• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఆంగ్ల కథ : టెలిఫోన్ కాల్ 

స్వాతి శ్రీపాద by స్వాతి శ్రీపాద
January 10, 2026
in అనువాద కథలు
0
ఆంగ్ల కథ : టెలిఫోన్ కాల్ 

ఆంగ్ల మూలం : డోరతీ పార్కర్ 
అనువాదం : స్వాతీ శ్రీపాద

దేవుడా , ప్లీజ్, అతను ఇప్పుడు నాకు కాల్ చెయ్యాలి. దేవుడా,  అతన్ని నాకు కాల్ చెయ్యనివ్వు. నిన్నింకేమీ కోరను. నిజం అడగనే అడగను. అడగడానికి ఇదేమీ గొప్ప విషయం కాదు. చాలా చిన్న సంగతే మరి. చిన్న సంగతే.  అతను నాకు కాల్ చెయ్యాలి. ప్లీజ్  దేవుడా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 

నేనా ఆలోచన వదిలేస్తేనైనా ఆ టెలిఫోన్ రింగ్ అవుతుందేమో ఒక్కోసారి అలాగే అవుతుందిగా. మరేదైనా ఆలోచించగలిగితేనో, బహుశా నేను అయిదు పది పదిహేను అంటూ అయిదు వందల వరకూ లెక్కపెడితే ఆలోగా ఫోన్ రింగ్ అవుతుందేమో. 

మెల్లిగా లెక్కవేస్తాను. నేనేం మోసం చెయ్యను. మూడు వందలకు నేను చేరేసరికీ  ఫోన్ రింగైనా ఆపను. అయిదు వందలు చేరే వరకూ ఫోన్ కు జవాబివ్వను. అయిదు, పది, పదిహేను ఇరవై, అరవై అయిదు, ముప్పై, ముప్పై అయిదు, నలభై, నలభై అయిదు, యాభై … ఓహ్ ప్లీజ్ ఫోన్, రింగవు ప్లీజ్. 

ఇదే చివరి సారిగోడ గడియారం వంక నేను చూడటం . ఇంకోసారి దానివంకే చూడను. ఇప్పుడు ఏడూ పది అయింది. అయిదింటికే కాల్ చేస్తానని చెప్పాడతను. “డార్లింగ్ అయిదింటికి కాల్ చేస్తాను” 

అప్పుడే అనుకుంటా అతను డార్లింగ్ అని అన్నది. నిజమే, బాగా గుర్తు.  అతనప్పుడే డార్లింగ్ అన్నాడు. నాకు తెలుసు అతను నన్ను రెండు సార్లు డార్లింగ్ అని పిలిచాడు. మరోసారి వీడ్కోలు చెప్పినప్పుడు.”గుడ్ బై డార్లింగ్” అన్నాడు. అతను బిజీగా ఉండి ఆఫీస్ లో ఏం ఎక్కువ చెప్పలేక పోయినా నన్ను రెండు సార్లు డార్లింగ్ అని పిలిచాడు.  అతనికి నేనే కాల్ చేసినా ఏమీ అనుకోకపోవచ్చు కాని నాకు తెలుసు, వాళ్ళకు నేనతనికి కాల్ చెయ్యడం నచ్చదని.  అలా చేస్తే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావనీ, వాళ్ళను కోరుకుంటున్నావనీ  వాళ్లకు తెలిసిపోతుంది. దాంతో వాళ్ళు నన్ను ద్వేషిస్తారు. కాని మూడు రోజుల్లో అతనితో ఒక్కసారీ మాట్లాడలేదు- మూడూ రోజులు , ఒక్కసారీ. నేను చేసిందల్లా ఎలా ఉన్నావని అడగటమే. ఆవిధంగా అతన్ని ఎవరైనా అడిగేవారేమో. అతనేమీ అనుకోకపోవచ్చు కూడా.

నేను విసిగిస్తున్నానని అస్సలు అనుకుని ఉండడు.  ” లేదు లేదు ఏ మాత్రం కాదు” అన్నాడు. 

నాకు కాల్ చేస్తానని చెప్పాడు. అది చెప్పాల్సిన అవసరం అతనికి లేదు కదా. నేను అడగలేదు. నిజంగా నేను అడగలేదు. “నేను కాల్ చేస్తానని అతనంటాడని నేనస్సలు అనుకోలేదు. అంతే ఆపైన చెయ్యనే లేదు. ప్లీజ్ అతన్నలా చెయ్య నివ్వకు దేవుడా. ప్లీజ్ చెయ్యనివ్వకు. 

“అయిదింటికి కాల్ చేస్తాను డార్లింగ్” ” గుడ్ బై డార్లింగ్ ” అతను బిజీగా ఉన్నాడు. అతను తొందరలో ఉన్నాడు.  చుట్టూ జనం ఉన్నారు. అయినా నన్ను రెండు సార్లు డార్లింగ్ అని పిలిచాడు. అది నేనే, అది నేనే. నా కది చేరింది, అతన్ని మళ్ళీ మరొకసారి చూడలేకపోయినా.

ఓహ్, అది చిన్న విషయమేగా. అతన్ని మళ్ళీ చూడలేకపోతే అది సరిపోదు. ఏదీ సరిపోదు. 

దేవుడా, ప్లీజ్ నేను మరోసారి అతన్ని చూడాలి. ప్లీజ్ నాకు అతను కావాలి, ఎంతగానో కావాలి. ఎంతగానో కావాలి. నేను మంచిగా ఉంటాను , ఇంకా మెరుగ్గా ఉండటానికి  చూస్తాను, దేవుడా, అతన్ని మళ్ళీ చూపిస్తే నేను మంచిగా ఉంటాను. నువ్వు అతన్ని నాకు టెలిఫోన్ కాల్ చెయ్యనిస్తే , ఓహ్ ఇప్పుడే అతను నాకు ఫోన్ చేసేలా చెయ్యి. 

నా ప్రార్ధన మరీ చిన్నదని అనుకోకు. దేవుడా, నువ్వక్కడ  తెల్లగా, వయసు మళ్ళిన వాడిలా చుట్టూ దేవకన్యలతో  కూచుని ఉంటావు, చుక్కలు మెత్తగా జారుకుంటూ ఉంటాయి. మరి నేనో, ఒక టెలిఫోన్ కాల్ కోసం నిన్ను అర్ధిస్తూ వచ్చాను. నవ్వకు, దేవుడా. 

ఇది ఎలా ఉంటుందో నీకు తెలీదు. నీలాకాశం నీ కాళ్ళ కింద తిరుగుతూంటే   నీ సింహాసనం మీద ఎంత సురక్షితంగా ఉన్నావు.  ఏదీ నిన్ను స్పర్శించలేదు. ఎవరూ వాళ్ళ చేతులతో  నీ హృదయాన్ని మెలితిప్పలేరు. ఇది నిజంగా నరకమే, దేవుడా, ఎంత దౌర్భాగ్యపు నరకం, ఎంత దుర్మార్గపు బాధ.  నాకు సాయ పడవూ? నీ కొడుకు కోసమైనా నాకు సాయం చెయ్యి. అతని పేరిట నిన్నేమడిగినా చేస్తానని అన్నావుగా. 

ఓహ్ దేవుడా, నీ ప్రియమైన పుత్రుని పేరిట, మన ప్రభువు,  పేరిట అతనిప్పుడు నాకు ఫోన్  చేసేలా చెయ్యి. 

నేనిది ఆపెయ్యాలి. నేనిలా ఉండకూడదు. చూడు, ఎవరైనా యువకుడు ఓ అమ్మాయికి కాల్ చేస్తానని అంటే, ఆ తరువాత ఏదైనా జరిగితే , కాల్ చెయ్యలేకపోవచ్చును . అదంత భయంకరమైన సంగతి కాకపోవచ్చును , అవునా? మరి ఎందుకీ విషయం ఈ నిమిషాన  ఇలా అంతటా వ్యాపిస్తోంది. ఆ టెలిఫోన్ ఎందుకు రింగ్ అవడం లేదు. ఎందుకు అవడం లేదు? ఎందుకు? 

నువ్వు శబ్దించలేవా? ఓహ్ ప్లీజ్ రింగ్ అవలేవా? ఓ దుర్మార్గమా , అందవికారమా,  మెరుపుల నెరజాణా, ధ్వనించడం నిన్ను బాధపెడుతుందా? అవునా? ఓ అది నిన్ను బాధిస్తుందా? దుర్మార్గురాలా. నీ చెత్త వేర్లను గోడ నుండి పీకేస్తాను. నీ మసి బారినమొహాన్ని ముక్కలు ముక్కలుగా బద్దలు చేస్తాను. నిన్ను నరకంలోకి విసిరేస్తాను. 

లేదు, లేదు లేదు. నేనిక్కడ ఆగాలి. మరింకేదో ఆలోచించాలి.  నేనిలా చేస్తే,  ఈ గడియారం మరోగదిలో పెడతాను. అప్పుడు నేను దాని వంక చూడలేను కదా. ఒక వేళ చూడాలనుకున్నా  బెడ్ రూమ్ లోకి వెళ్ళాలి, అదీ ఒక చెయ్యవలసిన పనే. బహుశా దాని వంక మరోమారు చూసేలోగా అతను నాకు కాల్ చేస్తాడేమో. కాల్  చెయ్యాలేగాని అతనితో తియ్యగా మాట్లాడనూ. అతను ఈ రాత్రి నిన్ను కలుసుకోలేనని అన్నా, “ఓకే డియర్. వర్రీ ఎందుకు సరేలే” అనేస్తాను. అతన్ని మొదటిసారి కలుసుకున్నట్టుగానే ఉంటాను. బహుశా అతను నన్ను మళ్ళీ ఇష్టపడతాడేమో.  నేనెప్పుడూ మొదట్లో సున్నితంగా మృదువుగానే ఉంటాను. ఓహ్ ప్రేమించకముందు జనాలతో ఎంత మధురంగానైనా మాట్లాడటం ఎంత సులభం. 

 

అతను నన్ను కొంచం ఇష్టపడుతున్నాడనే అనుకుంటాను. నా మీద ఏమాత్రం ఇష్టం లేకపోయినా, ఈ రోజున రెండు సార్లు నన్ను డార్లింగ్ అని పిలిచే వాడు కాదు గదా. నన్ను అతను ఏ కొంచం ఇష్టపడినా , కొంచమే అయినా, అతికొంచెమే అయినా అంతా అయిపోనట్టే కదా. చూడు దేవుడా, నువ్వు అతన్నొక్కసారి నాకు కాల్ చెయ్యనిచ్చావా నిన్నింకేమీ కోరను. అతనితో మంచిగా ప్రవర్తిస్తాను.  ఆనందంగా ఉంటాను, ఇదివరకులానే ఉంటాను. మరి అతను నన్ను మళ్ళీ ప్రేమిస్తాడు. అప్పుడిహ నాకు నిన్ను కోరడానికి ఏమీ ఉండదు. నువ్వు చూడటం లేదా దేవుడా, అందుకైనా ప్లీజ్ అతన్ని నాతో మాట్లాడనివ్వు. మాట్లాడ నివ్వవూ, ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. 

దేవుడా, నేను చెడుగా ప్రవర్తించానని నన్ను శిక్షిస్తున్నావా? నేనలా చేసానని నా మీద కోపంగా ఉన్నావా? ఓహ్, కానీ దేవుడా, ఎంతమందో చెడ్డవాళ్ళు ఉన్నారుగా, నా ఒక్కదానితో ఇలా కఠినంగా ఉండటం భావ్యమా?  అదేమంత పెద్ద దుర్మార్గం కాదు. అసలది దుర్మార్గమే అయ్యేది కాదు. మేమెవరినీ నొప్పించలేదు దేవుడా. ఎవరినైనా నొప్పించినప్పుడే విషయం చెడ్దదవుతుంది. కనీసం ఒక్కళ్ళని కూడా మేము నొప్పించలేదు. నీకు తెలుసది చెడ్డపని కాదని. నీకు తెలియదా దేవుడా? అయితే అతన్ని నాకు కాల్ చెయ్యనివ్వవా? 

అతను నాకు కాల్ చెయ్యకపోతే దేవుడు నాపట్ల కోపంగా ఉన్నాడని నాకు తెలుసు. అయిదువందలవరకు అయిదు పదీ అంటూ లెక్కపెడతాను. అప్పటికీ అతను కాల్ చెయ్యకపోతే భగవంతుడు నాకు ఎప్పటికీ సాయం చెయ్యడని తెలుసుకుంటాను.  అదే గుర్తు. అయిదు, పది పదిహేను, ఇరవై, ఇరవై అయిదు, ముప్పై, ముప్పై అయిదు, నలభై, నలభై అయిదు, యాభై, యాభై అయిదు, అది దుర్మార్గమే. నాకు తెలుసు అది దుర్మార్గమని. సరే, దేవుడా, నన్ను నరకానికి పంపు, నీ నరకం పేరిట నన్ను భయపడుతున్నానని అనుకుంటున్నావా? అవును కదా, నీ నరకాని కన్నా ఇది మరింత దుర్భరం. 

నేను చెయ్యకూడదు, నేనిలా చెయ్యకూడదు. నాకు కాల్ చెయ్యడంలో అతను కొంచం ఆలస్యం చేసాడేమో నేనింతగా పిచ్చిదాన్ని కావలసిన అవసరం లేదు. అతను బహుశా కాల్ చెయ్యడం లేదేమో, కాల్ చెయ్యకుండా డైరెక్ట్ గా ఇక్కడికి వస్తున్నాడేమో. నేను ఏడవటం చూస్తే అతనికి కోపం వస్తుంది. నువ్వు ఏడవటం వాళ్లకి నచ్చదు. అతను ఏడవడు. నేను అతన్ని ఏడ్చేలా చెయ్యాలని దేవుడిని కోరుకుంటాను. అతన్ని ఏడిపించి, నేల మీద నడుస్తూ,  హృదయం బరువెక్కడంతో అతన్ని బాధించడం నేను అనుభవించాలి. నేను అతన్ని నరకం లా బాధించాలని నా కోరిక. 

అతను నా గురించి అలా అనుకోడు. నాకెలాటి భావన కలిగిస్తున్నాడో అతనికి తెలుసని నేను అనుకోను, కాని నేను చెప్పకుండానే అతనికి తెలవాలని నాకోరిక, నిన్ను ఏడిపించారని నువ్వు చెప్పడం వాళ్ళకు నచ్చదు. వాళ్ళ వల్ల నువ్వు విచారంగా ఉన్నావని వాళ్ళకు చెప్పడం వాళ్ళకు నచ్చదు. ఒకవేళ నువ్వు చెప్తే నీకు స్వాతిశయం  అనీ అధికారం చూపుతున్నావనీ అనుకుంటారు. అందుకని నిన్ను అసహ్యించుకుంటారు. నువ్వు నిజమనుకున్నది చెప్పినప్పుడల్లా నిన్ను ద్వేషిస్తారు. నువ్వెప్పుడూ కొద్దో గొప్పో నాటకాలు ఆడుతూనే ఉండాలి. ఓహ్, మనం అలా చెయ్యక్కర్లేదని అనుకున్నాను. ఇది ఎంత పెద్ద విషయం అంటే నేనేమనుకున్నా చెప్పగలను. నువ్వైతే ఎప్పటికీ చెప్పలేవు. ఎప్పుడూ అంత పెద్ద విషయం ఏదీ లేదని నా అభిప్రాయం. ఓహ్, అతనొక కాల్ చేస్తే చాలు అతనికి నేను విచారంగా ఉన్నానని చెప్పనుగా. అతనివల్లే కదా విచారంగా ఉన్నది. వాళ్ళకి దిగులుగా ఉండే వాళ్ళంటే నచ్చదు. నేనెంత ఆనందంగా , ఎంత మధురంగా ఉంటానంటే నన్ను ఇష్టపడటం తప్ప మరోటి ఉండదతనికి. ఒక్క సారి అతను కాల్ చేస్తేనా, ఒకే ఒక్కసారి అతనే కాల్ చేస్తే . 

బహుశా అతనదే చేస్తున్నాడేమో. నాకు కాల్ చెయ్యకుండా ఇక్కడికే వస్తున్నాడేమో. బహుశా ఇప్పుడు దారిలో ఉన్నాడేమో. అతనికి ఏదైనా జరిగిందేమో. కాదు. అతనికెప్పుడూ ఏదీ జరగకూడదు. అతనికేమైనా జరగటం నేను ఊహించుకోలేను. అతను దేనికిందైనాపడటం ఎప్పడూ ఊహలోకి కూడా రానివ్వను. నేనతన్ని చాలా సేపు కదలకుండా చచ్చి పడి ఉన్నట్టు చూడలేను. అతను చచ్చిపోవాలని కోరుకున్నాను, ఎంత భయంకరమైన కోరిక. ఎంత  ప్రియమైన కోరిక. అతను చస్తే నావాడే అవుతాడు. అతను మరణిస్తే నేనెప్పటికీ ఇప్పటి గురించీ గత నాలుగు వారాల గురించీ ఆలోచించను. ఆహ్లాదకరమైన సమయాలను మాత్రమే గుర్తుంచుకుంటాను.  ప్రతిదీ ఎంత అందంగా ఉంటుంది. మనం చచ్చి పోవాలి. అతను చావాలి, చావాలి, చావాలి. 

ఇది తెలివితక్కువతనమేగా. కేవలం నీకు కాల్ చేస్తానన్న సమయానికి కాల్ చెయ్యనందుకే జనాల మరణం కోరుకోడం తెలివితక్కువతనమే కదా. 

ఏమో గడియారంఎక్కువ తిరుగుతోందేమో. అది సరైన సమయం చూపుతోందో లేదో నాకు తెలీదు. అతను ఏ మాత్రం ఆలస్యం చెయ్యట్లేదేమో. ఏదో ఒక విషయం అతన్ని ఆలస్యం చేస్తోందేమో. బహుశా ఆఫీస్ లో ఉండిపోవలసి వచ్చిందేమో. ఇంటినుండి కాల్ చేద్దామనుకుని అతను ఇంటికి వెళ్ళాడేమో. ఈ లోగా ఎవరైనా అతనింటికి వచ్చారేమో. 

ఇతరుల ముందు నాకు కాల్ చెయ్యదలచుకోలేదేమో. 

నన్నిలా ఎదురు చూసేలా చేస్తున్నందుకు అతను కొంచం బాధపడుతున్నాడేమో , కొంచం, కొంచం మాత్రమే. నేనే కాల్ చేస్తానని, చెయ్యాలని  కూడా అనుకుంటూన్నాడేమో. నేను చెయ్యొచ్చు కూడా. నేనతనికి కాల్ చెయ్యచ్చును. 

కూడదు. నేను కాల్ చెయ్యకూడదు. నేను చెయ్యకూడదు. ఓహ్ దేవుడా, దయచేసి నన్ను అతనికి కాల్ చెయ్యనివ్వకు. ప్లీజ్ నన్ను దాన్నుండి దూరంగా ఉంచు. భగవంతుడా, నాకు తెలుసు, నీకూ తెలుసు అతనికి నా గురించి ఏ మాత్రం బాధ ఉన్నా అతను ఎక్కడ ఉన్నా, చుట్టూ ఎవరు ఉన్నా, ఎంతమంది ఉన్నా నాకు కాల్ చేసేవాడు. నన్ను తెలుసుకునేలా చెయ్యి ప్లీజ్. అది నాకు సరళతరం చెయ్యమని నిన్ను కోరను. నువ్వది చెయ్యలేవు. చెప్పాలంటే నువ్వొక ప్రపంచాన్నే తయారు చెయ్యగలవు. నన్ను మాత్రం తెలుసుకోనీ భగవంతుడా. నన్నిలా ఆశలను పెంచుకుంటూ పోనివ్వకు, నాకు నేను సాంత్వన పరచుకునే మాటలను చెప్పుకోనివ్వకు. ప్లీజ్ నన్ను ఆశపడనివ్వకు, ప్రియమైన భగవంతుడా, ప్లీజ్ వద్దు. 

 

నేనతనికి కాల్ చెయ్యను. నేనతనికి మళ్ళీ బ్రతికుండగా ఎప్పటికీ కాల్ చెయ్యను. నేనతనికి కాల్ చేసే లోగానే అతను నరకం లో కుళ్ళిపోతాడు. భగవంతుడా నువ్వు నాకు శక్తినివ్వనవసరం లేదు. నాకే ఉంది. అతను నన్ను కోరుకుంటే పొందగలడు. అతనికి తెలుసు నేనెక్కడ ఉన్నానో , ఇక్కడ నేను ఎదురు చూస్తున్నానని అతనికి తెలుసు. అతనికి నామీద గట్టినమ్మకం, గట్టి నమ్మకమే. 

నీ గురించి అంత గట్టిగా తెలిసినా ఎందుకు నిన్ను మెచ్చరో నాకు అర్ధం కాదు. అంత నమ్మకం ఎంత మధురంగా ఉంటుంది. 

అతనికి కాల్ చెయ్యడం ఎంత సులభం. నాకు తెలుసు, అలా చెయ్యడం తెలివితక్కువపని కాకపోవచ్చు. అతనికి అభ్యంతరం ఉండకపోవచ్చును. అది అతనికి నచ్చవచ్చేమో. బహుశా నన్ను పొందాలని చూస్తున్నాడేమో. ఒక్కోసారి జనం కనీసం టెలిఫోన్ లో నిన్ను చేరాలని మళ్ళీ మళ్ళీ  ప్రయత్నిస్తారు. నంబర్ ఆన్సర్ చెయ్యడం లేదని అంటారు.  నాకు నేను సాయం చేసుకుందుకు చెప్పడం లేదు. అదే నిజంగా జరిగేది. ఓహ్ దేవుడా, నన్ను ఆ టెలిఫోన్ నుండి దూరంగా ఉంచు. దూరంగా ఉంచు. నాకింకా కొంత ఆత్మ గౌరవం మిగలనివ్వు. నాకది అవసరం అనిపిస్తోంది, నాకున్నది అదొక్కటే అనిపిస్తోంది. 

ఒహ్, ఆత్మగౌరవం అంటే ఏమిటి? నేనతనితో మాట్లాడకపోతే దాన్ని ఎదుర్కోలేనా? అలాటి గర్వం అనేది ఎంత అల్పమైన, తెలివితక్కువ అనాగరికపు విషయం. అసలైన దర్పం, ఆ గొప్ప గర్వం, దర్పం లేకపోవడం లోనే ఉంది. అది నేను కేవలం అతనికి కాల్ చెయ్యాలని చెప్పడం లేదు. నేను అనడంలేదు. అది నిజం. అది నిజమని నాకు తెలుసు. నేను గొప్పే. ఈ అల్పమైన దర్పాలకు అతీతం నేను. 

ప్లీజ్ దేవుడా, అతనికి ఫోన్ చెయ్యకుండా ఆపు, ప్లీజ్ దేవుడా. 

దీనితో  దర్పానికి ఏం సంబంధమో తెలియదం లేదు. ఇదెంత చిన్న విషయం, దీనివల్ల గర్వపడటానికీ , దీని గురించి ఇంతగా వలపోయడానికీ. నేనే అతన్ని అపార్ధం చేసుకున్నానేమో. అతనే నన్ను అయిదింటికి  కాల్ చెయ్యమని అన్నాడేమో. “అయిదింటికి నాకు కాల్ చెయ్యి డార్లింగ్” చక్కగా పరిపూర్ణంగా అలా అని అన్నాడేమో.  నేనే అతన్ని సరిగ్గా వినలేదేమో, “అయిదింటికి కాల్ చెయ్యి డార్లింగ్” అని. అవును ఖచ్చితంగా అలాగే అని ఉంటాడు. భగవంతుడా, నాతో నన్ను ఇలా మాట్లాడనివ్వకు.నన్ను తెలుసుకోనివ్వు, ప్లీజ్ నన్ను తెలుసుకోనివ్వు. 

నేను చెయ్యను. నేను నిశ్శబ్దంగా ఉంటాను. ఇదేమీ పెద్ద ఉద్వేగపడవలసిన విషయం కాదు. చూడు, అతనెవరో అయితే నాకు బాగా తెలియకపోవచ్చు. అతను మరో అమ్మాయి అయినా నేనే  కాల్ చేసి “ఏమైందే నీకు” అనేసేదాన్ని. అదే చేసే దాన్ని కాని ఇంతగా ఆలోచించే దాన్నే కాదు. నేనెందుకు ఎప్పటిలా ఉండలేకపోతున్నాను, అతన్ని ప్రేమించినందుకా? కావచ్చు. నిజంగా నేను చెయ్యగలను. అతనికి కాల్ చేసి నవ్వుతూ సరదాగా మాట్లాడతాను. చూడు, నేనలా చెయ్యకపోతే. దేవుడా, ఓహ్ నన్ను అతనికి కాల్ చెయ్యనివ్వకు. వద్దు, వద్ద్దు, వద్దు. 

దేవుడా, నిజంగా అతన్ని నాకు కాల్ చెయ్యనివ్వవా? అంతేనా? దేవుడా? కొంచం దయ చూపలేవా దేవుడా?చూపలేవా? ఈ నిమిషం అతను నాకు కాల్ చేసేలా చూడమని నిన్ను అడగను. కాస్సేపట్లో చెయ్యనివ్వు. అయిదుల్లో అయిదు వందల వరకు లెక్కపెడతాను. నెమ్మదిగానే చక్కగా చదువుతాను. అతను ఈ లోగా కాల్ చెయ్యకపోతే నేనే చేస్తాను. నేనే చేస్తాను. 

ఓహ్ ప్లీజ్. ప్రియమైన దేవుడా, ప్రియమైన కరుణామయుడా, నన్ను స్వర్గం నుండి దీవించే తండ్రీ అతనే ముందు కాల్ చేసేలా చూడు. ప్లీజ్ గాడ్, ప్లీజ్. 

అయిదు, పది, పదిహేను, ఇరవై, ఇరవై అయిదు, ముప్పై, ముప్పై అయిదు. 

 

స్వాతి శ్రీపాద

కథాసాహిత్యం, నవల, కవిత్వం, అనువాదం ఇదే జీవితం. కేవీ లో పీజీ టీచరుగా ఉద్యోగ విరమణ. హైదరాబాద్‌లో ఆరునెలలు అమెరికాలో ఆరునెలలు నివాసం. రాత 69 నుండీ. తొలికథ వసుధలో 69-70. విపుల లో చాలానే అనువాద కథలు వచ్చాయి. కవిత్వం నా ఉనికి లానే.

Previous Post

కన్నడ కథ :  అంతర్వాహిని

Next Post

అనువాద కవిత : నూతన సంవత్సర ఉదయం

Next Post
అనువాద కవిత : నూతన సంవత్సర ఉదయం

అనువాద కవిత : నూతన సంవత్సర ఉదయం

0 0 votes
Article Rating
Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • హిందీ కథ : కంఫర్ట్ జోన్
  • రష్యన్ కథ: భయం
  • ఆంగ్ల కవిత : విడిచిన బాట
  • కన్నడ కథ:  నిర్ణయం
  • వాయిదా పడిన కలయిక!
  • ఆంగ్ల కవిత : విరామం
  • కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • బెంగాలీ కవిత: కాగితపు పడవలు
  • కెనడా కవిత : My heart soars
  • ఉర్దూ కథ : లీహాఫ్ (బొంత )
  • హిందీ కథ : బోరీబందర్ ముసలమ్మ
  • తుళు కథ : నాకూరు
  • కన్నడ కథ: నడిచేవాడికి నూరు దార్లు
  • రష్యన్ కథ : దైవ సంకల్పం
  • జర్మన్ కథ : రొట్టె
  • ఇంగ్లిషు కథ : వెన్నుపోటు
  • ఇంగ్లాండ్ కథ : విషవలయం
  • ఆంగ్ల కవిత : బందీ 

అభిప్రాయాలు

  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply