• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

చైనా కథ : అమ్మ

ఎడిటర్ by ఎడిటర్
July 1, 2025
in అనువాద కథలు
0
చైనా కథ : అమ్మ

మూల రచయిత : తింగ్ లింగ్

అనువాదం : పురిపండా అప్పలస్వామి

పల్చని చెట్లవరస దాటాక విశాలమైన బయలు. దాని కవతల పశ్చిమఉయిలో గ్రామం. ఊరిదగ్గర చెట్లు– పొడవాటి కొమ్మలు చలికి ఊగులాడుతూ ఉన్నాయి. చెట్లలో.ఒక ఇంటివాకిలి సున్న పుగోడ ఏదో విషణ్ణంగా ఉంది. చలికి మరింత పాలిపోయింది కాని బాల్లిరంగు. వాతావరణం నలు దిక్కులా మృత్యువు నీడలను అమభవానికి తెస్తున్నట్లుగాఉంది.

ఊరిచివర పురాతనమైన ఒక చీకటికొంప పెగోడావలె ఉంది. మనక మనక దీపంతో, తోడులేని ఏకాకివృద్ధుడు విషారంగా దూరాన్ని పరికిస్తూ ఉన్నట్లుండా ఇల్లు.

సాయంసంధ్య ఆక్రమిస్తూఉంది. ఊరికొంపలనుండి ఇవాళ అధికంగా పొగలు లేవడంలేదు. నిశ్శబ్దమైన సాయంప్రసన్నత గ్రామాన్ని కప్పుతూ ఉంది. కాకులు చిన్న చిన్న గుంపులుగా, తలమీద చక్రాకారంగా ఎగురుతూ ఖర్జూరవనం దిక్కు వెళ్లిపోతూ ఉన్నాయి. అంతకుముందే ఖర్జూరవృక్షాలను అశ్రయించుకున్న చిన్నరకం పట్టలు ఈ అగంతుకుల్ని చూసి భయంతో కిచకిచలాడుతున్నాయి.

ఇంతలో ఒక పెర్లనీడ బరువైన పాదాలు వేసుకొంటూ కొండమీదినుండి దిగి రావడం చూసి పక్షులన్నీ మరింత భయపడ్డాయి. ఆ పాదాలకు తొడిగిఉన్న నాళ్లువేసిన నల్లని జోళ్ల బరువుకు గడ్డిమీది పల్చటి మంచుముక్కలు పిండిపిండి ఐపోతున్నవి. చిత్రమైన జుత్తు కలిగిన ఒక అడవికోడి భయంతో పారిపోయి తుప్పలో దూరిపోయింది.

చెన్‌సింగ్ హాన్ హృదయంలోని భావం ఉరికొయ్య క్రింద నిలువబడిన నేరస్తుని భావంలా ఉంది. శరీరంలోని సమస్త శక్తిని కూడగట్టుకొని నిలుచోగలుగుతున్నాడు. కాంతిలేని కళ్లు, శూన్యమైన చూపులు ఆకాశం మీదికిగాని, భూమి మీదికిగాని పడడానికి సంకోచిస్తున్నాయి; ఏమో ఏదన్నా భయంకరమైన దృశ్యం ఎదురౌతుందేమో అన్నట్టు. కొండ దిగివచ్చి మరింత మెల్లగా, బరువుగా అడుగులు వేస్తూ ముందుకు నడిచాడతడు.

గ్రామాన్ని ఆవరించిఉన్న నిశ్శబ్దం మెల్ల మెల్లగా విడిపోతూఉంది. స్పృహతప్సి పోయిన రోగి తిరిగి తెలిని పొందినట్లు అస్పష్టమైన మూలుగులు వినవస్తూన్నాయి. మధ్య మధ్య చీకటిభయం వేస్తూ ఉంది. అయితే ఆ ధ్వనులు ఎవరివి? ఆకలితో ఉన్న తోడేళ్ల గుంపు అర్ధరాత్రి స్మశానంలో దూరి జాలిగా అరుస్తూ ఉన్నట్టుగా ఉంది. ఆ శబ్దాలు స్పష్టంగా వివ గలుగుతున్నాడు. చేన్‌సింగ్ హాన్. అతడి శరీరం భయంతో జలదరించింది. కదలడానికిగాని, కిక్కురుమనడానికిగాని శక్తి లేదు. నిలుచున్న పాటున ఆపాదమస్తకం కంపిస్తున్నాడు. అంతేలోనే లేని సాహనం, శక్తీ తెచ్చుకొని శరీరాన్ని నడిపాడు ముందుకు గ్రామ౦దిక్కు. ధూసరితమైన పొగమంచులో గ్రామం పూడ్చుకు పోయిఉంది. ఇంటికప్పులు కనపడ్డమేలేదు.

గ్రామంలోనుండి నీడలవలె ఇద్దరు మనుష్యులు బయల్దేరి వస్తున్నారు. ఏదో మోసుకొని ఒకరి వెంట ఒకరు నడుస్తున్నారు. అది మానవకళేబర మని చెన్సింగ్ హాన్ తెలుసుకోగానే, ఎవరో బలంగా గాయబరచినట్లయిం దతనికి. గుండెల్లో ఒక ఉద్వేగం మంటలా లేచింది. కొంచెం దూరంలో అగి వాళ్లను పరికించడం మొదలు పెట్టాడు.

తడబడుతూ గడ్డపార్లతో మన్ను త్రవ్వారు వాళ్లు. శవాన్ని గోతిలో పెట్టి మన్ను కప్పారు. చేతులతో తట్టి సదునుచేశారు. అదొక పెద్ద కేకురొట్టెవలె తయారైంది. చివరికి అటూ  ఇటూ పడిన మన్ను సరిచేసి వచ్చిన దారిని బయలు దేరారు. ఇంత సేపూ వాళ్లు ఒక్క మాటన్నా ఆడలేదు. వెళుతూ వెళుతూ ఒకడు మాత్రం పెద్ద నిట్టూర్పు విడిచాడు.

“ఎవర్ని పాతారో చెప్పండి, చెప్పితీరాలి.”

వాళ్లిద్దరి చేతులూ పట్టుకున్నాడు చేన్సింగ్ హాన్. రోగం తో మూలిగిన పశువు గొంతుకులా వినిపించింది అతడి కంఠం.

“తాతచ్యాంగ్ . ఇతడి మనవఁడి ఇంటిలో దొరికింది శవం. మొట్టమొదట ఇతణ్ణే కాజేశారేమో!”

ఆ ఇద్దరిలో ఒకడు పలికాడు. రెండోవాడూ పలికాడు:

“ఇతడి మనవఁడి భార్యశవం కూడా ఆ ప్రక్కనే దొరికింది. శరీరం మీద రవికగాని దుస్తులుగానీ ఏమీలేవు. రక్తం మండలంకట్టి శరీరాన్నీ మట్టినీ అంటుకు పోయింది. అదిగో తాత కుడి ప్రక్క సమాధిలో ఆమె నిద్రపోతూఉంది.”

వాళ్లను విడిచిపెట్టేశాడు చేన్ సింగ్ హాన్. ఇంకో ప్రశ్న తన కంఠంలో కొట్టాడుతూ ఉంది. కాని పెదవుల మీదికి తీసుకు రావడానికి సాహసం చాలడం లేదు.

ఇద్దరిలో చిన్నవాడన్నాడు.:

‘‘చేన్ దద్దా! ఇన్నాళ్లు ఎక్కడిరిక వెళిపోయావు? ఇంటికి త్వరగా వెళ్లు. మీ తమ్ముడు వచ్చేశాడు.’’

‘‘తమ్ముడు- అంటే సోహనా! ఎపుడు వచ్చాడు?’’ జవాబు వినడానికి అతడు ఆగలేదు. కాళ్లలో కొత్తశక్తి వచ్చిందిప్పుడు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడిచాడు. ఎదురటికి చూస్తూ ఉన్న కొద్దీ అనేక దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతీ చిన్న విషయమూ అతణ్ని చలింపజేస్తూ ఉంది.

ముగ్గురూ గ్రామంలో ప్రవేశించారు. చీకటిలో గ్రామంలోని మార్పు ఏమీ కనిపించడం లేదు. ఉద్వేగం తొలగిపోతూ, ఆశ అంకురిస్తూ ఉంది అతడి మనస్సులో. వాళ్లిద్దరినీ విడిచిపెట్టి త్వరత్వరగా ఇంటిముఖం పట్టాడు.

అయిదు దినాలక్రితం అతడు ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. అవాళ తెలతెలవారుతూ ఉంది. ఊరిబయట తుపాకుల మ్రోరత త్రుళ్లిపడి లేచా డతడు. అంతకుముందే అతడి భార్య లేచి కూర్చుని ఉంది. పదిహేనేళ్ల పిల్ల సోనా తెల్ల మొగం వేసుకుంటూ పరుగెత్తుకు వచ్చింది నట్టింటికి. వెంటే విషయం బోధపడిపోయింది. ‘‘వెళ్లిపో, కొండమీద నాయనమ్మగారింటికి పారిపోయి దాక్కో’’ అన్నాడు.

‘‘నాన్నా! చవ్వడమే వస్తే అంతా ఒకదగ్గరే చవ్వడం మంచిది.’’

‘‘నీ ఊలు జాకెట్టేదీ?’’

‘‘అదంతా ఎందుకు నాన్నా! పిశాచసైన్యం వచ్చేసింది!’’ ఒక చేత్తో భార్య చెయ్యీ, ఒకచేత్తో కూతురు చెయ్యీ పట్టుకున్నాడు. నిస్సహాయమూ, వివర్ణమూ అయిన అతని ముఖంలో నెత్తుటిచుక్క లేదు. గుంపులు గుంపులుగా పారిపోతూ ఉన్న జనంలోనుంచి వడివడిగా కొండ శిఖరాన్ని చేరుకున్నాడు వాళ్లిరిరువురితో. అంతలో భార్య వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. రెండో కూతురూ, చిన్న కుర్రాడూ ఏరీ! వాళ్లు పారిపోగలవాళ్లు గనకనా! అంతేకాక చేన్ సింగ్ హాన్ అమ్మ యాభైఏడేళ్ల ముసలిది ఉండిపోయింది. భార్యా కూతుళ్లను ముందుకు నడవండని చెప్పి అతడు వెనక్కు మళ్లాడు. ఒకరిద్దరు వారించారు: వెనక్కి వెళ్లొద్దు. బ్రతుకు మీద ఆశఉంటే ముందుకు పద. తప్పించుకో. పరిగెత్తు.’’

కాని అతడు భయపడలేదు. అమ్మను రక్షించాలి. చూస్తూ ఉండగా జనసమూహం పెరిగిపోతూ ఉన్నది. అతడు అమ్మను వెదుకుతున్నాడు. సంవత్సరం కుర్రాణ్ణి చంకను వేసుకొని సోహాన్ భార్య గుంపువెంట పరిగెడుతూ ఉన్నది. 

‘‘అమ్మ ఎక్కడ? అమ్మని చూశావా?’’

‘‘ఆఁ, చూశాను. మా కంటె ముందే ఇల్లు బయల్దేరింది. రూపా, తుంగ్ కుయా ఆమెతో ఉన్నారు. మనం ఎక్కడకు వెళ్లడం?’’

‘‘నాయనమ్మ గారింటికి. పరుగెత్తుకు పద.’’ అంతతోకూడ అతడు మళ్లలేదు. ఇంటిదిక్కు బయల్దేరాడు. పొగలు తెరల వలె ఊళ్లో అల్లుకుంటున్నాయి. ఇంట ఎవ్వరూ లేరు. అక్కడక్కడ కోడిపిల్లలు అటూఇటూ తిరుగుతున్నాయి. తిరిగి కొండదిక్క బయల్దేరాడు. ఒక తుపాకిగుండు తన దగ్గర నుండి పొగలు చిమ్ముతూ వెళ్లిపోయింది. గుర్రాల డెక్కలు చప్పుడు వినిపిస్తూ ఉన్నది. వెనక్కి చూచిందికి అవకాశం లేదు. ఆకాశం బరువుగా విరిగిపోతున్నట్టుంది. క్రింద నేల ముక్కలైపోతున్నట్టుంది. ఊపిరి తీసిందికి వేళలేదు. సగం సగం ఆర్తనాదం. అంతతో అంతమైపోతుంది జీవనం. తిరిగి వచ్చేశాడతడు. తన వాళ్లను ఎంత వెదకినా కలుసుకోలేకపోయాడు. గ్రామస్తులను ఎందరినో అడిగాడు. ఎవ్వరూ చెప్పలేకపోయారు.

కొండమీద ఇద్దరు వృద్ధులు ఒకచోట కూర్చుని దీనంగా ఏడుస్తున్నారు. జనంలో ఎందరో పిల్లలున్నారు. కాని తుంగ్ కుయా లేడు. మీదు మిక్కిలి ఇపుడు తన భార్యా కూతుళ్లు సహా తప్పిపోయారు. సోహాన్ భార్య ఐనా కనిపిస్తే బావుండేది. కాని ఆమె జాడా తెలియడం లేదు. ఒకచోట కొంచెం ఆగి అలసట తీర్చుకున్నాడు. గుంపులు గుంపులుగా జనం వచ్చేస్తూనే ఉన్నారు. కాని స్వజనం మాత్రం అందులో కనపడరాయె.

‘‘పూరా ఒక రెజిమెంటు, రాక్షసులు.’’

‘‘ఎందరో కర్షకుల్ని చంపేశారు.’’

‘‘మన ఊరు ఇలాగే అంతమైపోతుందా?’’

‘‘వీళ్లు వస్తారని ఎన్నాళ్ల క్రిందో నేను చెప్పాను.’’

‘‘నిజం, మనకు మరే ఆశా లేదు.’’

‘‘దురదృష్టమంటే ఇదే.’’

ప్రజల్లో భయం అంటువ్యాధిలా వ్యాపించింది. అక్కడికి ముప్ఫై లీల (లీ=మైలులో మూడోవంతు) దూరంలో ఉన్న చాంగ్ కియాకుయాన్ గ్రామం చేరుకున్నాడతడు. గ్రామం చిన్నది. ఏ ఇరవై ముప్ఫై కొంపలో మాత్రం ఉన్నాయి. ఎప్పుడూ, ఏ విధమైన అలజడీ లేదీ గ్రామానికి. పైవాళ్ల రాకపోకలూ అరుదే అక్కడికి. ప్రపంచంతో సంపర్కం లేకుండా ఆదిమయుగాలనాటి జీవితం గడుపుతున్నారక్కడి ప్రజలు. చేన్ సింగ్ హాన్ అత్తా, మామా అక్కడ నివసిస్తున్నారు. 

అతడి తరవాత అతడి భార్యా, కూతురు సోనా అక్కడికి వచ్చారు. అంతే, కుటుంబంలో మిగిలిన వారి పత్తా తెలియడం లేదు. మర్నాడు బైటకు వెళ్లి తిరిగివచ్చాడు. తన గ్రామం గురించిన దుర్వార్తలు తప్ప మరేమీ తెలియరాలేదు. మూడోనాడు తన తమ్ముడికి నోటికబురు పంపాడు. స్వగ్రామానికి వెళ్లవచ్చుననే కబురు నాల్గోనాడు తెలిసింది. ఐదోనాడు ఒక మంచి కబురుతో తిరిగివచ్చాడు. గొరిల్లాలు ఉయిలో గ్రామం తిరిగి దఖలు పరచుకొన్నారు. ప్రజలు తిరిగి ఇళ్లు చేరుకుంటున్నారు. పరిస్థితి చూచిపోవాలని అతడూ బయలుదేరి వచ్చాడు. భయంతో, తన వారి దుస్థితి ఏమై ఉంటుందో అన్న వ్యాకులంతో బయల్దేరాడు. ప్రతీ అణువూ కంపిస్తూ ఉండగా నడిచివచ్చాడతడు. అయితే ఇపుడు కొంచెం శాంతి కలిగింది. తన కుటుంబానికి ప్రమాదం కలిగినట్లు ఏ విధమైన వార్తా వినలే దింతవరకూ. ఇంతా చేసి క్షేమంగానే ఉండవచ్చు చివరికి. కాని శవం పాతినవాళ్లు చెప్పడం మరచిపోయారు. ఈ ఉదయమే అతడి కుమారుణ్ణి పాతిపెట్టిన సంగతి. పేరు తుంగ్ కుయా, అతడికి ఒకే కొడుకు.

ఎడిటర్

జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

Page 1 of 3
123Next
Previous Post

సంపాదకీయం : స్వార్థ ప్రయత్నం!

Next Post

ఇంగ్లీషు కథ : దొంగ

Next Post
ఇంగ్లీషు కథ : దొంగ

ఇంగ్లీషు కథ : దొంగ

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com