• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

హిందీ కథ : అమ్మ

ఎడిటర్ by ఎడిటర్
November 20, 2026
in అనువాద కథలు
0
హిందీ కథ : అమ్మ

మూలం : సియా రామ గుప్త
తెలుగు అనువాదం: పారనంది నిర్మల.

ఆ రోజు ఉదయం శ్యామ నిద్ర లేవగానే ఇల్లు అంతా ఏడ్పులు, పెడబొబ్బలతో నిండివుంది. శ్యామ అమ్మ కాళ్ళ నుండి తల వరకూ ఒక తెల్లని బట్ట కప్పుకుని నేల మీద నిద్రిస్తోంది. ఇంట్లోని వారంతా ఆమె చుట్టూ చేరి దీనంగా విలపిస్తున్నారు.

కాసేపటి తర్వాత కొందరు వాళ్ళ అమ్మను స్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతుండగా . శ్యామ గొడవ పెట్టాడు. తనని పట్టుకున్నవారిని విడిపించుకొని అమ్మపై పడ్డాడు.

“పడుకున్న మా అమ్మని ఇలా ఎక్కడకు తీసుకెళ్తున్నారు? నేను మా అమ్మను తీసుకెళ్ల నివ్వను” అని ఏడుస్తూ గోల పెట్టాడు.

అతి కష్టం మీద వాడిని ఆమె నుంచి దూరం చేశారు అక్కడున్న బంధువులు.

పనిమనిషి సహనంతో వాడిని పట్టుకొని ఓదారుస్తూ ఇంట్లోనే ఉండిపోయింది.

అమ్మ తన అన్నయ్య ఇంటికి వెళ్లిందని నమ్మించారు,

కానీ, వాళ్ల మామయ్య ఇంటికి వెళ్ళలేదు. ‘పైనున్న దేవుని దగ్గరకు వెళ్లింద’నే విషయాన్ని శ్యామా తో ఎక్కువ కాలం దాచలేకపోయారు.

శ్యామ అమ్మ కోసం చాలా రోజులు ఏడ్చాడు. మెల్లగా ఆ ఏడుపు శాంత పడింది. కానీ దుఃఖం మాత్రం తగ్గలేదు. వాడు దిగాలుగా ఒక్కడూ కూర్చుని శూన్యం వైపు చూస్తూ ఉండేవాడు.

ఒకరోజు ఆకాశంలో ఒక గాలిపడగ ఎగరడం చూసాడు. ఏమి ఆలోచించాడో తెలియదు కానీ
మనసు పువ్వులా విచ్చుకుంది.
తండ్రి దగ్గరికి వెళ్లి…

“నాన్నా నాకు గాలిపడగ తెప్పించు” అని అడిగాడు.

“అలాగే బాబూ… తెస్తాను” అన్నాడు తండ్రి. “ఎప్పుడో కాదు, ఇప్పుడే తెప్పించు” అంటూ శ్యామ మారాం చేశాడు.
భార్య చని పోయిన నాటి నుండీ అన్యమనస్కంగా ఉన్న శ్యామా తండ్రి విశ్వేశ్వరుడు కొడుకలా అడిగేసరికి సరేననక, కాదనక, అనాసక్తంగా బయటకు వెళ్ళాడు . శ్యామా గాలిపడగ కోసం చాలా ఆత్రుతతో ఉన్నాడు. వాడు గాలిపటం విషయంలో జాప్యం సహించలేకపోయాడు గదిలో ఒక మేకుకి తండ్రి కోటు తగిలించే ఉంది.

అటూ ఇటూ చూసి మూలనన్న స్టూల్ లాక్కొని దాని మీదకు ఎక్కి, కోటు జేబు తడిమాడు. గాలిపటానికి కావాల్సిన డబ్బులు మాత్రమే తీసుకుని పారిపోయాడు.

పనిమనిషి దులారి కొడుకు భోలా శ్యాము స్నేహితుడు.

శ్యాము వాడికి తండ్రి కోటులో తీసిన డబ్బులు ఇచ్చి-

“మీ అక్కతో చెప్పి ఎవరికీ తెలియకుండా ఒక గాలిపడగ, దాన్ని కట్టడానికి ఒక దారపు ఉండ తెప్పించు. చాలా జాగ్రత్తగా తీసుకురావాలి, ఎవరికీ తెలియకూడదు” అని చెప్పాడు.

భోలా తల ఊపి “చెప్పను ఎవరికీ చెప్పను” అన్నాడు.

అప్పుడు శ్యామూ ఇలా చెప్పాడు:
“ఈ గాలి పడగను నేను పైకి దేముడి వద్దకు పంపుతాను. నిన్ను దీనిని పట్టుకుని అమ్మ కిందకు దిగి వస్తుంది. నాకు రాయడం చేతకాదు, లేకపోతే దీనిపైన ‘అమ్మ’ అని పేరు రాసేవాడిని అన్నాడు.

భోలా శ్యాము కంటే తెలివైనవాడు.
“నువ్వు అన్న మాట చాలా బాగుంది.., కానీ ఒక భయం కూడా ఉంది. గాలిపడగకు కట్టే దారం చాలా సన్ననైనది. దాన్ని పట్టుకొని అమ్మ దిగి రాలేదు. అది తెగిపోతుంది ఏమో అని అనిపిస్తుంది” అన్నాడు.

ఈసారి శ్యాము ఆలోచనలో పడ్డాడు.
వాడన్నది నిజమే..
కానీ, లావుతాడు ఎలా తెప్పించాలి?

తన వద్ద డబ్బులు కూడా లేవు. ఇంట్లో వాళ్లని అడగటం అనవసరం. వాళ్లు దయాదాక్షిణ్యాలు లేకుండా అమ్మని కాల్చేశారు.

వాళ్ళు ఎందుకు అలా చేశారో తెలియక ఆ రోజు చాలా సేపటి వరకూ శ్యామూకి నిద్ర పట్టలేదు.
మొదటి రోజు లాగే నాన్న కోటు లోనుంచి డబ్బులు తీసి భోలా కి ఇచ్చాడు.
“భోలా… ఎవరికీ తెలియకుండా రెండు తాళ్ళు తెచ్చు. ఒకటి సరిపోదేమో అన్నయ్యతో ఒక కాగితం మీద ‘అమ్మ’ అని రాయించు.

అలా పేరు రాసి ఉంటే గాలిపడగ నేరుగా అమ్మ దగ్గరికే వెళుతుంది కదా!”అని చాలా హుషారుగా చెప్పాడు.
రెండు గంటల తర్వాత ఎంతో సంతోషంగా బోలా, శ్యామూ ఆ చీకటి గదిలో గాలి పడగకు తాడు కట్టుకుంటున్నారు.
అకస్మాత్తుగా ఉగ్రరూపం ధరించి విశ్వేశ్వరుడు శుభకార్యం లో విష్నుoలా ఆ కొట్టు గదిలోకి దూసుకొచ్చాడు.
వాళ్ళని బెదిరించి-

“మీలో ఎవరు నా కోటు నుండి డబ్బులు తీశారు?” అని అడిగాడు.
ఒక్క కేక కే భోలా నోరు విప్పి

“గాలి పడగ కు తాడు తెప్పించడం కోసం శ్యామూయే డబ్బులు తీసేశాడు” అని చెప్పేసాడు.
వెంటనే విశ్వేశ్వరుడు శ్యామూ ను రెక్కలు పట్టుకుని ఠప్…. ఠప్ మనే శబ్దం వచ్చేలా రెండు దెబ్బలు కొట్టి –

“దొంగతనం నేర్చుకొని జైలుకు వెళ్తావా? నీకు బుద్ధి చెప్తాను” అని మళ్లీ రెండు దెబ్బలు కొట్టి చెవులు గట్టిగానలిపి.. ఆ గాలిపడగని చింపి పారేశాడు.

తరువాత అక్కడ ఉన్న తాళ్ళను చూసి “ఇవి ఎవరు తెచ్చారు?” అని అడిగాడు.

భయంతో వణికిపోతున్న భోలా” గాలి పడగ కు కట్టడానికి శ్యామూయే ఇవి తెప్పించాడు. అమ్మను పైనుండి కిందకి దింపుతాడంట ”

“ఆఁ” అంటూ విశ్వేశ్వరుడు నివ్వెరపోయాడు.
ఆశ్చర్యంతో సజలమైన కన్నీళ్ళతో అలాగే చాలాసేపు నిలబడి పోయాడు.
చనిపోయివాడి అమ్మపై వాడికి గల ప్రేమ నూ , అమ్మను కిందకు రప్పించాలనే వాడి అమాయకత్వానికీ… విశ్వేశ్వరునికి దుఃఖం పొంగుకు వచ్చింది.
ఆ చిరిగిన గాలిపటాన్ని చేతులు తీసుకొని చూశాడు. దానిపైన ‘అమ్మ’ అని రాసి ఉంది.

ఎడిటర్

జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

Previous Post

పాటల వెనుక మనిషిని పరిచయం చేసిన అనువాదం

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

హిందీ కథ : అమ్మ

హిందీ కథ : అమ్మ

by ఎడిటర్
November 20, 2026
0

...

ఫ్రెంచ్ కథ : పవిత్ర జలం

ఫ్రెంచ్ కథ : పవిత్ర జలం

by ఎడిటర్
November 20, 2026
0

...

గుజరాతీ కథ : జానెడు కడుపు

గుజరాతీ కథ : జానెడు కడుపు

by పాలెపు బుచ్చిరాజు
November 20, 2026
0

...

హిందీ కథ : చచ్చేంత ప్రేమ

హిందీ కథ : చచ్చేంత ప్రేమ

by వెన్నా వల్లభరావు
November 19, 2026
0

...

రష్యన్ కథ: బడిపంతులు

రష్యన్ కథ: బడిపంతులు

by కేశవ్ గోపాల్
November 19, 2026
0

...

కన్నడ కథ: చెరసాల

కన్నడ కథ: చెరసాల

by చందకచర్ల రమేశబాబు
November 19, 2026
0

...

కన్నడ కథ : తల్లీ సాకీబాయి

కన్నడ కథ : తల్లీ సాకీబాయి

by రంగనాధ రామచంద్రరావు
November 19, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

by శివ చల్లా
November 19, 2026
0

...

హిందీ కథ : ఎమోషనల్ ఇంటెలిజెన్స్

హిందీ కథ : ఎమోషనల్ ఇంటెలిజెన్స్

by విఎల్ నరసింహం శివకోటి
November 19, 2026
0

...

ఉర్దూ కథ : మొజెల్

ఉర్దూ కథ : మొజెల్

by పి. శ్రీనివాస్ గౌడ్
November 10, 2026
0

...

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

ఏది ప్రమాదకరం?
అనువాద కవితలు

ఏది ప్రమాదకరం?

November 20, 2026
సీతాకోకచిలుకకేం ?
అనువాద కవితలు

సీతాకోకచిలుకకేం ?

November 20, 2026
క్యోకా — చిన్న కవిత వ్యంగ్య దృష్టి
అనువాద కవితలు

క్యోకా — చిన్న కవిత వ్యంగ్య దృష్టి

November 20, 2026
హిందీ కవిత : పోస్టర్లూ – మనుషులు!
అనువాద కవితలు

హిందీ కవిత : పోస్టర్లూ – మనుషులు!

November 19, 2026
మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026

అభిప్రాయాలు

  • buchireddy gangula on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply