• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

చైనా కథ : అమ్మ

ఎడిటర్ by ఎడిటర్
July 1, 2025
in అనువాద కథలు
0
చైనా కథ : అమ్మ

-2-

‘‘పద నేనూ వస్తా’’

తల్లి అసమ్మతిని లక్ష్యపెట్టలేదు సోనా. నడుంకి బెల్టు మరింత బిగిస్తూ పినతండ్రి చేస్ సోహాన్ దిక్కు గబగబా నడిచింది. చేన్ సింగ్ హాన్ తమ్ముడు చేన్ సోహాన్, తండ్రి సాహసం, గాంభీర్యం అలవడ్డాయి అతడికి. అతడి కనుబొమలు ముడివడి, పెదవితో పెదవి బిగిసినప్పుడు అతని సోదరులు పరస్పరం చూసుకుంటూ వెనక్కు తగ్గిపోతారు. చిన్న పిల్లలను ముద్దుచేసి మించబెట్టేస్తున్నాడని ఇంటి ఆడవాళ్లు గొణుగుతూ ఉంటారు.

‘‘వొద్దు, పైకి వెళ్లొద్దు. ఇంట్లోనేఉండు. కనపడలేదూ, మంచు ఎలా కురుస్తోందో.’’

దూది వేసి పల్చని గుడ్డతో కుట్టిన సోనా దుస్తుల మీద చేతితో తట్టుతూ అన్నాడతడు.

‘‘ఉహూఁ, వెళ్తాను. ఇంట్లో ఉండను.’’

శరీరాన్ని ఒక మెలికలా చేసి, మొఖం ఇంతచేసుకుంటూ అంది సోనా.

తల్లినీ, పినతల్లినీ ఓసారి చూచి పినతండ్రి దిక్కు ఆశతో, ఉత్సాహంతో చూసింది.

‘‘చిన్న పిల్లకదా!’’ అన్నట్టు పినతండ్రి నవ్వాడు.

‘‘ఇంత అల్లకల్లోలంగా ఉంటే నువ్వు పైకి వెళతావటే ఏపుకి వచ్చిన పిల్లవు, సిగ్గయినా వెయ్యటం లేదూ!’’ తల్లి తిట్లూ శాపానాకారాలూ ఆరంభించింది. తల్లి ఈ మధ్య ఏదో ఏదోలా ఐయిపోయి ఉంది. ‘‘తల్లి దగ్గర ఇంట్లోనే ఉండు’’ అంటూనే సోనా దిక్కు చూడకుండా బైటికి వెళ్లిపోయాడు చేన్ సింగ్ హాన్.

‘‘వెళ్లు, పొయ్యిలో నిప్పు వెయ్యి కొంచెం నీళ్లు అధికంగా పెట్టు. నానమ్మనూ, చెల్లెల్నీ నాన్న వెదికి తెస్తాడులే. ఇంకేమిటి చూస్తున్నావ్!’’

సోనా జవాబు చెప్పలేదు. తలకు చేతి రుమాలు చుట్టుకుంటూ ద్వారం దిక్కు నడిచింది.

‘‘ఎక్కడికి పోతున్నావ్?’’ కోపంతో గర్జించింది తల్లి.

‘‘బొగ్గులు తేవడానికి. అదీ వీల్లేదా ఏవిటి?’’ తల్లి చెప్పినంత గట్టిగానూ జవాబు చెప్పింది సోనా.

పినతండ్రి మళ్లీ నవ్వాడు. అయితే ధుమధుమ లాడుతూ ఉన్న మొఖంతో ఇంటి నాలుగు మూలలకూ చూపులు విసిరి బైటికి వెళ్లిపోయాడు. 

చెన్ సింగ్ హాన్ భార్య మంచం మీద కాళ్లు చాచుకొని కూర్చుంది. గుండెల్లో కుమిలిపోతూ ఉంది దుఃఖం. శూన్యంగా దిక్కులు చూస్తూ ఉంది. తన దుఃఖమూ, క్రోధమూ ఎవరి మీదన్నా వర్షించడానికి అవకాశం కోసం వెదకుతూ ఉన్నట్టుగా ఉంది. అంతలో ఆమెకొకటి తట్టింది. తన ఊహ సక్రమమైందే అని కూడా తోస్తున్నది. దుస్సహమైన కోపంతో ఆమె శరీరం అంతా వణకడం ఆరంభించింది. కరచి, కర్రలతో బాది, ఒక భయంకరమైన కలహరంగం సృష్టించాలి అనే ఆవేశం ఎలాగో ఆపుకుంటూ మెల్లమెల్లగా శాంతమైన గొంతుకతో చెన్ సోహాన్ భార్యను అడిగింది తుపాను ముందు వెనక్కు తగ్గిన సముద్రంలా.

‘‘అయితే, అత్తగారితో రూపా, తుంగ్ కుయీలు ఉన్నట్టు అవాళ చూశానన్నావు కదూ!’’

మంచం మరోప్రక్క కుర్రాణ్ణి ఒళ్లో పెట్టుకు కూర్చుని ఉంది సోహాన్ భార్య. అమాయకంగానే జవాబు చెప్పింది. గడచిన రెండు దినాలనుండీ సింగ్ హాన్ భార్యతో మాట్లాడడం అంటే ప్రాణసంకటమైపోయి ఉందామెకు. 

‘అవును, వెళుతూ ఉండగా చూశాను.’

‘సోనాతండ్రిని ఎక్కడ కలుసుకున్నావు?’

‘దారిలోనే’

‘ఉహూఁ!…’

కొంతసేపు ఎవ్వరూ మాటాడలేదు. తిరిగి ఆమె ప్రశ్నించడం మొదలుపెట్టింది. 

‘మీ పినతండ్రిగా రింటికి ఇంతకుముం దెపుడన్నా వెళ్లావా ఇదే వెళ్లడమా?’’

‘‘ఎపుడూ వెళ్లలేదు. మాతో ఇంకా కొందరున్నారు. వాళ్లతో ఎలాగో ఓలాగ అక్కడికి చేరుకోగలిగాను. బావగారు కనపడకపోయి ఉంటే మా దశ…’’ అవాళటి విపత్తు జ్ఞాపకం వచ్చింది ఆమెకు. అతడు కనపడకపోయి ఉంటే ఆమె స్థితి ఏమై ఉండేదో!

‘‘హూఁ! మహదొడ్డ ఏర్పాటన్నమాట! విన్నావూ, ఎంచక్కటి మేళవింపు!- మనం ఒక్క కుటుంబంలోని వాళ్లం, ఇలా మాటదాచి ఏం ప్రయోజనం చెప్పూ! సోనా నాన్న నిన్ను వెంటబెట్టుకు తీసుకువెళ్లారే అనుకో, అందులో తప్పేముంది? ఈ మాట నా దగ్గిర దాచిపెట్టడం ఎందుకూ అంటా?’’

‘‘అక్కా, తెలివి తక్కువగా ఎందుకు మాట్లాడుతావు? మనకు కలిగిన ఈ కష్టానికి తోడు ఈ అశాంతి కూడా ఎందుకూ?’’

‘‘కష్టం! నీకు కలిగిన కష్టమేంటో చెప్పూ! కడుపులో చల్ల కదలని స్థలానికి భద్రంగా దిగబెట్టేవాళ్లున్నారు నీకు. నా కర్మమే కాలిపోయింది! తుంగ్ కుయా! బాబూ! పాడు చావు నీ నుదుటే వ్రాసిపెట్టిందిరా తండ్రీ! నీ తల్లి రాకాసి ఐపోయిందిరా బాబూ! సిగ్గూ, లజ్జా, దయా, దాక్షిణ్యం లేకపోయిందిరా నాయనా!…’’

సోహాన్ భార్య నొచ్చుకునేటట్లు, దూసుకుపోయే మాటల కోసం వెదుకుతూ ఉంది సింగ్ హాన్ భార్య. ఆమెను పోట్లు పొడిచి, కవ్వించి కలహానికి రెచ్చగొట్టాలి. 

అక్క తనతో అసందర్భ ప్రసంగం చేస్తూ ఉందని ఆమెకు తెలిసిపోయింది. ముక్కుపుటా లదరిస్తూ ఏడవడం మొదలుపెట్టింది. ఒడిలో కుర్రాడుకూడ భయపడి ఏడుపు ప్రారంభించాడు.

‘ఏవిటయిందమ్మ?’ బొగ్గులు బుట్టతో వచ్చి నిచ్చెరపోతూ నిలబడింది సోనా.

కూతురు గొంతుక విని తల్లి ఉక్కు రోషం మరింత హెచ్చింది. ఈ ఒక్క కూతురే ఇపుడు మిగిలింది. రెండో కూతురు సోనా కంటే అందమైన పిల్ల. అటి  బంగారం బొమ్మ మరెవ్వరి ఇంట్లోనూ ఉండదని వాళ్లందరి ఊహ. తల్లి ఇష్టం లేని పని ఎప్పుడూ ఆ పిల్ల చేసి ఎరగదు. ఇక కొడుకు తుంగ్ కుయా శవం కూడా ఆమె కళ్లపడలేదు. చిన్ని సమాధి మాత్రం రెండుసార్లు చూసి వచ్చింది. అంతే. తన చిట్టి నాన్న ఎలా మరణించిందీ ఊహించడం తరం కాదామెకు. నక్కలు పీక్కుతున్నట్టు చంపేశారా! పేగులు పీకేసి బంగారు నాన్న  ఒంటినిండా రక్తం కారిపోతూ ఉండగా- ఈ ఊహలతో ఆమె కడుపులోని పేగులు ఎవరో తోడేస్తున్నట్టనిపిస్తుంది.

‘‘ఏడవకమ్మా పిన్నీ! ఏమైందే?’’ అంటూ సోనా కూడా వెక్కి వెక్కి ఏడ్చేసింది.

మంచు కురుస్తూ ఉంది. చీకటి ముంచుకొస్తూ ఉంది. మంచుపొరకు చీకటిపొర. చలిగాలి తీవ్రంగా ఇంటిగోడల కాగితాలను కొట్టేస్తూ ఉంది. సందులు చీల్చుకొంటూ గదుల్లో ప్రవేశిస్తూ ఉంది. ఇంతవరకూ మసకమసకగా ఉన్న గదులు చీకటినిండి నల్లగా ఉన్నాయి. మనుష్యుల ఉద్వేగమూ పెరుగుతూ ఉంది. ఏ మౌతుందో అన్న భయం పోయి, దానిస్థానే తీరని దుఃఖం. ఏడుపు తగ్గిపోయి దెబ్బతిన్న వారి జాలి గొంతుక వినిపిస్తూ ఉంది. 

ఒడిలో కుర్రాడు అలిసిపోయి నిద్రపోయాడు. వాణ్ణి మంచంమీద పడుకోబెట్టి లేచి నిలబడిందామె. మెల్లగా ఇంట్లో పచారు ప్రారంభించింది. ఈవాళ ఏదో ఒకటి సంభవిస్తుందని ఆమె మనస్సు చెపుతూ ఉంది. ఇంట్లో ఎవరో కదులుతూ ఉన్నట్టనిపించి సోనా దుఃఖం మానేసి నిలబడింది. శరీరం దులుపుకుంది. నిప్పు ప్రొయ్యిలో కనకన మండుతూ ఉంది. మంచంమీద కూచొనే చలి కాగవచ్చు. మరుగుతూ ఉన్న నీళ్ల ఆవిరిలో దగ్గరివారి మొగాలు ధూసరితంగా కనిపిస్తున్నాయి. కొంత సేపయాక మళ్లీ ఆరంభించారు వాళ్లు మాటలు. ఈసారి సుముఖంగా, ఆశాపూర్ణమైన మాటలు. ఇద్దరూ- పండుతలతో అమ్మా, బంగారం బొమ్మ రూపా తిరిగి ఇంటికి వచ్చేస్తారని వారి ఆశ.

దూరాన్నీ, దగ్గరా, పొలాల్లోనూ, వీథుల్లోనూ ఉత్తరపు గాలి జోరుగా వీస్తూ ఉంది. నిశ్శబ్దంలో పల్చటి మంచుముక్కలు వర్షంగా పడుతూ ఉన్నాయి. శరీరం గడ్డకట్టించే చలీ, క్రూరమైన చీకటీ భూమిమీద అధికారం చెలాయిస్తూ ఉన్నాయి. కొద్దిపాటి ఇళ్లగోడలూ, ఇంటి కప్పులూ మాత్రం సరిగా నిలబడి ఉన్నాయి. నిరాధారులైన మనుష్యులు కుక్కలవలె నేలమీద మొగాలు ముడుకుల్లో పెట్టుకొని పడిఉన్నారు. ముక్కముక్కలై చెల్లాచెదరైన సామానుల మద్య, కాళ్లల్లో తోకలు ముడుచుకొని తల దాచుకుంటున్నాయి కుక్కలు. కళ్లముందు ఏవైనా నీడలు కనపడినా కూడా అవి మొరగడం లేదిపుడు. కళ్లు మూసుకొని అలసిపోయి పడిఉన్నాయి. చేన్ ఇంటివాళ్లు ఉత్కంఠతో, ఆశతో ఇంచుమించు రాత్రంతా మేలుకొనే గడిపారు. సోనా ఇంటిమధ్య పచారుచేస్తూనే ఉంది; మధ్యమధ్య అడుగుతూనే ఉంది: ‘‘బాబయ్యా! నాన్నమ్మ నిజంగా వస్తుందే అంటావా?’’

‘‘ఉఁహూఁ, ఇవాళ మరిరాదుఁ చలి అమితంగా ఉంది. అమ్మ దొరికినా కూడా నాన్న చలిలో ఈ రాత్రి రానివ్వడు. వెళ్లు ఇక పడుక్కో.’’ మంచాన్ని ఆనుకుని చేన్ సోహాన్ పొగ పీలుస్తున్నాడు.

‘‘నువ్వు పడుక్కోలేదు. మరి నేనూ పడుక్కోను. చూడు, అమ్మ ఎలా కునుకుతూ ఉందో?’’ తరవాత ఊరిలో విశేషాలు అడిగింది సోనా. నాయనమ్మ విషయమూ ఎత్తింది. ఈరాత్రి రాదని ఇద్దరూ అనుకున్నారు. ఇవాళ ఎంత మంచు చలి!

గాలిలో ఏడుపులూ, ఆర్తనాదాలూ వినిపిస్తూ ఉన్నాయి. సోనా భయపడింది. సరిగా వినడం కోసం చేత్తో ఆగమని సైగ చేసింది పినతండ్రికి. ఊపిరికూడా ఆపేసి వినడానికి ప్రయత్నించా డతడూనూ. మంచంమీద కూచొని ఊగుతూ ఉన్న సోనా తల్లి కూడా లేచి కూర్చుంది. కానీ ఏమీ జరగలేదు. చలిలో మసకమసకగా తెల్లవారుఝాము వరకూ వాళ్లలాగే కూర్చున్నారు ఆత్రతతో. తెల్లవారడమంటే సమస్త ఆశలూ మరోదినం వరకూ కూడబెట్టి వుంచడమన్న మాట. కొంత సేపటిలో బైటి మల్లేనే  ఇంటిలోకూడ నిశ్శబ్దం ఘనీభవించింది. ప్రభాతం మలినంగానే కాదు నైరాశ్యంగా కూడా ఉంది. పిట్టలు అరవడం లేదు. కోళ్లు కూయడం లేదు. కుక్కలు మొరగడం లేదు. కూలిన కొంపలూ, విరిగిన గోడలూ అన్నింటినీ మంచు కప్పేసి ఉంది. చెత్తా చెదారం, కంపూ, కుళ్లూ, ఎముకలూ, రోమాలూ, అన్నిటినీ కప్పింది మంచు. ఒక్కొక్క గోడ మీద మాత్రం పెద్ద పెద్ద అక్షరాలు కనిపిస్తూ ఉన్నాయి. ‘చాంగ్ కైసేక్ నశించాలి’, ‘కమ్యూనిష్టులను నాశనం చెయ్యండి’, ‘చైనానుండి జపానువాళ్లను తరిమేయండి’, కన్నీళ్లతో తడిసిన విచారముఖంవలె పాలిపోయి ఉన్నాయి అక్షరాలు.

మంచుతో పాండురమైన నేలమీదినుండి ఊగిపోతూ జోగిపోతూ ఏదో వస్తూ ఉంది. మధ్య మధ్య తూలిపోతూ ఉంది. ముందుకు పడిపోతూ, మళ్లీ లేస్తూ నడుస్తూ ఉంది. అక్కడక్కడ మంచులో పూడ్చుకుపోతూ, కష్టంగా మంచు దులుపుకుంటూ వస్తూఉంది. అది గ్రామానికి మరింత చేరువగా వచ్చింది. ఒక మానవవ్యక్తి అని దా న్నెవరు గుర్తించగలుగుతారు?

దారిప్రక్క ఆ మూర్తి మరోరసారి పడిపోయేసరికి ఒక కుక్క దగ్గిరికి పరిగెత్తింది. కుక్కని తోలడంకోసం ఎలాగో కష్టం మీద నిలబడింది. అలాగే తూలిపోతూ, తూలిపోతూ ఒక పరిచితమైన కొంప దిక్కు బయల్దేరింది. ఏం చెయ్యాలో తోచకుండా కుక్క వెనక్కు తగ్గిపోయింది. ఒక నిశ్చితమైన ఆకారం లేని ఆ వ్యక్తి కేవలం సంకల్పమే శక్తిగా, ఏదో విధంగా చేన్ సింగ్ హాన్ ఇంటి ద్వారం వరకూ వచ్చింది. మరి మిగలలేదు శక్తి. తూలి అక్కడ బోర్లా పడిపోయింది. ఆకలితో రెండు పచ్చని కళ్లు తన దిక్కు చలించకుండా చూస్తున్నాయి. వాటిని తరిమేయడానికి గాని, వాటి ఎదటనుండి తప్పుకోడానికి శక్తిలేనంత దుర్బలంగా ఉందావ్యక్తి. ఒక అస్పష్టమైన మూలుగు మాత్రం వినిపిస్తూ ఉంది. కుటకలవంటి లోతైన శుష్కనేత్రాలు రెండూ వాటంతట అవి మెల్లమెల్లగా మూతలుపడ్డాయి. సరిగా అదే సమయానికి విరిగిన గోడల నుండి మరో కుక్క అరుస్తూ పరుగెత్తుకు వచ్చింది. దాంతో మొదటికుక్క మరింత అరుస్తూ ముందుకు ఉరికింది. లేవని గొంతుకతో ఒక్కసారి ఆర్తనాదం చేస్తూ లేవబోయిందా వ్యక్తి.

‘‘బయట ఏమిటీ గందరగోళం బాబయ్యా!’’

గడబిడలో సోనా కునుకు తేలిపోయింది. ఒక విధమైన భీతి ఆమెను ఆవరించింది.

‘‘కుక్కలు మొరుగుతున్నాయి’’

‘‘ఏమిటీ బాధ! వాటిని తరిమేసి వస్తాను’’

మంచం దిగి ఒక బొగ్గుముక్క పట్టుకుంది సోనా. తలుపు తీసి బైటకు వెళ్లేసరికి మరింత వికారంగా మొరిగాయి కుక్కలు. బొగ్గు ముక్క విసరగానే కొంచెం దూరం పోయాయి; కాని మొరగడం మాత్రం మానలేదు. ‘‘కుక్కల వెంట వెళితేనే గాని ఉండపట్టదు గావోలు!’’ సోనా తల్లి గొణగడం మొదలెట్టింది.

‘‘బాబయ్య! మెట్ల దగ్గర ఏదో పడిఉంది’’

సోనా మరికొంచెం ముందుకు వెళ్లేసరికి కుక్కలు కలబడబోయాయి. వాటిని తరిమివేశాక ఆ వ్యక్తి కళ్లు కొంచెం విడ్డాయి; నోటినుండి అస్పష్టమైన ధ్వని వెలికివచ్చింది.

వెదురుబొంగు చీల్చినట్లు ఒక్క చీత్కారం చేసింది సోనా. కోలాహలం- పరుగులూ- గందరగోళం- కొంతసేపటికి చైతన్యంలేని ఆ వ్యక్తిని దూదివేసి కుట్టిన దుస్తులు తొడిగి, వేడిమంచం మీద పడుక్కోబెట్టారు. మొఖంమీద చెదరిని పిడికెడు జుత్తూ, కుటకలవలె లోతుకుపోయిన కాంతిలేని గాజు కళ్లల్లో జీవంలేని దృష్టీ, తల్లి ఒడిలో తల దాచుకొని ఏడుస్తున్నది సోనా. చిన్ని కుర్రాడు ఓమూల నిశ్శబ్దంగా కూచొని ఉన్నాడు. తనను ఒడిలో పెట్టుకొని ముద్దులాడుతూ ఉండే నాయనమ్మను ఇపుడు పోల్చుకోలేకపోతున్నాడు.

చేన్ సింగ్ హాన్ డాక్టరుకోసం వెళ్లాడు. చేన్ సోహాన్ భార్య వేడి పానీయం త్రాగిస్తున్నది. చెన్ సింగ్ హాన్ భార్య రాగాలు తీసి విడవకుండా ఏడుస్తూ ఉంది. తన కూతురేదీ! ఆపిల్ల కావాలి ఆమెకు. ‘‘అమ్మా! మమ్మల్ని పోలుస్తున్నావూ?’’ పదేపదే ఇదే ప్రశ్న చెన్ సోహాన్ ది. కాని అమ్మ ఏమీ మాటాడలేదు. ఎవర్నీ పోల్చిన గుర్తయినా ఆమె కళ్లల్లో గాని, మొఖంలో గాని, కనిపించడం లేదు. 

వయస్సు మళ్లిన పండు. వికృతమైపోయిన ఆమె మొఖం పరికించి చూచాడు చేన్ సింగ్ హాన్. పొగచూరిన కర్రలా ఉంది మొఖం. కళ్లు రెండూ మాత్రం చేపలవలె తళతళా మెరుస్తున్నాయి. పరికించి పరికించి, తన గుండెల్లో చిరకాలం నుండీ అణగారి ఉంటూన్న క్రోధం అగ్నిశిఖలా మండుతూ లేచింది. ఏ భావాలూ లేకుండా, కదలకుండా ఉన్న అమ్మ మొఖాన్ని చూస్తూ, వణుకుతూ ఉన్న కంఠంతో, ఉద్రేకంతో అన్నాడు-

‘‘అమ్మా, ఇక నువ్వు శాంతంగా వెళిపోవచ్చు. నీ కొడుకులం. ప్రాణాలు అర్పించైనా దీనికి ప్రతీకారం చేసి తీరుతాము. ఇవాళనుండి మా జీవనలక్ష్యం జపాను పశువులను నరకడం. తప్పక ప్రతీకారం చేస్తాము.  ఈ ప్రతీకారం, ప్రతిహింసా నీ కోసం, మన ఈ గ్రామం కోసం, మనజాతికోసం, మన చైనా కోసం. జపాను రక్తం- ఆ  జపాను రక్తంతో మన దేశాన్ని అభిషేకం చేస్తాం, సారవంతం చేస్తాము. జపాను సైతానుల రక్తం మాకు కావాలి. కావాలి.’’

ఈ మాటలు మంత్రాల్లాగ పనిచేశాయి. మంచం మీది నుండి కదుల్తూ లేచింది అమ్మ. పెదవులు అదరడం మొదలుపెట్టాయి. పెదవుల ఆ అదరు మాటలుగా మారడానికి ప్రయత్నించింది. ఒక్కసారి భయవిహ్వలమైన గొంతుకతో చీత్కారం చేసింది- ‘‘జపాన్ సైతానులు’’ తరవాత కోడళ్ల దిక్కూ, మనమరాలి దిక్కూ చూసింది. అంతే మరో మాటకు శక్తి లేదామెకు. గుండు దెబ్బతిన్న బాతు రెక్కలు కొట్టుకుంటూ వేదన పడినట్లు మొఖం చేస్తూ ఏడవడం ఆరంభించింది శిశువులా.

‘‘అమ్మా! అమ్మా!’’ ఇంటి వాతావరణమంతా దుఃఖమయంగా ఉంది. అయినా ఒక ఆశారేఖ ద్యోతక మౌతూనే ఉంది అందులో.

ఎడిటర్

జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

Page 2 of 3
Prev123Next
Previous Post

సంపాదకీయం : స్వార్థ ప్రయత్నం!

Next Post

ఇంగ్లీషు కథ : దొంగ

Next Post
ఇంగ్లీషు కథ : దొంగ

ఇంగ్లీషు కథ : దొంగ

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com