• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఫ్రెంచ్ కథ : ఆయన చిన్నతనంలో

వినయమణి by వినయమణి
March 24, 2023
in అనువాద కథలు
0
గుజరాతీ కథ : ఆలంబన
“సరే!  కానియ్యి.  నాకు కూడా అలాగే అనిపిస్తోంది. కొత్త జీవితం మొదలుపెట్టు.”
“అదేంలేదు.  నేను మళ్లీ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఆ రొంపిలోకి దిగకుండా నా బ్రతుకు నేను బ్రతుకుతాను.  ఇంకేమైనా అడగవలసినది ఉందా?”
“లేదు, కాని… ముందు ఎలా ఉంటుందో తెలియకుండా ఈ నిర్ణయం తీసుకుంటే…”
“నాకు తెలుసు ఎలా ఉంటుందో: మెదట ప్రశాంతత, తర్వాత ముసలితనం, ఆఖరున పారిస్ లో పేరుగన్న ‘పేర్ లాషైజ్’ శ్మశానం”.
“జోకులు వెయ్యకు.  నన్ను ఓ మాట చెప్పనియ్యి.  మనం అనుకున్నట్టుగానే చేద్దాం కాని, మనిద్దరం విడిపోతున్నట్టు ప్రపంచానికి అంతటికీ  వెంటనే ప్రకటించాలా? అక్కర్లేదనుకుంటా.  ఆలోచించి చూడు.”
“ఏమో! ఎందుకంటే, అందరికీ ఎప్పుడో అప్పుడు తెలిసిపోతుందిగా…”.
“నిజమే కాని, అప్పుటికి అంతా చల్లారిపోతుంది.  నేను చెప్పేది ఇది:  మనం తప్పకుండా విడిపోదాం.  కాని, విడాకులు తీసుకునే ముందు అందరి కళ్లలోపడి, మన స్నేహితులకి అనుమానాలు రాకుండా ఒక పని చేద్దాం.”
“ఏమంటున్నారు మీరు?”
“అనుకున్నట్టుగానే రేపు నువ్వు వెళ్లిపో.  కాని, ఇక్కడో, మరో దేశంలోనో ఏ స్నేహితురాలిదగ్గరికో వెళ్ళే బదులు బ్రిటనీ ఊరి బయట ఉన్న నా పాత బంగళాకి వెళ్ళు.  అక్కడ, వీలయితే ఓ రెండు నెలలు ఉండు.  ఎంతో కాలం నుంచి మా అమ్మ, నాన్నల దగ్గర పనిచేసి, చిన్నప్పుడు నన్ను పెంచిన మదామ్ బెనార్ ఆ బంగళాలో ఉంటోంది.  ఆమె నీకు ఏ లోటూ లేకుండా చూసుకుంటుంది.  నేను త్వరలో వస్తానని ఆమెతో చెప్పు.”
“అది ఏ మాత్రం నిజం కాదు.”
“ఔను కాని, ప్రస్తుతానికి అలా చెప్పు.  బంగళాలో అన్ని సదుపాయాలూ ఉన్నాయి; చాలా బావుంటుంది కూడాను. నేను నా చిన్నతనంలో ఉన్న ఆ బంగళా పారిస్ కి దూరంగా ఉందని నువ్వు ఇంతవరకు చూడనేలేదు. మనం విడిపోయే ముందు నువ్వు దాన్ని చూడడానికి ఇది ఒక మంచి అవకాశం.  ఏమంటావు?”.
“మర్యాదగా చెప్పారుగనక, సరే!  నేను వస్తున్నానని మదామ్ బనార్ కి టెలిగ్రామ్ ఇవ్వండి.”
తర్వాత ఇద్దరూ గుడ్ నైట్ చెప్పుకున్నారు.  వాళ్ళ కంఠాలు వణకలేదు కాని, వాళ్ళ హృదయాలు వణికాయి. “నిజమేనా, మేము శాశ్వతంగా విడిపోతున్నామా? చూద్దాం!”
ఏమయితేనేం, మర్నాడు మదామ్ ప్రెసీ బయలుదేరి బ్రిటనీలోని పాత బంగళా చేరుకుంది.   వసంతం పసిపిల్లలాగా  ఆ సముద్ర తీరప్రాతంలోకి బుడిబుడి అడుగులు వేస్తోంది.  చెట్లు, చేమలు చిక్కగా అలుముకుని ఉన్నాయి.  ఆకాశం మామూలుకన్న ముదురు రంగులో ఉంది.  ఆ ఉప్పుగాలిలో ఏముందోగాని, బుగ్గలకి ఎరుపుని, మనసుకి హాయిని ఇస్తోంది.
మదామ్ ప్రెసీ కోసం మదామ్ బనార్ రెండో అంతస్తులో విశాలమైన పడకగది కేటాయించింది.  దాని గోడలని చక్కగా అలంకరించింది.  గాలిలో పైన్ చెట్ల గుసగుసలు వినిపిస్తున్నాయి.
తన అంతస్తువాళ్ళు వేరే ఎవరూ లేకపోవటం వల్ల తన హుందాతనం నిలుపుకుంటూనే మదామ్ బనార్ తో స్నేహంగా ఉండసాగింది మదామ్ ప్రెసీ.  ఒకరోజు ఆమెకి బంగళా అంతా తిప్పి చూపిస్తోంది మదామ్ బనార్.  మూడో అంతస్తులోని ఒక పెద్ద గది గుమ్మం దగ్గరికి తీసికెళ్లి, తలుపులు తోస్తూ, “ముందర మీకు ప్రెసీగారి చిన్నతనానికి సంబంధించినవన్నీ చూపిస్తాను.  ఇదిగో, ఈ గదిలో ఆయన చిన్నతనంలో ఒంటరిగా ఆడుకుంటూ కాలం గడిపేవారు.” అంది.  అలమారాలుతెరిచి, “ఇవిగో బంతులు, సైనికుల బొమ్మలు, తుపాకీ, చదరంగం; ఇవి, ఆయన చిన్నతనంలో ఆడుకున్న బొమ్మలు” అంటూ చూపించింది.  హఠాత్తుగా ఆ గుట్టలోంచి ముక్కు విరిగిన ఒక బొమ్మని లాగి, “చూడండి మేడమ్!  ఆయనకి ఒక బొమ్మకూడా ఉంది. దీన్నిపోషెత్ అని పిలిచేవారు. దీన్ని ముద్దు పెట్టుకుంటూ, ‘దీన్నే నేను పెళ్లి చేసుకుంటా’ అనేవారు.  నవ్వొస్తుంది కదూ? ఇప్పుడు అలా అనరు లెండి.  ఆయనకి ఎంతో అందమైన బొమ్మ ఉంది ఇప్పుడు.” అంది నవ్వుతూ.  మదామ్ ప్రెసీ ఏమీ మాట్లాడలేదు.
తర్వాత ప్రెసీగారి పడకగది చూపించింది.  అప్పుడప్పుడు ప్రెసీగారు అనడం మర్చిపోయి ఆయన అసలు పేరు వాడుతూ లూయీ అనేసేది.  అలా అన్నప్పుడల్లా మదామ్ ప్రెసీ కి అదోలా అనిపించేది: తను తొమ్మిదేళ్లుగా పిలిచిన పేరు; మళ్లీ ఇంక పిలవదేమో!
అక్కడినుంచి ఆమె భర్త చదువుకునే గదికి వెళ్లారు.  అక్కడి అరల్లో ఆయన పాత స్కూల్ పుస్తకాలు, కాపీ పుస్తకాలు ఉన్నాయి.   అందులోంచి ఒక కాపీ పుస్తకాన్ని తీసి చూపిస్తూ అంది మదామ్ బనార్, “చూడండి!  ఆయన చిన్నతనంలో ‘మనం ఒకరినొకరు ప్రేమించుకుందాం’ అని ఎంత బాగావ్రాశారో!”
ఆ తర్వాత వాళ్ళు క్రిందికి వచ్చి కొంతసేపు మౌనంగా నడిచారు.  అంతలో ఒక పెద్ద చెరువు కనిపించింది.  అందులో రెండు తెల్లని అందమైన హంసలు ఈదుతున్నాయి.  “ఈ చెరువులోనే ఆయన చిన్నతనంలో తన పడవ నడిపేవారు.  ఒకరోజు సాయంత్రమైతే దాదాపు ఆయన మునిగిపోయినంత పని అయ్యింది.  అది నేను ఎప్పటికీ మరచిపోలేను.” అంది మదామ్ బనార్.
ఇంకొంత దూరం నడిచిన తర్వాత ఒక పాత కర్ర బెంచీ కనిపించింది. దాని రెండువైపులా పెద్ద పెద్ద కుండీలు ఉన్నాయి.” ఆయన చిన్నతనంలో దీనిమీదే కూర్చుని ఏదో చదువుతూండేవారు”  ఉత్సాహంగా చెప్పింది ఆమె.
వినయమణి

సంగీతం, సాహిత్యం, సాహసయాత్రలు, స్వచ్ఛందసేవ ముఖ్యమైన అభిరుచులు. ఆకాశవాణినుంచి విరమించుకున్న తరువాత కాలిఫోర్నియాలో ఉద్యోగం, నివాసం. ఫ్రెంచ్ లో ఆంత్వాన్ ద సెంత్ ఎక్సూపెరీ రాసిన ప్రసిద్ధ నవల చిన్నారి రాకుమారుడు తెలుగులోకి అనువదించి ప్రచురించారు.

Page 2 of 3
Prev123Next
Previous Post

ఆల్బేనియా కథ : అజ్ఞాత యోధుడు

Next Post

గుజరాతీ కథ : ఆలంబన

Next Post
గుజరాతీ కథ : ఆలంబన

గుజరాతీ కథ : ఆలంబన

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com