• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

జపనీస్ కవయిత్రి ఇజుమి షికుబు : ఒంటరి చిమ్మెట పాట

పి. శ్రీనివాస్ గౌడ్ by పి. శ్రీనివాస్ గౌడ్
March 24, 2023
in అనువాద కవితలు
0
జపనీస్ కవయిత్రి ఇజుమి షికుబు : ఒంటరి చిమ్మెట పాట

జపనీస్ మూలం : ఇజుమి షికిబు
వ్యాసం, కవిత్వ అనువాదం :  పి.శ్రీనివాస్ గౌడ్

జపనీయ సాహిత్యానికి ఉత్కృష్టమైన కాలంగా చెప్పబడిన హీయన్ (794 – 1185) లోనే ఒనొ నొ కొమచి వలె విలసిల్లిన మరో గొప్ప కవయిత్రి ఇజుమి షికుబు ( 976 – 1036 ).

హీయన్ కాల రాజరిక వ్యవస్థ లో దైనందిన జీవితాన్ని కళాత్మకంగా గడిపే స్త్రీ రచయితలకు ప్రత్యేక స్థానం వుంది. వారసత్వంగా సంక్రమించే ఉన్నత పదవులు,గౌరవం,హోదా రాజప్రసాదాలలో అత్యుత్తమ వ్యక్తిగత ప్రతిభ కనపరిచిన స్త్రీ, పురుషులు ఇరువురుకీ దక్కుతుంది.సౌందర్యమూ,తన జతగాడిని అలరించే నేర్పు,చాకచక్యంగా కవిత్వం అల్లగల నేర్పు వారికి ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి.

ఈమె కూడా జపనీయ రాజప్రసాదాలలో తన సేవలందిస్తూ గొప్ప కవయిత్రిగా పేరు గాంచింది. తన అందం తోనూ, తన కవిత్వ సౌందర్యం తోనూ జపనీయ సాహిత్య చరిత్రలోనే ఎన్నదగిన స్థానం సంపాయించింది.

ఈమె కవిత్వంలోని గాఢత,ప్రాకృతిక తన్మయత్వం, ఊహాశాలిత్వం,విరహం,ప్రేమ,జీవితం మీద అనురక్తి, తాత్విక చింతన విస్మయం కలిగిస్తాయి. పాఠకునికి హృదయోల్లాసం కలిగించి, ఆలోచన రేకెత్తించి, తన కవితా పటిమతో వశపరుచుకోగలగడం షికుబు నేర్పు.

10 వ శతాబ్దపు జపనీయ ‌‌రాజ సాంప్రదాయాలను అనుసరిస్తూ షికిబు వెలువరించిన సాహిత్యం నేటికీ
ప్రజ్వలిస్తూనే వుంది.

Ink Dark Moon (Love poems of Ono no komachi and Izumi shikibu. Women of the ancient court of Japan) Translated by Jane Hirshfield with Mariko Aratani అనే పుస్తకం నుంచి తీసుకొని తెలుగు చేసిన కవితలు : ఆస్వాదించండి :

ఇజుమి షికిబు తంక కవితలు :

నువ్వు నీ మనసు మార్చుకున్నావని
గమనించి గానీ, నేను
తలదిండును మారుస్తానో లేదోననే
నిర్ణయం
నిర్థారించి చెప్పలేను –
(మా ప్రేమను తృణీకరించిన నా ప్రియుడు, తాము శయనించిన తలదిండును మార్చవద్దని కోరినపుడు..
నా సమాధానం)

అర్థరాత్రి
చంద్రుని చూస్తూ
యోచిస్తున్నాను..
ఏ తావు నుంచి అతను
చంద్రుని చూస్తున్నాడా అని –

ఈ దేహం మీంచి
కన్నీటి నదులు
ప్రవహించినా..
ఈ ప్రేమాగ్నిని
చల్లార్చలేవు.

చిమ్మెట పాటకి
పదాలు లేనప్పటికీ..
అది ఇంకా
విచారంగానే
ధ్వనిస్తోంది-

ఈ వేసవి కీటకం
కనిపిస్తూ కాలిపోవడం..
ఈ దేహం ప్రణయం వల్ల
రూపాంతరం చెందడం..
తేడా లేదు..నిజానికి –

ఏది ఉత్తమం –
మీరు కోరుకునే
సుదూరపు ప్రేమికుడా లేదా
మీరు మనసు పడని
ప్రతిరోజూ చూసే ప్రేమికుడా?

చంచలమైన విషయాలలో
ఏది తక్కువగా నమ్మదగనిది –
దూసుకుపోయే పక్షులా..
ప్రవహిస్తూ పోయే నదా..లేదంటే
ఈ మానవ లోకమా ?

ప్రపంచం దొర్లిపోతుంది
ఇంకిప్పుడు వసంతం ముగిసింది.
నేను చూసినదంతా
నిన్నటికాల పూల
పరిపూర్ణ శోభ మాత్రమే.

ఈ రాత్రి ఎదురుచూడటానికి
ఎవరూ లేకపోయినా..
నా తలపులెందుకు
తీవ్రమవుతున్నాయి
సందెవేళతో పాటు

గత సంవత్సరాల్లో
క్షణికంగా కురిసి, మాయమైన మంచు
ఇప్పుడు మళ్లీ కురుస్తోంది.
నిన్ను చూస్తూ వుంటే కూడా
ఇలాగే ఉంటుంది.

ఏమిటీ
సంధ్యా సమయం ?
తగిలీ తగలని
పిల్లగాలి సడి కూడా
హృదయాన్ని గుచ్చుతుంది.

ఎంత దూరంలో ఉన్నా,
అతను నాలాంటి మనసుతో
తారాడే చంద్రుడిని చూస్తుంటే..
ఖచ్చితంగా ఈ నిర్మల ఆకాశం
మేఘాలతో నిండి ఉంటుంది.

వసంతకాలంలో
జీవితాన్ని ఆస్వాదించడం వల్ల
ఏమిటీ ఉపయోగం ?
దాని పూలు మనల్ని
ఈ ప్రపంచానికి సంకెల వేస్తాయి.

నీవు శూన్యాకాశంలోకి
ఎందుకు మాయమయ్యావు?
పెళుసుగా ఉండే మంచు కూడా
అది పడేటప్పుప్పుడు,
ఈ ప్రపంచంలోనే పడుతుంది.
(నైషి (షికిబు కూతురు) మరణించినపుడు మంచు కురిసి, కరిగి పోయింది.)

వినండి, వినండి:
ఆశ , ఖేదం..
కొట్టిన గంట
పునశ్చరణ పిలుపులో,
ఏ ఒక్క క్షణాన్ని మర్చిపోలేదు.
(నా కూతురి స్మారకార్ధం రోజున)

సంతాప కాలం ముగిసింది,
నేనిక బయటపడాలి.
ఈరోజు నుండి నేను ధరించే
ఈ ముదురు విస్టేరియా పూలవస్త్రాలు
కన్నీళ్లతో మాత్రమే రంగులు వేయబడతాయి.

ఈ దుఃఖకరమైన ప్రపంచాన్ని
ద్వేషించడం చాలా సులభం.
కానీ ఈ బిడ్డ
ఉన్న ప్రపంచాన్ని
ఎలా వదిలి వెళ్ళగలను?
ఇంతటితో తనువు చాలిద్దామనుకుంటున్నప్పుడు.. ఒక బిడ్డను చూసాను.)

నేనీ ప్రపంచంలో
కొండ కోయిలతో స్నేహం చేస్తే,
మేము మృత్యుపర్వతాన్ని
దాటేటప్పుడు బహుశా అతను
నాతో సంభాషిస్తాడు.

నేను ప్రవేశించవలసిన మార్గం
చీకటి నుంచి చీకటికి దారి తీస్తుంది..
శిఖరాగ్రాల మీద ఓ చంద్రుడా..
దయుంచి నా మార్గంలో
మరి కొంచెం ప్రకాశించు.

(ఈ కవిత తన మరణ శయ్య మీద షికిబు రాసిన అంతిమ కవితగా భావిస్తున్నారు )

పి. శ్రీనివాస్ గౌడ్

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి.

రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

Previous Post

కథాస్మృతి : మధురాంతకం రాజారాం ‘పిచ్చి వెంకట్రావు’

Next Post

ఆలోచింపజేసే కథ :  మూడు అడుగుల శవపేటిక!

Next Post
ఆలోచింపజేసే కథ :  మూడు అడుగుల శవపేటిక!

ఆలోచింపజేసే కథ :  మూడు అడుగుల శవపేటిక!

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com