• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

గుజరాతీ కథ : జానెడు కడుపు

పాలెపు బుచ్చిరాజు by పాలెపు బుచ్చిరాజు
November 20, 2026
in అనువాద కథలు
0
గుజరాతీ కథ : జానెడు కడుపు

గుజరాతీ మూలం: భూపేష్ అధ్వర్యు
అనువాదం: పాలెపు బుచ్చిరాజు

‘భౌ…భౌ…భౌ…’

వరండాలో కట్టి పడేసి ఉన్న కుక్క మొరిగింది. ఒక కాలి తాపుతో అది కుయ్యోమంది. కటకటాల గడియ తెరుచుకుంది. నోట్లో నానుతున్న ‘శివ కవచం’ తిరిగి ఆరంభం అయింది. భుజాన్నున్న తువ్వాలుతో ‘గోర్ బాపా’ చెమట పట్టిన ముఖాన్ని తుడుచుకున్నాడు. తిన్నగా వంటింట్లోకి దారి తీశాడు. అక్కడి దాకా చేరడానికి కాస్త టైము పట్టింది. కాదు మరీ! విశాలమైన కాయం ఇటు, అటు, లయబద్ధంగా ఊగుతూ ఉంటే, కాళ్లు పాపం వామనావతారం అనిపిస్తున్నాయి. అవి పెద్ద ఆవు పొదుగు క్రింద వ్రేల్లాడే సన్నకట్టుల్లా ఉన్నాయి. నీరసంగా ఆ కాయాన్ని ముందుకి చేరవేస్తున్నాయి. వంటింటి వరకు చేరే సరికి శరీరం అంతా చెమటలు పట్టింది. ఛాతీ మీది వెంట్రుకలనుంచి క్రింద వర్తులాకారం మీదికి ధారగా ప్రవహిస్తోంది.

మోకాళ్ళమీద చేతులు ఆని, ఆయన నెమ్మదిగా కూర్చున్నాడు. పంచెతో శరీరానికి పట్టిన చెమటని తుడుచుకున్నాడు. ప్రక్కనున్న నీళ్ళ చెంబు ఎత్తగానే నోటిలో ఉన్న ‘శివ కవచం’ అదృశ్యం అయి, నీళ్ళు లోపలికి వెళ్ళాయి. పని పూర్తి అవగానే, తిరిగి ఆరంభం అయింది. దాహం తీరగానే ఆయన కడుపు మీద నిమురుకున్నాడు. ఆయన పీల్చిన గాలికి ముక్కు చాలక, నోరు కూడా సాయం చేసింది.

ఎదురుగా తయారుగా ఉన్న సామగ్రిని చేతిలోకి తీసుకున్నాడు. అలవాటయిన తన్మయత్వంతో రెండు చేతులతోనూ లడ్డులు తయారు చేయ సాగాడు. ప్రతీ లడ్డూ తన శరీరం లాగే, గోళాకారంలో ఉండాలి. అసంకల్పితంగానే, రెండు చేతులతోను, తియ్య బూంది తీసుకుని, నొక్కుతున్నాడు. చక్కని, గుండ్రని లడ్డులు తయారవుతున్నాయి. వాటిని ఒకదాని తరవాత ఒకటి తీసుకుని, ప్రక్కనే ఉన్న జంగిడిలో వేస్తున్నాడు. ఒక చిన్న మిఠాయిల గుట్ట తయారు అవుతోంది.

గోర్ బాపా గతంలోకి జారుకున్నాడు. ‘ఆ రోజులే వేరు. అప్పటిలా యజమానులు ఇప్పుడు దయాశీలురు కాదు. ఇప్పుడు వాళ్ళిచ్చే సంభావనలో ఆ తియ్యదనం లేదు. అసలు సిసలైన నేతివాసనలో మునిగి తేలేవారు….’

బైట తలుపుల దగ్గర చప్పుడు అయింది. అలవాటు ప్రకారం గూని వాడు చేతికర్రమీద తన శరీరాన్ని ఆన్చి, చేతి చిప్పలో ఉన్న డబ్బుల్ని గల గల లాడిస్తూ బాపా ధ్యానాన్ని ఆకర్షించాడు. బాపాకి కోపం నసాళానికి ఎక్కింది. ఈ ముష్టివాడు సరిగ్గా టైము చూసుకుని వస్తాడు. అని విసుక్కుంటూ చేతులు దులుపుకుని లేచి నిలబడ్డాడు. వరండా వైపు నడిచాడు. ఇంతలోనే, కర్ర సహాయంతో వేగంగా అడుగులు వేసుకుంటూ, ఆ ముష్టివాడు అక్కడి నుంచి మాయమయ్యాడు. వాడిని తిట్టుకుంటూ, బాపా తిరిగి తన పనిలో లగ్నం అయాడు. మళ్ళి ఆ పని మీద మనసు పెట్టడ్డానికి కొంత టైము పట్టింది.

ఇక ఆఖరి ఉండ చుట్టి, ‘హమ్మయ్య’ అనుకునేలోగా, బైట నుంచి అరుపు. “బం బోలే”. బోర్ బాపా కళ్ళు పైకెత్తి అటు చూశాడు. విభూతి బాబా తన బిక్షాపాత్ర ముందుకు చాచి నిలబడ్డాడు. ఆ కళ్ళలో కాస్త ‘భాంగ్’ తాగిన మత్తు కనిపిస్తోంది. బాపా లేచి వెళ్లి, ఆ పాత్రలో ఒక రాగి డబ్బు వేసి తిరిగి వచ్చాడు. బాబా ముందుకి సాగిపోయాడు. పోయి గుడిలో మళ్ళి బాంగ్ తాగి పడుకుంటాడు. తిరిగి సాయంత్రం గుడిగంటలు మ్రోగాక లేస్తాడు.

-హి,హి,హి,హి,

బాపాకి క్షణం తీరిక ఉండదు. ఇలా సగం దూరం వచ్చాడో లేదో, వెనకాలే ‘నాగ్ భాయ్’ తయారు. బాపా వెనక్కి తిరిగి చూశాడు. నాగ భాయ్ రోజంతా ఊళ్ళో బలాదూరు తిరుగుతాడు. ఏదో ఒక ఇంటిముందు నిలబడి ‘హి,హి,హి,హి, అంటూ ఉంటాడు.

ఈ నేతి మిఠాయి వాసనకి అందరూ ఇక్కడికి చేరతారు. గోర్ బాపా మనసులోనే విసుక్కున్నాడు. వెనక్కి తిరిగి చూశాడు. నాగ్ భాయ్ హి,హి,హి, హి అంటూ కాస్త సిగ్గుతో తలవంచుకుని నిలబడ్డాడు.

శివకవచం వేగం పుంజుకుంది. గబగబా వంటింట్లోకి వెళ్లి, చేతిలో సగం మిఠాయి ఉండ తీసుకుని, వరండాలోకి వచ్చాడు గోర్ బాపా. తన మీద ఎవరి దృష్టి అయినా పడుతోందేమోనని ఇటు అటు చూశాడు. నాగ్ భాయ్ ని లోపలికి రమ్మని సైగలతో పిలిచాడు. లడ్డూ అతని చేతిలోఉన్న పాత్రలో వేసి, వెనక్కి తిరిగాడు. కటకటాలు మూసి, శివ, శివ అనుకుంటూ పంచెతో వంటికి పట్టిన చెమట మరో సారి తుడుచుకున్నాడు.

పిల్లి పిల్లంత లడ్డూ! నాగ్ భాయ్ సంతోషంతో ఖీ, ఖీ, ఖీ, ఖీ అనుకుంటూ ముందుకి సాగాడు. దారిలో తనలో తానే మాట్లాడుకోసాగాడు. ఒక్కోసారి ఏడుస్తాడు, కొట్టుకుంటాడు, చుట్టూ తిరుగుతాడు. అప్పుడప్పుడూ ఓ ఇంటిముందు నిలబడి హి,హి,హి,హి, అంటూ ఉన్నట్టుండి పాడడం ప్రారంభిస్తాడు. అవేవో అర్థంలేని తత్వాలు.

మధ్యాహ్నం బడి వదులుతారు. అప్పుడు ఒక గుంపు పిల్లలు వాడిని వెతుక్కుంటూ వస్తారు. రెండే వీధులు ఉన్న అ ఊరిలో అది కష్టం ఏమీ కాదు. అతను ఎవరితోనో పోట్లాడుతూనో, ఏదో పాడుకుంటూనో దర్శనం ఇస్తాడు.

అప్పుడప్పుడూ మిద్దె ఇంటి మేడ మీద పావురాలు ఎగురుతూ ఉండగా చూస్తూ నిలబడతాడు. వాటికి తినడానికి అక్కడ గింజలు వేస్తారు. అతణ్ణి చూడగానే, కుర్రకారు నాగిడి, నాగిడి అంటూ గేలి చేస్తారు. కాని అతను అవేమీ పట్టించుకోడు. క్రమంగా కుర్రాళ్ళు అతని మీద రాళ్ళు విసురుతారు. నాగ్ భాయ్ అక్కడినుంచి కదలగానే ఆ గుంపు అతని వెంట పడుతుంది. అయినా నాగ్ భాయ్ వాళ్ళని ఏమీ అనడు. రాళ్ళు తగలకుండా ముఖానికి బిక్షాపాత్ర అడ్డం పెట్టుకుంటాడు. తన ధోరణిలో తానే సాగిపోతాడు. బడి దగ్గరికి చేరుకునే సరికి, ఇంకా కొందరు కుర్రాళ్ళు కూడా తోడు అవుతారు. కొంత సేపు వెనకనే తిరుగుతారు.

అలా ముందుకి పోయి, పోయి, ఊరి చివర ఒక పొలం దగ్గర ఆగుతాడు నాగ్ భాయ్. అక్కడ సరిహద్దులో ఉన్న మామిడి మొక్క అతనే నాటాడు. ఇప్పుడది ఏపుగా పెరిగి శాఖలుగా విస్తరించింది. కాస్త క్రిందుగా ఉన్న కొమ్మని పట్టుకుని నిలబడతాడు నాగ్ భాయ్. చల్లని గాలికి ఆ కొమ్మలు ఊగిసలాడుతూ ఉంటే, సంతోషంగా వింటాడు. ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూస్తాడు. వాటిలో ఏదైనా ఒక పక్షి ఆ చెట్టు మీద గూడు కడితే సంబర పడిపోతాడు. అతనిలో కవిత్వపు ధోరణి కనిపిస్తుంది.

కాస్త ముందుకు వెళ్లి రుండ్ నాథ్ మహదేవుని దర్శనం చేద్దామని దగ్గరలోని నది వైపు దారి తీస్తాడు. అతని నడక వేగం పుంజుకుంటుంది. ఆ గుడి ముందు ఉన్న మర్రి చెట్టు క్రింద కూర్చుంటాడు. ‘వెజీ’ నదికి ఆవలివైపుకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. నాగ్ భాయ్ తన వద్దకు వచ్చినా ఆమె అలాగే ఉంటుంది. పడుకున్నప్పుడు కూడా అంతే! ఎవరైనా పిలిస్తే, ఒకసారి తలెత్తి అటుగా చూస్తుంది. దగ్గరలో పక్షులు కూస్తూ ఉంటే ఆనందంగా వింటుంది. దేవాలయంలో గంటలు మ్రోగినా, నదిలో కెరటాలు లేచి పడినా అలాగే ఒకసారి అటు చూస్తుంది. అంతా ప్రశాంతంగా ఉంటే, అలా శూన్యంలోకి చూస్తుంది. ఒక్కోసారి దృష్టి అంతా రుండ్ నాద్ మీద. మరోసారి ఊరి వైపు. ఆమె ఎటు ముఖం పెట్టుకుని ఉందో ఆటే కన్నార్పకుండా చూస్తుంది. ఆకలి వేసినా, ఏదో బాధగా ఉన్నా, చిన్నపిల్లాడిలా ఏడుస్తుంది. భయం వేసినా అంతే! ఎక్కడైనా పెద్దగా చప్పుడు అయితే ఆమెకి భయం వేస్తుంది. వర్షం పడినప్పుడు తను తడిసిపోతానని భయపడుతుంది. అలా జరిగినప్పుడు తిన్నగా మహాదేవ మందిరం వైపు దారి తీస్తుంది. అక్కడ వరండాలో తలదాచుకుంటుంది. మాట్లాడకుండా అక్కడ ముడుచుకుని పడుకుంటుంది.

నాగ్ భాయ్ ఆమె దగ్గరికి వచ్చి ‘వెజీ’ అని పిలిచే వరకు ఆమెకి అతను వచ్చినట్టే తెలియదు. ఆ పిలుపు విని ఆతని వైపు తిరిగి చూస్తుంది. నాగ్ భాయ్ ఆమె ప్రక్కనే కూర్చుని ఆమె జుట్టు సవరిస్తాడు. ఆమె వీపు మీద ప్రేమతో నిమురుతాడు. వెజీకి మరేమీ తెలియక పోయినా, ఎవరైనా అలా చేస్తే, కిల కిలా నవ్వుతుంది. నాగ్ భాయ్ కూడా కి,కి,కి,కి అని నవ్వుతాడు. వెజీకి వాంతులు, విరేచనాలు అయినప్పుడు, ఆమెని ఒక ప్రక్కగా తీసి, ఎండిన మర్రి ఆకులతో శుభ్రం చేస్తాడు. తను తెచ్చిన బిక్షాపాత్ర మీద ఒక చెయ్యి వేసి మూసి ఉంచుతాడు. కాకులు వచ్చి తను తెచ్చినది ఎత్తుకుపోకుండా. రెండో చేత్తో అందులో ఉన్న అన్నం తీసి వెజీ బేటీకి తినిపిస్తాడు. ఆమె కడుపు నిండా తిన్నాక ఏమైనా మిగిలితే, తను కాస్త ఎంగిలి పడతాడు. లేకపోతే ‘జై భోలే!’

ఆ తరవాత ఖాళి అయిన పాత్ర పట్టుకుని నాగ్ భాయ్ నది ఒడ్డుకి వెళ్తాడు. అక్కడ ఆవుల మంద గడ్డి మేస్తూ ఉంటుంది. వాటిలో ఒక ఆవు పరుగులు పెడుతూ అతని దగ్గరకి వస్తుంది. అది తనని నాకుతూ ఉంటే దానిని ప్రేమగా నిమురుతాడు నాగ్ భాయ్. దానికి అతనే ‘గౌరీ’ అని పేరు పెట్టాడు. అప్పుడది చిన్న బుజ్జాయి. ఇప్పుడు బాగా ఎదిగింది. దాని మెడలో చిరుమువ్వలు కట్టి ఉన్నాయి. అది అతన్ని చూస్తూ నిలబడుతుంది. ఇంతలో పశువుల కాపరి వచ్చి దానిని తోలుకుపోతాడు. మన నాగ్ భాయ్ అది వెళ్లిపోతుంటే, కి,కి,కి,కి, అని నవ్వు కుంటాడు. తరవాత పాత్రలో నీళ్ళు నింపుకుని తాను తాగి ఇంకా వెజీ తాగడానికి నీళ్ళు తెస్తాడు.

ఆమె నీళ్ళు తాగుతూ ఉంటే అలాగే ఏకాగ్రతతో చూస్తూ నిలబడతాడు. తరవాత ఆమెను ఒళ్లోకి తీసుకుని జోకొడుతూ అలాగే ఆమె వైపు చూస్తూ తనలో తానే ఏదో గొణుక్కుంటాడు. వెజీ నిద్రలోకి జారుకుంటుంది. ఆమె శరీరాన్ని ప్రేమగా నిమురుతున్న నాగ్ భాయ్ చేయి ఆమె కడుపు మీద ఆగుతుంది. అదేదో దోసకాయలా అనిపిస్తుంది అతనికి. వెంటనే సిగ్గుపడిపోయి ఇటు అటు కలియ జూస్తాడు. మిట్ట మధ్యాహ్నం వేళ అక్కడ ఎవరుంటారు? అతను మళ్ళి కి,కి,కి,కీ,అని నవ్వుకుంటాడు. ఉన్నట్టుండి అతని ముఖం గంభీరంగా మారుతుంది. ఎక్కడ ఉన్న చేతిని అక్కడే ఉంచి, రెండో చేతితో గడ్డం నిమురుకుంటూ భవిష్యత్తులోని ఏవో కలల్లోకి జారిపోతాడు.

పాలెపు బుచ్చిరాజు

స్వస్థలం గునుపూడి, విశాఖపట్నం జిల్లా. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర పట్టా పుచ్చుకుని, ‘చమురు సహజవాయు సంస్థ’ లో భూభౌతిక శాస్త్రజ్జుడిగా, ఉద్యోగ రీత్యా 1965 డిశంబరు నెలలో మొట్టమొదటి సారిగా గుజరాత్ నేల మీద అడుగుపెట్టారు. 1968లో బరోడా వచ్చి స్థిరపడ్డారు. 40 సంవత్సరాలుగా కథలు, వ్యాసాలూ, నవలలు సుమారు రెండు వందల వరకు రాశారు. వీటిలో స్వంత రచనలేకాక , గుజరాతీ, ఆంగ్ల భాషల్లోంచి చేసిన అనువాదాలు కూడా ఉన్నాయి. నాలుగవ ప్రపంచ మహా సభల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు, ‘రాష్ట్రేతరాంధృడిగా తెలుగు భాష వ్యాప్తికి వీరు చేస్తున్న కృషిని గుర్తించి 2012 లో సత్క రించారు.
2016 లో ”గుజరాతీ సాహిత్యం – ఒక విహంగ వీక్షణం” పేరున పుస్తకం ప్రచురించారు. శ్రీకాకుళంలో శ్రీ కాళీపట్నం రామారావు గారు స్థాపించిన ‘కథానిలయం’ లో వీరి కథలు చదివిన ఒక విద్యార్థిని, వ్రాసిన సిద్ధాంత వ్యాసం ‘పాలెపు బుచ్చిరాజు కథలు – పరిశీలన’కు, 2022 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం పిహెచ్ డి ప్రదానం చేసింది.

Previous Post

హిందీ కథ : చచ్చేంత ప్రేమ

Next Post

ఫ్రెంచ్ కథ : పవిత్ర జలం

Next Post
ఫ్రెంచ్ కథ : పవిత్ర జలం

ఫ్రెంచ్ కథ : పవిత్ర జలం

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

హిందీ కథ : అమ్మ

హిందీ కథ : అమ్మ

by ఎడిటర్
November 20, 2026
0

...

ఫ్రెంచ్ కథ : పవిత్ర జలం

ఫ్రెంచ్ కథ : పవిత్ర జలం

by ఎడిటర్
November 20, 2026
0

...

గుజరాతీ కథ : జానెడు కడుపు

గుజరాతీ కథ : జానెడు కడుపు

by పాలెపు బుచ్చిరాజు
November 20, 2026
0

...

హిందీ కథ : చచ్చేంత ప్రేమ

హిందీ కథ : చచ్చేంత ప్రేమ

by వెన్నా వల్లభరావు
November 19, 2026
0

...

రష్యన్ కథ: బడిపంతులు

రష్యన్ కథ: బడిపంతులు

by కేశవ్ గోపాల్
November 19, 2026
0

...

కన్నడ కథ: చెరసాల

కన్నడ కథ: చెరసాల

by చందకచర్ల రమేశబాబు
November 19, 2026
0

...

కన్నడ కథ : తల్లీ సాకీబాయి

కన్నడ కథ : తల్లీ సాకీబాయి

by రంగనాధ రామచంద్రరావు
November 19, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

by శివ చల్లా
November 19, 2026
0

...

హిందీ కథ : ఎమోషనల్ ఇంటెలిజెన్స్

హిందీ కథ : ఎమోషనల్ ఇంటెలిజెన్స్

by విఎల్ నరసింహం శివకోటి
November 19, 2026
0

...

ఉర్దూ కథ : మొజెల్

ఉర్దూ కథ : మొజెల్

by పి. శ్రీనివాస్ గౌడ్
November 10, 2026
0

...

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

ఏది ప్రమాదకరం?
అనువాద కవితలు

ఏది ప్రమాదకరం?

November 20, 2026
సీతాకోకచిలుకకేం ?
అనువాద కవితలు

సీతాకోకచిలుకకేం ?

November 20, 2026
క్యోకా — చిన్న కవిత వ్యంగ్య దృష్టి
అనువాద కవితలు

క్యోకా — చిన్న కవిత వ్యంగ్య దృష్టి

November 20, 2026
హిందీ కవిత : పోస్టర్లూ – మనుషులు!
అనువాద కవితలు

హిందీ కవిత : పోస్టర్లూ – మనుషులు!

November 19, 2026
మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026

అభిప్రాయాలు

  • buchireddy gangula on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply