చింతపట్ల సుదర్శన్

చింతపట్ల సుదర్శన్

1952లో జన్మించిన చింతపట్ల సుదర్శన్ కృష్ణాపత్రిక, విశాలాంధ్రల్లో 1972లో కవితలతో రచనలు ప్రారంభించారు. హైదరాబాదు పాతనగరంలో ‘ఉషస్సు’ లిఖితపత్రిక సంపాదకుడిగా నడిపారు. 1973లోనే హైదరాబాదు పాతనగరం రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘వేదిక’ లిఖిత పత్రికర సంపాదకుడిగా ఉన్నారు. 1982 నుంచి వివిధ పత్రికల్లో 1500కు పైగా కాలమ్స్ ప్రచురితం అయ్యాయి. కాలమ్, క్రిటికాలమ్, హాట్ కేక్, మాయాబజార్, కానికాలమ్, నాశనగాలమ్, వలపులవల, క్విక్ బాక్సింగ్, కలంకారీ, చల్తే చల్తే, చౌరస్తా, రంగస్థలం వంటివి ప్రముఖమైనవి.
అద్దం, క్రిటికాలమ్, సుదర్శన్ సెటైర్స్, తెలంగాణ.కాం, అమృతం కురవని రాత్రి (కథలు), పగలే వెన్నెల (నవల) ప్రచురించారు. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనేక అనువాద రచనలు చేశారు. ముల్క్ రాజ్ ఆనంద్- అంటరానివాడు, రవీంద్రనాధ్ టాగోర్- శిలావిలాపం, ఆదిశంకరాచార్య- భజగోవిందం, ఆర్కే నారాయణ్- మాల్గుడి నవలలు లాంటివి ముఖ్యమైనవి.

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

మళయాళం, ఇంగ్లిషు : కె.సచ్చిదానందన్ తెలుగు అనువాదం : చింతపట్ల సుదర్శన్ ఒక మిట్ట మధ్యాహ్నం వర్షం కురవడానికి ముందు శాశ్వతమైన చీకటి నుంచి విముక్తి కోసం...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

మూలం: హృదయ్ కౌల్ భారతి అనువాదం: చింతపట్ల సుదర్శన్  (అపరిచితుడు' ఐడెంటిటీకి 'సంబంధించిన  ప్రతీకాత్మక కథ. ఒక కాశ్మీరీ పురాగాధ ఈ కథకు ఆధారం. నాగరాజు అనే...

అభిప్రాయాలు