• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

అనువాద కవిత: కివులులో కుక్క + 3

అనిల్ బత్తుల by అనిల్ బత్తుల
July 1, 2025
in అనువాద కవితలు
0
అనువాద కవిత: కివులులో కుక్క + 3

మూల రచయిత: రాల్ఫ్ బిటమజైర్ (ఆఫ్రికా)
అనువాదం: అనిల్ బత్తుల

కివులులో కుక్క
బక్కగా ఎముకలగూడులా వుంది,
అది ఆవులిస్తుంది,
కివులులో కుక్క
దాని యజమానిలాగే
ఊపిరి పీల్చుకుంటూ చతికిలబడి వుంది,
కివులులో కుక్క
ధన్యవాదాలు అనే పాటపాడుతూ
చెత్తకుప్పలను దాటివెళ్తున్న
దిగంబరపిల్లలను చూసి
మొరుగుతుంది.
కివులులో కుక్క
ఈగల్ని తోలుకుంటూ
పళ్లతో దాని తోకను గొక్కుంటుంది
దాని పళ్లచిగుళ్లను అదే కొరుక్కుంటుంది
దాని ఎంగిలిని అదే మింగుతుంది,
కివులులో కుక్క
తాగుబోతు యజమానిని కాపలాకాస్తుంది
మట్టికుండలలో పులియబెట్టిన
ఆహారాన్ని తింటుంది
కానీ కివులులో కుక్క
తాగడానికి ఏమీ లేక పడుకుంటుంది
అది కందకాల వద్ద కనిపిస్తుంది –
పశువులకొట్టం నుండి పారే నీరు త్రాగుతుంది.
.
*కివులు – ఆఫ్రికాలో ఒక ప్రాంతం పేరు.

 

రహస్యం

మూల కవి : షుంతారో తనికవ ( జపాన్)
స్వేచ్ఛానువాదం : అనిల్ బత్తుల

 

ఎవరో ఒకరు
దాస్తున్నారు
ఒక రహస్యాన్ని.
వాళ్ళెవరో నాకు తెలియదు.
ఆ రహస్యమూ నాకు తెలియదు.
అది తెలిస్తే,
విశ్వ రహస్యం తెలుస్తుంది.
ఊపిరి బిగబట్టి,
చెవులు రిక్కించి వింటున్నాను.
వర్షం భూమిని స్పర్శిస్తూ,
భూమి గర్భంలో ఏదో దాస్తుంది.
అది మనకు ఏదో రహస్యం చెప్పాలని చూస్తుంది.
నాకు దాని రహస్య భాష అర్థం కాదు.
వంటింట్లోకి తొంగి చూస్తాను,
అమ్మ ఏదో దాస్తుంది.
ఏంటా అని చూస్తే,
ఆమె ముల్లంగి దుంపల్ని కోస్తుంది.
నాకు రహస్యాలంటే చాలా ఇష్టం.
కాని ఎవ్వరూ నాకు రహస్యాలు చెప్పరు.
నా గుండెలోని రంధ్రంలోకి తొంగిచూస్తాను.
దానిలో నాకు
మబ్బుపట్టిన రాత్రి ఆకాశం
కనిపించింది.

 

బిర్చ్ చెట్టు

మూలం: అర్కాడి కులెసేవ్ (రష్యన్ కవి)
తెలుగు అనువాదం: అనిల్ బత్తుల

ఏకాంతంలో విచారంగా బిర్చ్ చెట్టు ఒకటి శ్మశానవాటిక కంచెపై వాలివుంది.
నాజీ బాంబ్ షెల్స్ దాని బెరడుపై అనేక గుర్తులను మిగిల్చాయి.
మ్యాజిక్ చేసినట్టు అది బతికింది.
వధశాల ట్రాజిడీ వద్ద నిల్చున్న అమ్మాయివలే అది నిలబడి వుంది .
నువ్వు ఏడవొద్దు, నిట్టూర్చొద్దు, వణకొద్దు.
సుందరమైన బిర్చ్ చెట్టు!
నీ జడల్ని నదితో ముడివెయ్యి.
సుందరమైన బిర్చ్ చెట్టు!
శత్రువులు నిన్ను చంపలేకపోయారు లేదా లొంగిపోయేలా బలవంతం చేయలేకపోయారు;
ఎత్తుగా పెరుగు,
నువ్వు ఈ భూమిని సంతోషపెట్టినప్పుడు,
మనుషుల హృదయాలు ఆనందంతో నిండుతాయి.

 

పల్లె జీవితపు ఆనందం

మూలం: వాంగ్ వే (ప్రాచీన చైనీయకవి)
ఇంగ్లీషు అనువాదం: విక్రం సేత్
తెలుగు అనువాదం: అనిల్ బత్తుల

 

పీచ్ పువ్వులు ఎర్రగా పుష్పించాయి; రాత్రి వర్షాన్ని అవి తమలో దాచుకున్నాయి.
విల్లో చెట్లు పచ్చగా వున్నాయి, అవి వసంతపు పొగమంచును మరోసారి ధరించాయి.
రాలిన పూలను పనిపిల్లాడు ఇంకా ఊడవలేదు.
ఓరిఒల్ పక్షులు కిచకిచ మంటున్నాయి, నా కొండమీది అతిధిని దయచేసి నిద్రలేపకండి.

అనిల్ బత్తుల

అనిల్ బత్తుల కవి, పిల్లల పుస్తక రచయిత. సోవియట్ తెలుగు పుస్తకాలను సేకరించి, డిజిటలైజ్ చేయించి ఉచితంగా తెలుగు వారికి అందించారు. అరుదైన అనువాద కథలు, నవలల్ని పునర్ ముద్రణకు కృషి చేస్తున్నారు. అనిల్ బత్తుల పబ్లికేషన్స్ ద్వారా త్వరలో కొన్ని అరుదైన పుస్తకాలని మన ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుత నివాసం యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్.

Previous Post

తమిళ కథ : చిరు సంచిక

Next Post

రామోజీరావు స్ఫూర్తికి అంకితం ‘కథావసుధ’

Next Post
రామోజీరావు స్ఫూర్తికి అంకితం ‘కథావసుధ’

రామోజీరావు స్ఫూర్తికి అంకితం ‘కథావసుధ’

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com