• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

ఎడిటర్ by ఎడిటర్
September 10, 2026
in అనువాద కథలు
0
పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ మూలం : రఫాదాల్వీ
తెలుగు అనువాదం : రమేశ్ రాచపూటి

అమృత్ సర్ రైల్వేస్టేషన్లోని మూడవ ప్లాట్ ఫాంపై ఉన్న బెంచీపై కూర్చుని ఉన్నాడు సింగ్. తొమ్మిది సంవత్సరాలు వేచి ఉండడంతో అతడు ఇప్పుడు ఒక కొయ్యబొమ్మలాగానే ఉన్నాడు. సింగ్ వద్దంటున్నా రోజూ అతడి భార్య అతడి సూట్ ను ఇస్త్రీ చేస్తూ ఉండడంతో అది పలచగా కనిపిస్తోందిప్పుడు.

పఠాన్ కోచ్ కు వెళ్ళే 4.30 ట్రైన్ రావలసి ఉంది. ‘ఛాయ్ బోలో, గరమ్ ఛాయ్’ ఛాయ్ అమ్మకందారు గొంతు పోర్టర్ల అరుపులతో కలసిపోతూ ఉంది. ఒక చిన్న పిల్ల ఏడుపు, స్టాల్ వద్ద అరటిపళ్ళు బేరం చేస్తున్న ఒక మహిళ గొంతుతో కలసిపోయి వినవస్తోంది. “ఇండియా 48 పరుగులకు 2 వికెట్లు, టెండుల్కర్ 32 నాట్ ఔట్” ట్రాన్సిస్టర్లో క్రికెట్ కామెంటరీ వస్తోంది.

అతడు తన జేబులోంచి ఒక ఉత్తరం తీశాడు.  ముడతలు పడ్డ అతని వేళ్ళు కాగితం మడతలు తీస్తూ ఉంటే వణికాయి. అతనికా ఉత్తరంలోని పదాలన్నీ బాగా తెలుసు, ఐనా చదివాడు.

“నాన్నగారూ, సత్ శ్రీ అకాల్,

క్షేమంగా చేరాను. ట్రైనింగ్ కఠినంగా ఉన్నా నీ కొడుకు తట్టుకుంటూ ఉన్నాడు. జీవిత పరీక్షలు కఠినంగా ఉన్నా పంజాబీలెప్పుటూ వెనుకంజ వేయరని మీరంటూ ఉంటారు కదా, పొద్దున్నే సైరన్ మోగినప్పుడల్లా నాకు మీ మాటలు గుర్తుకొస్తాయి. ఉత్తరాది ప్రాంతాలన్నింటి నుండీ ఇక్కడ యువకులున్నారు. అమృత్ సర్, లూథియానా, హిమాచల్, హర్యానా…

ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేస్తాము. మొదట ఒక గంట పరుగు తీయాలి, హైరబ్బా, మొదటి వారంలో నా కాళ్లు ఊడిపోతాయేమో అనిపించింది. కానీ చిన్నగా నా శరీరం ఉక్కులా గట్టిపడ్తోంది. పరుగు తరువాత లెఫ్ట్, రైట్ అని కదం తొక్కుతూ చేసే డ్రిల్, ఆ తర్వాత వెపన్స్ ఎలా వాడాలో చెప్పే ట్రైనింగ్, మళ్ళీ డ్రిల్, చివరికి మా యూనిఫారాలు చెమటతో తడిసిపోతాయి. సాయంత్రానికి మేము కళ్ళు తెరవలేమో అన్నంతగా అలసిపోతాము. కానీ నేను సంతోషంగా ఉన్నాను నాన్నా. చిన్ననాటి నుండీ నేను కోరుకున్నదిదే.

మాతృభూమికి సేవచేసి మన సిక్కుల గౌరవాన్ని నిలబెడ్తాను. ఎప్పుడైనా పారి పోవాలనిపిస్తే, నేను అమ్మ గురించి, మన వంశగౌరవం గురించి గుర్తుతెచ్చుకుంటాను.

అమ్మను దిగులు పడవద్దని చెప్పండి, నేను బలంగా ఉన్నాను. త్వరలో యూనిఫామ్ వేసుకొని, నా రైఫిల్ తో బాటూ ట్రైన్ దిగుతాను. మీ దీవెనలు నాకు బలాన్నిస్తాయి.”

ఇట్లు
మీ ప్రియ కుమారుడు దలేర్.

సింగ్ జాగ్రత్తగా ఆ ఉత్తరాన్ని మడచి జేబులో పెట్టుకున్నాడు.

ప్లాట్ ఫాం రద్దీగా ఉంది. సింగ్ ఆ రద్దీలో తన కుమారుడి కోసం వెతికాడు. యూనిఫారంలో వెళ్తున్న సైనికుడిని చూడగానే అతడి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది.

“సింగ్ సాబ్” పిలిచాడు స్టేషన్ మాస్టర్ శర్మ. అతడి యూనిఫామ్ చొక్కాలోని చివరి బటన్ బదులు పిన్నీసు వేలాడుతూ ఉంది. “మీరింకా వేచి చూస్తున్నారా?” అడిగాడు శర్మ.

సింగ్ తల నిలువుగా ఊపాడు. “మీరు ఇంటికెళ్లండి, మీ భార్య మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది” అన్నాడు శర్మ.

“ఆమెకు నేనిక్కడ ఉన్నట్లు తెలుసు.”

శర్మ దూరంగా నడిచాడు. శర్మగారు, సింగ్ భార్య, వాళ్ల డాక్టరు, సింగ్ పక్కింటివాళ్ళు ఎందరు చెప్పినా సింగ్ రోజూ తన కొడుకు కోసం రైల్వే స్టేషన్లో ఎదురు చూడడం మానలేదు.

“అక్కడి పొల్యూషన్ సింగ్ గారి ఆరోగ్యం దెబ్బ తీస్తుంది” అనేవారు డాక్టరు. “తాను వీళ్ళకంతా తన మనసులో మాట ఎలా చెప్పాలి?” అనుకొనేవాడు సింగ్.

ట్రైన్ కీచుమంటూ ఆగింది. సింగ్ లేచి నిలబడి తన టై సవరించుకున్నాడు.

“ఈ రోజేమైనా….”

బోగీల తలుపులు తెరచుకున్నాయి. ప్రయాణీకుల వరద… సింగ్ ఆత్రంగా మనుషులలో ఖాకీ దుస్తుల్లో తుపాకీ ధరించి ఉన్న వ్యక్తికోసం చూస్తున్నాడు. అతనికి కొందరు సైనికులు కనిపించారు. కానీ వారిలో దలేర్ లేడు. ప్లాట్ ఫారమ్ చిన్నగా ఖాళీ అయ్యింది. సింగ్ బెంచీపై కూర్చొన్నాడు.

“రేపేమైనా…” అనుకున్నాడు.

కొందరు పిల్లలు అతని వద్దకు వచ్చారు. వారికతడి దినచర్య తెలుసు, సింగ్ కొన్ని నాణేలు తీయడంతో, ఆ పిల్లలు నవ్వుతూ అతని చుట్టూ మూగారు.

“బాబాజీ, మీరు రోజూ ఇక్కడ కూర్చొంటారు, ఎవరికోసమైనా చూస్తున్నారా?” ఏడేళ్ల బాలుడు అడిగాడు.

“నా కొడుకు కోసం”. ఆ అబ్బాయి తల ఊపి అడిగాడు. “మీ అబ్బాయి దాగుడు మూతలాడుతున్నాడా? నేను మీకు సహాయపడాలా?”

సింగ్ ఖాళీ రైలు పట్టాలను దూరం వరకూ చూశాడు. “దాక్కోవడంలో మా అబ్బాయి ప్రవీణుడు” అన్నాడు.

1991లో దలేర్ ఇంటి నుండి వెళ్ళినప్పుడు ఎలా ఉందో, ఆ ఇల్లు ఇప్పుడూ అలానే ఉంది. దలేర్ ఆరోజు లస్సీ తాగిన గ్లాసు, కడగబడి దాని స్థానంలో ఉంది. కేలండర్ పై గురునానక్ బొమ్మ మాసిపోయి ఉన్నా, సింగ్ భార్య అమర్ జీత్ ఆ పేజీ మార్చలేదు.

“అతడు తిరిగి వచ్చినప్పుడు అంతా అలానే ఉండాలి” అనేదామె.

సింగ్ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆమె స్టౌ వద్దనే ఉంది. తెల్లని జుట్టుతో, ఒక భుజంపై దుప్పట్టతో.

“పప్పు చల్లారిపోతోంది” అన్నదామె.

“నాకు ఆకలి లేదు.”

“మీకిక ఆకలి వేయదు.”

దలేర్ రాసుకునే బల్లవద్ద కూర్చున్నాడతడు. ఆ బల్ల ఎన్నో ఏళ్ళ వాడకంతో మచ్చలు పడి ఉంది. దలేర్ ఆ బల్లపై తన ఇనీషియల్స్ చెక్కిన ప్రదేశంలో తడిమాడు సింగ్. దలేర్ ఆ పని చేసినప్పుడాయన కొడుకుపై విరుచుకుపడ్డాడు.

అమరజీత్ భోజనం ఆ బల్ల వద్దకే తెచ్చింది.

“శర్మ, అతడి భార్య వచ్చారు. వారు మీ గురించి దిగులు పడుతున్నారు.”

“పడనివ్వు.”

“రోజు ఆ కలుషిత వాయువులు పీలుస్తూ అక్కడే కూర్చొంటారు. మీరు జబ్బు పడితే…”

“నేను బాగానే ఉన్నాను.”

“తొమ్మిదేళ్లు గడిచాయి.”

“ఐతే ఏం, కొన్నిసార్లు రావడం వీలుకాని ప్రదేశంలో ఉంటారు వారు.”

“సైన్యం అధికారులు అతనికేవైనా జరిగితే మనకు తెలిపి ఉండేవారు.”

“అతడు మనకు తాను వస్తున్నట్లు ఉత్తరం రాశాడు గదా.”

ఇంటి పనితో మొద్దుబారి, పలచగా ఐపోయిన చేతులతో అతని చేతులు పట్టుకుందామె. అతడు స్టేషన్లో కూర్చుని ఉన్నప్పుడు తానొక్కటే చూరులో ఏర్పడ్డ కంత పూడుస్తూ ఉంటే ఆమె వేలికి గాయమైంది.

“అతను రాకపోతే” అందామె.

అతడు తన చేతులను లాక్కొని “అలా అనకు” అన్నాడు.

“మనం ఒక డిటెక్టివ్ ను నియమిస్తే…”

“వద్దు. అతడు నన్ను స్టేషన్లో వేచి ఉండమన్నాడు.”

ఆమె లేచి అతడు తినని ఆహారపు పళ్ళాన్ని తీసుకు వెళ్ళింది.

రాత్రి పడకలో పడుకున్న వారి మధ్య అదే సంభాషణ.

“యూనిఫాంలో వాడెంత అందంగా ఉండేవాడు” అంటుందామె.

“యువరాజులాగా ఉంటాడు.”

“అతడన్ని విధాలా పర్ఫెక్ట్.”

“కొన్నిసార్లు మార్కెట్లో అతడిలాంటి అబ్బాయే నాకు కనిపిస్తాడు. నన్ను చూసి మొఖం తిప్పుకుంటాడు.” అందామె.

“సింగ్ కళ్ళు మూసుకున్నాడు.” ప్రతి యువకుడి లోనూ కొడుకును చూస్తాడాయన.

దలేర్ కదులుతున్న గూడ్స్ వేగన్ ఎక్కాడు. ఆ పెట్టెలో మొత్తం బట్టల క్రేట్స్ ఉన్నాయి. పెట్టె చివరి నుండీ కుళ్ళిన కూరగాయల వాసన వస్తోంది. అతడి శరీరపు వాసనలాగే.

ప్రతిరోజు అతడు చాటుగా తన తండ్రి ప్లాట్ ఫామ్ నుండీ వెళ్ళిపోవడం చూస్తాడు. కొన్నిసార్లు బెంచి వైపు నడిచినా, దానికి 31 అడుగుల దూరంలోని పిల్లర్ వద్ద ఆగుతాడు.

ట్రైన్ వేగంగా వెళ్తోంది. తొమ్మిదేళ్ల క్రితం తాను తన తోటివారితో నవ్వుతూ, కథలు చెప్పుకుంటూ, చిరుతిండ్లు తింటూ ట్రైన్ లో ట్రైనింగ్ కు వెళ్ళడం గుర్తొచ్చిందతనికి.

ఎనిమిది వారాలే అతడు ట్రైనింగ్ లో ఉన్నాడు.

ఒక రాత్రి ఎక్సర్ సైజ్ లో భాగంగా మట్టిలో పడుకొని పాకుతూ ఉంటే, అతడిపై నుండి మెషిన్ గన్ తాలూకా డమ్మీ బుల్లెట్ వెళ్ళింది. కంగారుగా అతడు లేవబోతూంటే మరో డమ్మీ బుల్లెట్ అతడి ఛాతీకి తగిలింది.

సార్జెంట్ అతడిని తిట్టి, “నువ్వు చాలా పిరికివాడివి. సైన్యానికి పనికిరావు. ఇంకో పని వెతుక్కో” అన్నాడు.

అతను తిరిగొచ్చి, స్టేషన్ ఎంట్రన్స్ లో నిలబడి తన తండ్రికి ఏం చెప్పాలో తెలియక తత్తర పడుతుంటే, తన తండ్రి ప్లాట్ ఫాం బెంచీపై వేచి ఉండడం చూశాడు.

పక్క ఇంటివాళ్ళు అటుగా వెళ్తూ “చూడండి, సింగ్ ఇప్పుడు హీరోగా మారిన కొడుకు కోసం కాచుకొని ఉన్నాడు” అంటున్నారు.

అవమానంతో, తండ్రికి ముఖం చూపలేక, నగరంలోకి నడిచాడు. మొదటి వారం బరువులు మోస్తూ, టాయిలెట్లు కడుగుతూ ఏదో కొంత సంపాదించాడు. కానీ ధర్మశాల అద్దెకు, భోజనాలకు అది చాలలేదు. ఒక రాత్రి ఆకలిగా ఉన్నప్పుడు ఆగి ఉన్న ఒక ట్రైన్ లో ఒక బ్యాగ్ కనిపించిందతనికి. “ఈ ఒక్కసారికే” అనుకొని దాన్ని దొంగలించాడు.

రెండవసారి పని సులభతరమైంది.

“ఛయ్య, ఛయ్య, ఛయ్యా” అనుకుంటూ అతడి పార్ట్ నర్ మున్నా వచ్చాడు. ఎప్పుడూ ఆ షారుఖ్ ఖాన్ ట్రైన్ సాంగ్ నే పాడుతాడతను.

“మళ్ళీ మా నాన్న కనిపించాడు” అన్నాడు దలేర్.

“మా నాన్న కూడా ఫ్యాక్టరీ గేట్ వద్ద నాకోసం వేచి ఉండేవాడు. ఒకరోజు గుండె నొప్పితో చనిపోయాడు” బీడీ ముట్టిస్తూ అన్నాడు మున్నా.

“ఎన్ని రోజులిలా ఉంటావు. ఒక రోజాయన ప్లాట్ ఫామ్ పైనే మరణించ బోతున్నాడు” అన్నాడు మున్నా.

“నోర్ముయ్” కోపంగా అరిచాడు దలేర్.

“నవయుగ ఎక్స్ ప్రెస్ లో ఒక లాప్టాప్ కొట్టేశాను” నవ్వుతూ చెప్పాడు మున్నా. దలేర్ కళ్ళు మూసుకున్నాడు. జేబులు కొట్టే సమయంలో అతని చేతులు వణుకుతున్నాయి.

లూథియానాకు వెళ్తున్న ఆ ట్రైన్ లో మున్నా గుర్రుపెడ్తూ నిద్రపోతున్నాడు. దలేర్ ఆ పెట్టె తలుపుకున్న కంతల్లోంచి నక్షత్రాలను చూశాడు. అతని తండ్రి చిన్నప్పుడు తనకు నక్షత్రాలను చూపుతూ “అర్జునుడి వీరత్వం” గురించి కథలు చెప్పేవాడు.

సింగ్ తన నుదుటిని కర్చీఫ్ తో తుడుచుకున్నాడు. కాసేపటికి గోల్టెన్ టెంపుల్ మెయిల్ వస్తుంది. ట్రైన్ ల రాకపోకల గురించి సింగ్ కి బాగా తెలుసు. పోర్టర్ తో మెరుస్తున్న పుల్కాలీ చున్నీ వేసుకున్న మహిళ బేరమాడుతోంది. లౌడ్ స్పీకర్లో పంజాబీ, హిందీ, ఇంగ్లీష్ లో ప్రకటనలు వస్తున్నాయి.

సింగ్ కు హఠాత్తుగా ఛాతీలో మండుతున్నట్లు అనిపించింది. “ఇప్పుడు కాదు… వచ్చే ట్రైన్ లో…”

అతడి తండ్రీ గుండె నొప్పితో మరణించాడు. అతని కుటుంబంలో గుండె నొప్పి ఉందనేవాడు డాక్టరు.

సింగ్ కు దృష్టి మందగించింది. ప్లాట్ ఫారమ్ కదులుతున్నట్లు ఉంది. చేతిలోంచి ఆ ఉత్తరం జారిపోయింది.

“సింగ్ సాబ్” ఛాయ్ వాలా సింగ్ ను పడిపోకుండా పట్టుకున్నాడు. “రామూ, రఫీక్ రండిరా” అని అరిచాడు.

పళ్ళదుకాణం మనిషి, చెప్పులు కుట్టేవాడు, జేబుదొంగ అందరూ సింగ్ చుట్టూ మూగారు.

సింగ్ వారికందరికీ తోచిన సహాయం చేసేవాడు. “మనమితడిని హాస్పిటల్ కు త్వరగా తీసుకెళ్ళాలి” అరిచాడు పాన్ వాలా.

దేశ విభజన సమయంలో లాహోర్ నుండి వలస వచ్చాడు రఫీక్. వారం తరువాత వస్తానన్న అతడి మామయ్య రానేలేదు. 52 ఏళ్ళు గడిచాయి. వేచి ఉండడం ఎంత నరకమూ తెలుసతనికి.

దలేర్ వేగంగా కదిలాడు. ఒక ట్రాలీలో సింగ్ ను కూర్చోబెట్టారు వారు. దలేర్ మిగతావారితో బాటూ తోశాడు దాన్ని.

రద్దీ ప్లాట్ ఫారమ్ లో ఆ ట్రాలీని తోస్తున్న వాడొకడు దలేర్ విచార వదనం చూసి అడిగాడు “మీకతను తెలుసా?”

“నేను… నేనాయన్ని ఈ ప్లాట్ ఫాంపైనే చూస్తుంటాను.”

పేకాట ఆడుతున్న ఆటోవారిలో ఒకరు సింగ్ ను ఆసుపత్రికి చేర్చాడు. పురుగుల మందు తాగిన రైతులు, డ్రగ్ అడిక్ట్ లతో తేజ్ బహదూర్ హాస్పిటల్ రద్దీగా ఉంది.

ఒక కుర్ర డాక్టర్ సింగ్ నాడీ పరీక్షించాడు.

“గుండెనొప్పి, అతడి ఫామిలీలో ఎవరైనా ఉన్నారా” అడిగాడు.

“సింగ్ ఇల్లు నాకు తెలుసు. అతడి భార్యను తీసుకొస్తాను” అని వెళ్ళాడొకడు. ఏడుస్తూ అమర్ జీత్ సింగ్ చేతిని పట్టుకొంది.

తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును ఆ చిరు వ్యాపారులు ఇవ్వజూపినా తీసుకో లేదామె. తన కేప్ ను ముఖంపై కప్పుకొని దలేర్ చూస్తున్నాడు తల్లిదండ్రులను.

తాను వెళ్ళిపోవాలనుకున్నా తండ్రి ముఖం వెళ్ళనీకుండా చేస్తోంది. అమర్ జీత్ పడక పక్కనే కూర్చుని ఉంది.

“దలేర్” చిన్నగా కళ్ళు తెరిచి గొణిగాడు సింగ్.

తలుపు చాటులో ఉన్న దలేర్ ఉలిక్కిపడ్డాడు. కానీ సింగ్ మరొక మూల చూస్తూ “అమర్ జీత్, అటుచూడు, మన పిల్లవాడు ఎంత అందంగా ఉన్నాడో” అని గొణిగాడు. అక్కడామెకు ఏమీ కనబడలేదు.

“అతడి యూనిఫాం ఎంత బాగుందో” వణికే ఒక వేలు ఆ మూలకు చూపుతూ అన్నాడు సింగం.

“మూడు మెడళ్ళు… కాదు నాలుగు, ధైర్యసాహసాలకు. నాకు తెలుసు, మన కొడుకొక హీరో ఔతాడని…”

దలేర్ తన నుదుటిని తలుపుకేసి నొక్కాడు.

“ఎనిమిది వారాలకు మించి ట్రైనింగ్ లో ఉండలేని తనకు నాలుగు మెడళ్ళా”

“అతడెప్పుడూ మన గురించే అనుకుంటూ ఉంటాడు.”

“ఔను, నీలాగే పొడుగ్గా, అందంగా ఉండి ఉంటాడు” అందామె.

“మనమతణ్ణి చూసి గర్వపడుతున్నామని చెప్పు.”

సింగ్ కళ్ళు మూతలు పడ్డాయి. శ్వాస బరువైంది, దలేర్ చిన్నగా నడిచాడు.

సుల్తాన్ వాడీ శ్మశానంలో మంచు కురుస్తోంది.

చితికి, శ్మశానం గేటు మధ్య రైల్వే ఉద్యోగులు, చిరు వ్యాపారాలు, కాలనీ వాసులు, ఛాయ్ వాలాలు ఉన్నారు.

గోడ ఇటుకల మధ్య ఉన్న ఒక కంతలోంచి దలేర్ చూస్తూ ఉన్నాడు. కానీ 50 అడుగులు నడవలేక పోయాడు.

“చాలా మంచాయన, జీవితమంతా వేచి చూశాడు” అన్నారొకరు. చితి మంటలు ఆకాశానికెగిశాయి. గురుద్వార్ లో జరిగిన అఖండపాత్ కు అతడు వెళ్ళలేక పోయాడు.

సింగ్ అంత్యక్రియల తరువాతి రోజు అమర్ జీత్ పడుకొని ఉండిపోయింది. సింగ్ కళ్ళజోడు, చెప్పులు అతడిని గుర్తు చేస్తున్నాయి. రెండవరోజు రోటీలు, దాల్ వండి, రెండు ప్లేట్లలో అవి సర్దింది. మూడవ రోజు అప్రయత్నంగా సింగ్ కోటును ఇస్త్రీ చేయబోయింది. ఆ కోటు వేసుకొని అమర్ జీత్ స్టేషన్ కు వెళ్ళింది. జేబులో సింగ్ తాలూకు లెటర్ ఉంది.

ప్లాట్ ఫారంపై ఆ బెంచిని చూసి వీడ్కోలు చెప్పాలనుకుంది. కానీ అక్కడి పూల మొక్కలు ఆమెను ఆ బెంచిపై కూర్చొనేలా చేసాయి.

ఛాయ్ వాల ఆమెను చూసి, “అమ్మగారు, మీరు ఈ విషాద సమయంలో ఇంటిలోనే ఉండాలి” అన్నాడు.

“సింగ్ గారు రోజూ ఇక్కడే కూర్చొనేవారు. ఎవరో ఒకరు వేచి ఉండాలి కదా” అన్నదామె.

ఆ వార్త చుట్టుపక్కల పాకింది. పళ్ళ వ్యాపారి, ఆమె పక్కన రెండు అరటి పళ్ళు ఉంచాడు, కిళ్ళీలు అమ్మేవాడు, చెప్పులు కుట్టేవాడు ఆమె వద్దకు వచ్చి తమ సంతాపం తెలియజేసారు.

ట్రైన్ వచ్చింది, వెళ్ళింది. ప్లాట్ ఫారం ఖాళీ ఐనా ఆమె వెళ్ళలేదు. సాయంత్రం చివరి ట్రైన్ వరకు వేచి చూసేది.

కొన్నిసార్లు దలేర్ ఆమె ఉత్తరం చదవడం చూసేవాడు. ఒక సాయంత్రం ఆమె ఇలా అంది –

“నువ్వు నన్ను చూస్తున్నావని నాకు తెలుసు దలేర్, తల్లికి తెలుస్తుంది. నువ్వు సిద్ధమైనప్పుడు రా, నీకోసం వేచి ఉంటాను.”

దలేర్ పిల్లర్ ను ఆనుకొని విన్నాడా మాటలను.

అతని గొంతు రాసిపోయింది. కళ్ళు మండాయి. ఆమె వద్దకు పరుగెత్తి వెళ్ళాలనుకున్నాడు. “కానీ ఆమె తనకోసం కాదు, కోటుపై మెడళ్ళు ఉన్న కొడుకు కోసం చూస్తోంది.” అనుకున్నాడు.

ఒక సాయంత్రం అమర్ జీత్ ఇంటికి వెళ్ళడానికి బెంచీపై నుండి లేవగానే ఆమె జేబులోంచి ఉత్తరం జారిపడింది.

దలేర్ ఆ దృశ్యం చూశాడు. ఆ ఉత్తరం ఎగిరిపోతే ఆమెకున్న చివరి నమ్మకం పోతుంది. ఆమె ఇక ఎంతో కాలం బతకదు.

దలేర్ నిశ్చేష్ఠుడైనాడు. ప్లాట్ ఫారం ఖాళీగా వుంది. తన తండ్రి గొంతుక అతనికి వినిపిస్తోంది “ధర్మాన్ని పాటించే వాడే వీరుడు అబ్బాయి, ధర్మమే అతడి ఆయుధం.”

ఒక్కొక్క అడుగు వేస్తూ అతడు 31 అడుగులు నడిచాడు. తొమ్మిదేళ్ల తరువాత… ఆ ఉత్తరాన్ని తీసి చదివాడు. ఆ బెంచిపై కూర్చుని దాన్ని తడుముతూ గతం గుర్తు చేసుకున్నాడు.

ఆ ఉత్తరాన్ని జాగ్రత్తగా మడిచి, అమృత్ సర్ వీధులగుండా నడిచాడు. నక్కి నక్కి నడవడం లేదు. ఇంటివైపు ధీమాగా నడిచాడు.

మూడవ నంబరు ప్లాట్ పారం ఇప్పుడు ఖాళీగా ఉంది. అది అలాగే ఉండదు. ట్రైన్లు వస్తూ పోతూ ఉంటాయి. వేచి వుండేవారు ఎవరో ఒకరు ఉంటారు.

ఎడిటర్

జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

Previous Post

హిందీ కథ : కొత్త గాలి

Next Post

హిందీ కథ : పింఛను

Next Post
హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 
  • మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • ఒరియా కథ : పులి 
  • హిందీ కథ:  ఆత్మ గీతం
  • కాశ్మీరీ కథ: అపరిచితుడు
  • హిందీ కథ : పింఛను
  • పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 
  • హిందీ కథ : కొత్త గాలి
  • జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!
  • మళయాళ చిన్న కథలు
  • బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 
  • హిందీ కథ : ఓడిపోయాను 
  • రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది
  • కన్నడ కథ : చావు
  • ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
  • తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

అభిప్రాయాలు

  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ : భీమ వచ్చింది
  • విహారి on కన్నడ కథ : భీమ వచ్చింది
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Dr.Kvl sandhya Rani on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • Lahari on ఉర్దూ కథ : పీరున్
  • Raghunath Thotapalli on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Jashwanth on ఉక్రెయిన్ జానపద కథ: వజ్రాల కంచె

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply