• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

రష్యన్ కథ : లావు మనిషి- బక్క మనిషి

కేశవ్ గోపాల్ by కేశవ్ గోపాల్
March 10, 2026
in అనువాద కథలు
0
రష్యన్ కథ : లావు మనిషి- బక్క మనిషి

రష్యన్ మూలం : అంతోన్ చెహోవ్
తెలుగు అనువాదం : కేశవ్ గోపాల్

నికలాయెవ్ స్కీ రైల్వేస్టేషన్ లో ఇద్దరు మిత్రులు కలిశారు. ఒకరు లావుమనిషి. మరొకరు బక్క మనిషి. లావు మనిషి రెస్టారెంట్ లో అప్పుడే భోజనం చేశాడు. వెన్న అంటుకున్న పెదాలు పండిన చెర్రీల్లాగా నిగనిగలాడుతున్నాయి. అతని దగ్గర ద్రాక్షసారా వాసన, దాంతోపాటు సెంటు వాసన వేస్తోంది. బక్క మనిషి అప్పుడే రైలు పెట్టెలోంచి బయటపడ్డాడు. అతని దగ్గర సూట్ కేసులు, మూటలు, అట్టపెట్టెల మోత వుంది. అతడు నీచువాసన, అలాగే కాఫీపొడి వాసన కొడ్తున్నాడు. అతని వెనుక శుష్కించిన శరీరంతో, పొడవాటి చుబుకంతో పొట్టిగా ఒక ఆడమనిషి- అతని భార్య- తొంగిచూస్తోంది. అలాగే, హైస్కూల్ విద్యార్థి అయిన మెల్లకంటి అబ్బాయి- ఏపుగా ఎదిగిన అతని కొడుకున్నాడు.

బక్కమనిషిని చూడగానే లావుమనిషి ఆశ్చర్యంతో, ‘‘పోర్ఫిరీ! నువ్వేనా.. ఒరేయ్.. ఎన్నేళ్లయ్యిందిరా నిన్ను చూసి!’’ అంటూ గట్టిగా కేక పెట్టాడు.

బక్కమనిషి విస్మయంతో ‘‘నా చిన్నప్పటి నేస్తానివి మిషాయే కదరా నువ్వు! ఎక్కణ్ణించి వూడిపడ్డావు?’’ అన్నాడు.

కళ్లనిండా నీళ్లు వుబుకుతుండగా ముమ్మారు ఒకర్నొకరు కౌగలించుకున్నారు- స్నేహితులిద్దరూ.

పలకరింపులయ్యాక ‘‘ఒరేయ్.. అద్భుతం. మనమిలా కలుస్తామని కల్లో కూడా వూహించలేదు!’’ అంటూ మొదలెట్టి బక్కమనిషి ‘‘ఏదీ ఒకసారి నిన్ను తనివితీరా చూడనీ. ఎప్పట్లా ఎంత అందంగా వున్నావురా! అదే సొగసు, అదే బడాయి! ఏంట్రా సంగతులు? బాగా సంపాదించావా? పెళ్లయిందా? నాకు పెళ్లయిపోయింది. చూడు… ఈమె నా భార్య లూయిసా నీవాన్‌త్సెన్ బాఖ్ – లూథరన్. ఇక వీడు మా అబ్బాయి నథానియెల్.. మూడో ఫారమ్ చదువుతున్నాడు. నిట్టీ! వీడు నా చిన్ననాటి నేస్తం. ఇద్దరం హైస్కూల్లో కలిసి చదువుకున్నాం!’’ అన్నాడు.

అతని కొడుకు నథానియెల్ కాస్సేపు తటపటాయించి తలమీది టోపీ చేతిలోకి తీసుకున్నాడు గౌరవ సూచకంగా.

బక్కమనిషి మళ్లీ అందుకున్నాడు. ‘‘మనిద్దరం హైస్కూల్లో కలిసి చదువుకున్నాం! అందరూ నిన్ను ఎంతగా ఏడ్పించేవాళ్లో గుర్తుందా? స్కూల్ రిజిష్టర్ కాల్చి తూటు పెట్టినందుకు నిన్నేమో ‘‘హీరో స్ట్రాటస్’’ అనేవాళ్లు. చాడీలు చెప్పడమంటే నాకు ఇష్టం కాబట్టి నన్ను ‘‘ఎఫియాల్టెస్’’ అనేవాళ్లు. హ్హ..హ్హ.. ఎంతైనా చిన్నపిల్లలం కదా! …నట్టీ! సిగ్గుపడొద్దు. ఆయన దగ్గరికెళ్లు.. ఇక ఈమె నా భార్య లూయిసా లూథరన్..’’

నథానియెల్ ఒక క్షణం ఆలోచించి వాళ్ల నాన్న వెనకాల దాక్కున్నాడు.

‘‘సరే! ఎలా వున్నావ్‌రా నువ్వు? ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నావా? బాగా సంపాదించావా?’’ అనడిగాడు లావుమనిషి బక్కమనిషిని ఆప్యాయంగా చూస్తూ.

‘‘ఉద్యోగం చేస్తున్నానోయ్- కాలేజియేట్ అస్సెస్సర్‌గా. ఇప్పుడు రెండో ఏడాది. సెయింట్ స్తానిస్లావ్ పురస్కారం దక్కింది. జీతం తక్కువే.. కానీ ఏం చేస్తాం?… నా భార్య సంగీతం పాఠాలు చెప్తుంది. జీతానికి తోడు నేను కొయ్యతో చుట్టల పెట్టెలు తయారు చేస్తాను. అద్భుతమైనవి! ఒక్కొక్కటి ఒక రూబుల్ లెక్కన అమ్ముతాను. ఎవరైనా పదీ, అంతకుమించి కొంటే వెల తగ్గించి యిస్తాను. మేము ఏదోవిధంగా నెట్టుకొస్తున్నాం. నేను సివిల్ సర్వీస్ లో వున్నాను కదా! నన్నిప్పుడు అదే మంత్రిత్వశాఖలో విభాగాధిపతిగా ఇక్కడికి మార్చారు. ఇక మీదట ఇక్కడే పనిచేస్తాను. సరే… నువ్వెలా వున్నావ్ రా? పందెం కాస్తాను. నువ్వు ఈ పాటికే స్టేట్ కౌన్సిలర్ అయ్యుంటావు. అవునా..?’’- అడిగాడు బక్కమనిషి.

‘‘ఒరేయ్… నన్ను ఇంకొంచెం పై హోదాకు పంపు. ఇప్పటికే ప్రివీ కౌన్సిల్ స్థాయికి ఎదిగాను. నాకిప్పుడు రెండు నక్షత్రాలొచ్చాయి’’ అన్నాడు లావు మనిషి.

బక్కమనిషి ముఖం హఠాత్తుగా పాలిపోయింది. శిలాప్రతిమ అయ్యాడు. కానీ వెంటనే నోరారా నవ్వే ప్రయత్నంలో అతని ముఖం అష్టవంకర్లు పోయింది. – ముఖంలోంచి, కళ్లలోంచి నిప్పురవ్వలు రాలుతున్నట్టుగా… భయంతో వెనక్కు ముడుచుకుపోయాడు. ఒదిగిపోయాడు. అతని సూట్ కేసులు, అట్టపెట్టెలు కూడా ముడుచుకపోయాయి. అతని భార్య చుబుకం ఇంకా పొడుగ్గా సాగింది. అతని కొడుకు నథానియెల్ నిటారుగా నిల్చుని తన స్కూల్ యూనిఫాం గుండీలన్నీ కుదురుగా పెట్టుకున్నాడు.

‘‘మహాప్రభూ!… నేను.. నాకు మహా సంతోషంగా వుందండీ… మరి… చెప్పాలంటే.. చిన్ననాటి నేస్తం… వున్నట్టుండి.. ఇంతగొప్పవారిగా కనిపిస్తే! హ్హీ..హ్హీ..!’’ – తడబడుతూ నోరు విప్పాడు బక్కమనిషి.

‘‘చాల్చాలు!’’ అని వురిమి చూస్తూ ‘‘నీ మాట తీరేమిటి? నువ్వూ నేనూ బాల్యమిత్రులం- ఎందుకంత బెరుకు- గులాంలాగా?’’ అన్నాడు లావు మనిషి.

‘‘దయచూపండి.. నిజ్జం…’’ బక్కమనిషి పళ్లికిలిస్తూ వంగి వంగి ఇంకా వెనక్కు జరిగాడు దూరంగా. ‘‘మహా ప్రభువులు! ఘనత వహించిన తమరి దర్శన భాగ్యంతో నా జన్మ తరించింది… మహాప్రభూ! ఇతడు నా కుమారుడు నథానియెల్… ఈమె నా భార్య లూయిసా లూథరన్… ఒక రకంగా చెప్పాలంటే..!’’ నసిగాడు బక్కమనిషి.

లావు మనిషి అభ్యంతరం చెప్పాలనుకున్నాడు. కానీ, బక్కమనిషి ముఖంలో కనిపించిన పూజ్యభావమూ, ప్రసన్నతా, గౌరవంతో కూడిన భీతీ చూసి లావు మనిషికి రోత పుట్టింది. అతడు దూరంగా తొలిగి వీడ్కోలు తీసుకుంటున్నట్లుగా చెయ్యిముందుకు చాపాడు.

లావుమనిషి తాలూకు మూడు చేతివేళ్లను పట్టుకుని బక్కమనిషి అంటీఅంటనట్లుగా కరచాలనం చేస్తూ, తన శరీరమంతా ముందుకువంచి ‘‘హ్హీ..హ్హీ..హ్హీ..’’ అంటూ పళ్లికిలించాడు చైేనీయుడిలా. అతని భార్య చిరునవ్వు నవ్వింది. అతని కొడుకు నథానియెల్ కాలు గోక్కుంటూ టోపీ కింద పడేశాడు. ఆ ముగ్గురూ మ్రాన్పడిపోయారు.


(1881లో ప్రచురితం)

కొన్ని వివరణలు:

హీరోస్ట్రాటస్ : ఇతడు గ్రీకు దేశస్థుడు. క్రీ.పూ. 356 సంవత్సరంలో తన పేరు చిరస్థాయిగా వుండాలనే కోరికతో ‘ఎఫిసెస్ నగరం’ (ప్రస్తుతం తుర్కియే దేశంలో వుంది) ఆర్టిమిస్ ఆలయాన్ని తగులబెట్టాడు.
ఎఫియాల్టెస్ : ప్రాచీన ఏథెన్స్ (క్రీ.పూ. 506-461) నగరవాసి. రాజనీతిజ్ఞుడు. ఏథెన్స్ నగరాన్ని పర్షియన్లు వశపర్చుకోడానికి వీలుగా ద్రోహం చేశాడు.
కాలేజియేట్ అసెస్సర్ : విశ్వవిద్యాలయ ఉద్యోగి. ఆనాటి ఉద్యోగుల శ్రేణిలో 8వ తరగతికి చెందిన హోదా గలవాడు.
సెయింట్ స్తానిస్లావ్: రష్యాలో విప్లవానికి పూర్వం ఇతని పేరుతో సివిల్ సర్వెంట్స్ కు పురస్కారం ఇచ్చేవారు.
స్టేట్ కౌన్సిలర్ : ప్రభుత్వ సలహాదారు. 5వ తరగతి హోదా గలవాడు.
ప్రివీ కౌన్సిల్ : చక్రవర్తి (రష్యా) రాజ్యసంబంధ సలహాదారుల్లో ఒకడు. 3వ తరగతి హోదా గలవాడు.

కేశవ్ గోపాల్

ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో సీనియర్ రష్యన్ డిప్లొమా చేశారు. 6 ఏళ్లు మాస్కోలో అనువాదంలో శిక్షణ పొంది, ఉద్యోగం చేశారు. జర్మన్ భాషతో కూడా పరిచయం ఉంది.

అభిరుచులు: చిత్రలేఖనం,ఫోటోగ్రఫీ, భాషల అధ్యయనం

Previous Post

విలక్షణ ఆత్మకథకి విశిష్ట అనువాదం – ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’

Next Post

తమిళ కథ : సైకిలు డాక్టరు

Next Post
తమిళ కథ : సైకిలు డాక్టరు

తమిళ కథ : సైకిలు డాక్టరు

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • సుధామూర్తి కథ: అమ్మమ్మ నా కాళ్ళకు మ్రొక్కింది!
  • ఆంగ్ల కవిత : ఐనా ఉదయిస్తాను
  • రష్యన్ కథ : లాటరీ టికెట్టు 
  • కన్నడ కవిత: సీసా – ఓడ
  • ఆంగ్ల కవిత :  ఎవరూ…. (లేరు)
  • హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!
  • టర్కిష్ కథ : వలసపిట్ట
  • కన్నడ కథ: నాలుగో ఆయామం
  • ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !
  • హిందీ కథ: నన్ను పంచుకోండి
  • ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 
  • ఆంగ్ల కవిత : దశలు
  • ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న
  • గుజరాతీ కథ: కాకాజీ నీతికథ
  • ఆంగ్ల కవిత : వర్షంలో గాలి తెరలు
  • హిందీ కథ: పెద్దక్క ప్రయాణం 
  • ఆంగ్ల కవిత: గృహ గీతం
  • హిందీ కథ : కంఫర్ట్ జోన్

అభిప్రాయాలు

  • Gopal Venuraja Rao on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Rajeshwari Srimallik on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply