• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

హిందీ కథ:  ఆత్మ గీతం

వాడ్రేవు చినవీరభద్రుడు by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
in అనువాద కథలు
0
హిందీ కథ:  ఆత్మ గీతం

మూలం : మున్షీ ప్రేమ్ చంద్
అనువాదం: వాడ్రేవు చినవీరభద్రుడు 

ఆశ్చర్యమే! ప్రేమ్‌చంద్ ఇలాంటి కథ రాసాడంటే! కాని ఆశ్చర్యం లేదు. రావిశాస్త్రి ‘వెన్నెల’ కథ రాసినట్టు, ముళ్ళపూడి వెంకటరమణ ‘కానుక’ కథ రాసినట్టు, ప్రేమ్‌చంద్ ఈ కథ రాసాడనుకోవచ్చు. ఎంత కవితాత్మకంగా ఉంది! ఎంత భావగర్భితంగా ఉంది! అందుకని ఉండబట్టలేక, నేరుగా హిందీ నుంచి అనువాదం చేసి, ఈ ‘ఆత్మ గీతం’ (1927) కథని మీతో పంచుకుంటున్నాను.

అర్థరాత్రి. నది ఒడ్డు. ఆకాశంలో తారలు స్థిరంగా ఉన్నాయి. వాటి ప్రతిబింబాలు నది అలల్తో పాటు సంచలిస్తున్నాయి. హృదయంలో ఆశలనీడలు పరుచుకుని ఉన్నట్టుగా, లేదా ముఖమండలంపై శోకం పరుచుకుని ఉన్నట్టుగా ఒక స్వర్గ సంగీతం తాలూకు మనోహరమైన జీవనదాయక, ప్రాణపోషక ధ్వనులు ఈ నిస్తబ్ధ, తమోమయ దృశ్యంలో ఒక వెలుగుని ప్రసరిస్తున్నాయి. రాణీ మనోరమ ఈ రోజు గురుదీక్ష స్వీకరించింది. రోజంతా దానధర్మాల్తో, వ్రతాల్తో గడిచిపోయేక ఒక తియ్యని నిద్ర ఒడిలో ఆమె సేద దీరుతున్నది. అకస్మాత్తుగా ఆమె కన్నులు తెరుచుకున్నాయి. మనోహరధ్వనులేవో ఆమె చెవుల్ని తాకుతున్నాయి. దీపాన్ని చూసిన రెక్కలపురుగులాగా ఆమెనొక  వ్యాకులత ఆవహించింది. చక్కెరవాసన తగిలిన చీమలాగా ఆమె ఉద్విగ్నురాలై మేల్కొంది. లేచి ద్వారపాలకుల, చౌకీదారుల కన్నుగప్పి రాజమహలునుంచి బయటకొచ్చింది. వేదనాపూర్వకమైన ఆ ఆక్రందన వినబడుతున్నకొద్దీ  ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్ళు ప్రవహించడం మొదలుపెట్టాయి.

నది ఒడ్డున ముళ్ళపొదలు. ఎత్తైన ఒడ్డు. భయానకమైన జంతువులు. భయం పుట్టిస్తున్న వాటి అరుపులు. అక్కడ శవాలున్నాయి, అంతకన్నా భయపెడుతున్నవి వాటి గురించిన ఊహలు. మనోరమ కోమలత, సుకుమారత మూర్తీభవించిన ఒక రూపు. కాని ఆమె వింటున్న మధుర సంగీతం తాలూకు ఆకర్షణ, దానిలో ఆమె తాదాత్మ్యత ఆమెని లాక్కుపోతూ ఉన్నవి. ఆమెకి ఆ సమయంలో ఆపదల గురించిన ధ్యాసలేనే లేదు.

అలా ఆమె గంటలకొద్దీ నడుచుకుంటూ పోతూనే ఉంది, నది ఆమె దారికి అడ్డుపడేదాకా.

-2-

వివశురాలై మనోరమ తన దృక్కుల్తో అటూ ఇటూ పరికిస్తూ ఉన్నది. నది ఒడ్డున ఒక నావ కనిపించింది. ఆమె ఆ పడవ దగ్గరకు పోయి ‘నావికుడా, ఈ మనోహర రాగం నన్ను వ్యాకులపరుస్తున్నది, నేను అవతలి ఒడ్డుకు వెళ్ళాలి’ అని అంది.

పడవవాడు: రాత్రిపూట పడవ విప్పడానికి కుదరదు. గాలి చాలా తీవ్రంగా ఉంది. అలలు భయపెడుతున్నాయి. ప్రాణాలకే ప్రామాదం.

మనోరమ: నేను రాణీ మనోరమను. పడవ తియ్యి, నీకెంత కావాలంటే అంతిస్తాను.

పడవవాడు: ఏమైనా చెప్పండి, పడవ నడపడం సాధ్యం కాదు. రాణులకి ఇది తగింది కాదు.

మనోరమ: నావికా, నీ కాళ్ళు పట్టుకుంటాను. తొందరగా పడవ తియ్యి. నా ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి.

పడవాడు: అందుకు లభించే పారితోషికం?

మనోరమ: నువ్వు ఎంతంటే అంత.

పడవవాడు: మీరే చెప్పండి. రాణుల్ని ఏమడగాలో ఈ మొద్దుకేం తెలుస్తుంది? నేను మీతో బేరమాడితే అది మీకే తలవంపు కాదా?

మనోరమ: ఇదుగో, ఈ నా హారం చూడు. ఇది చాలా విలువైంది. దీన్ని నీకిచ్చేస్తాను అని అంటూ మనోరమ తన మెళ్ళోంచి ఆ హారాన్ని బయటకు  తీసింది. ఆ హారకాంతి ఆ నావికుడి ముఖం మీద మెరిసింది. ఆ మొరటు ముఖం మీద, ముడతలు పడ్డ అతడి  నల్లని ముఖం  మీద ఆ హారం మెరిసింది.

ఇంతలో ఆ సంగీత ధ్వని తనకు సమీపంగా వస్తున్నట్టుగా మనోరమకు తోచింది. ఎవరో ఒక పూర్ణ జ్ఞాని ఆత్మానంద సంతోషంలో ఆ సరిత్తటి మీద కూచుని ఆ నిస్తబ్ధ నిశీథిని సంగీతమయం చేస్తున్నట్టు తోచింది.  రాణి హృదయం ఎగిసిపడింది. ఆహా! మనసుని ఎంత ముగ్ధురాల్ని చేస్తున్నదీ రాగం! ఆమె తాళలేక, ‘నావికా, ఇంకా ఆలస్యం చేయకు, పడవ తియ్యి, ఇంకొక్క క్షణం కూడా నేను నిలవలేకపోతున్నాను’ అన్నది.

పడవవాడు: ఆ హారం తీసుకుని నేనేం చెయ్యాలి?

మనోరమ: అవి మేలిముత్యాలు.

పడవాడు: దీనిలో మరో ప్రమాదం కూడా ఉంది. మా ఆడమనిషిగాని ఈ హారం మెళ్ళో వేసుకుని కూచుంటే చుట్టుపక్కలవాళ్ళంతా అసూయతో రగిలిపోయి ఆమెని తిట్టడం మొదలుపెడతారు. దాన్నెక్కణ్ణుంచో దొంగిలించిందనుకుంటారు. చివరికది పాముని మెడకు చుట్టుకున్నట్టవుతుంది. నా గుడిసెమీద పడి పట్టపగలే దోచుకుపోతారు. లేదా దీన్ని నేనక్కణ్ణుంచో దొంగిలించానని చుట్టూ జనం నా మీద అభాండాలు వేస్తారు. వద్దమ్మా, నాకీ హారం వద్దు.

మనోరమ: అలా అయితే నీకేం కావాలో చెప్పు, అదే ఇస్తాను. ఇంకా ఆలస్యం చెయ్యకు. నాకు ఓపిక చాలడం లేదు. ఇంకొక్క క్షణమైనా వేచి ఉండటానికి శక్తి లేదు. ఈ రాగంలోని ఒక్కొక్క గమకం నా హృదయాన్ని చీల్చేస్తున్నది.

పడవవాడు: అయితే ఇంతకన్నా మంచిదేదైనా ఇవ్వండి.

మనోరమ: ఓరి క్రూరుడా! నువ్వు నన్నిట్లా మాటల్లో పెట్టి ఆపేస్తున్నావు. నేనేదిస్తానంటే అది వద్దంటున్నావు, అలాగని నీ అంతట నువ్వు నీకేంకావాలో చెప్పడం లేదు. ఈ సమయంలో నా హృదయంలో ఏమి సంభవిస్తున్నదో నీకెలా తెలుస్తుంది? ఇప్పుడు నన్ను ఆత్మీయంగా పెనవేసుకుంటున్న దీనికోసం నేను నా సర్వస్వం  త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను.

పడవవాడు: మరేమిస్తారో చెప్పండి.

మనోరమ: నా దగ్గర ఇంతకన్నా విలువైన వస్తువు మరేదీ లేదు. కానీ ఇప్పుడు నువ్వు పడవతీసినట్టయితే, ఇదుగో, ఒట్టేసి చెబుతున్నాను, నీకు నా మహలునిచ్చేస్తాను. నువ్వది  ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటావు. స్వచ్ఛమైన పాలరాతితో కట్టిన మేడ. మొత్తం దేశంలోనే దానికి సాటిలేదు.

పడవాడు (నవ్వుతూ): ఆ మహల్లో నివసిస్తే నాకేమి ఆనందం కలుగుతుంది చెప్పండి? పైగా నా అన్నదమ్ములు,చుట్టపక్కాలు నాకు శత్రువులైపోతారు. అర్థరాత్రిపూట ఈ నావలో పయనిస్తున్నప్పుడు కూడా నాకు భయం కలగదు. కాని ఆ మహల్లో నేను పట్టపగలే వణికి చస్తాను. నా పరివారమంతా కలిపినా కూడా ఆ మహల్లో ఒక మూలకి కూడా చాలరు. ఇంక మనుషుల్నెక్కణ్ణుంచి తేను? పనివాళ్ళనెక్కణ్ణుంచి తేను? దాన్లో పట్టేటంత సరుకూ సామగ్రీ ఎక్కణ్ణుంచే తెచ్చుకోను? దాన్ని శుభ్రంచేస్తూ ఉండటమెలాగా? మరమ్మత్తులెలాగ? బాగోగులు చూసుకోడమెలాగ? ఆ పువ్వులు వాడిపోతాయి, ఆ పక్కల మీదకి నక్కలు చేరతాయి, దాని అటకల్లో పావురాలూ, పిచికలూ గూళ్ళు కట్టుకుంటాయి.

మనోరమ అకస్మాత్తుగా ఒక తన్మయావస్థలో తుళ్ళిపడింది. ఆమెకి వినిపిస్తున్న ఆ సంగీతం మరింత దగ్గరగా వచ్చినట్టుగా తోచింది.  ఒత్తిని ఎగసనదోసినప్పుడు దీపం మరింత ప్రజ్వరిల్లినట్టుగా ఆ సంగీత సౌందర్యం, ఆనందం మరింత ఇనుమడిస్తున్నాయి. ఆ సంగీతం మొదట్లో మనసుని ఆకర్షించింది కాస్తా ఇప్పుడు హృదయాన్ని ఉద్వేగపరచడం మొదలుపెట్టింది. మనోరమ మరింత వ్యాకుల చిత్తంతో-ఆహా! మరి నీ అంతట నువ్వే నీకేం కావాలో చెప్పవెందుకు? ఆహా! ఎంత విరాగజనక రాగం. అది నన్నెంత విహ్వల పరుస్తూ ఉన్నది! నేనింక ఒక్క క్షణం కూడా ఓపిక పట్టలేను. ఈ నదిని దాటిపోవాలని ఎంత ఉద్వేగచిత్తురాలిగా ఉన్నాను! ప్రవహించడానికి నీళ్ళు త్వరితపడుతున్నట్టుగా, గాలికోసం ఊపిరి తపిస్తున్నట్టుగా, ప్రసరించడానికి సుగంధం ఆత్రుతపడ్డట్టుగా ఆ స్వర్గసంగీతం కోసం నేని ట్లా వ్యాకులపడుతున్నాను. ఆ సంగీతంలో కోకిలలో వినిపించే ఉల్లాసమేదో ఉంది. చకోరంలో వినిపించే వేదనలాంటిది ఉంది. సాయంసంధ్యలో కనిపించే విహ్వలత్వం ఉంది. ఇందులో జలపాతాల ఆవేగం ఉంది. తుపానులో కనిపించే ప్రచండత ఉంది. దీనిలో అవన్నీ కలిసి ఉన్నాయి. ఇది వింటున్నప్పుడు వివేకాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంది. దీని వల్ల ఆత్మకొక సాంత్వన చేకూరుతున్నది. అంతరంగం తేటపడుతున్నది. ఓ నావికా! నేనింక ఒక్క క్షణం ఆలస్యం చేసినా అది నాకు మృత్యుసమానమే. తొందరగా పడవ తియ్యి. ఇది ఏ సుమసుగంధమో, ఇది ఏ దీపదీప్తినో అక్కడికి నన్ను తొందరగా తీసుకుపో. ఈ సంగీతకర్త ఎవ్వరో ఇక్కడే ఎక్కడో దగ్గరలో, చాలా దగ్గరలో ఉన్నాడుగానీ నేను కనుగొనలేకపోతున్నాను.

పడవమనిషి: మీ మహల్తో నాకు పనిలేదు. నా గుడిసె దానికన్నా ఎన్నో రెట్లు అందమైంది.

మనోరమ: అయ్యో! అయితే నేన్నీకు ఏమివ్వాలి? ఇది సంగీతం కాదు. ఇది ఈ సువిశాల క్షేత్రం తాలూకు పవిత్రత. ఈ సమస్త సుమసమూహాల సౌరభం, సమ స్త మధుర్యాల మాధురి, సమస్త జీవితావస్థల సారాంశం. పడవ తియ్యి. నేనెంతకాలం బతికితే అంతకాలం నీకు సేవచేసుకుంటాను. నీకోసం నీళ్ళు తోడిపెడతాను. నీ గుడిసె ముంగిలి చిమ్మిపెడతాను. నువ్వు నడిచే దారి శుబ్రం చేస్తాను . నీ గుడిసెని పూలతో అలంకరిస్తాను, నీ ఆడమనిషి కాళ్ళు ఒత్తిపెడతాను. ప్రియ నావికా, నాకే గనక నూరు జన్మలు లభిస్తే అవన్నీ ఈ సంగీతంకోసం అర్పించుకుంటాను. దేవుడిముఖం చూసి నన్ను నిరాశ పర్చకు. నా ధైర్యంలో చివరి బొట్టుకూడా వట్టిపోతూ ఉంది. నా ఈ కోరికలో అగ్ని రగులుతున్నది. నేను నా శిరసుతో నీ పాదాలముందు ప్రణమిల్లుతున్నాను.

ఇలా మాట్లాడుతూనే మనోరమ ఒక విక్షిప్తావస్థలో ఆ పడవమనిషి దగ్గరకు పోయి అతడి చరణాలముందు కూలిపోయింది. ఆ క్షణాన ఆమెకి ఆ సంగీతం తన వైపు వస్తున్నట్లుగా,  ప్రజ్వలిస్తున్న దీపకాంతిలాగా అది తన మీద వర్షిస్తున్నట్టుగా అనిపించింది. ఆమెకి రోమాంచమైంది. ఉన్మత్తురాలై నర్తించడం మొదలుపెట్టింది. ఆమెకి గాల్లో తేలుతున్నట్లుగా ఉంది. ఆమెకి రెండుపక్కలా తారకలు మెరుస్తూ కనిపించడం మొదలుపెట్టాయి. ఆమె ఒక  ఆత్మవిస్మృతికి లోనయ్యింది. ఆ ఉన్మత్త సంగీతం, ఆ మనోహర రాగం ఇప్పుడు ఆమె ముఖం నుంచే వెలువడుతున్నట్లుగా ఉంది. అవే అమృతబిందువులు ఆమె అధరాలమీంచి స్రవిస్తున్నాయి. ఆమెనే ఆ సంగీతస్రోతస్వినిగా కనిపిస్తున్నది. నదీతీరమ్మీంచి వినవస్తున్న ధ్వనులు, ప్రాణం పోస్తున్న ఆ ధ్వనులు ఇప్పుడు ఆమె నుంచే వినవస్తున్నవి. మనోరమ ముఖమండలం చంద్రసమానంగా ప్రకాశిస్తున్నది. ఇప్పుడామె నేత్రాలనుంచి పరిపూర్ణ ప్రేమకాంతి ప్రసరిస్తున్నది.

వాడ్రేవు చినవీరభద్రుడు

వాడ్రేవు చినవీరభద్రుడు 1962లో ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లాలోని శరభవరంలో జన్మించారు. తత్వశాస్త్రంలో ఎమ్మే చేశారు. రాష్ట్రస్థాయి అధికారిగాను, ఐఏఎస్ అధికారిగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మూడున్నర దశాబ్దాలు పనిచేశాక 2022లో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులుగా పదవీవిరమణ చేశారు. ఇప్పటిదాకా స్వీయరచనలు, అనువాదాలు, సంకలనాలు, పరిచయగ్రంథాలు మొత్తం 80 వెలువరించారు. డా.ఎపిజె అబ్దుల్ కలాం రాసిన ఇగ్నైటైడ్ మైండ్స్ పుస్తకానికి చేసిన తెలుగు అనువాదానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. పునర్యానం కావ్యానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ వచన కవితా పురస్కారం లభించింది. గిరిజన విద్యారంగంలో ఆయన అనుభవాల కథనం ‘కొన్ని కలలు కొన్ని మెలకువలు’ విశేష ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం హైదరాబాదులో నివాసం. నా కుటీరం పేరిట ఒక బ్లాగు నిర్వహిస్తున్నారు. ఆయన నీటిరంగుల చిత్రకారుడు కూడా.

Previous Post

కాశ్మీరీ కథ: అపరిచితుడు

Next Post

ఒరియా కథ : పులి 

Next Post
ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

by రమేశ్ రాచపూటి
September 14, 2026
0

...

హిందీ కథ : కొత్త గాలి

హిందీ కథ : కొత్త గాలి

by విఎల్ నరసింహం శివకోటి
September 10, 2026
0

...

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

by పి. శ్రీనివాస్ గౌడ్
September 10, 2026
0

...

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

by తిరువాయపాటి రాజగోపాల్
September 10, 2026
0

...

మళయాళ చిన్న కథలు

మళయాళ చిన్న కథలు

by ఎడిటర్
September 10, 2026
0

...

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

by డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
September 10, 2026
0

...

హిందీ కథ : ఓడిపోయాను 

హిందీ కథ : ఓడిపోయాను 

by వెన్నా వల్లభరావు
September 10, 2026
0

...

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

by కేశవ్ గోపాల్
September 10, 2026
0

...

కన్నడ కథ : చావు

కన్నడ కథ : చావు

by చందకచర్ల రమేశబాబు
September 10, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

by శివ చల్లా
September 10, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026
హిందీ కవిత: అడవిలో వర్షం
అనువాద కవితలు

హిందీ కవిత: అడవిలో వర్షం

September 10, 2026
హిందీ కవితలు: గోధుమ + గోవు
అనువాద కవితలు

హిందీ కవితలు: గోధుమ + గోవు

September 10, 2026
సచ్చిదానందన్ కవితలు రెండు..
అనువాద కవితలు

సచ్చిదానందన్ కవితలు రెండు..

August 15, 2026
హిందీ కవిత: నా చిరునామా
అనువాద కవితలు

హిందీ కవిత: నా చిరునామా

August 15, 2026

అభిప్రాయాలు

  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply