• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఫ్రెంచ్ కథ : ఆయన చిన్నతనంలో

వినయమణి by వినయమణి
March 24, 2023
in అనువాద కథలు
0
గుజరాతీ కథ : ఆలంబన
తర్వాత వాళ్లిద్దరూ కూరమళ్లదగ్గరకి వచ్చారు.  గబగబా ఒక చిన్న మడి వైపు నడుస్తూ, “ఇదే ఆయన చిన్నతనంలో చేసిన వ్యవసాయం.” అంది ఆమె. ఆ పైన గుర్రపు శాలల పక్కగా నడిచారు వాళ్లు.  మదామ్ బనార్ మళ్లీ అంది, “ఇక్కడే బోనిఫాస్ ని కట్టేసేవారు.”
“బోనిఫాస్ ఎవరూ?”  అడిగింది మదామ్ ప్రెసీ.
“బోనిఫాస్ ఆయన చిన్నతనంలో సవారీ చేసిన గుర్రం”
చదువుకుంటూ, వ్రాసుకుంటూ, నవ్వుకుంటూ, ఆడుకుంటూ ఉండే చిన్నారి లూయీని మదామ్ బనార్ ఎంతగా కళ్ళకి కట్టేటట్టు చూపించిందంటే, మదామ్ ప్రెసీకి నిక్కర్ వేసుకుని, ఎండకి కమిలిన కాళ్లతో, టోపీ లేకుండా తోటలో అడ్డంగా పరిగెత్తుతున్న అతను ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు.
ఆ మధ్యాహ్నం ఇద్దరూ డైనింగ్ హాల్ లో కిటికీలోంచి సముద్రాన్ని చూస్తూ కూర్చునారు.  మదామ్ బనార్ మిస్టర్ ప్రెసీ గారి గురించి, ఆయన చిన్నతనంలో జరిగిన సంగతుల గురించి చెప్పసాగింది.  అది ఏమంత సంతోషకరమైనవి కావు.
“మీతో ఒక విషయం చెప్పాలి, మదామ్.” మొదలు పెట్టింది ఆమె.” ప్రెసీ గారి తల్లిదండ్రులు మరీ విచిత్రపు మనుష్యులు.  మీరు ఎప్పుడూ చూడలేదు కాని వాళ్లు నాకు బాగా తెలుసు.  ఇది అని ఒక కారణం లేకుండానే వాళ్లకి ఒకరు అంటే ఒకరికి అస్సలు ఇష్టం లేదు.  వారిద్దరి మధ్య అన్యోన్యం అన్న మాట లేదు.  మనకి పడదులే అన్న సాకుతో ఎప్పుడూ విడివిడిగానే ఉండేవారు.  తండ్రి పారిస్ లో ఉంటే తల్లి దేశాలు తిరుగుతూండేది.  ఆవిడ ఇంటికి వచ్చిందంటే ఆయన వెళ్లిపోయేవాడు.  ఇద్దరికీ లూయి అంటే ప్రేమే కాని అతనితో ఉండేవారే కాదు.  ఇక్కడికి, నా దగ్గరికి పంపించేసేవారు.  నేనే అయనకి తల్లి, తండ్రి అయి పెంచాను. ఆయన తల్లిదండ్రులు బాగా చిన్నతనంలోనే పోయారు.  అప్పుడు ఆయన ఎంత బాధ పడ్డారో! “
“ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక్కోసారి ఎక్కువగా చిరాకు పడవచ్చు, కోపంగా ఉండవచ్చు, పరధ్యాసగా ఉండవచ్చు. మీరు ఏమీ అనుకోకండి.  అది అంతా ఆయన తప్పు కాదు.  అది ఆయన చిన్నతనంలో ఉన్నప్పటి పరిస్థితుల ప్రభావం.  అలా బాల్యంనుంచి ఒంటరితనంతో, ప్రేమ లేకుండా గడపకుండా ఉండి ఉంటే ఆయన తప్పకుండా మరోలా ఉండేవారే.”
అలా సాయంత్రం దాకా ఆమె ఎన్నో సంఘటనలు, వివరాలు చెప్తూనే ఉంది.  చీకటి చుట్టేసినా ఇద్దరూ దీపం కోసం చూడలేదు.  అందుకే అప్పుడప్పుడు మదామ్ ప్రెసీ కళ్లు తుడుచుకోవటం మదామ్ బనార్ కి కనిపించలేదు.  చివరికి లేస్తూ, మదామ్ బనార్ రెండు చేతులూ ప్రేమగా నొక్కుతూ ఆమె అంది,
“మదామ్ బనార్!  మీరు నా భర్త గురించి చెప్పిన విషయాలన్నీ నాకు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.”  ఇది చూసి మదామ్ బనార్ ఆశ్చర్యపోలేదు.  ఆ యువతి ‘ఈ టెలిగ్రామ్ పారిస్ లో ఈ ఆఫీస్ కి పంపించు’ అంటూ ఒక టెలిగ్రాం ఇచ్చినప్పుడు కూడా ఆమె ఆశ్ఛర్య పడలేదు.  ఆ టెలెగ్రామ్ లో ఏముంది?  ఏమోగాని, ఆ రాత్రి దాన్ని పంపగానే మర్నాడు మిస్టర్ ప్రెసీ అక్కడికి చేరుకున్నాడు.
వినయమణి

సంగీతం, సాహిత్యం, సాహసయాత్రలు, స్వచ్ఛందసేవ ముఖ్యమైన అభిరుచులు. ఆకాశవాణినుంచి విరమించుకున్న తరువాత కాలిఫోర్నియాలో ఉద్యోగం, నివాసం. ఫ్రెంచ్ లో ఆంత్వాన్ ద సెంత్ ఎక్సూపెరీ రాసిన ప్రసిద్ధ నవల చిన్నారి రాకుమారుడు తెలుగులోకి అనువదించి ప్రచురించారు.

Page 3 of 3
Prev123
Previous Post

ఆల్బేనియా కథ : అజ్ఞాత యోధుడు

Next Post

గుజరాతీ కథ : ఆలంబన

Next Post
గుజరాతీ కథ : ఆలంబన

గుజరాతీ కథ : ఆలంబన

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com