• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి

చందకచర్ల రమేశబాబు by చందకచర్ల రమేశబాబు
August 10, 2026
in అనువాద కథలు
0
కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి

కన్నడ మూలం: శ్రీనివాస్ జోకట్టె
తెలుగు అనువాదం: చందకచర్ల రమేశబాబు

“సూఫీ సంతులు ఖుదాను ప్రేమించారు. మరి కొందరు ప్రేమే ఖుదా అన్నారు. ప్రేమే జీవితం అన్నాడు బుద్ధుడు..”

ప్రవచనం వింటున్న శివానంద్ ఫోనుకు మెసేజ్ వచ్చిన చప్పుడయింది. 

చూసుకున్నాడు. ఆఫీసునుండి వచ్చింది. ఇప్పుడు చదవడం వద్దనుకుని జేబులో ఉంచుకున్నాడు. ఆఫీసులో వచ్చిన ఏదో సమస్య గురించి అయ్యుంటుంది. సెలవు పెట్టినా వీళ్ళ బాధ తప్పదు అనుకున్నాడు. అక్కడ ప్రవచనం కొనసాగుతోంది. 

“ప్రేమను ఒకప్పుడు పూజతో పోల్చేవారు. భగవంతుడికి ప్రేమతో అర్చన చేస్తూ చేస్తూ భక్తుడే స్వయంగా పరమాత్మ అయ్యే స్థితి అది. రాధ ఎప్పుడు కృష్ణుడవుతుంది, కృష్ణుడి ఎప్పుడు రాధ అవుతాడు… ఎవరూ చెప్పలేరు…”

మళ్ళీ మొబైల్ కు మెసేజ్ వచ్చింది. ఈసారి జేబులోంచి తీసి చూసినప్పుడు ఇది అంకిత నుండి వచ్చిన మెసేజ్. చదివాడు. “సాయంత్రం అంధేరి స్టేషన్ కు రండి. మాట్లాడాలి.” మెసేజ్ పంపింది. చాలా రోజుల తరువాత వచ్చిన మెసేజ్ అది. 

శివానంద్ ప్రవచనం హాలునుండి బయటకు వచ్చాడు. భోజనం వేళయ్యింది. నేరుగా రోడ్డు పైకి వచ్చాడు. ఆ సార్వజనిక అన్న సంతర్పణ క్యూలో  నిలబడడం వ్యర్థమనుకుని హోటల్ వెతుకుతూ నడిచాడు. భోజనం చేసి రూముకు వెళ్ళి దుస్తులు మార్చుకోవాలి. సాయంత్రం అంకితను మీటవ్వాలి. ఈరోజేమైనా ఫలితం దొరకొచ్చునేమో చూడాలి. తొందరగా భోజనం ముగించి రూముకు వెళ్ళి కొద్దిగా పడుకోవాలి. సాయంత్రం తనను కలిసినప్పుడు ఫ్రెష్ గా ఉండాలి. తనయితే ప్రతి సారీ కొత్త డ్రెస్, కొత్త రంగు. తనకు అందంగా కనిపిస్తుంది. ఆమె ఎదుట తను ఇస్త్రీలేని దుస్తులు ధరిస్తే అవమానం. టీ షర్ట్ వేసుకోవాలి. తనే ఒకసారి అనింది- “ఎప్పుడూ ఎందుకు ఫుల్ చేతులది వేసుకుంటారు? టీ షర్ట్, జీన్స్ ఇలా ఒక్కొక్క రోజు వేసుకోవచ్చు కదా! చూద్దాం ఎలా కనిపిస్తారో…” ఈ రోజైనా అలా ఆమె ఎదుట కనిపించాలి.. ఇలా ఏవేవో ఆలోచిస్తూండగా ఎదురుగా హోటల్ కనిపించింది. లోపలికి వెళ్ళాడు. 

“ప్రేమ” అనే పదాన్నిపరిచయం చేసిందే అంకిత. మొదటి కలయిక అదే అంధేరి రైల్వే స్టేషన్ వంతెన పైన. పదిహేను నిమిషాలు కబుర్లు చెప్పుకున్నారు. ఈ రోజు మళ్ళీ అక్కడే కలవాలి. 

ఎంత తొందరగా మూడు సంవత్సరాలు గడిచి పోయాయి! ఈ మూడు సంవత్సరాల్లో ఎన్ని సార్లు అలక చెందలేదు తను? ఎన్ని సార్లు మెసేజ్ చేయడం ఆపలేదు? అంకిత ముక్కు సూటి మనిషి. కోపం ఎక్కువ. కాని తొందరగా చల్లబడిపోతుంది. ఒకసారి గుడ్ నైట్ చెప్పలేదని రాద్ధాంతం చేశాడు తను. అంకితది కొత్త మొబైల్. పంపిన మెసేజ్ అందుండలేదు. శివానంద్ కోపానికి అంకిత సౌమ్యంగానే బదులిచ్చింది. “నమ్మకం ముఖ్యం. మీకు నేను గుడ్నైట్ పంపాను. రాకపోతే నా తప్పెలా అవుతుంది? నమ్మకం లేకపోతే ఇక మెసేజ్ లు పంపడం వ్యర్థం….”

అవును. అన్నట్లే ఒక వారం మెసేజులు రాలేదు. మళ్ళీ రాజీ పడ్డ తరువాత శివానంద్ జాగ్రత్తగా ఉన్నాడు. మెసేజ్ తో ఆమె ప్రేమను తూచడం తన తప్పు అని పశ్చాత్తాప పడ్డాడు. కానీ ఆ మెసేజ్‌ల పిచ్చి పట్టేలా చేసిందే అంకిత. 

శివానంద్ కు తాము మొదటిసారి కలిసింది గుర్తుకు వచ్చింది… ఆరోజు ఆమె కట్టుకున్న అందమైన చీర…!

ఆ రోజు ఆఫీసులో కూర్చుని ఎప్పటిలాగే డ్యూటిలో ఉన్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. “ఈ వారం సాప్తాహికంలో మీరు మహిళల గురించి రాసిన వ్యాసం చాలా నచ్చింది. ఒక పురుషుడై కూడా మీరు మహిళల అంతరంగానికి దిగి రాశారు…” అంటూ తన మెసేజ్ లో రాసింది అంకిత. 

శివానంద్ కు సంతోషం, నవ్వు కలిసే వచ్చాయి. తనేం రచయిత కాడు. ఏదో అరుదుగా ఒకటో రెండో వ్యాసాలు రాయడం అంతే. అది కూడా తన ఆఫీసులోని మహిళా ఉద్యోగినుల దినచర్య చూస్తూ రాసింది. తనెక్కడ మహిళల అంతరంగంలోకి దిగింది? అది వీలవుతుందా అసలు? ఆఫీసులోని అందరు మహిళలూ వివాహితులే. వివాహితుల అంతరంగంలో ఏముంటాయి?… పోన్లే. ఊరికే వచ్చిన ప్రశంసకు “థ్యాంక్స్ అంకితా” అంటూ బదులు పంపాడు. 

అప్పట్నుంచి మెసేజ్ లు రావడం మొదలయ్యింది. “గుడ్ మార్నింగ్” తో మొదలై “గుడ్ నైట్”తో ముగిసేది రోజూవారీ కథ. 

అలాగే, ఆ రోజు మెసేజ్ అతడిని చాలా సతాయించింది. ’నన్ను కనికరించని దేవుడు మిమ్మల్ని కనికరించనీ. మీ కలలన్నీ సాకారమవనీ. ప్రపంచంలోని సుఖాలన్నీ మీకు దక్కనీ. ఆ ఆనందాన్ని చూసే భాగ్యం నాదవనీ.”

అంకిత ఈ మెసేజ్ చాలా అనందాన్నిచ్చింది. “ఎవరిదీ మెసేజ్” అని అడిగాడు. “తెలియదు. నాకు ఎక్కడినుండో వచ్చింది. మీకు ఫార్వర్డ్ చేశాను.” అన్నది.

శివానంద్ కు కొద్దిగా నిరాశ కలిగింది. తనకోసం పంపిన మెసేజ్ కాకుండా ఎవరో తనకు పంపిన మెసేజ్ అన్నది నిరాశను కలగజేసింది. తను మురిసిపోవడానికి ముందు అంకిత కూడా దాన్ని పంపిన వాణ్ణి తలచుకుని మురిసిపోయుంటుంది కదా? ఒక రకంగా తనకు పంపింది పాచిపోయిన మెసేజ్. ఇంకోసారి చదివినప్పుడు పులకింతలు కలగలేదు. 

అప్పుడప్పుడు ఇలాంటి మెసేజ్ లు పంపడం- రిసీవ్ చేసుకోవడం జరిగేది. 

చాలా రోజులనుండి ఇలా మెసేజులు పంపుకుంటున్నారు కాని కలుసుకోలేదు. ఒక రోజు వ్యక్తిగతంగా కలుసుకుందాం అనుకున్నారు. “వచ్చేటప్పుడు మీరు ఇతర వ్యాసాలను ప్రకటించి ఉంటే తీసుకురండి. నేను చదవాలి. జిరాక్సులు తెండి…” అంకిత మెసేజ్ పెట్టింది. 

శివానంద్ అరుదుగా రాసిన కొన్ని వ్యాసాలను, గల్పికలను జిరాక్స్ తీయించి, ఆమెకోసం ఒక నవలను కొని, అందులో తన రాతలను పెట్టి అందంగా ప్యాక్ చేశాడు. 

అనుకున్న సమయానికి ఇద్దరూ రైలు వంతెన పైన కలుసుకున్నారు. అందరిలాగానే ప్రథమ భేటీలో ఎన్నో నిరీక్షణలను పెట్టుకున్నారు. కుతూహలం కూడా ఉండింది. అంకిత ఎంత అందంగా ఉండవచ్చు? అని ఉదయం నుండే శివానంద్ అనుకుంటుంటే, సాయంత్రం భేటీకోసం కాచుకున్న సమయం చివరికి రానే వచ్చింది. 

“స్వీట్ తీసుకోండి. నేనే ఇంట్లో చేశాను. మన ప్రథమ కలయికకు గుర్తుగా” అంకిత స్వీట్ ప్యాకెట్ ఇచ్చింది. 

“నేనేమీ తీసుకురాలేదు. మనం హోటెల్ కి వెళ్దామనుకున్నాను. కొన్ని గల్పికల జిరాక్స్ తెచ్చాను. వీలైనప్పుడు చదవండి… అన్నట్టు మీకోసం ఒక నవల కూడ ఉంది. అది ఎవరిదని ఇంటికి వెళ్ళి చూడండి. మంచి నవల మీకోసమని కొన్నాను.” అంటూ శివానంద్ తన చేతిలోని ప్యాకెట్ ఇచ్చాడు. 

వాళ్ళ ఆఫీసు వివరాల్ని పంచుకున్నారు. “హోటల్ కి వెళ్దామా? ఒక కాఫీ తాగి తరువాత బస్సెక్కుదురుగాని.” శివానంద్ భేటీ చివరి మజిలీకి వచ్చాడు. 

“ఈ రోజు వద్దు. అక్కడంతా పరిచయస్తులు ఉంటారు. మళ్ళెప్పుడైనా చూద్దాం. ఇంటికి రండి ఒకసారి. ఇక్కడే అంధేరి ఈస్ట్ లో ఉంది.” అంకిత పిలిచింది. 

“మీ ఇష్టం…” అంటూ శివానంద్ బస్ స్టాప్ దాకా వచ్చి అంకితకు వీడ్కోలు చెప్పాడు. 

రూముకు వచ్చాక శివానంద్ ఆమె ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ విప్పాడు. అలాగే తీపి జ్ఞాపకాలతో పులకించాడు. చిన్న గిఫ్ట్ కూడ ఉండింది. 

‘ప్రేమ’ను పరిచయం చేసిన అంకిత ప్రేమ దాహాన్ని పెంచింది. దాంతో పాటే ప్రేమ దారిలో ముళ్ళుంటాయి అని కూడా చెప్పింది. శివానంద్ ముందుకు వెళ్తున్నాడు. తన ముందు అంకిత ప్రేమ గంగోత్రిలా పరిగెడుతోంది అనిపించింది. కొంత భ్రమకు బానిసయ్యేవాడు. 

ఆ రోజు రాత్రి గుడ్ నైట్ మెసేజ్ వచ్చినప్పుడు అంకిత అన్నది. “నిజం చెప్పాలంటే ఆ రోజు మీ చేతినుండి పుస్తకం తీసుకున్నప్పుడు, నేను మీకు స్వీట్ ప్యాకెట్ ఇచ్చినప్పుడు నా చేతులు ఎంత వణికాయో తెలుసా? అయినా మీరు నా చేతుల వంక ఏం చూశారు లెండి! నా మొహం చూడ్డంలోనే సరిపోయింది మీకు! అందుకే నేను తప్పించుకున్నాను. నిజంగానే భయపడ్డాను.”

నవ్వు వచ్చింది. 

“అదెక్కడ గమనించడానికి వీలవుతుంది అంకితా? నేను చూసింది నీ చీర రంగు మాత్రమే. ఎంత బాగా కట్టుకున్నావు! మన ప్రథమ భేటీకి గుర్తుగా ఆ చీరను తీసిపెట్టు. పాతబడ్డప్పుడు స్టీల్ పాత్రలవాడికి వేసేయవద్దు. ఎవరికీ ఇవ్వవద్దు. నాకది కావాలి…” శివానంద్ బదులిచ్చాడు.
“ఓ! ఏమేం ఊహలు మీవి. సరే. ఎవరికీ ఇవ్వనులెండి.” అనింది అంకిత. మరుసటి రోజునుండి నాలుగు మెసేజులు ఎక్కువే రాసాగాయి. 

“ప్రేమ లేని హృదయం, వివేకం లేని మనసు, కలలు కాంచని కళ్ళు, నేస్తాలు లేని బ్రతుకు అన్నీ వ్యర్థాలే…” అంకిత మెసేజ్ వచ్చింది. చదివిన శివానంద్ పులకించి పోలేదు. అది బహుశ ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అయ్యుండవచ్చు. తనది మాత్రం కాదు. ‘ఎప్పుడు అంకిత తనదే ఐన మెసేజ్ రాసి పంపుతుందో?” తనలో తనే నవ్వుకున్నాడు. శివానంద్ ను ఈ మధ్య అంకిత చాలా సతాయించసాగింది. 

ఒక సాయంత్రం అంకితకు “ప్రేమించవచ్చా?” అని మెసేజ్ పెట్టాడు. అది పంపేటప్పుడు మొబైల్ పట్టుకున్న శివానంద్ చేయి ఇప్పుడు వణికింది!

లేదు. అంకిత నుండి బదులు రాలేదు. శివానంద్ దాని గురించి మళ్ళీ కెలకడానికి వెళ్ళలేదు. కాకపోతే అప్పుడప్పుడు దాదర్ లోనో, చర్చ్ గేట్లోనో కలిసేవాళ్ళు. “ప్రేమించవచ్చా?” అన్న ప్రశ్నకు మాత్రం ఇంతవరకు అంకిత బదులివ్వలేదు. అలాగని శివానంద్ కూడా దాని గురించి అడగలేదు. అయినా ఇద్దరూ చాలా చోట్లకు కలిసే వెళ్ళేవాళ్ళు. చీర కట్టుకుని వచ్చినప్పుడంతా “మహాదేవ్ సీరియల్ లోని పార్వతిలా కనబడుతున్నావు.” అని శివానంద్ ఆట పట్టించేవాడు. 

ఆ రోజు జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్స్ చూస్తున్నప్పుడు “చీరలో నువ్వు ఈ రోజు దేవతలా కనిపిస్తున్నావు.” అనేశాడు. 

“ఛ! మనుషులను ఎవరైనా దేవతలంటారా? మీకేమైంది ఇవ్వాళ?” తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది అంకిత. ఇద్దరూ బయటికి వచ్చాక, శివానంద్ “ఏమైనా చెప్పనా?” అంటూ “అంకితా! నువ్వు నా అదృష్టానివి. నా సంతోషానివి. దాంతో పాటు… ఏదీ మరచి పోవడానికి వీలు కాదు. నిన్ను కలిశాక బ్రతుకులో గట్టివాణ్ణవుతున్నాను. నా బ్రతుకులో నీ ప్రవేశం వల్ల నా అదృష్టం ఫలించిందనే అనుకుంటున్నాను…” శివానంద్ గేట్ వే వెంట నడుస్తూ చెప్తూనే ఉన్నాడు. 

“అయిపోయిందా? ఇంకా ఏమన్న మిగిలి ఉందా చెప్పడానికి? ఇది కాకుండా మాట్లాడడానికి వేరే మాటలే లేవా? ఇలా మాట్లాడితే నాకు మెసేజ్ చెయ్యడానికి ఇబ్బందిగా ఉంటుంది.” అంకిత కొద్దిగా డిస్టర్బ్ అయినట్టుగా మాట్లాడింది. 

అక్కడి నుండి ట్యాక్సిలో మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుని, పక్కనే ఉన్న హాజి అలి దర్గా ఎదురుగా అలలను చూస్తూ కూర్చున్నారు. “నువ్వేమని మొక్కుకున్నావు? నా గురించి ఏమైనా మొక్కుకున్నావా?” శివానంద్ అడిగాడు. “ప్రార్థనలన్నీ మన మనసుకు నచ్చినట్టు చేసుకోవాలి.” అన్నది అంకిత. 

“ఎప్పుడైనా ప్రవచనం వినడానికి వెళ్ళావా? భక్తిలో ఉన్నప్పుడు ఎప్పుడు రాధ కృష్ణుడవుతుంది, ఎప్పుడు కృష్ణుడు రాధ అవుతాడు తెలిసి రాదట. భక్తికి అంతటి పరివర్తనా శక్తి ఉంది. అందుకే అప్పుడప్పుడు నువ్వు నాకు దేవతవనిపిస్తావు..”

అంకిత బదులియ్యలేదు. ఊరికే ఊ కొట్టింది. 

“ఉద్యాన్ ఎక్స్ ప్రెస్”లో ముంబైనుండి బెంగళూరు మధ్యలోని ప్రయాణం వీరిద్దరినీ మరింత దగ్గరికి చేర్చింది.ఇద్దరూ బెంగళూరుకు వెళ్ళి వచ్చే అవకాశం ఒకటి దొరికినట్టయింది. అంకితకేమో తన ఆఫీసు పని అనే సాకు. శివానంద్ ఏదో మేదోమథనపు గోష్ఠికి వెళ్ళాల్సి ఉంది. ఇద్దరూ కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అంకిత తండ్రితో శివానంద్ కూడా రావడాన్ని తెలిపి మరీ అనుమతి తీసుకుంది. ఇద్దరికీ రిటర్న్ టికెట్ కూడా తనే తీసింది. రైలులో ఇరవైనాలుగు గంటల ప్రయాణం. వెళ్ళేటప్పుడు ఇంటినుండే తినడానికి తీసుకు వచ్చింది అంకిత. రాత్రికి రైల్వే వాళ్ళ భోజనం. మనసు తీరా కబుర్లు. ఇద్దరికీ ఎదురెదురు బెర్తులే వచ్చాయి. నిండా కప్పుకుని పడుకుంది అంకిత. నిద్రలో ఎందుకో ముద్దుగా కనిపించింది. ఎంత తొందరగా  నిద్ర పట్టింది ఈమెకి అనుకున్నాడు. మొబైల్ లోని సౌలభ్యాలను ఎలా ఉపయోగించుకోవాలో రోజంతా శివానంద్ కు నేర్పింది. దాంతో అలసి పోయిందేమో ? రాత్రి మెలకువ వచ్చినప్పుడు అంకిత కప్పుకున్న దుప్పటి క్రింద పడింది కనిపించింది. మళ్ళీ దాన్ని ఆమె పైన సరిగ్గా కప్పి వచ్చి పడుకున్నాడు. అలాగే మెత్తగా బుగ్గ గిల్లాడు. ఆమెకు మెలకువ రాలేదనిపించింది. 

మరుసటి రోజు బెంగళూర్లో దిగినాక ఎవరిదారి వారిదయ్యింది. తను వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళింది. శివానంద్ తమ గోష్ఠి వాళ్ళు ఏర్పరచిన హోటెల్ కు వెళ్ళాడు. రాత్రి మళ్ళీ మెజెస్టిక్ స్టేషన్లో కలిశారు. ఇద్దరి పనులూ సాయంత్రానికే ముగిసాయి. మళ్ళీ అదే దృశ్యం. అంకిత భోజనం తెచ్చింది. రాత్రి ఎదురెదురు బెర్తులే వచ్చాయి. పడుకునేటప్పుడు “దుప్పటి సరిగ్గా కప్పుకో” అన్నాడు శివానంద్. అప్పుడు అంకిత “దుప్పటి సరిచేసిన తరువాత బుగ్గ తాకొద్దు” అన్నది. “దొంగా! తెలియనట్టు నటించావా నిన్న” అంటూ ముక్కు గిల్లాడు. మరుసటి రోజు పగలంతా రైల్లో కబుర్లే కబుర్లు. రాత్రి ఎనిమిదికి దాదర్ స్టేషన్ వచ్చింది. తన కొత్త మొబైల్, అందులోని ఫేస్బుక్… అన్నిటినీ పరిచయం చేసింది అంకిత. “ఇప్పుడు అందరిదీ ఫేస్బుక్ అకౌంట్ ఉంది. మీరు కూడా చేసుకోండి” అన్నది. “అంత టైం లేదు నాకు.” అంటూ “అయినా నాకు అందులో అంత ఆసక్తి లేదు.” అన్నాడు. దాదర్లో మళ్ళీ విడిపోయారు. 

రాత్రి వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిన తరువాత గుడ్ నైట్ మెసేజ్ పంపాడు శివానంద్. అంకిత నుండి వచ్చిన  గుడ్ నైట్  మెసేజ్ కు ముందు ఒక మాట చెప్పింది తన మెసేజ్ లో 

“మనల్ని ప్రేమించేవాళ్ళనే మనం ప్రేమించాలి.” శివానంద్ రెండు సార్లు చదివినా అర్థం చేసుకోలేక పోయాడు. ఇంతవరకూ ఏమీ చెప్పని మనిషి ఇప్పుడు ఎందుకిలా అన్నది? ఏమీ పొడుపుకథ? “ప్రేమించవచ్చా?” అని ఎప్పుడో తనే అడిగాడు. ఇంతవరకూ దానికి బదులివ్వలేదు. ఇప్పుడు ఈ మాటకు అర్థమేమిటి? శివానంద్ గందరగోళంలో పడిపోయాడు. 

శివానంద్ మళ్ళీ మెసేజ్ చదివాడు.- “మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి.” అంకితకు తన ప్రేమ గురించి తెలుసు. ఈ ప్రకారం తను కూడా నన్ను ప్రేమించాలి. అలాంటప్పుడు తనై ఇప్పటిదాకా తన ప్రేమను బహిరంగంగా చెప్పలేదు? పొడుపు కథలా ఎందుకు చెప్పింది? లేదా ఆమెకు తనపై ప్రేమ లేదా?

రైలులో బెంగళూరుకు వెళ్ళినప్పటి దృశ్యం ఒకటి గుర్తుకు వచ్చింది. తనే చపాతీలు తెచ్చింది. ఇద్దరికీ చెరో ప్లేటులో వేసింది. అంకిత తిన్న సగం చపాతీని “నాకు ఇవ్వు” అన్నాడు శివానంద్. “ఛ! ఎంగిలి తినరాదు. నేను కూడా తినను.” అంటూ కోపగించుకుని చెప్పింది గుర్తుకు తెచ్చుకున్నాడు. 

అంకితది ఉత్తమ సంస్కారం నిజమే. కానీ ప్రేమ ముందు ‘ఎంగిలి’ నిలబడరాదు కదా! నిజంగా తను నన్ను ప్రేమించడం లేదా? శివానంద్ తనకు తనే ప్రశ్న వేసుకున్నాడు. 

లేదా అంకిత ఇంకెవరినైనా ప్రేమిస్తూందేమో? అది చెప్పలేక త్రిశంకు స్థితి అనుభవిస్తోందా? కాబట్టే ఈ పొడుపు కథ చెప్పిందా? వెనుకటికొకసారి స్టేషన్లో “బొండాం తాగుదామా?”అంటూ అంగడికి వెళ్ళారు. వెంటనే అంకిత “ రెండు తీసుకుందాం. ఒక్కదాంట్లోనే ఇద్దరూ వద్దు.” అన్నదాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. 

ఇటీవలి రోజుల్లో ఇద్దరూ బిజీ. ఇద్దరి నడుమ మెసేజులు లేవు. కాల్ చేద్దామంటే శివానంద్ కు మొహమాటం. అయినా ప్రేమించినాక ఇక మొండితనం ఎందుకు? ఆమెనుండి మెసేజ్ రావాలనుకోవడం తన తప్పు. మెసేజ్ రాకపోతే తనను మరచిపోయింది అని ఎందుకు అనుకోవాలి? మెసేజ్ పంపితే మాత్రమే తను గుర్తున్నట్టా?

ఒకసారి అంకితే అన్నది “ఓన్లీ మెసేజెస్ ఆర్ నాట్ లైఫ్” అని. 

చివరికి శివానందే అంకితకు మెసేజ్ పెట్టాడు. “ఇంకెప్పుడు కలుస్తావు? చాలా రోజులైంది మనం కలిసి. మెసేజెస్ కూడా రావట్లేదు… కోపమా? బిజీనా?….” 

అంకిత వైపునుండి బదులు రాలేదు. కాచుకున్నాడు, నిద్రపట్టేదాకా. మొబైల్ మెసేజ్ వచ్చిన శబ్దం చేయనే లేదు. 

ప్రవచనం విని, భోంచేసి రూముకు వచ్చాడు శివానంద్. చాప పైన పడుకున్నవాడికి గడచిన సంఘటనలన్నీ గుర్తుకు వచ్చాయి. ఈ రోజేగా తను అంకితను అంధేరి వంతెన పైన కలిసింది? ఈ రోజే మెసేజ్ చేసి ఆ వంతెన పైన తనను రమ్మంది. అంటే ఈ రోజుకు మూడు సంవత్సరాలైంది తాము కలిసి…. అంకితకు ఇది గుర్తుందా? ఈ రోజు మాత్రం తనను “ప్రేమిస్తున్నావా?” అని అడగాలి. అదీ కూడా మొహం పైనే అడగాలి…. శివానంద్ బయలేదేరడానికి సిద్ధమయ్యాడు. 

చెప్పిన సమయానికి అరగంట ముందే అంధేరి స్టేషన్ కు వచ్చి వంతెన పైన నిల్చున్నాడు శివానంద్. క్రింద లోకల్ రైళ్ళ తిరుగుడు. 

ఇలా ఒక్కడే నిల్చున్న శివానంద్ కు ఎందుకో తను చేస్తున్నది సరైనదా కాదా అనే తక్షణ ఆలోచన ఆవరించసాగింది.

ప్రేమను ఒత్తిడితో బలవంతంగా అడగాలా? “నిజంగా ప్రేమిస్తున్నావా?” అని ఒకసారి అడిగినా పక్షిలా ఎగిరి వచ్చి “అవును. ప్రేమిస్తున్నాను.” అని చెప్పి ఉండవచ్చు. లేదు. అంకిత అలా చెప్పలేదు. ప్రేమ అన్నది ఎద లోతుల్లోనుండి రావాలి. అది నాలుక కొసనుండి కాదు. తను అడగడం జరిగింది. ఆమె పొడుపుకథ ఏదో చెప్పింది. ఆ మెసేజ్ ఎంతమందికైనా ఆమె పంపి ఉండవచ్చు. ఎవరో పంపినదాన్ని మరెవ్వరికో పంపి ఉండవచ్చు. ఎంత మంది తనలా పులకితులయ్యుండవచ్చు? ఇంకెప్పుడూ తను ఆమెను దీని గురించి అడగరాదు. ఇప్పుడున్నట్టే ఇలాగే ఉండిపోవాలి. మెసేజ్ కోసం నిరీక్షణలో గడపడమే జీవితమైపోతే అది పెద్ద ప్రమాదం. ఇక ఎన్నడూ ఆమెతో ప్రేమ అనే పదం అనరాదు. మనసు రాయి చేసుకున్నాడు…

జేబునుండి మొబైల్ బయటకు తీశాడు శివానంద్. మెసేజ్ చేశాడు. “అంకితా! మూడు సంవత్సరాల క్రితం ఇదే వంతెన పైన మనం కలుసుకున్నాము. ఆ జ్ఞాపకమే శాశ్వతంగా ఉండనీ… మళ్ళీ ఈ రోజు కలుసుకోవడం వద్దు. నాకు ఇంకో పని ఉంది.. వెయిట్ చెయ్యద్దు.” 

మొబైల్లో డెలివరీ అయినట్టు కనిపించగానే శివానంద్ క్రిందికి దిగి ప్లాట్ ఫారం పైకి వచ్చాడు. లోకల్ రైలు వచ్చి నిలిచింది. దాంట్లో ఎక్కి కూర్చుని తేలికగా ఫీలయ్యాడు. 

 

 

 

చందకచర్ల రమేశబాబు

నివృత్త బ్యాంకు అధికారి. హైదరాబాద్ శివార్లలో ఉంటున్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది. మాతృభాష కన్నడం.

ఆయన భాషల అభిమాని. బళ్ళారిలో పుట్టినందువల్ల ఆయనకు కన్నడం, తెలుగు రెండూ భాషల పరిచయం కలిగింది. రెండు భాషల్లోనూ సాహిత్య రచనలు చేశారు. ఆయన అనువదించిన కథలు అటు తెలుగు పత్రికలలోనూ, కన్నడ పత్రికలలోను ముద్రణకు నోచుకున్నాయి.

ఆయన కన్నడంలో “మనదర్పణ, అనిసిద్దెల్ల అక్షరదల్లి” అనే  రెండు కవితా సంకలనాలను తీసుకువచ్చారు. తెలుగు నుండి “తూర్పుగాలి, మంచుపువ్వు, తపన” నవలలను  కన్నడంలోకి అనువదించారు.  దేవరకొండ బాలగంగాధర తిలక్ “అమృతం కురిసిన రాత్రి”, మామిడి హరికృష్ణ “ఒంటరీకరణ” కవితలను కన్నడంలోకి అనువదించి పుస్తకాలుగా తీసుకొచ్చారు.  ఆయన కన్నడం నుండి అనువదించిన కస్తూర్ బా గారి ఆత్మచరిత్ర “నేను కస్తూర్ బా ని”, అనువాద కథా సంకలనాలు “అత్తర్” “నలుగురికి చేరిన కథలు” “గుడిగంట” “మండే మంటకు ఒళ్ళంతా నోరు”, నవల “వేర్లు” వెలువడ్డాయి.

“గీతలోని మార్గదర్శకాలు” అనే శీర్షికన “కర్తవ్య బోధన, స్థితప్రజ్ఞత, త్రిగుణాలు, నిత్య జీవన గీత ” అనే నాలుగు పుస్తకాలను స్వంతంగా రాశారు. వాటిలో “స్థితపజ్ఞత. త్రిగుణాలు” గుంటూరు నుండి వెలువడుతున్న ఆధ్యాత్మిక పత్రిక “విశ్వధర్మ వాణి” పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడ్డాయి. ”ఉపనిషత్తుల సారం” అనే పుస్తకాన్ని కన్నడం నుండి అనువదించారు. అనువాద కృషికి గాను 2019 లో గిడుగు రామమూర్తి పంతులు పురస్కారం  పొందారు. స్థానిక ఓం భం ట్రస్ట్ వారు ఆయన అనువాద కృషిని గుర్తిస్తూ జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.

Previous Post

హిందీ కథ : లెక్క తప్పింది !

Next Post

రష్యన్ కథ : శస్త్రచికిత్స

Next Post
రష్యన్ కథ : శస్త్రచికిత్స

రష్యన్ కథ : శస్త్రచికిత్స

Subscribe
Login
Notify of
guest
Required
guest
2 Comments
Oldest
Newest Most Voted
Raghunath Thotapalli
Raghunath Thotapalli
1 month ago

చాలా బాగుంది.

Mobile
9448015724
0
Reply
కోడీహళ్ళి మురళీమోహన్
కోడీహళ్ళి మురళీమోహన్
1 month ago

సంఘటనల కంటే భావోద్వేగాలపై ఆధారపడిన కథ ఇది. పెద్దగా నాటకీయ సంఘటనలు జరగకపోయినా, శివానంద్ మనసులో జరిగే పరిణామాలే కథకు చలనాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా ప్రేమను పొందడం కంటే, ఎదుటివారి స్వేచ్ఛను గౌరవించి వెనక్కి తగ్గడమే నిజమైన ప్రేమకు మరో రూపం అనే భావన కలుగుతుంది. సాధారణ ప్రేమకథగా కాకుండా, మెసేజ్‌ల యుగంలో ప్రేమను ఎలా అపార్థం చేసుకుంటామో, నిరీక్షణ ఎలా ప్రేమకు ప్రత్యామ్నాయంగా మారుతుందో చెప్పే మానసిక కథ. మూల రచయితకు, అనువాదకులకు అభినందనలు.

0
Reply

ఈ సంచికలో అనువాద కథలు..

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

by రమేశ్ రాచపూటి
September 14, 2026
0

...

హిందీ కథ : కొత్త గాలి

హిందీ కథ : కొత్త గాలి

by విఎల్ నరసింహం శివకోటి
September 10, 2026
0

...

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

by పి. శ్రీనివాస్ గౌడ్
September 10, 2026
0

...

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

by తిరువాయపాటి రాజగోపాల్
September 10, 2026
0

...

మళయాళ చిన్న కథలు

మళయాళ చిన్న కథలు

by ఎడిటర్
September 10, 2026
0

...

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

by డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
September 10, 2026
0

...

హిందీ కథ : ఓడిపోయాను 

హిందీ కథ : ఓడిపోయాను 

by వెన్నా వల్లభరావు
September 10, 2026
0

...

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

by కేశవ్ గోపాల్
September 10, 2026
0

...

కన్నడ కథ : చావు

కన్నడ కథ : చావు

by చందకచర్ల రమేశబాబు
September 10, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

by శివ చల్లా
September 10, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026
హిందీ కవిత: అడవిలో వర్షం
అనువాద కవితలు

హిందీ కవిత: అడవిలో వర్షం

September 10, 2026
హిందీ కవితలు: గోధుమ + గోవు
అనువాద కవితలు

హిందీ కవితలు: గోధుమ + గోవు

September 10, 2026
సచ్చిదానందన్ కవితలు రెండు..
అనువాద కవితలు

సచ్చిదానందన్ కవితలు రెండు..

August 15, 2026
హిందీ కవిత: నా చిరునామా
అనువాద కవితలు

హిందీ కవిత: నా చిరునామా

August 15, 2026

అభిప్రాయాలు

  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
2
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply