• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఫ్రెంచ్ కథ : ఆయన చిన్నతనంలో

వినయమణి by వినయమణి
March 24, 2023
in అనువాద కథలు
0
గుజరాతీ కథ : ఆలంబన

ఫ్రెంచ్ మూలం : ఆన్రీ లావ్దా
తెలుగు అనువాదం :  వినయమణి

“సంగతి ఏమిటా? చెప్తాను.  మారు మాట్లాడకుండా, కొంచెంసేపు నేను చెప్పేది పూర్తిగా వింటానంటే చెప్తాను.” అంది మేడమ్ ప్రెసీ భర్తతో.
“తప్పకుండా వింటాను.  చెప్పు.”  ఎంతో ప్రశాంతంగా అన్నాడు అతను.
“సంగతి ఏమిటంటే,” భావోద్రేకంతో ఆమె కంఠం వణికింది, “మీతో జీవితం దుర్భరంగా ఉంది. ఇంక ఇది నేను ఏమాత్రం భరించలేను.  నిజమే, మీరు మర్యాదస్తులే. ఎంతో నిజాయితీగా ఉన్నారు కూడా.  మనిద్దరికీ ఏ పొరపొచ్చాలూ లేవు.  కాని, మనిద్దరికీ పొసగటం లేదు.  నేను ఏం చేసినా మీరు చిరాకు పడతారు. మీ పద్ధతులేవీ నాకు నచ్చవు.  నేను ఏం మాట్లాడినా మీరు విసుక్కుంటారు. మీరు నవ్వితే నాకు చిర్రెక్కిపోతుంది.  మనం నిశ్శబ్దంగా ఉన్నా కూడా ఒకరినొకరం ఉసిగొల్పుతున్నట్టుగా ఉంటుంది.  ఒక టోపీ గురించో, ఒక డ్రెస్సు గురించో, అన్నం సరిగ్గా ఉడికిందా లేదా అనో – చెప్పాలంటే ప్రతి చిన్న విషయానికి మనకి పోట్లాటే.  ఇంక ఒక్కోసారి మీరు ఎంతగా మాట్లాడతారంటే నేను నోరు విప్పటానికే వీలు లేదు.  లేదా పెదవి కదపకుండా స్మశాన నిశ్శబ్దత పాటిస్తారు.  మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉండాలి, మీరు విచారంగా ఉంటే  విచారంగా ఉండాలి.  మీకు ఇష్టం లేకపోతే నేను మాట మధ్యలోనే ఆపేయాలి.  నేను ఎడ్డెం అంటే తెడ్డెం అంటారు.  నా బట్టలు ఎలా ఉండాలో మీరే నిర్ణయిస్తారు.  ఏ చిన్న విషయం గురించి పోట్లాట వచ్చినా గంటల తరబడి దాన్ని సాగదీస్తారు. నేను ఏం చేసినా మీకు నచ్చదు. అంతే.  నాకు అలాగే అనిపిస్తుంది.  చెప్పకండి.  మీకు ఈ క్షణంలో నన్ను కిటికీలోంచి బయటికి విసిరేయాలని ఉంది”.
‘’అందుకని?’’  అన్నాడు అతను.
“అందుకని ఇంక మనం ఈ భర్యాభర్తల నాటకం ఆపేయటం మంచిది.  ఇది మీ తప్పూ కాదు, నా తప్పూ కాదు.  లేదా ఇద్దరి తప్పూనూ. మనం కలిసి ఉండలేం.  అదృష్టవశాత్తూ మనకి పిల్లలు లేరు.  ఎవరి ఆస్తులు వారికి ఉన్నాయి. ఒకరిని ఒకరం బాధ పెట్టుకుంటూ ఎందుకు ఇలా ఉండటం? మీ అమ్మ, నాన్నలకి కూడా పడేది కాదని, పట్టుమని పది రోజులైనా కలిసి ఉండేవారు కాదని మీరే చెప్పారుగా!  నేను లేకపోయినా మీరు బానే ఉండగలరు.  ఇంక ఇంతకన్న దీనిగురించి మాట్లాడటం అనవసరం.  నేను నా గదిలోకి వెళ్తున్నాను.”
ఇంతసేపూ మిస్టర్ ప్రెసీ ఆమె చెప్పినదంతా నిశ్శబ్దంగా వింటున్నాడు. ఒకసారో, రెండుసార్లో దీర్ఘంగా నిట్టూర్చాడు.  మధ్యలో ఎప్పుడో పచార్లు చేయటం మొదలు పెట్టాడు.  ఆమె మాట్లాడటం ముగించే సమయానికి ఆమె ముందర ఆగాడు.   వీలయినంత గంభీరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ కొద్దిగా బాధతో అన్నాడు,
“చెప్పటం అయిందా?”
“అయింది, మన మధ్య సంబంధం కూడా అయిపోయింది.”
వినయమణి

సంగీతం, సాహిత్యం, సాహసయాత్రలు, స్వచ్ఛందసేవ ముఖ్యమైన అభిరుచులు. ఆకాశవాణినుంచి విరమించుకున్న తరువాత కాలిఫోర్నియాలో ఉద్యోగం, నివాసం. ఫ్రెంచ్ లో ఆంత్వాన్ ద సెంత్ ఎక్సూపెరీ రాసిన ప్రసిద్ధ నవల చిన్నారి రాకుమారుడు తెలుగులోకి అనువదించి ప్రచురించారు.

Page 1 of 3
123Next
Previous Post

ఆల్బేనియా కథ : అజ్ఞాత యోధుడు

Next Post

గుజరాతీ కథ : ఆలంబన

Next Post
గుజరాతీ కథ : ఆలంబన

గుజరాతీ కథ : ఆలంబన

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com