• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఇనుపచువ్వల దడి

admin by admin
September 2, 2025
in అనువాద కథలు
0
ఇనుపచువ్వల దడి

మూలం : హెల్మట్ ష్వాబ్ (The Wall)
తెలుగు అనువాదం : మణి వడ్లమాని

“ఆకాశానికి చిల్లుపడినట్లు… ఆగకుండా వర్షం…! ఎక్కడా తెరిపిలేదు, ఒక్కలా వర్షం కురుస్తూనే ఉంది! ఉన్నట్టుండి కరెంటుపోయింది. అంతా చీకటి, దారి కనిపించటం లేదు. కింద అంతా బురద, కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఇంతలో ఒక్కసారి మెరుపు మెరిచింది. ఆ మెరుపు వెలుగులో ఎదురుగుండా ఒక ఇనుపచువ్వలదడి కనిపించింది. అమ్మయ్య అనుకుంటూ, వాటి మధ్యలోనించి లోపలకి వెళుతున్నాను. జాగ్రత్తగా అడుగు తీసి, అడుగు వేసానో లేదో ఆ దడి తాలుకు ఒక సన్నటి ఇనుపచువ్వ, చీకట్లో కనిపించలేదు, అచ్చు కత్తి మొన లాగా కోసుగా ఉండి కడుపులోకి గుచ్చుకొని… నేను చచ్చిపోయాను.”

“ఏవండి! లేవండి, అప్పుడే టైం ఏడు గంటలయింది, తొందరగా ఆఫీసుకి వెళ్లాలన్నారు కదా! అంటూ రవిని లేపడానికి వచ్చిన సంధ్య మంచం మధ్య కూర్చుని శూన్యంలోకి చూస్తున్న భర్తను చూసి, “అదేంటి చెమటలు అలా దిగకారుతున్నాయి, ఏంటి పిచ్చి చూపులు చూస్తున్నారు” అంటూ కంగారుగా కుదిపేసింది. కాని రవి ఏమి మాట్లాడకుండా లేచి బాత్‌రూంలోకి వెళ్ళిపోయాడు. సంధ్యకి అతని చర్య అర్థం కాక అలా చిత్తరవులా నిలబడిపోయింది. బయటకు వచ్చిన రవి భార్యను చూసి అతిమాములుగా “కాఫీ ఇవ్వు” అనడిగాడు.

“ఆ అలాగే” అని వంటింట్లోకి వెళ్లి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. ఆమె మొహం వైపు చూడకుండానే కాఫీ తాగేసి మళ్ళి స్నానాల గది లోకి వెళ్లిపోయాడు. కొంచెం సేపు అయ్యాక బట్టలు వేసుకొని “నేను ఆఫీసుకి వెళుతున్నాను” అని గోడకి చెప్పినట్లు చెప్పి వెళ్ళిపోయాడు. సంధ్య అతని వింత ప్రవర్తనకు విస్తుపోయింది. పెళ్ళయిన ఇన్నేళ్ళలో ఇలా ఎప్పుడూ జరగలేదు అనుకొంది.

ఆఫీసుకు బయల్దేరిన రవి తన కలను పునశ్చరణ చేసుకుంటూ ఎప్పుడూ వెళ్ళే దారిలోనే నడుచుకుంటూ బస్సుస్టాప్ వైపు వెళుతుండగా, హటాత్తుగా అతని కళ్ళకి రోడ్డుకి ఆ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ‘దడి’ కనిపించింది. తనని కలలో చంపిన దడి అదే!

ఇంక ఆపక్కకు చూసే ధైర్యం లేక వడివడిగా అడుగులేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు

తెలియని భయం వెంటాడుతోంది, తలచుకుంటే అదే నిజమేమో, తను చనిపోయాడేమో అనిపిస్తోంది. ఏదో అదృశ్యశక్తి నువ్వు త్వరలో మరణిస్తావు అని అన్యాపదేశంగా చెపుతున్నట్లు అనిపిస్తోంది. ఏవిటో ఈ ప్రపంచం తో సంబంధం తెగిపోయినట్లు, ఎక్కడో గమ్యం తెలియనంత దూరంలో, పెద్దగాజు గోళంలో ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు, ఎప్పుడు వస్తుందో తెలియని మృత్యువు కోసం ఎదురు చూస్తున్నట్లు, అందరూ ఉంటారు ఈ లోకంలో ఒక్క నేను తప్ప, అనే దిగులు, నైరాశ్యం మనసును కమ్మేసాయి.

ఆరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక ఇంత భోజనం తిన్నాననిపించి గదిలోకి వెళ్లి ముసుగుతన్ని పడుకున్నాడు. ఏదో ఆందోళన, భార్యకు చెప్పితే చిన్నబుచ్చుతుందేమో అనే అనుమానం. అలా ఆలోచిస్తూ పడుకున్న రవికి మగత నిద్రలో మళ్ళీ అదే కల. ఆ దడి మధ్యలో నుంచి వెళుతూ ఉంటే ఇనపచువ్వ మొన గుచ్చుకొని తను చచ్చిపోయాడు. అర్ధరాత్రి దిగ్గున లేచి కూర్చొన్నాడు మంచం మీద వణికిపోతూ. రోజు ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఏదైనా శవం వెళుతూవుంటే అయ్యో పాపం అనుకుంటాము. కానీ అదే మన దగ్గరకు వచ్చేసరికి ఆ చావు మాట తలచుకోవడమే భయంకరంగా అనిపిస్తుంది. సంధ్య తనని దగ్గరకు తీసుకుంటే బాగుండును ఆ వెచ్చటి కౌగిలిలో అన్ని భయాలు పోతాయి అనిపించింది. కానీ ఇవేమీ తెలియని ఆమె హాయిగా నిదురపోతోంది.

మళ్ళి తెల్లవారింది. రోజు వారి దినచర్య మొదలు. మనసులో ముల్లులా ఆ దడి గురుకొస్తోంది. అది తలచుకుంటే చాలు చావు గురించిన బెంగ మొదలయింది. ఎప్పుడూ వెళ్ళే దారిలోనే నడుచుకుంటూ బస్సు స్టాప్ కి వెళ్తూ ఆ పక్కన ఉన్న ఖాళీ స్థలం దగ్గరకి వచ్చినపుడు దడి వైపు చూశాడు. ఇంకా ఆశ్చర్యం, అచ్చు కలలో తనకి గుచ్చుకొన్నలాంటి సన్నగా మొనతేలిన చువ్వ, కొంచెము ముందుకు వాలి ఉంది. ఇంక ఆ పక్కకు చూసే ధైర్యం లేక వడివడిగా అడుగులేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఆఫీస్ లో పని చేసుకుంటూ మనసులోపల అనుకుంటున్నాడు, “అవును, నేను ఎందుకు భయపడుతున్నాను. ఇవాళ కాకపోతే రేపైనా అందరం ఇక్కడనుంచి వెళ్ళాలిసిన వాళ్ళమే. ఎప్పుడో పోయే దానికి ఇప్పటి నుంచే ఆదుర్దా అనవసరం. ఈ జీవితం ఉన్నంత వరకు నేను సంతోషంగా ఉండి నా వాళ్ళను కూడా సంతోషపెట్టాలి, అంతే కానీ పిరికి వాడిలాగా నిజం నుంచి పారిపోకూడదు అని దృఢంగా అనుకున్నాడు. సాయంత్రం ఇంటికి వస్తూ సంధ్యకి కొత్త చీర, బాబుకి కొత్త డ్రెస్, స్వీట్స్, పళ్ళు తీసుకొని బయలుదేరాడు. వాన మొదలైంది. అంత వరకు మర్చిపోయిన దడి గురించిన ఆలోచనలు మళ్ళీ వచ్చాయి. ఇలా జరగడం కాకతాళీయమా లేక నిజంగా నాకు భవిష్యత్తు తెలుస్తోందా” అంటూ ఆలోచించడం మొదలెట్టాడు రవి.

ఎంత చూడకూడదు అనుకొన్నా చూపు మాత్రం ఆ ఖాళీ స్థలం వైపు మళ్ళింది. అనూహ్యం! ఆ ఇనుప చువ్వల దడి పడిపోయివుంది. అక్కడ నుంచొని చూస్తూ ఉండగా ఆ పక్క నుంచి ఒక వ్యక్తి వెళుతున్నాడు, వెంటనే కుతూహలంగా అతనిని ఆపి అడిగాడు “ఈ దడి ఎలా పడిపోయింది బాబు” అని, దానికి ఆ వ్యక్తి ఇదేమి పిచ్చిప్రశ్న అన్నట్లు రవిని కిందనుంచి పైవరకు ఓ చూపు చూసి “ఇక్కడ ఏదో పెద్ద హోటల్ కడతారుట, అందుకే ఈ స్థలమంతా చదును చెయ్యడానికి దడిని పడగొట్టారు. ఇనుపదడి దానంతట అదే పడి పోతుందా?” అని ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.

అప్పటి వరకు రవి మనసులో ఇనుములా బరువుగా దడికట్టిన భయం ఒక్కసారిగా పటాపంచలయింది. మనసు దూదిపింజెలాగా తేలిగ్గా మారింది. లోపలగూడు కట్టుకొన్న దిగులంతా మాయమైపోయింది. ఆనందంగా ఇంటి వైపుకి అడుగులు వేసాడు. తెల్లారకట్ట వచ్చిన కలలు నిజమవుతాయి అనే మూఢనమ్మకంలో ఉన్న రవి, అది కలే కాని నిజం కాదనే నమ్మకం కుదిరింది. రెట్టించిన ఉత్సాహంతో సంతోషంగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళాడు. హుషారుగా ఇంటికి వచ్చిన రవిని చూసి సంధ్య ఎంతో ఆనంద పడింది. కొడుకు “నాన్నా” అంటూ దగ్గరగా వచ్చాడు. చేతులు చాపి వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకొని మనసారా హత్తుకున్నాడు.

admin
admin
sahityam.adarsini.com
Previous Post

కన్నడ కథ : తక్కువేమి మనకూ..

Next Post

వయసు మరిచిన మనసు

Next Post
వయసు మరిచిన మనసు

వయసు మరిచిన మనసు

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

by రమేశ్ రాచపూటి
September 14, 2026
0

...

హిందీ కథ : కొత్త గాలి

హిందీ కథ : కొత్త గాలి

by విఎల్ నరసింహం శివకోటి
September 10, 2026
0

...

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

by పి. శ్రీనివాస్ గౌడ్
September 10, 2026
0

...

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

by తిరువాయపాటి రాజగోపాల్
September 10, 2026
0

...

మళయాళ చిన్న కథలు

మళయాళ చిన్న కథలు

by ఎడిటర్
September 10, 2026
0

...

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

by డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
September 10, 2026
0

...

హిందీ కథ : ఓడిపోయాను 

హిందీ కథ : ఓడిపోయాను 

by వెన్నా వల్లభరావు
September 10, 2026
0

...

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

by కేశవ్ గోపాల్
September 10, 2026
0

...

కన్నడ కథ : చావు

కన్నడ కథ : చావు

by చందకచర్ల రమేశబాబు
September 10, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

by శివ చల్లా
September 10, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026
హిందీ కవిత: అడవిలో వర్షం
అనువాద కవితలు

హిందీ కవిత: అడవిలో వర్షం

September 10, 2026
హిందీ కవితలు: గోధుమ + గోవు
అనువాద కవితలు

హిందీ కవితలు: గోధుమ + గోవు

September 10, 2026
సచ్చిదానందన్ కవితలు రెండు..
అనువాద కవితలు

సచ్చిదానందన్ కవితలు రెండు..

August 15, 2026
హిందీ కవిత: నా చిరునామా
అనువాద కవితలు

హిందీ కవిత: నా చిరునామా

August 15, 2026

అభిప్రాయాలు

  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply