈ కవిత ఎంతమాత్రం నచ్చుండదులే! మీ నాన్న పెద్ద నాయకుడు కదా!’ అన్నది. 

నేను కోపంతో ‘నచ్చటమా? ఇంత అసహ్యమైన దరిద్రపుగొట్టు కవిత నేనింతవరకు వినలేదు’ అన్నాను.

మా స్నేహితురాలి వ్యంగ్యం లోని మర్మం నేను బాగా అర్థం చేసుకున్నాను. ఆమె కోపం చాలా మటుకు ‘ద్రాక్ష పళ్ళు అందని…’ వారి ఆక్రోశం లాంటిది. ఆమె తండ్రి ఎన్నికల్లో మా నాన్నకి ప్రత్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ ఓటమి బాధ ఆమె ఇంకా మర్చిపోలేదు. ఈరోజు ఈ కవిత విన్నాక ఆవిడ హృదయంలోని అక్కసు వెళ్ళగక్కుకునే అవకాశం వచ్చింది. తన తండ్రి ఓటమి కూడా తనకీరోజు ఉపయోగపడినట్లు ఆమెకి అనిపించింది. కానీ నా మనసులో మాత్రం ఇంకేదో సుడులు తిరగసాగింది. 

నేను కోపంతో బయటకి వెళ్లి కారులో కూర్చున్నానన్నమాటేగాని, నన్ను నమ్మండి, ఇంటికి వెళుతున్నంతసేపు ఒకటే ఆలోచన- ఆ కవికి ఏ విధంగా బుద్ధి చెప్పాలా అని. మా నాన్నగారి పాలనలోనే నాయకుల పట్ల ఇటువంటి పనికిమాలిన ఆరోపణలు సహించి ఊరుకో దగినవేనా! 

ముల్లుని ముల్లుతోనే తియ్యాలి. కవితకి కవిత ద్వారానే సమాధానం చెప్పాలి అనుకున్నారు, కానీ ఆ దిశగా మునుపెన్నడూ ప్రయత్నం చెయ్యకపోవటంతో అడుగు ముందుకు పడలేదు. అందుకే కవిత్వంతో కాదు, కథ ద్వారా జవాబు ఇవ్వదలచాను. నా కథలో సర్వగుణ సంపన్నుడైన నాయకుడిని రూపొందించే ప్రణాళిక సిద్ధం చేశాను. దాన్ని చదివి ఆ కవి పరాజయం అంగీకరించి తీరుతాడని భావించాను. నిండు సభలో పిచ్చి కూతలు కూసిన వ్యక్తికి కుక్క కాటుకు చెప్పు దెబ్బగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనైనా నా వాదమే పైచేయిగా నిలుస్తుందని ఊహించాను.

అదే ఆలోచిస్తూ నా గదిలోకి అడుగు పెట్టాను. గోడకు వేలాడుతున్న గొప్ప గొప్ప నాయకుల చిత్రపటాలు నా దృష్టిని ఆకర్షించాయి. ఆ ప్రతిభావంతుల దివ్యమైన ముఖారవిందాలు నన్ను ప్రోత్సహించ సాగాయి. ఆ మహా నాయకులందరి వ్యక్తిగత సద్గుణాలన్నింటినీ నా కథలోని నాయకునిలో చొప్పించాలని నిర్ణయించుకున్నాను. 

ఒక వారం పాటు నేను గొప్ప గొప్ప నాయకుల జీవిత చరిత్రలు చదివి, రాయబోయే కథలోని నాయకుని స్వరూప స్వభావాల్ని ఊహించుకో సాగాను. చాలామంది మహనీయ నాయకుల గురించి విని, చదివి అనేక విషయాలు గ్రహించాను. కమలం బురదలోనే  పుట్టినట్టు, గొప్ప గొప్ప వాళ్ళు పేదల ఇళ్లల్లోనే జన్మించారని తెలిసింది. బాగా ఆలోచించి ఒక శుభ ముహూర్తం చూసుకుని అన్ని సద్గుణాలు సంతరించుకున్న నా నాయకుడిని పల్లెటూర్లో ఒక పేద రైతు పూరిగుడిసెలో జన్మింపజేశాను.

మనసులో కోరికలు, ఆశలు పెరిగే విధంగా నా నాయకుడు కూడా ఎదగ సాగాడు. బడికి వెళ్లే ఈడు రాగానే గ్రామంలోని స్కూల్లోనే అతని చదువు ప్రారంభమైంది, ఆ ఏర్పాటుకు నేనైతే పూర్తిగా సంతృప్తి చెందలేదు, కానీ గత్యంతరం లేని స్థితిలో నా అంతట నేనే అటువంటి పరిస్థితి కల్పించాను. క్రమక్రమంగా అతడు మాధ్యమిక తరగతులు ఉత్తీర్ణుడయ్యాడు. అప్పటికే ప్రపంచంలో లేని గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాల్ని, విప్లవోద్యమ  చరిత్రల్ని అతను చదివేశాడు. చూడండి, ఎనిమిదవ తరగతి చదివే కుర్రాడు ఈ విషయాలన్నింటినీ ఎలా అర్థం చేసుకోగలడు అని మీరు మధ్యలో ప్రశ్నించవద్దు. ఇది పూర్తిగా అసహజమైన విషయమే. ఇప్పుడు నేను మీరు వేసే ఏ ప్రశ్నకీ సమాధానం ఇచ్చే మనఃస్థితిలో లేను. ఈ కుర్రాడు ఒక గొప్ప భావి నాయకుడు అని మీరు మర్చిపోవద్దు సుమా!

అవును, ఇవన్నీ చదివి అతని మనసులో గొప్ప గొప్ప కోర్కెలు రేకెత్త సాగాయి, గొప్ప గొప్ప కలలు సాకారం అవ్వ సాగాయి, సరికొత్త ఉత్సాహం పొంగ సాగింది. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అతడు పిడికిలి బిగించి వాటిని రూపుమాపుతానని ప్రతిన పూనుతున్నాడు. దానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. అతని ప్రతినల్లోను, ప్రణాళికల్లోను నా విజయం తారసపడసాగింది. ఒకసారి ప్రాణాలకు తెగించి జమిందారుగారి గుమస్తాలతో కూడా అతను తలపడేటట్టు చేశాను. అప్పుడు అతని విజయంపై అతని కంటే ఎక్కువ సంతోషం నాకే కలిగింది.

ఇంతలో అకస్మాత్తుగా ఒక సంఘటన జరిగింది. అతని తండ్రి ఆకస్మికంగా మరణించాడు. వైద్యానికి-మందులకు కూడా ఇంటిలో చిల్లుగవ్వ లేదు. దానితో గిలగిల తన్నుకుని తండ్రి ప్రాణాలు విడుస్తున్నా పాపం అతనేమీ చెయ్యలేకపోయాడు. దయనీయమైన స్థితిలో తండ్రి మరణించటంతో అతనికి భరింపరాని బాధ కలిగింది. వృద్ధురాలైన అతని తల్లి ఏడ్చి ఏడ్చి ప్రాణాలైతే విడవలేదు గాని, కంటి చూపు కోల్పోయింది. ఇంట్లో విధవరాలైన మేనత్త, క్షయ వ్యాధితో బాధపడుతున్న చెల్లెలు కూడా ఉన్నారు. అందరి పోషణ బాధ్యత ఒక్కసారిగా అతనిపైనే పడింది. దమ్మిడీ ఆదాయం లేదు. కొద్దిపాటి భూమి ఉంటే, దాన్ని కూడా జమీందారు పన్ను బకాయిల నిమిత్తం హస్తగతం చేసేసుకున్నాడు. తండ్రి వినయం, మాట మంచితనం కారణంగా ఇప్పటివరకు ఆయన మౌనంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఎందుకు ఊరుకుంటాడు? విప్లవకారుడయిన అతని కొడుకు గురించి జమిందారుకి తెలుసు. అందుకే అవకాశం రాగానే ప్రతీకారం తీర్చుకున్నాడు.  

ఇప్పుడు నా భావి నాయకుని ముందు పెను సమస్య వచ్చి పడింది. సలహా కోసం అతను నా దగ్గరకొచ్చాడు. నేను అతనితో “ఇప్పుడు సమయం వచ్చింది. నువ్వు ఇల్లు-వాకిలి, తిండి-తిప్పలు గురించిన ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేశ సేవకు నడుం కట్టు. నువ్వు దేశాన్ని చక్కదిద్దాలి. నవ నిర్మాణం గావించాలి. దోపిడీకి గురయ్యేవారి కోసం గళమెత్తి వర్గరహిత సమాజాన్ని స్థాపించాలి. వీటన్నిటిని నువ్వు విజయవంతంగా నిర్వహించ గలుగుతావు. అందుకు అవసరమైన సద్గుణాలన్నీ నేను నీలో నింపాను. వెంటనే  కార్యోన్ముఖుడివి అవ్వు” అని హితవు పలికాను. 

అప్పుడతను చాలా నిరుత్సాహంగా “అంతా బాగానే ఉంది కానీ గుడ్డిదైపోయిన మా అమ్మ, జబ్బుతో ఉన్న నా చెల్లెలు సంగతేమిటి? నాకు దేశమంటే ఎనలేని ప్రేమే. కానీ నా వాళ్ళంటే కూడా నాకు తక్కువ ప్రేమేమీ లేదు” అన్నాడు.

అతని మాటలు విని నేను మండిపడ్డాను “నువ్వు కాబోయే నాయకుడివని మర్చిపోయావా? నాయకుడవ్వటమంటే ఆషామాషీ అనుకున్నావా? నాయకులనేవాళ్ళు తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచించరు. దేశం గురించి, సమాజం గురించి మాత్రమే ఆలోచిస్తారు. నువ్వు నా అజ్ఞానుసారమే నడుచుకోవాలని మర్చిపోకు. నేను నిన్ను సృష్టించిన దాన్ని, నీ విధాతను.”

అతను నా మాటల్ని పట్టించుకోకుండా “అది నిజమే, కానీ అంధురాలైన మా అమ్మ బాధ పడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను భరించలేను. నువ్వు నాకు ఎక్కడైనా ఉద్యోగం ఎందుకు ఇప్పించకూడదు? కుటుంబం జరుగుబాటుకు నాకు ఏదన్నా ఆధారం దొరికితే అప్పుడు మిగిలిన సమయాన్నంతా ఆనందంగా దేశ సేవకే వినియోగిస్తాను. నువ్వు కన్న కలల్ని సాకారం చేస్తాను. ముందు నువ్వు మా కడుపు నింపే ఏర్పాటు చెయ్యి” అన్నాడు.

మా నాన్నగారి పరిధిలో ఉన్న విభాగంలోనే అతనికి ఏదైనా ఉద్యోగం ఇప్పించుదామని ఆలోచించాను. కానీ నాన్నగారి ఉదార వైఖరి కారణంగా అక్కడ ఒక్క ఉద్యోగమూ ఖాళీ లేదు. అన్నిటికి అన్నీ భర్తీ అయిపోయాయి. మా బాబాయి గారి అబ్బాయి, మేనత్త గారి అబ్బాయి చాలా లౌకీకులు. అందువల్ల అతనికి ఎక్కడా ఉద్యోగం ఇప్పించలేకపోయాను. అతని నోరైతే మూయించ గలిగాను గానీ కడుపు నింపే ఏర్పాటు చేయలేకపోయాను. గత్యంతరం లేని స్థితిలో అతను కూలి పని చేయటం ప్రారంభించాడు. ఊళ్లో జమిందారు కొత్తగా భవంతి కట్టిస్తుంటే, అక్కడ అతను ఇటుకలు మోసే పని చేయసాగాడు. తలపై ఇటుకలు ఎత్తుకుంటుంటే, అతని ఆశలు అడుగంటిపోసాగాయి. నేను ఎన్నోసార్లు ఆ పని మానేయమని అన్నాను. ఆ మాట చెప్పినప్పుడల్లా అతను తన తల్లి-చెల్లి దైన్యాన్ని గురించి చెప్పి నన్ను నోరు మెదపనీయకుండా చేసేవాడు. నాకు అతని మీద అమితమైన కోపం వచ్చేది. అయినా నా నమ్మకం బ్రతికే ఉంది. ఎందుకంటే గొప్ప గొప్ప సద్గుణాల్ని, ప్రతిభా పాటవాల్ని ఉగ్గుపాలతో అతనికి పట్టించాను. అవన్నీ ఎలాంటి స్థితిలోనైనా ప్రభావాన్ని చూపితీరతాయి అని భావించి, అతన్ని అతని అదృష్టానికి విడిచి పెట్టాను. ఒక తటస్థ ప్రేక్షకురాలుగా అతని ప్రతి కదలికను గమనిస్తూ ఉండిపోయాను.

ఇంతలో జబ్బుతో ఉన్న అతని చెల్లి పరిస్థితి విషమించింది. చెల్లెలంటే అతనికి చెప్పలేనంత ప్రేమ. ఆమె వైద్యానికి పట్టణంలోగల అవకాశాన్ని తెలుసుకునేందుకు, పనికి సెలవు చెప్పి పట్నం వెళ్లి ఆరా తీశాడు. చాలా డబ్బు ఉంటే తప్ప తన చెల్లి బ్రతకదని అతనికి అర్థమైంది. పట్నం నుంచి తిరిగి వచ్చేటప్పుడు తన చెల్లి దీనంగా ఆరుస్తున్న అరుపులే అతని హృదయాన్నికకావికలం చెయ్యసాగాయి. “అన్నయ్యా! నన్ను కాపాడు. ఎలాగైనా డబ్బు సమకూర్చు, నన్ను కాపాడు. అన్నయ్యా! నాకు చనిపోవాలని లేదు…” అని చెల్లెలు దీనంగా అడుగుతున్నట్లు అనిపించింది. ఆ సమయంలో తన తండ్రి మరణించిన దృశ్యం అతని కళ్ళ ముందు మెదిలింది. వివశత్వంతో తండ్రిని కోల్పోయానని బాధపడ్డాడు. ఊరికి వచ్చి డబ్బున్న వాళ్ళందరి వద్దకు వెళ్లి అప్పు ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. చేతులెత్తి దండాలు పెట్టాడు. కానీ నిరాశే ఎదురైంది. ఆ వైఫల్యంతో అతని ఉద్రేకమైన మనసు రగిలిపోయింది. పగలంతా ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా ఏవేవో ఆలోచనలు చేస్తూ గడిపాడు. సుమారు అర్ధరాత్రి అయ్యేసరికి ఒక నిర్ణయానికొచ్చాడు.

అతను దొంగతనానికి పాల్పడబోతున్నాడని తెలిసి నేను నిలువెల్లా కంపించిపోయాను. నేను రుపొందించబోయిన నాయకుడు ఇలా పతనమవ్వటమా! దొంగతనం చేస్తాడా!ఛీ ఛీ! దొంగతనం చేసి తన నైతికతను చంపుకొనేలోపు నేనే అతన్ని పరిసమాప్తి గావించాను… అప్పటివరకు నేను రాసిన కథ పేజీలన్నీ చింపి ముక్కలు చేసిపారేశాను.

మళ్లీ కలం పట్టాను. ఈసారి నాయకుడు మారిన రూపంలో, మారిన పరిస్థితులలో మరొకసారి ఈ లోకంలోకి వచ్చాడు. ఈసారి అతను పట్టణంలో కోటీశ్వరుని ఇంట జన్మించాడు. అక్కడతనికి కడుపు నింపుకోవడానికి, జబ్బు చేసిన చెల్లి వైద్యానికి సమస్యలు లాంటివి లేనే లేవు. అల్లారుముద్దుగా సిరి సంపదల మధ్య పెరగసాగాడు. పెద్ద పేరున్న స్కూల్లో అతనికి చదువు చెప్పించబడింది. అతని అద్భుత  ప్రతిభ చూసి అందరూ ఆశ్చర్యపోసాగారు. అన్యాయాల్ని, అత్యాచారాల్ని చూసి అతను చలించిపోయేవాడు. ఆవేశంగా ప్రసంగం చేసేవాడు. పల్లెటూళ్ళకి వెళ్లి నిరక్షరాస్యులైన పిల్లలకి చదువు చెప్పేవాడు. పేదరికం చూసి అతని హృదయం వెన్నలా కరిగిపోయేది. ధనవంతుడై  ఉండికూడా నిరాడంబర జీవితం గడుపుతూ ఉండేవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే గొప్ప నాయకుడు అయ్యే శుభ లక్షణాలన్నీ అతనిలో కనిపించసాగాయి. అడుగడుగునా నా సలహా తీసుకుంటున్నాడు. నేను కూడా అతని భావి జీవితపు పటాన్ని అతని మనసులో పూర్తిగా ముద్రింపజేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను దారి తప్పకూడదని శ్రద్ధ వహించాను.

మెట్రిక్ పాసై అతను కాలేజీలో అడుగుపెట్టాడు. పెద్ద పేరుమోసిన కాలేజీ అది. ఒకానొక సమయంలో అందులో కేవలం జమిందార్ల పిల్లలే చదువుతూ ఉండేవారు. అక్కడ సర్వత్రా ఖరీదైన వాతావరణమే. అలాంటి కాలేజీలో తండ్రి అతన్ని చేర్పించాడు. నేను ఎంత జాగ్రత్త తీసుకున్నా ధనవంతుల పిల్లల సాంగత్యం అతనిపై ప్రభావం చూపక మానలేదు. ఇప్పుడిక అతను స్వేచ్ఛా జీవితానికి అలవాటు పడ్డాడు. నా సలహా సంప్రదింపులు అతనికి రుచించటం లేదు. గంటల తరబడి రెస్టారెంట్లలో గడపసాగాడు. ఒకరోజు అతన్ని నేను హౌసీ ఆడుతూ ఉండగా చూశాను. నా గుండె ఆగినంత పని అయింది. జూదమా! అయ్యో! ఏమిటి వీడు ఇలా తయారయ్యాడు? నేను సంభాళించుకుని కుర్చీలో కూలబడ్డాను. కలాన్ని గట్టిగా పట్టుకున్నాను. అతని ఆకతాయితనాన్ని అదుపులో పెట్టానా అన్నట్టు కలాన్ని ఒడిసి పట్టుకున్నాను. కానీ ఇప్పుడు అతనికి రెక్కలొచ్చాయి. కేవలం జూదమే అతని నైతిక పతనానికి సరిహద్దు కాలేదు. కొన్నాళ్ళ తరువాత నేనతన్ని తాగుతుండగా చూశాను. నా  కోపం కట్టలు తెంచుకుంది. పిలిచి దగ్గర కూర్చోబెట్టాను. రగులుతున్న కోపాన్ని నియంత్రించుకుని “నిన్ను నేను ఏ ఆశయంతో తయారు చేశానో తెలుసా?” అని అడిగాను.

అతను కూడా నన్ను ఎదుర్కోవటానికి పూర్తిగా సిద్ధమై వచ్చాడు.”నీ స్వార్థం కోసం. నీ గొంతెమ్మ కోర్కెలు తీర్చుకోటానికి నన్ను తయారు చేశావు. నాకైతే నీ ఇష్టానుసారం నడుచుకోవాల్సిన అవసరం లేదు. నా అస్తిత్వం నాకుంది. నా ఆలోచనలు నాకున్నాయి” అన్నాడు.

నేను గద్దించాను. “ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? నేను నీ సృష్టికర్తను. నిర్మాతను. నా ఇష్టానికి విరుద్ధంగా నీకు స్వతంత్ర అస్తిత్వం లేదు” అన్నాను.

ఆ మాట విని అతను ఒక నవ్వు నవ్వాడు. “నువ్వు కేవలం నీ కలంతో నన్ను సృష్టించావు. నా స్నేహితుల్ని చూశావా! వీళ్ళ తల్లులు వీళ్ళని తమ రక్తమాంసాలు ఇచ్చి కన్నారు. అయినా నువ్వు జోక్యం చేసుకుంటున్నంతగా వీళ్ళ తల్లులు వీళ్ళ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవటం లేదు. ‘నేనేదో మనిషిని కాదు, కొయ్యి బొమ్మన’న్నట్టు అడుగడుగునా ఇది చేయొద్దు, అది చేయొద్దు అని ఇప్పటికే నన్నెంతో విసిగించావు. నువ్వనుకునే నేతాగిరి నావల్ల కాదు. ఈ వయసు, ఈ రంగుల లోకం, ఇంట్లో ఐశ్వర్యం. ఆనందాన్ని అనుభవించకుండా జీవితాన్ని నాశనం చేసుకోమంటావా? ఇవన్నీ చేసి కూడా నాయకుడు అవ్వటం కుదరదా?” అని ప్రశ్నించాడు.

నేనేదో అనబోయేలోపే ఈల వేసుకుంటూ కులాసాగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అతని దురుసుతనాన్ని, దౌష్ట్యాన్ని నేను ఎలా సహించి ఉంటానో మీరే ఊహించుకోండి. మునుపటి నాయకుడి కథ ముగించినట్టుగానే వీణ్ణి కూడా సమాప్తం చేసి పారయ్యాలని ఆ క్షణాన నాకు అనిపించింది. కానీ కోపం కంటే బాధ ఎంత ఎక్కువ కలిగిందంటే ఏమి చెయ్యడానికీ శక్తి లేకపోయింది.

ఇంత జరిగిన తర్వాత కూడా బహుశా అతను మళ్లీ సరైన దారికి వస్తాడేమోనన్న చిన్న ఆశేదో నా మనసులో మిగిలి ఉంది. గాంధీ గారి లాంటి వాడు కూడా చిన్నతనంలో ఒకసారి దొంగతనం చేశారు. ఇంకేవో తప్పులు కూడా చేశారు. కానీ తనంతట తానుగా మంచి దారిలోకి వచ్చారు. ఇతను కూడా బహుశా తన చెడు ప్రవర్తనకి పశ్చాత్తాపపడి తనంతట తానే మంచి దారిలోకి వస్తాడేమో! ఇక నేను అతనికి ఆదేశాలివ్వడం కట్టిపెట్టి, తన తప్పు తెలుసుకుని నా కాళ్ళపై పడి క్షమాపణ కోరే రోజు వస్తుందని శాంతంగా ఎదురుచూడసాగాను.

అయితే అలాంటి శుభ దినం ఎన్నటికీ రాలేదు. కలలో కూడా ఊహించని రోజు మాత్రం వచ్చింది. ఒక చక్కని సాయంత్రం వేళ అతను ప్రత్యేకంగా అలంకరించుకుంటున్నాడు. అందమైన సిల్క్ శర్వాణి ధరించాడు. సిగరెట్ తాగే పెదవులు కిళ్ళి వేసుకోవడం వల్ల ఎర్రబడ్డాయి. సెంటు గుబాళిస్తోంది. ఇంతలో బయట హారన్ మోగింది. అతను కులాసాగా కూనిరాగాలు తీస్తూ వెళ్లి ఫ్రెండ్ వచ్చిన కార్లో కూర్చున్నాడు. కారు ఒక బార్ ముందు ఆగింది. జమిందారు బిడ్డలిద్దరూ రాత్రి పొద్దు పోయే వరకు పెగ్గు మీద పెగ్గు తాగుతూనే ఉన్నారు. అశ్లీలమైన జోకులు వేసుకుంటూ పగలబడి నవ్వుకున్నారు. రాత్రి 9 గంటలకు లేచారు. వాళ్ళ కాళ్ళు తడబడుతున్నాయి. ఎలాగోలా వెళ్లి కార్లో కూలబడ్డాడు. డ్రైవర్ తో ఫలాన వీధికి పోనిమ్మని చెప్పారు, ఆ ప్రదేశం పేరు రాయాలంటేనే నాకు సిగ్గుగా ఉంది.

నన్నునేను నిగ్రహించుకోవాలని ఎంతో ప్రయత్నించాను, అతని పతనాన్ని చూసి సహించలేక పోయాను. ఇక ఆ రోజు అటోఇటో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాను. కోపంతో ఊగిపోతూ అతని వద్దకు వెళ్లాను. నిజానికి ఆ స్థితిలో అతనితో మాట్లాడటానికి కూడా నాకు అసహ్యం అనిపించింది. క్రోధంతో నా అణువణువు రగిలి పోసాగింది. అయినా నన్ను నేను నిగ్రహించుకుంటూ సాధ్యమైనంత మృదువుగా “నిన్ను ఆఖరిసారిగా హెచ్చరించడానికి వచ్చాను. నువ్విలా సర్వ నాశనమైపోతుంటే చూసి నా హృదయం ఎంత బాధ పడుతుందో నీకు తెలుసా? ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నిన్ను నువ్వు సంభాళించుకో. తెలియక తప్పుచేసి పెడదోవ పట్టినా, తప్పు తెలుసుకుని మంచి దారిలోకి రావడం ఆమోదయోగ్యమైనదే!” అన్నాను.

కానీ ఆ సమయంలో బహుశా అతను నాతో మాట్లాడటానికి సిద్ధంగా లేడు. కిళ్ళి నములుకుంటూ “చూడు తల్లి! నువ్వు పొద్దస్తమానం నా వెంట పడి నేతాగిరి అంటూ ఎందుకు నా ప్రాణం తీస్తావు? నీ నేతాగిరి ఎక్కడ, ఈ రంగేళి రవళి ఎక్కడ! ఒక్కసారి చూశావంటే నీకే కళ్ళు జిగేల్ మంటాయి” అన్నాడు.

నేను చెవులు మూసుకున్నాను. అతను ఇంకా ఏదో అన్నాడు కానీ నేను వినలేదు. అయితే నన్ను చూసి వాడు కన్నుకొట్టాడు. అది చూసిన నాకు నిలుచున్న నేలంతా తిరిగి పోతున్నట్టు అనిపించింది. క్రోధావేశంలో నా నోట మాట రాలేదు, కేవలం “దుర్మార్గుడా! నీచుడా! పాపాత్ముడా!” అన్న తిట్లు మాత్రమే వెలువడ్డాయి.  

వాళ్ళ స్నేహితులు వెళుతూ వెళుతూ అన్న మాటలు నెమ్మదిగా నా చెవిన పడ్డాయి “ఇంత ఘోరమైన భాషలో చివాట్లు పెడితే వీడికేం అర్థమవుతుంది? కొంచెం తేలికైన భాష మాట్లాడు తల్లీ!” 

ఇంకా సహించటం నా వశం కాలేదు. ఏ కలంతోనైతే నేనతన్ని సృష్టించానో అదే కలంతో అతన్ని అంతం చేసిపారేశాను. అతను వెళ్లి ఆ రంగేళి సరసన కూర్చోబోతుండగానే అతన్ని చెత్తబుట్టలో పారేశాను. మంచి పనే అయిందిలే! చేసుకున్న దానికి చేసుకున్నంత అనుభవించాడు!

అతనైతే ఫలితం అనుభవించాడు కానీ నా సమస్యకైతే పరిష్కారం కనుక్కోలేకపోయాను. ఈసారి నేను పొందిన వైఫల్యం నన్ను ఏడిపించేసిందంటే నమ్మండి. ఈసారి మధ్యతరగతి నుంచి తన నాయకుణ్ణి సృష్టించే ప్రయత్నానికి ధైర్యం చాలలేదు. ఈ రెండు హత్యల భారంతోనే నా మెడ విరిగిపోతోంది. ఇంకొక హత్యాపాతకం మెడకు చుట్టుకోవాలని కోరికా లేదు, శక్తీ లేదు. చేసేదిలేక నా అహాన్ని విడిచిపెట్టి చాలా నిజాయితీగా చెపుతున్నాను, నా శరీరంలో ఆణువణువూ చెపుతోంది… నిండు సభలో ఆనాడు ఆ కవి చాలా దర్జాగా నాయకుల్ని ఎలా దుయ్యబట్టాడో, దాన్ని ‘తప్ప’ని రూడిగా నిరూపించలేకపోయాను సరిగదా, కనీసం అరుదుగానైనా ఆదర్శ నాయకులుంటారని ఋజువు చెయ్యలేకపోయాను. నేను ఓడిపోయాను, చాలా హీనంగా ఓడిపోయాను.

మన్ను భండారి (1931 – 2021) హిందీలో ప్రఖ్యాత నవల, కథా రచయిత్రి. మధ్యప్రదేశ్ లో జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయంలోనూ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోను విద్య అభ్యసించారు. కలకత్తా, దిల్లీల లోని కళాశాలల్లో హిందీ అధ్యాపకురాలిగా పనిచేశారు. వీరు హిందీ సాహిత్యంలో నవ్యకథా ఉద్యమానికి మూలస్తంభంగా నిలిచారు. ‘ఆప్ కా బంటీ’, ‘మహాభోజ్’ అనే నవలలు; ‘ఏక్ ప్లేట్ స్కైలాబ్’. ‘ 15౦ కి పైగా కథలు రాశారు. తమ రచనల్లో  మధ్యతరగతి జీవితం, విద్యావంతులైన మహిళల మనస్తత్వాలు-సమస్యలు, లైంగిక అసమానతలు, కులవివక్ష వంటి అంశాల్ని ప్రధానంగా స్పృశించారు. వీరు దూరదర్శన్, పలు చలనచిత్రాలకు స్క్రీన్ ప్లేలు కూడా రాశారు. వీరి కథ ‘యహీ సచ్ హై’  ఆధారంగా 1974లో ‘రజనీగంధ’ సినిమా తియ్యబడింది. ఉత్తరప్రదేశ్ హిందీ సంస్థాన్ పురస్కారం, కె కె బిర్లా ఫౌండేషన్ ద్వారా ‘వ్యాస సమ్మాన్’ అందుకున్నారు.      

వెన్నా వల్లభరావు

తెలుగు నుంచి హిందీకి, హిందీ నుంచి తెలుగుకి కథ, కవిత, నాటకం మొదలైన ప్రక్రియల్లో గత 4 దశాబ్దాలుగా అనువాదాలు. రెండు భాషల్లో స్వీయ రచనలు. ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడలో హిందీ శాఖాధ్యక్షునిగా 3 దశాబ్దాలు పనిచేసి పదవీ విరమణ. 20 పుస్తకాల ప్రచురణతో పాటు పలు పత్రికల్లో అనువాద రచనల ప్రచురణ. సుమారు 60 ఆకాశవాణి జాతీయ నాటకాలు (హిందీ-తెలుగు-హిందీ) అనువాదాలు ప్రసారం. 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం.

Previous Post

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

Next Post

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

Next Post
బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

by రమేశ్ రాచపూటి
September 14, 2026
0

...

హిందీ కథ : కొత్త గాలి

హిందీ కథ : కొత్త గాలి

by విఎల్ నరసింహం శివకోటి
September 10, 2026
0

...

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

by పి. శ్రీనివాస్ గౌడ్
September 10, 2026
0

...

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

by తిరువాయపాటి రాజగోపాల్
September 10, 2026
0

...

మళయాళ చిన్న కథలు

మళయాళ చిన్న కథలు

by ఎడిటర్
September 10, 2026
0

...

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

by డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
September 10, 2026
0

...

హిందీ కథ : ఓడిపోయాను 

హిందీ కథ : ఓడిపోయాను 

by వెన్నా వల్లభరావు
September 10, 2026
0

...

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

by కేశవ్ గోపాల్
September 10, 2026
0

...

కన్నడ కథ : చావు

కన్నడ కథ : చావు

by చందకచర్ల రమేశబాబు
September 10, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

by శివ చల్లా
September 10, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026
హిందీ కవిత: అడవిలో వర్షం
అనువాద కవితలు

హిందీ కవిత: అడవిలో వర్షం

September 10, 2026
హిందీ కవితలు: గోధుమ + గోవు
అనువాద కవితలు

హిందీ కవితలు: గోధుమ + గోవు

September 10, 2026
సచ్చిదానందన్ కవితలు రెండు..
అనువాద కవితలు

సచ్చిదానందన్ కవితలు రెండు..

August 15, 2026
హిందీ కవిత: నా చిరునామా
అనువాద కవితలు

హిందీ కవిత: నా చిరునామా

August 15, 2026

అభిప్రాయాలు

  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply