• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

మళయాళ చిన్న కథలు

ఎడిటర్ by ఎడిటర్
September 10, 2026
in అనువాద కథలు
0
మళయాళ చిన్న కథలు

తెలుగు అనువాదం : పారనంది నిర్మల

జ్ఞాపకం

మూలం: పి.కే.పారక్కటవు

ట్రాఫిక్ జామ్ వల్ల అతడు కారు ఆపు చేయాల్సి వచ్చింది. అప్పుడే అతడి దృష్టి ఒక స్త్రీ మీద నిల్చింది. ఆమె బస్సుకోసం బస్సు స్టాప్ లో నిల్చుని ఉంది. ఆమెను ఎక్కడో చూసినట్టు అతనికి అనిపించింది. ఆమె ఎవరు?

ఒక్క క్షణం ఆలోచిచంాడు. జామ్ తొలగింది. జనసమూహం కదిలింది. అతడు కారు స్టార్ట్ చేసి ముందుకు సాగాడు. కాని మనసు ఇంకా ఆమె గురించే ఆలోచిస్తూంది. ఎంత ఆలోచించినా ఏమీ గుర్తు రావడం లేదు. ఆమె ఎవరై ఉంటుంది?

అతడు ఇంటికి వచ్చాడు. కారును గ్యారేజ్ లో పెట్టి ఇంటి లోపలకి వెళ్లాడు.

అకస్మాత్తుగా అతడికి జ్ఞాపకం వచ్చింది. వోహ్!  ఆమె తన తల్లే అని!

దుస్తులు

మూలం: శ్రీరాజు కుప్పాయుగళ్

నల్ల దుస్తులన్నాయి-  న్యాయం నాలో ఇమిడి ఉందని

తెల్ల దుస్తులన్నాయి- జీవితమే మాలో ఇమిడి ఉందని

ఖాకీ దుస్తులన్నాయి- క్రమశిక్షణ మాలో ఇమిడి ఉందని

ఖద్దరు దుస్తులన్నాయి- దేశభక్తి మాలో ఇమిడిఉందని

అంతా విన్నాక దుస్తులు లేని ఒక దరిద్రుడి ఎండిపోయిన తోలు ఇలా ఛీత్కరించింది- 

నేనేమీ వేసుకోను. ఈ శరీరాన్ని బట్టల్లేకుండా మాడమంటూ ప్రపంచానికి వదిలేస్తాను.

అప్పుడు ముఖం తిప్పుకొని వెళ్లిపోతున్న జన సమూహం ‘ఔను ఔను’ అంది.

వర్షం

మూలం: పి.కె. పారక్కటువు

దాహంతో పోతోందనిపించినప్పుడు అతను తన ఆప్తమిత్రుడితో అన్నాడు- ‘‘కాస్త స్నేహం..!’’

మిత్రుడన్నాడు- ‘‘మిత్రమా! ఈ భూమి ఎండిపోయింది. ఆకాశం కూడా ఎండిపోయింది. ఈ కరువు కాలంలో దాహంతోనే ఈ భవసాగరాన్ని ఈదాలి.

ఆ తరువాత అతడు కూతురుతో- ‘‘కొంచెం మంచినీళ్లు..’’ అని అడిగేడు. అప్పుడు జవాబుగా ఆమె, ‘‘నాన్నగారు, పాపం పుణ్యం అనే నమ్మకాలు పాతపడిపోయాయి. కోరికలు లేని ఆ ప్రపంచంలో ఏ విధమైన కోరిక లేకుండా మీరు పయనించండి’’ అనేసి తన స్నేహితునితో బైటకి వెళ్లిపోయింది.

అప్పుడు ఆయన ఆకాశం వైపు దీనంగా చూస్తూ యాచించాడు- ఒక నీటిబొట్టు..

ఆయన కోరిక పైకి ఆవిరై ఎగసిపోయి మేఘమై ఆకాశంలో నాట్యమాడటం మొదలెట్టింది. అది చూసి సంతోషంతో కాలం అనే ఆకాశం దయ అనే తలుపు తెరిచింది. ఇంకేముంది ధారా ప్రవాహంగా వర్షం కురిసింది.

కాలం

మూలం : కుంజున్ని

రేపు ఈ సంసారం నాశనమైపోతుంది. అందుకు అది నాశనమైన తరువాత నింపాదిగా కథ రాసి పంపుదామనుకున్నాను. ఈ రోజు పంపితే ఈ జన కోలాహలం గందరగోళంలో పడి చేరుతుందో లేదో? మీరు బహుశా ఆశ్చర్యపోతున్నారు కదూ!

ఈ ప్రపంచమే లేనప్పుడు కథ ఎలా రాస్తానని.

ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది? కథ రాయడానికి ప్రపంచముండాలా?

అక్కరలేదు. కథకాలం బట్టి రాయబడుతుంది. రేపు కాలం అంతం అవుతుందని ఏ జ్యోతిష్కుడు అనలేదు కదా!!

ఎడిటర్

జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

Previous Post

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

Next Post

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

Next Post
హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై .....!

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 
  • మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • ఒరియా కథ : పులి 
  • హిందీ కథ:  ఆత్మ గీతం
  • కాశ్మీరీ కథ: అపరిచితుడు
  • హిందీ కథ : పింఛను
  • పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 
  • హిందీ కథ : కొత్త గాలి
  • జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!
  • మళయాళ చిన్న కథలు
  • బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 
  • హిందీ కథ : ఓడిపోయాను 
  • రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది
  • కన్నడ కథ : చావు
  • ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
  • తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

అభిప్రాయాలు

  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ : భీమ వచ్చింది
  • విహారి on కన్నడ కథ : భీమ వచ్చింది
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Dr.Kvl sandhya Rani on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • Lahari on ఉర్దూ కథ : పీరున్
  • Raghunath Thotapalli on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Jashwanth on ఉక్రెయిన్ జానపద కథ: వజ్రాల కంచె
  • కొల్లూరి సోమ శంకర్ on ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply