• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

రష్యన్ కథ : మాస్క్

కేశవ్ గోపాల్ by కేశవ్ గోపాల్
January 10, 2026
in అనువాద కథలు
0
రష్యన్ కథ : మాస్క్

మూలం : అంతోన్ చెహొవ్
తెలుగు అనువాదం : కేశవ్ గోపాల్

ఎక్స్ అనే సోషల్ క్లబ్‌లో దానధర్మాల నిధి కోసం మాస్క్ వేసుకుని చేసే బాల్ నృత్య ప్రదర్శన జరుగుతోంది.
రాత్రి పన్నెండు గంటలైంది. నృత్యప్రదర్శనలో పాల్గొనని ఐదుగురు మేధావులు రీడింగ్ రూంలో ఒక పెద్ద బల్ల దగ్గర కూచుని ముక్కులు, గడ్డాలు వార్తాపత్రికల్లో దూర్చి చదువుతూ కునుకు తీస్తూ వున్నారు. సెయింట్ పీటర్స్‌బుర్గ్ వార్తా పత్రికల స్థానిక విలేకరి మాటల్లో చెప్పాలంటే, ఒక మహా ఉదారవాద జెంటిల్మన్ ‘‘దీర్ఘాలోచన’’లో నిమగ్నమైవున్నాడు.
మెయిన్ హాల్లోంచి సంగీత స్వరాలు వినిపిస్తున్నాయి. మధ్యమధ్యలో నౌకర్లు దబదబా అడుగులు వేస్తూ గ్లాసులు, ప్లేట్లు టకటకలాడుతుండగా హడావుడిగా ద్వారంగుండా వస్తూపోతూ వున్నారు. కానీ రీడింగ్ రూంలో మాత్రం నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది.
‘‘ఇక్కడ మరింత సౌకర్యంగా వుంటుందనిపిస్తోంది!’’ అంటూ పొయ్యి గూట్లోంచి వచ్చినట్లు మంద్రంగా, కొంచెం రాపుగొంతుతో వినిపించింది. ‘‘రండి.. రండి! ఇటువైపు’’ అంటూ.
తలుపు తెరుచుకుంది. గుర్రబ్బగ్గీ తోలేవాళ్ల యూనిఫాంలో నెమలీకలు గుచ్చిన టోపీతో ముఖానికి మాస్క్ ధరించిన ఒక దృఢకాయుడు రీడింగ్ రూం లోపలికి ప్రవేశించాడు.
అతని వెంట మాస్కులు ధరించిన ఇద్దరు మహిళలు, ట్రే పట్టుకుని ఒక నౌకరు వచ్చారు. ట్రేలో కుండలాంటి ఒక మద్యం సీసా, రెడ్ వైన్ నింపిన మూడు సీసాలు, కొన్ని గ్లాసులు వున్నాయి.
‘‘ఇటువైపు రండి! ఇక్కడ చల్లగా కూడా వుంది!’’ అన్నాడు ఆ వ్యక్తి. ‘‘ట్రేని బల్లమీద పెట్టు..’’ అంటూ ఆజ్ఞాపించాడు. ‘‘అమ్మాయిలూ! కూర్చోండి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను!’’ అని ఫ్రెంచి భాషలో చెప్పాడు. ‘‘జెంటిల్మెన్ అవతలికి జరగండి.. మీరిక్కడ అడ్డంగా వున్నారు!’’
అతడు కొద్దిగా తూలుతూ చేత్తో బల్లమీది వార్తా పత్రికలను విసురుగా తోసేశాడు.
‘‘ట్రే ఇక్కడ పెట్టు. జెంటిల్మెన్! మీరిక్కణ్నించి వెళ్లిపోండి. వార్తాపత్రికలకు, రాజకీయాలకు ఇది చోటు కాదు.. ఆపండి!’’
‘‘కొంచెం మెల్లగా మాట్లాడండి’’ అంటూ అక్కడున్న మేధావుల్లో ఒకరు మాస్క్ వైపు కళ్లజోడులోంచి చూస్తూ అన్నాడు. ‘‘ఇది రీడింగ్ రూం. అల్పహారశాల కాదు.. తాగేచోటు కాదు.’’
‘‘ఎందుక్కాదు? బల్ల ఏమైనా వూగుతోందా? పైకప్పు ఏమైనా కూలిపోతోందా? విచిత్రం.. తగ్గండి! కబుర్లకు తీరికలేదు! వార్తాపత్రికలు అవతల పారేయండి. చదివింది చాలు. ఇప్పటికే మీరు తెలివి మీరిపోయారు. చదివిచదివి కళ్లు పాడైపోతాయి. ముఖ్యంగా మీరు చదవడం నాకిష్టం లేదు. అంతే!’’
నౌకరు ట్రేను బల్లమీద పెట్టి తన మోచేతిపై రుమాలు కప్పి తలుపు దగ్గర నిలబడ్డాడు. మహిళలు వెంటనే రెడ్ వైన్ తాగడం మొదలెట్టారు.
‘‘జనానికి తెలివి ఎక్కువైపోయిందా ఏమి? పానీయాలకంటే వార్తాపత్రికలు మేలు అనుకుంటున్నారు.’’ నెమలీకలు పెట్టుకున్న వ్యక్తి గ్లాసులో మద్యం నింపుకుంటూ, ‘‘మహాశయులారా! నా అభిప్రాయమేమంటే- తాగడానికి మీ దగ్గర డబ్బుల్లేవు. అందుకే మీరు వార్తాపత్రికలపైన ప్రేమ కురిపిస్తున్నారు! నిజమే కదా? హ్హ.. హ్హ! మొండితనం మాని, తాగుడే మేలని తెలుసుకోండి!’’
నెమలీకల మనిషి కొంచెం పైకి లేచి కళ్లజోడు పెట్టుకున్న వ్యక్తి చేతుల్లోంచి వార్తాపత్రిక లాగి పడేశాడు. కళ్లజోడు వ్యక్తి ముఖం పాలిపోయింది. తర్వాత ఎర్రబారింది. అక్కడున్న మేధావులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
‘‘అయ్యా! మీరు ఒళ్లు మరిచి ప్రవర్తిస్తున్నారు!’’ అంటూ అతడు కోపగించుకున్నాడు. ‘‘మీరు రీడింగ్ రూం ను పానశాలగా మారుస్తున్నారు. మీ ప్రవర్తన- చేతుల్లోంచి వార్తాపత్రికలు లాగేసుకోవడం- దారుణం! నేను దీన్ని సహించను! మీరు ఎవరితో గొడవ పెట్టుకుంటున్నారో తెలుసా? నేను బ్యాంక్ మేనేజర్ జెస్త్యకోవ్ ను!’’
‘‘నువ్వు జెస్త్యకోవ్ అయితే ఏంటి? నీ వార్తాపత్రికకు దక్కాల్సిన గౌరవం ఇదే..’’ అంటూ అతడు వార్తాపత్రికను ముక్కలు ముక్కలుగా చింపేశాడు.
‘‘జెంటిల్మెన్! ఏంటిది?’’ జెస్త్యకోవ్ గొణిగాడు. ‘‘ఇది దౌర్జన్యం.. అంతకు మించి దారుణం!’’
‘‘పాపం! వాళ్లకు కోపమొచ్చింది!’’ నెమలీక మనిషి నవ్వాడు. ‘‘అయ్యో! నాకు భయమేస్తోంది. నా కాళ్లు కూడా ఒణుకుతున్నాయి.. గౌరవనీయులారా! జోక్ చేయడం పక్కన పెడితే, మీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు.. ఇక్కడ నేను ఒంటరిగా ఈ అందాల భామలతో సరదాగా గడపాలనుకుంటున్నాను. మీరు అడ్డు చెప్పకుండా బైటకు దయచేయండి.. ఇటు బైటకు బెలెబూహిన్ గారూ.. కుక్కల దగ్గరికి.. ముఖం ఎందుకు మాడ్చుకుంటున్నారు? వెళ్లండి.. అంటే గెటౌట్ అని అర్థం.. త్వరగా- లేదంటే మెడలో బుల్లెట్ దూరుతుంది!’’
‘‘ఏంటీ దుర్మార్గం?-’’ అనాథల కోర్టు కోశాధికారి బెలెబూహిన్ ఎర్రబారిన ముఖంతో భుజాలు ఎగరేస్తూ ప్రశ్నించాడు. ‘‘నాకు బొత్తిగా ఏమీ అర్థం కావడం లేదు.. ఎవడో రాస్కెల్ లోపలికి దూరి.. హఠాత్తుగా.. ఇదంతా..’’
‘‘ఏమన్నావ్? రాస్కెలా?’’ నెమలీకల మనిషి గర్జించాడు. సహనం నశించి పిడికిలితో బల్లమీద గట్టిగా బాదాడు. ఎంత గట్టిగా అంటే ట్రేలో వున్న గ్లాసులు ఎగిరెగిరి పడ్డాయి.
‘‘ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాస్క్ వేసుకున్నాను కాబట్టి నోటికొచ్చింది వాగుతావా? బైటకు వెళ్లమని చెప్పాను కదా! బ్యాంక్ మేనేజర్.. బైటకెళ్లు.. అందరూ బైటికి.. ఒక్క దుర్మార్గుడు కూడా ఇక్కడ వుండకూడదు. అందరూ పొండి.. నరకానికి!’’
‘‘ఆ సంగతేమిటో ఒక్క క్షణంలో తేలుస్తా’’ అన్నాడు జెస్త్యకోవ్. ఆందోళనతో అతని కళ్లజోడు చెమర్చింది. ‘‘నా తడాఖా చూపిస్తాను! హేయ్.. డ్యూటీ సార్జెంట్ మేజర్‌ను పిలవండి!’’
ఒక నిముషం తర్వాత భుజానికి లేత నీలం రంగు రిబ్బన్ కట్టుకున్న ఎర్రజుట్టు పొట్టి సార్జెంట్ మేజర్ లోపలికొచ్చాడు. నృత్యం చేస్తూ మధ్యలో రావడం వల్ల ఆయాసపడుతున్నాడు.
‘‘దయచేసి వెళ్లిపో! ఇది తాగే చోటు కాదు.. పలహార శాలకు వెళ్లు!’’
‘‘ఎక్కణ్నించి వూడిపడ్డావు నువ్వు? నేను నిన్నేమైనా రమ్మన్నానా?’’ ప్రశ్నించాడు నెమలీకల మనిషి.
‘‘నన్ను రెచ్చగొట్టకు.. బైటకెళ్లు!’’
‘‘నేను చెప్పేది వినండి. మీకు ఒక నిముషం ఇస్తున్నా. నువ్వు ముఖ్యమైన వ్యక్తివి, మేనేజర్ వి కాబట్టి ఈ జోకర్లను పట్టుకొని బైటికి తీసుకెళ్లు! ఎవరెవరో ఇక్కడుండటం ఈ భామలకు నచ్చదు.. వీళ్లకు సిగ్గు.. నా డబ్బులతో వచ్చారు కాబట్టి వీళ్లు ఇబ్బంది పడకూడదు.’’
‘‘ఈ మూర్ఖుడు తాను పశువుల దొడ్డిలో లేడని అర్థం చేసుకోలేకపోతున్నాడు’’ జెస్త్యకోవ్ అరిచాడు. ‘‘ఎఫ్‌స్త్రాస్ స్పిరిదోనిచ్ ను పిలిపించండి!’’
‘‘ఎఫ్‌స్త్రాస్ స్పిరిదోనిచ్ ఎక్కడున్నాడు?’’ అంటూ కేకలు క్లబ్ అంతటా మార్మోగాయి.
వెంటనే పోలీసు యూనిఫాంలో వున్న ఎఫ్‌స్త్రాస్ స్పిరిదోనిచ్ ప్రత్యక్షమయ్యాడు.
‘‘దయచేసి బైటికెళ్లు!’’ అంటూ అతడు భయంకరంగా గుడ్లు వురుముతూ మైనం పూసిన మీసాలు మెలేశాడు.
‘‘అబ్బో! భయపెట్టేశావు.. ఒట్టు!’’ పకపకా నవ్వాడు నెమలీకల మనిషి.. ‘‘ఎవరైనా సాయం చేయండి. నా కాళ్లు వణుకుతున్నాయి! దేవుడా.. పిల్లిలాగా మీసాలు.. కళ్లు నిప్పులు కక్కుతున్నాయి.. హీ..హీ..హీ!’’
‘‘దయచేసి వాదించొద్దు!’’ ఎఫ్‌స్త్రాస్ స్పిరిదోనిచ్ శక్తి కొద్దీ అరుస్తూ, వణకడం మొదలెట్టాడు. ‘‘గెటౌట్! నిన్ను బయటికి గెంటేస్తాను!’’
రీడింగ్ రూంలో గొప్ప కలకలం చెలరేగింది. ఎఫ్‌స్త్రాస్ స్పిరిదోనిచ్ ఎర్ర ఎండ్రకాయలా అయిపోయి గట్టిగా అరిచాడు. కాళ్లు నేలకేసి బలంగా తాటించాడు. జెస్త్యకోవ్ అరిచాడు. బెలెబూహిన్ అరిచాడు. మేధావులందరూ అరిచారు. కానీ వాళ్ల అరుపులన్నీ మాస్క్ మనిషి తాలూకు గంభీరమైన, కంచు కంఠం ముందు వెలవెలబోయాయి. అంతటా గందరగోళం కారణంగా నృత్యం ఆగిపోయింది. జనమంతా నృత్యమందిరం నుంచి రీడింగ్ రూం వైపు బిలబిలమంటూ దూసుకొచ్చారు.
ఎఫ్‌స్త్రాస్ స్పిరిదోనిచ్ తన ప్రతాపం చూపడానికి పోలీసులందర్నీ క్లబ్‌కు పిలిపించాడు. నివేదిక రాయడానికి కూచున్నాడు.
అతని కలానికి అడ్డుపడుతూ, మాస్కు ధరించిన వ్యక్తి ‘‘రాయండి.. రాయండి.. అయ్యో.. ఇప్పుడు నాకు ఏం గతి పడుతుందో? హ్హ.. హ్హ.. హ్హ! మంచిది.. నివేదిక తయారైందా? అందరూ సంతకాలు చేశారా? సరే.. ఇప్పుడు చూడండి ఒకటి.. రెండు.. మూడు!’’
అతడు పూర్తిగా నిటారుగా నిలబడి, తన మాస్క్ చింపేశాడు. తాగిన ముఖాన్ని అందరికీ చూపిస్తూ, తన ప్రభావానికి మురిసిపోతూ కుర్చీలో కూలబడి పకపకా నవ్వాడు. అతడు సృష్టించిన విస్మయం అంతా ఇంతా కాదు. మేధావులంతా అయోమయ దృక్కులతో ఒకరినొకరు చూసుకున్నారు. ముఖాలు పాలిపోయాయి. చాలామంది తలలు గోక్కున్నారు. ఎఫ్‌స్త్రాస్ స్పిరిదోనిచ్ పెద్ద తప్పు చేసినవాడిలా గొంతులోనే ఏదో గొణిగాడు.
అందరూ స్థానిక కోటీశ్వరుణ్ని, పారిశ్రామికవేత్తను, వంశపారంపర్య గౌరవ పౌరుడు అయిన ప్యతిగొరోవ్‌ను గుర్తుపట్టారు. అతణ్ని కుంభకోణాలకు, దాతృత్వ కార్యకలాపాలకు, స్థానిక పత్రికల ప్రకారం విద్యావ్యాప్తి పట్ల కృషికి ఖ్యాతిగాంచిన వ్యక్తిగా గుర్తుపట్టారు.
‘‘ఏంటి, బైటికి వెళ్తారా లేదా?’’ ఒక క్షణం తర్వాత ప్రశ్నించాడు- ప్యతిగొరోవ్.
మౌనంగా, పల్లెత్తుమాట మాట్లాడకుండా మేధావులంతా మునివేళ్ల మీద రీడింగ్ రూం నుంచి బైటికి నడిచారు.
ప్యతిగొరోవ్ వాళ్ల వెనుక తలుపు మూశాడు.
‘‘అతడు ప్యతిగొరోవ్ అని నీకు తెలుసు!’’ ఎఫ్‌స్త్రాస్ స్పిరిదోనిచ్ బెకబెకమన్నాడు రీడింగ్ రూంలోకి వైన్ తీసుకొచ్చిన నౌకరు భుజాన్ని కుదుపుతూ ‘‘ఎందుకు మౌనంగా వున్నావు?’’
‘‘చెప్పకూడదని నిషేధం విధించారు!’’
‘‘చెప్పకూడదని నిషేధం.. నెలరోజులు నిన్ను జైల్లో కుక్కి లాఠీతో నాలుగు తగిలిస్తే ఎందుకు చెప్పొద్దు అన్నారో తెలిసొస్తుంది.. బైటికి పో!’’ మేధావుల్ని వుద్దేశించి ‘‘మీరు కూడా మహా మంచోళ్లు, జెంటిల్మెన్! తిరుగుబాటు చేశారు.. ఒక్క పది నిముషాలు రీడింగ్ రూం వదిలిపెట్టి బైటికి వెళ్లలేకపోయారు. గొయ్యి తవ్వుకున్నారు. అందులో మీరే పడండి. ఓహో జెంటిల్మెన్! చెప్పినట్లు చేయాల్సింది మీరు..’’
మేధావులు కాలుగాలిన పిల్లుల్లా, అపరాధభావంతో నిస్పృహతో, ఓటమితో గుసగుసలాడుతూ అశుభసూచనలతో కలత చెందుతూ క్లబ్ లో ఇటూ అటూ తచ్చాడ సాగారు. ప్యతిగొరోవ్ ‘‘మనస్తాపం’’ చెంది ఆగ్రహంతో వున్నాడని తెలుసుకుని వాళ్ల భార్యలు, కూతుళ్లు విచారంతో ఇంటిముఖం పట్టారు. నృత్యం ఆగిపోయింది.
రెండుగంటలప్పుడు ప్యతిగొరోవ్ రీడింగ్ రూం నుంచి బయటికొచ్చాడు. చిత్తుగా తాగివున్నాడు. అడుగులు తడబడుతున్నాయి. నృత్యమందిరంలోకి ప్రవేశించి వాద్య బృందం దగ్గరికెళ్లి సంగీతం వింటూ నిద్రపోయాడు. తర్వాత విచారంగా తలవాల్చి గురకపెట్టసాగాడు.
‘‘వాయించడం ఆపండి!’’ అంటూ నిర్వాహకుడు వాద్య బృందానికి సైగ చేస్తూ, ‘‘ఈగర్ నిల్యీచ్ నిద్రపోతున్నారు’’…
‘‘ఈగర్ నిల్యీచ్! మిమ్మల్ని ఇంటికి చేర్చమంటారా?’’ కోటీశ్వరుని చెవి దగ్గరికి వొంగి మెల్లగా అడిగాడు.
ప్యతిగొరోవ్ తన బుగ్గమీది ఈగను పారదోలుతున్నట్లు పెదాలు కదిలించాడు.
‘‘తమర్ని ఇంటికి చేర్చమంటారా?’’ అని మళ్లీ అడిగాడు ‘‘సవారిబండి పిలిపించమంటారా?’’
‘‘ఎ.. ఎవర్నువ్వు.. ఏం కావాలి నీకు?’’
‘‘అయ్యా! మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లనా?.. పడుకునే వేళయింది!’’
‘‘సరే.. తీసుకెళ్లు!’’
బెలెబూహిన్ ముఖం సంతోషంతో చాటంతయింది. ప్యతిగొరోవ్ ను పట్టుకుని నిలబెట్టాడు. మిగతా మేధావులు పరుగెత్తుకొచ్చి చిరునవ్వులతో వంశపారంపర్య గౌరవ పౌరుణ్ని ఎత్తుకుని జాగ్రత్తగా బండి దగ్గరకు తీసుకెళ్లారు.
‘‘ఒక కళాకారుడు మాత్రమే, ప్రతిభావంతుడు మాత్రమే మొత్తం అందర్నీ దద్దమ్మల్ని చేసి ఆటపట్టించగలడు’’ ప్యతిగొరోవ్ ను బండిలో భద్రంగా కూచోబెడుతూ జెస్త్యకోవ్ సంతోషంగా అన్నాడు. ‘‘నిజంగా నేను ఆశ్చర్యపోయాను ఈగర్ నిల్యీచ్! నవ్వు ఆపుకోలేకపోతున్నాను. ఒట్టు. ఇంతగా నేనెప్పుడూ నవ్వలేదు- నాటకశాలలో కూడా.. నవ్వులే నవ్వులు! మరపురాని ఈ సాయంకాలాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను.
ప్యతిగొరోవ్‌కు వీడ్కోలు చెప్పింతర్వాత మేధావులు మరింత వుల్లాసంగా వూపిరి పీల్చుకున్నారు.
‘‘ఆయన నాకు వీడ్కోలు చెప్తూ కరచాలనం చేశారు’’ అన్నాడు జెస్త్యకోవ్ తృప్తిపడుతూ. ‘‘అంటే, ఆయనకు బొత్తిగా కోపం రాలేదన్నమాట!’’
‘‘దేవుడి దయవల్ల, రాలేదనే ఆశిద్దాం!’’ ఎఫ్‌స్త్రాస్ స్పిరిదోనిచ్ నిట్టూర్చాడు.
‘‘ఒక దుష్టుడు, నీచుడు.. కానీ, అతడు మన దాతకూడా! ఈ విషయం మనం మర్చిపోకూడదు.’’

(1884లో ప్రచురితం)

కొన్ని వివరణలు:
అనాథలకోర్టు : విప్లవానికి పూర్వం రష్యాలో వ్యాపారస్థుల, దుకాణాదార్ల, చేతివృత్తుల ఇతర నిమ్నస్థాయి వర్గాలకు ధర్మకర్త బాధ్యతను నిర్వహించిన సంస్థ.
వంశపారంపర్య గౌరవ పౌరుడు : రష్యాలో 19వ శతాబ్దం చివర్లో, 20వ శతాబ్ది ఆరంభంలో కులీనులు కానివారు చేసిన సేవకు చక్రవర్తి గుర్తింపు ద్వారా విశేషాధికారం పొందిన వర్గం.

కేశవ్ గోపాల్

ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో సీనియర్ రష్యన్ డిప్లొమా చేశారు. 6 ఏళ్లు మాస్కోలో అనువాదంలో శిక్షణ పొంది, ఉద్యోగం చేశారు. జర్మన్ భాషతో కూడా పరిచయం ఉంది.

అభిరుచులు: చిత్రలేఖనం,ఫోటోగ్రఫీ, భాషల అధ్యయనం

Previous Post

తమిళ కథ : పుష్పించని చెట్టు

Next Post

కన్నడ కథ: ఆ ఒక విధంగా …

Next Post
కన్నడ కథ: ఆ ఒక విధంగా …

కన్నడ కథ: ఆ ఒక విధంగా ...

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

by రమేశ్ రాచపూటి
September 14, 2026
0

...

హిందీ కథ : కొత్త గాలి

హిందీ కథ : కొత్త గాలి

by విఎల్ నరసింహం శివకోటి
September 10, 2026
0

...

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

by పి. శ్రీనివాస్ గౌడ్
September 10, 2026
0

...

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

by తిరువాయపాటి రాజగోపాల్
September 10, 2026
0

...

మళయాళ చిన్న కథలు

మళయాళ చిన్న కథలు

by ఎడిటర్
September 10, 2026
0

...

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

by డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
September 10, 2026
0

...

హిందీ కథ : ఓడిపోయాను 

హిందీ కథ : ఓడిపోయాను 

by వెన్నా వల్లభరావు
September 10, 2026
0

...

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

by కేశవ్ గోపాల్
September 10, 2026
0

...

కన్నడ కథ : చావు

కన్నడ కథ : చావు

by చందకచర్ల రమేశబాబు
September 10, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

by శివ చల్లా
September 10, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026
హిందీ కవిత: అడవిలో వర్షం
అనువాద కవితలు

హిందీ కవిత: అడవిలో వర్షం

September 10, 2026
హిందీ కవితలు: గోధుమ + గోవు
అనువాద కవితలు

హిందీ కవితలు: గోధుమ + గోవు

September 10, 2026
సచ్చిదానందన్ కవితలు రెండు..
అనువాద కవితలు

సచ్చిదానందన్ కవితలు రెండు..

August 15, 2026
హిందీ కవిత: నా చిరునామా
అనువాద కవితలు

హిందీ కవిత: నా చిరునామా

August 15, 2026

అభిప్రాయాలు

  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply