• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

యుగోస్లేవియా కథ : కాప్టెన్

ఎడిటర్ by ఎడిటర్
July 11, 2026
in అనువాద కథలు
0
యుగోస్లేవియా కథ : కాప్టెన్

మూలం : ఇవాన్ కాంకర్
తెలుగు అనువాదం : కె.సభా

గతించిన కాలంనాటి నా ఒక్కని మధుర స్మృతులు మాత్రమే గాదు, వాస్తవానికి ప్రతి మానవుని కలలు కూడా పవిత్రానుభూతుల సమ్మేళనమే. ఆ విహారాలు… అకారణంగా చెదిరిపోతున్న పొగమంచు దొంతరలు.. ఒకదానిలో ఒకటి చొచ్చుకపోతున్న నీలిమబ్బులు చివరికి అదృశ్యమైపోయే దృశ్యాలు మరి లేవు. 

పులకలతో అలకలతో తొలకరించి నిదురలేచి కన్నులు విచ్చి చూడగానే క్షణంలోనే అదృశ్యమయ్యే కలల తెరలిక కన్పించవు.

ఆ స్వప్నజగత్తుకే, ఆ భయంకరారణ్యంలోని పిశాచాల సమీపానికే ఆ నరకానికే, ఆ దయ్యం తీసుకొనిపోవు గాక.

నేను కంటున్న కలలుగాని, మీరు కంటున్న స్వప్నాలు గాని నిజానికి నిజమైన నీడలు. అవి భయానకమైనవైనా. అతి చిత్రమైనవైనా, వికలములైనా వాటిలో వాస్తవం వుంది. ఆ సత్యాన్ని గుర్తించినప్పుడు మీ గుండెలు బరువుతో క్రుంగిపోతాయి.

అది శరత్ప్రభాతం. ఉదయ కిరణాలతో పర్వత శిఖరాగ్రాన రాత్రి కురిసిన మంచు తళతళలాడుతున్నది. ఆ కొండ కప్పుకొన్న హేమంత చేలాంచలం నేత వెలిసిపోతున్నది. నిశ్శబ్ద గగన పథంలో భానుని రాకకై నిరీక్షిస్తున్నవి ఉదయతారకలు.

నేనొక గవాక్షం గుండా చూస్తున్నాను. ఆ కిటికీ తుడిచి ఎన్నాళ్లైందో! ముసుగులోనుండి చూచినట్లు అస్పష్టంగా కన్పిస్తోంది ప్రకృతి. ప్రశాంత ప్రభాతం గనుక ప్రతి పలుకూ విన్పిస్తోంది స్ఫుటంగా.

అరడుగు ప్రమాణం నల్లని బంకమట్టితో పేరుకునిపోయిందా మైదానం. మధ్య రేళ్ళ చెట్లు నిటారుగా నిలబడ్డాయి. అవి కూడా దుమ్ముతో నిండిపోయినవి. ఆ చెట్ల క్రిందనే వణుకు పుట్టించే చలినీ, అలసటనూ సరకు గొనని ఒక గుర్రం కళ్ళాన్ని పట్టుకొని నిలబడ్డాడొక సైనికుడు. మరో గంటలో కదన భూమికి తరలడానికి సిద్ధంగా వున్న ఒక సైనిక శ్రేణి నిలబడి ఉంది అతని కెదురుగా. ఆ సైనికులందరూ శిలాప్రతిమల్లా నిలబడ్డారు. ఏ ఒక్కరి నేత్రాలూ చలించడంలేదు. వారి బక్కపలచని శరీరాలు వారి భుజాలపైనున్న బరువులతో వాలిపోతున్నట్టున్నాయి. అలాంటి సుందరమైన దృశ్యాన్ని అంతవరకూ చూచి వుండలేదు. వారి ముఖాలు పసిబిడ్డల ముఖపద్మాలవలె కాంతులీనుతున్నాయి. ఉదయభాస్కరుని స్వర్ణ కిరణాలలో ప్రవహించే ఏ మంచు సెలయేటిలోనో జలకమాడి వచ్చినట్లు పరిశుభ్రంగా కన్పిస్తున్నా రా సైనికులు. మంచు ముత్యాలవలె మెరిసిపోతున్న వారి నయనాల దృక్కులు ఏ సౌందర్య స్వప్నసీమనో కంటున్నట్లు కన్పించినా అవి తమ్ము నిశ్శబ్దంగా పరీక్షిస్తున్న సైనికాధికారి మీదకే కేంద్రీకరించబడినవి.

ఆ కేప్టెన్ చాలా పొడుగరి. భుజాల మీదుగా ఓ గడియారం వ్రేలాడుతోంది. ఆ సన్నని కడుళ్లలాంటి కాళ్ళు, వంకర తిరిగి గోతుల్లాగా తొడుగుల్లో ఎముకలై కన్పిస్తున్న చేతులు. ఒకడు చేతి కర్రను వూనుకుంటూ నడుస్తున్నాడు. అతని ముఖాన్ని నేను సరిగా చూడలేదు. అతని వెనుకే నడుస్తున్నా డొక యువకుడు. అతని వాలకాన్ని చూస్తే విముక్తి ఎప్పుడా అన్నట్టున్నట్లు తోచినా విధికి కట్టుబడాలనే నిశ్చలత కన్పిస్తుందతనిలో.

కేప్టెన్ మరొకసారి సైనికులను పరీక్షించడానికి ప్రారంభించాడు. ఆ వరుసలో తొలి సైనికుని ముందు నిలబడ్డాడు. ఆ సైనికుడు కేప్టెన్ వంక చూశాడు. ఆ చూపులో అవ్యక్తమైన ఆవేదన కన్పిస్తోంది. కేప్టెన్ సూటిగా రెండడుగులు ముందుకువేసి ప్రశ్నించాడు.

‘‘నీ పేరేమి?’’

ఆ బాలుడు పేరు చెప్పాడు. నా హృదయాన్నెవరో పిండుతున్న్లట్లనిపించింది. నాకు తెలుసు. అతని హృదయం గాయపడి వుందని నేననుకొన్నాను.

‘‘వృద్ధులకంటే తెలివైన పిల్లవాడవు. నీవు ఫల పుష్ప భరితమైన వృక్షంలో ఒక కొమ్మవు. నిన్ను వారు నరికితే గాయపడే దా వృక్షమే.’’

కేప్టెన్ మళ్ళీ తన ప్రశ్నలు ప్రారంభించాడు.

‘‘నీకు తండ్రి ఉన్నాడా?’’

‘‘లేదు. చనిపోయాడు.’’

‘‘అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములూ ఎందరుంటారు?’’

‘‘ఒక్కరూ లేరు.’’

‘‘పోనీ మీ అమ్మేనా బ్రతికి ఉందా?’’

‘‘ఉంది. మా అమ్మ ఉంది.’’

ఈ చివరి జవాబిస్తున్నపుడా బాలుని కంటిపాపలు కాంతివంతాలయ్యాయి.

కేప్టెన్ తన చేతికర్రను పైకెత్తి ఆ కర్ర కొసలోని ఉక్కుగోళాన్ని ఆ బాలుని వక్షానికి ఆన్చి అతన్ని తన వెనుకనున్న యువకుని వైపునకు మరల్చాడు. ఆ యువకుడో కాగితాన్ని అందుకొని ఆ పిల్లవాని పేరు వ్రాసుకున్నాడు. ఆ కుర్రవాని ముఖం పేలవమైపోయింది.

కేప్టెన్ రెండవ సైనికుని ముఖాన్ని కూడా చూడలేదు. మూడవ వానిని మాత్రం నిశితంగా పరీక్షించాడు. వాక్చాతుర్యం కూడా చాలినంత వుంది. మంచి గాయకుడుగా కన్పిస్తున్నాడు. స్త్రీలోలుడు.

గంభీరవదనం. చెవి చుట్టూ మెలికలు దిరిగిన ముందరి ఉంగరాల జుత్తుతో మధుర గాన లోలత్వాన్ని సూచించే నయనాలతో, నవ్వులు విరిసే పెదవులతో సమ్మోహనంగా కన్పించా డతడు.

‘‘పెళ్ళి కుమారుడులా ఉన్నావేం? పెళ్లికూతురు ఇంట్లో ఉందనుకొంటాను నీకోసం కాచుకొని’’ అన్నాడు కేప్టెన్ ఆ యువకుని చూచి.

‘‘అవునండీ ఉంది.’’

ఆ యువకుని నయనాలలో రాగం సంతోషంతో ధ్వనించింది.

కేప్టెన్ కర్రను పైకెత్తాడు. వెనుకనున్న యువకుడు వ్రాశాడు. ఆ యువకుని నీలాల కనుల పాపల అనురాగరాగం అదృశ్యమైపోయింది. చచ్చిపోయింది.

కేప్టెన్ ఆ దీర్ఘ సైనిక శ్రేణినంటి నడిచిపోతున్నాడు ప్రశ్నల వర్షం కురిపిస్తూ. ఒక్కొక్కసారి రెండు మూడు ప్రశ్నలతో వదలిపెడుతున్నాడు. మరొక్కసారి కొందరిని కన్నెత్తియైనా చూడటం లేదు. జవాబివ్వడానికి వ్యవధినివ్వక ఐదారు ప్రశ్నలొక్కసారిగా వేస్తున్నాడు.

కేప్టెన్ అక్కడున్న వారిలో దృఢకాయులను, సౌందర్యవంతులను ఎన్నుకుంటున్నా డనుకున్నాను.

కేప్టెన్ ఆ వరుసలోని చివరి సైనికుని వరకు వెళ్లిపోయాడు. చివరి సారిగా తన చేతి కర్రనెత్తి యిటు తిరిగాడు. అదే తొలిసారి అతని ముఖాన్ని చూడటం. నా హృ‌దయం ఆగిపోయినంత పనయింది.

అతని ముఖంపై చర్మం కనిపించలేదు. కన్నులకు బదు లా పుర్రెలో రెండు గోతులు కన్పించాయి. కండలు ఒలిచిన ఎముకల్లా కన్పించే ఆ పొడవైన దవడపళ్లతో ఆ ముఖం వికృతంగా వుంది. ఆ సైనికాధికారి మృత్యువు.

‘‘పదండి పదండి కదనానికి.’’

ఆ సేనా నివహం కదిలింది. పొగమంచులో ఆ సేనాధికారిని అనుకరించింది. చూస్తుండగానే ఎత్తైన మంచు గట్టుపై ఆ సైనికాధికారి నల్లని ఉత్తరీయం రెపరెపలాడింది.

ఎడిటర్

జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

Previous Post

అనువాద కవిత : నూతన సంవత్సర ఉదయం

Next Post

తమిళ కథ : పుష్పించని చెట్టు

Next Post
తమిళ కథ : పుష్పించని చెట్టు

తమిళ కథ : పుష్పించని చెట్టు

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

by రమేశ్ రాచపూటి
September 14, 2026
0

...

హిందీ కథ : కొత్త గాలి

హిందీ కథ : కొత్త గాలి

by విఎల్ నరసింహం శివకోటి
September 10, 2026
0

...

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

by పి. శ్రీనివాస్ గౌడ్
September 10, 2026
0

...

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

by తిరువాయపాటి రాజగోపాల్
September 10, 2026
0

...

మళయాళ చిన్న కథలు

మళయాళ చిన్న కథలు

by ఎడిటర్
September 10, 2026
0

...

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

by డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
September 10, 2026
0

...

హిందీ కథ : ఓడిపోయాను 

హిందీ కథ : ఓడిపోయాను 

by వెన్నా వల్లభరావు
September 10, 2026
0

...

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

by కేశవ్ గోపాల్
September 10, 2026
0

...

కన్నడ కథ : చావు

కన్నడ కథ : చావు

by చందకచర్ల రమేశబాబు
September 10, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

by శివ చల్లా
September 10, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026
హిందీ కవిత: అడవిలో వర్షం
అనువాద కవితలు

హిందీ కవిత: అడవిలో వర్షం

September 10, 2026
హిందీ కవితలు: గోధుమ + గోవు
అనువాద కవితలు

హిందీ కవితలు: గోధుమ + గోవు

September 10, 2026
సచ్చిదానందన్ కవితలు రెండు..
అనువాద కవితలు

సచ్చిదానందన్ కవితలు రెండు..

August 15, 2026
హిందీ కవిత: నా చిరునామా
అనువాద కవితలు

హిందీ కవిత: నా చిరునామా

August 15, 2026

అభిప్రాయాలు

  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply