• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

తమిళ నవల : తెల్ల ఏనుగు (అధ్యాయం 1)

కుమార్ ఎస్ by కుమార్ ఎస్
July 2, 2025
in అనువాద కథలు
0
తమిళ నవల : తెల్ల ఏనుగు (అధ్యాయం 1)

అక్కడే చేతులు కళ్ళకడ్డం పెట్టుకుని కొంత సేపు నిల్చున్నాడు. దాని తర్వాత నిదానంగా చేతులు తీసి బలవంతంగా కళ్ళకు కాంతిని కొద్ది కొద్దిగా తనకు చూపందేదాకా అలవాటు చేశాడు. కళ్ళముందు కనపడుతోంది – స్వచ్ఛమైన నీలంలో ఉన్న ఆకాశంతో పాటూ అపార కాంతిపుంజంలా వెలిగిపోతూ ఉరుకులు పరుగులు పెడుతోన్న సముద్రం. ‘చీకటనేదే ఎరగని నేల ఇది’ అంటూ తనలో తను అనుకున్నాడు ఏడెన్.  తెల్లటి పక్షుల గుంపొకటి ఆకాశంలో జారుతూ వెళ్తున్నట్టుగా పక్కనించీ ఎగురుతూ వెళ్ళింది.

నింగిలోన కలిసే నీలపు సముద్రం, 

విశ్వంతరాళాన విలీనానికీ , 

అనుభవించి పదాల బిగించలేనిదీ,  

నాలో నేను దాచుకోలేనిదీ.  

అంటూ ఓ కవిత పెదాల మీది నించి బయటకు పొర్లింది. ‘ఎవరు రాసిన కవిత ఇదీ?’ మళ్ళీ మళ్ళీ అవే పదాలను గుర్తుకు తెచ్చుకున్నాడు.  వెంటనే తర్వాతి వాక్యం పెదాల పైకి వచ్చింది. 

సాగిపో! 

అనంత నిశాంత జలాంబుధీ సాగిపో! 

వేల నౌకలు దండెత్తివచ్చినా 

వాటిదంతా వృధా వ్యధ!

ఇంకేదో కాకుండా సరిగ్గా ఇదే కవిత, తనలోనించి పెల్లుబికి బైటికెలా  వచ్చిందని అబ్బురపడ్డాడు ఏడెన్. ‘వృధా వ్యధ!’ ఇదే పదం పదే పదే  ఓడ అడుగును ఢీకొనే  అలల్లా, పెదాలమీదికొస్తోంది ఏడెన్‌కు. 

‘వృధా వ్యధ!’,  ‘వృధా వ్యధ!’,  ‘వృధా వ్యధ!’  అతను ఆరోజు పొద్దున ఇక భోజనం చెయ్యలేదు. అందుకు బదులుగా కూచుని సముద్రం మీద సూర్యుడి లేత వెలుగు పడి ప్రతిఫలిస్తూంటే చూస్తూ ఉండిపోయాడు. ఆ రోజు సాయంత్రం ఓడ,  కాసాబ్లాంకా రేవును చేరుకుంది. ఊరంతా దుమ్ము పట్టిన గోడలతో ఇసక రంగులో ఉన్న  భవనాలతో నిండుకున్న ఆ పురాతనమైన రేవు పట్టణం, నెమ్మదిగా అతన్ని సమీపించింది.  ఒడ్డున కనపడుతోన్న ఆకాశం ధూళితో చేసినట్టుగా ఉంది.  మాడిపోయిన చేప నూనె వాసనలాంటిది సముద్రంలోంచి వచ్చి ముక్కుపుటాలను తాకుతోంది. ఎక్కణ్ణించో లీలగా మనుషుల గొంతులు, ఒకే శృతిలోని తేనెటీగల ఝంకారంలా గాల్లో తేలి వచ్చి చెవిన పడుతున్నాయి. 

ఓడలో ప్రయాణిస్తున్నవాళ్ళందరూ ఒక్కసారిగా తమ నిద్రాణస్థితి నించి బయటకొచ్చినట్టు ఏడెన్ గమనించాడు. ఉత్సాహం నిండిన గొంతులు అన్ని వైపుల్నించీ వినపడుతున్నాయి. మనుషులు అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్నారు. ఓడ కాసాబ్లాంకాలోనే ఎనిమిది దినాలు లంగరు వేస్తుందని వాళ్ళకు సమాచారం అందింది. పగటి వెలుగులో ఆ నగరం అస్త్యవ్యస్తంగా వింతగా కనిపిస్తోంది; బిగ్గరగా కర్ణకఠోరంగా వినపడుతోన్న నల్లవాళ్ళ కేకలు, అంతా ఏదో కుళ్ళిన వాసన. ఇరుకు సందులూ పొర్లిపారుతున్న మురిక్కాలవలు. వాళ్ళు చేసిన ఆ మొదటి మజిలీ, ప్రయాణీకులనందరినీ మత్తులోకి దించివేసింది. భూమ్మీద తయారయ్యే అన్నిరకాల మత్తు పానీయాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. విచిత్రంగా ఒక స్వప్నావస్థలో మునిగివున్నట్టుగా ఉందా నగరం. 

ఏడెన్ మాత్రం ఆ నగరపు హొయల మీద అస్సలు ఆసక్తి కనపర్చలేదు. సముద్రం కళ్ళెదురుగా ఉండేలా ఒక సత్రంలో గదిని అద్దెకు తీసుకున్నాడు. మంచం మీదున్న మురికి దుప్పట్లు విదిలిస్తే ధూళి కణాలు విరుచుకు పడ్డాయి. రాగి నాణాలంత నల్లులు గోడల్లోని పగుళ్ళల్లోంచి పరిగెత్తి వచ్చాయి. కిటికీ గట్ల మీద స్థిరపడ్డ పావురాలు గొంతులెత్తి కూతలు పెట్టడం మానలేదు. ఆవు పాలు పితికినప్పుడో, గుర్రబ్బండి పగ్గాలు నగిషీ పెట్టినప్పుడో, వండ్రంగి పని జరుగుతున్నప్పుడో వచ్చే శబ్దంలా ఉన్నాయి వాటి అరుపులు. అక్కడ కింద రాళ్ళు పరిచిన కాలి బాటంతా పావురాల రెట్టలతో నిండివుంది. ప్రయాణిస్తున్న బండి చక్రాల కాలి గిట్టల, ఝళిపిస్తున్న కొరడా శబ్దాల ప్రతిధ్వని  రోడ్డున్న వైపునించి వచ్చి చెవిన పడుతోంది.  అక్కడున్న ఒకానొక రోజుల్లో అతనికెందుకో అనిపించింది – ‘ఆ సూర్యకాంతిని నింపుకున్న సముద్రంతో బంధం తెంచుకుని ఎన్నటికీ దూరంగా వెళ్ళలేనని.’   

మెరీనా తీరాన నిలబడి ఏడెన్ అలలనే చూస్తున్నాడు. గాలి వీచిన మరకలు స్పష్టంగా ఇసక తిన్నెల మీద కనపడుతున్నాయి. ఆకాశాన్నించి భూమ్మీదకు దిగి అంతటా పరుచుకున్న తెల్లటి జరీ వస్త్రంలా ఉంది తీరం. క్రమంగా సముద్రం అందించే అద్భుత ఏకాంతాన్ని సౌఖ్యాన్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్నాడు ఏడెన్. ఒక్కసారిగా కొరడా ఝళిపించిన శబ్దం, అస్పష్టంగా ఎవరివో గొంతులు అతని చెవిన పడ్డాయి. వెనక్కి తిరిగి చూస్తే ఆ నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు, పొగమంచులా ఉన్న ఇసక దుమ్ముతో నిండిపోయుంది.  ఉన్నట్టుండి గాలిని చీల్చుకుని  ఒక ఆడమనిషి పెట్టిన కేక వినిపించింది. మళ్ళీ కొరడా దెబ్బల శబ్దం. 

ఏడెన్ గుర్రాన్ని వెనక్కి తిప్పి కొద్ది దూరం ముందుకు వెళ్ళాడు. ఇంతకు ముందు అతను చూసిన ఆ చెట్టు కింద ఏదో జరుగుతోంది. ఇద్దరు మనుషులు నేల మీద పడి ఉంటే ఇంకోడెవడో నిల్చుని కొరడా గాల్లోకి లేపుతున్నాడు. రెండు క్షణాల్లో ఏడెన్ వాళ్ళను చేరుకున్నాడు. ఏడెన్‌ను చూసి, ఆ కొడుతున్న మనిషి కొరడా చుట్టేసి వచ్చి తల వంచి నిల్చున్నాడు. నల్లటి మనిషి. పొడుగైన దృఢమైన శరీరం. తల మీద పెద్ద పాగా, ఒంటి మీద ఖాకీ కోటు. ఇండియన్ల కళ్ళు ఎప్పుడూ అతన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కనుగుడ్లు తెల్లగా ఉండి కళ్ళు ముత్యపు చిప్పల్లా ఎప్పుడు ఊడి పడతాయో అన్నట్టు బయటికి పొడుచుకొచ్చినట్లుంటాయి. 

“ఏం జరుగుతోందిక్కడ?” నేల మీద పడున్న ఇద్దరు మనుషుల మీద చూపును నిలిపి అడిగాడు ఏడెన్. అప్పుడు గమనించాడతను పడున్న ఇద్దరిలో ఒక ఆడ మనిషి ఉందని. నల్లగా కమిలిపోయి బలహీనంగా ఉన్న ఆకారాలు. బుగ్గలు, భుజపుటెముకలు వాచిపోయున్నాయి. భుజాలు సన్నగా అస్థిపంజరాలకున్నట్టున్నాయి. నేల మీద పడున్న మగమనిషి గోచీ పంచె మోకాళ్ళదాకా దించి కట్టున్నాడు. ఆడమనిషి చీర కూడా మట్టిరంగును అలుముకుంది. చీర కొంగు, ఉండీలేనట్టున్న ఆమె రొమ్ములకు గట్టిగా చుట్టివుంది. కొరడా దెబ్బకు ఆమె భుజం మీద తోలు లేచిపోయి రక్తం ధారగా కారుతోంది. అతని మెడ నించి భుజాల్నించి కూడా రక్తం పారుతోంది. కొరడా చేతిలో పట్టుకున్న మనిషి మళ్ళీ కిందికి వంగి ఏదో అన్నాడు. మాట్లాడింది ఇంగ్లీష్‌లో అయినా ‌ ఏడెన్‌కు ఒక్క ముక్క కూడా  అర్థం కాలేదు. 

“నెమ్మదిగా…నెమ్మదిగా మాట్లాడు,” అన్నాడు ఏడెన్. 

“సరేనండి,” తల ఊపాడు కొరడా పట్టుకున్నతను.  “వీళ్ళు ఐస్ హౌసులో పనిచేస్తున్న కూలీలు. పనికి ఎగనామం పెట్టి దాక్కున్నారు.”

కింద పడున్న మనిషి ఏవో కేకలు పెడుతూ ఏడెన్ కాళ్ళను పట్టుకోడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా కొరడా వచ్చి ఆ మనిషి నల్లటి వీపుని సర్రున నాకి ముడుచుకుంది. మెలికలు తిరిగిపోతూ అరుస్తూ అతను నేల మీదకు కూలిపోయాడు. ఆ ఆడమనిషి గట్టిగా అరిచి అతన్ని పట్టుకుంది. 

“ఆపు!” అని ఏడెన్ బిగ్గరగా అరిచాడు. 

కొరడా పట్టుకున్న మనిషి మళ్ళీ తల వంచి, “వాళ్ళు నేరస్థులు, సర్!” అంటూ ప్రకటించాడు. 

“నీ పేరేంటి?” అడిగాడు ఏడెన్. 

“నీల మంగళం సార్, నేను ఐస్ హౌసులో  మేస్త్రీగా పనిచేస్తున్నాను”  అన్నాడతను దూరంగా కనపడుతున్న భవనాన్ని చూపిస్తూ. 

“నీల మంగళం, నీకు వాళ్ళను శిక్షించడానికి అధికారం లేదు, అర్థం అయ్యిందా?”

అతను అయోమయంగా చూశాడు.  ఏడెన్ మళ్ళీ అవే మాటల్ని నెమ్మదిగా ఒక్కో పదాన్నీ పలికాడు. 

నీల మంగళం భయంతో రెండు చేతులూ జోడించాడు. కొరడా అతని ముడుచుకున్న చేతుల మధ్యలో ఉంది.  “వాళ్ళు నేరస్థులు సార్, వాళ్ళు నేరస్థులు” మళ్ళీ అదే వల్లించాడు. 

“అయ్యుండొచ్చు. వాళ్ళను తీసుకెళ్ళి మీ మేనేజర్‌కు అప్పచెప్పు. వాళ్ళకు చట్టప్రకారం ఏ శిక్ష విధించాలో ఆయన నిర్ణయిస్తాడు.”

నీల మంగళం గౌరవ ప్రదంగా మళ్ళీ వంగాడు. 

“వీళ్ళు కార్మికులు. బానిసలు కారు. ఘనత వహించిన బ్రిటిష్ రాణి ప్రజలు.  ఇలా కార్మికులను కొరడా దెబ్బలు కొట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు అనుమతినీయవు, అర్థం అయ్యిందా?”

రెండు కోడి గుడ్లలా ఉన్న అతని కళ్ళు పెద్దవైనాయి. 

“వాళ్ళను కొట్టి నువ్వు నేరం చేసావు. మీ పై అధికారితో మాట్లాడి నీకు సరైన జరిమానా పడేట్టు చూస్తాను.”

మళ్ళీ  కళ్ళు పెద్దవిగా చేసాడతను. 

“వాళ్ళకు చెయ్యి అందించి పైకి లేపు,” ఆజ్ఞాపించాడు. 

నీల మంగళం స్థానిక భాషలో ఏదో కేక పెడితే వాళ్ళిద్దరూ చేతులు జోడించి పైకి లేచి నిలబడడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఆ మగ మనిషి పట్టు తప్పి కింద పడ్డాడు. “వెళ్ళి పట్టుకో,“ ఆజ్ఞాపించాడు ఏడెన్ చేతులు వాళ్ళ వైపు విసురుతూ. నీల మంగళం కదలకుండా అక్కడే నిలబడ్డాడు. ఆ ఆడ మనిషి, కింద పడున్న మనిషి కాలివైపు చూపిస్తూ ఏదో చెప్పింది. ఇంకోసారి అతను నిలబడడానికి ప్రయత్నించాడు. అతని కుడి కాలు స్వాధీనంలో లేదని స్పష్టంగా తెలుస్తోంది. చూడగానే అతని కాలు, ఎండిపోయిన నల్ల చెట్టు మొద్దుతోనో  ఏదో చెక్కతోనో  చేసినట్టుంది అనుకున్నాడు ఏడెన్.  ఆ మనిషి ముందుకు అడుగు వేయడానికి తన కాలును చేత్తో పట్టుకుని నడవాల్సొస్తోంది. 

ఆమె వైపు తిరుగుతూ “ఏమైంది అతనికి?” అనడిగాడు ఏడెన్. 

అతని కాలివైపు చూపించి ఆమె మళ్ళీ ఏదో చెప్పింది. 

“నీల మంగళం, ఏమంటోందామె?” హుంకరించాడు ఏడెన్. 

“వాడు నటిస్తున్నాడు, సర్.”

ఏడెన్‌కు తన రక్తం మరిగినట్టనిపించింది. రోజూ ఎక్కడ చూసినా అతనికి ఇలాంటి మనుషులే తగులుతున్నారు. రక్తపిశాచుల్లా ఆకలి మరిగి ఉన్నవాళ్ళు. అధికార మద పీఠం నించి తలకిందులుగా వేలాడే కారాగారంలో పగలు పూట తిరుగుతూ రాత్రిపూట నగరం అంతా సంచరిస్తూ రక్తాన్ని పీల్చే వాళ్ళు. 

“నీ అభిప్రాయం నేనడగలేదు. ఆమె ఏం అంటోందో అనువదించి నాకు చెప్పమన్నాను.”

“ఐసు దిమ్మె అతని కాలు మొద్దు బారేలా చేసిందంటోంది సార్.”

“ఓహో!”అన్నాడు ఏడెన్. “అయితే సరే, మీ మేనేజర్‌తో నేను మాట్లాడతాను. అతన్ని లేపి మీ కంపెనీకి తీసుకెళ్ళు. కావాల్సిన సహాయం అంతా అతనికి అందేలా చూడు” అని చెప్పి ఏడెన్ ఆ నల్లటి మనిషి వైపు వంగి అన్నాడు,  “కంపెనీ, గో మెడిసిన్ – మాందూ మాందూ దేర్!”

లోపల ఏమనుకున్నాడో ఏమో, అతని కళ్ళని మాత్రం నీళ్ళు తడిపాయి. చేతులు జోడించాడు. మళ్ళీ లేచే ప్రయత్నం చేస్తే ఆమె ఊతంగా అతని భుజం పట్టుకుంది. అదే పరిస్థితి, అతను బాధతో కేకపెడుతూ కింద పడ్డాడు. 

“అతనికి చెయ్యందివ్వు!” ఏడెన్ నీల మంగళం వైపు చూసి అరిచాడు. 

“వాడు నడవగలడు, సార్,” అనొచ్చింది సమాధానం. 

నీల మంగళం ప్రతిఘటన చూస్తూంటే స్ఫురించింది ఏడెన్‌కు, చేప కొవ్వులోనించి  పొడుచుకొచ్చే బొమికలా, తమ స్వప్రయోజనాలు దెబ్బతింటాయేమో అన్న అనుమానం వచ్చినప్పుడల్లా చెక్కుచెదరని విధేయత ముసుగులో ఈ దేశపు నల్ల ఉద్యోగులు ప్రదర్శించే మొండితనం. 

“నే చెప్పింది చెయ్! లేపి నిలబెట్టు,” ఏడెన్ పదునైన స్వరంతో చెప్పాడు. నీల మంగళం ఏమీ సమాధానం ఇవ్వకుండా ఒళ్ళు, పళ్ళు  బిగపట్టి నేల వైపు చూస్తూ అలానే నిల్చున్నాడు. 

ఏడెన్‌కు ఏం జరుగుతోందో అర్థం అయ్యింది. ఇక్కడి వాళ్ళు చాలామంది ఒకర్నొకరు తాకడానికి ఇష్టపడరు. కింది కులం వాళ్ళను తాకితే మైల పడిపోతామని భావిస్తారు. ఒక్కోసారి స్నానం చేసినా కూడా ఆ మైల వదలదు అనుకుంటారు. ఆవు పేడ నీళ్ళల్లో కలిపి తాగుతారు. గుళ్ళకు వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. కొన్ని కులాల వాళ్ళైతే ఏకంగా వాళ్ళ చేతులు మండే మంటలో పెట్టి కాల్చుకోడమే పరిష్కారం, అని భావిస్తారు. 

“మూర్ఖుడా!“ అన్నాడు పరమ చిరాగ్గా ఏడెన్. “అతన్ని లేపు, ఇది నా ఆజ్ఞ!” ఏడెన్ మొహం పూర్తిగా ఎర్రబడింది. శ్వాస వేగం పెరిగింది. 

“క్షమించండి, నేనాపని చేయలేను”  అన్నాడు నీల మంగళం. 

“చెప్పింది చేస్తావా, చెయ్యవా?” ఏడెన్ తన గొంతు కంపిస్తూంటే బెల్టు తీస్తూ అడిగాడు. 

“క్షమించండి,” మళ్ళీ అదే మాట నీల మంగళం నోట్లోంచి. అతని నోట్లోంచి మాటలు వస్తున్నట్టు లేదు. అతని జీవాన్ని కోల్పోయిన కళ్ళు,  రెండు లోహపు గోళీల్లా ఉన్నాయి.  

“మూర్ఖుడా!” అని కేక పెడుతూ బఱ్ఱె చెర్మంతో చేసిన బెల్టు గాల్లో ఝళిపించాడు ఏడెన్. బెల్టు చివర్లు అతని మొహాన్ని రాసుకుంటూ వెళ్ళాయి. 

నీల మంగళం ఎక్కడివాడక్కడే కదలకుండా నిలబడ్డాడు. ఏడెన్ బెల్టు కిందికి దించాడు. “నిన్ను తీసుకెళ్ళి జైల్లో పారేస్తాను,”  అన్నాడు ఆయాసపడుతూ. “నువ్వు మళ్ళీ బయటి గాలి పీల్చడానికి కనీసం ఆరు నెల్లు పడుతుంది.” నీల మంగళంలో చలనం లేదు. అతని శరీరం, బిగించిన పిడికిలిలా ఏడెన్‌కు ఎదురు నిల్చింది. 

కొన్ని క్షణాలు  ఉద్విగ్నంగా స్థబ్దుగా నడిచాయి. నేల మీదున్న ఇద్దరూ అదిరిపడుతోన్న కళ్ళతోటి, చలనం లేని శరీరాల తోటి అలానే చూస్తున్నారు. నీల మంగళం,  శరీరం గడ్డ కట్టుకుపోయినవాడిలా చేష్టలుడిగిపోయి రాతి బొమ్మలా నిల్చునివున్నాడు. అతన్ని తాకితే తన చేయి చల్లబడిపోయి స్పర్శ కోల్పోతుందేమో అనిపించింది ఏడెన్‌కు. ఏడెన్ శరీరం మొత్తాన్నీ వణుకు ఆవరించింది. కాళ్ళు వాటికంతటవే బరువెక్కుతున్నాయి. టోపీ తల మీంచి తీసి జుట్టు వెనక్కి తోసుకుని “జీసస్!”అన్నాడు. తన రుమాలుతో గట్టిగా మొహాన్ని అదిమి తుడుచుకున్నాడు. 

“సరే, ఇక నీ సంగతి నేను చూసుకుంటాను” అంటూ తన బూట్లతో గుర్రాన్ని పక్కలో నొక్కాడు. ఒక్క ఉదుటున గుర్రం ముందుకు దూకి గిట్టల్తో చప్పుడు చేస్తూ ఆ నల్ల నాప బండలు పరిచిన దారిలో వేగాన్ని పుంజుకుంది.  

(ఆగస్టు నెలలో : ‘తెల్లఏనుగు’ నవల రెండో భాగం)

కుమార్ ఎస్
కుమార్ ఎస్

వృత్తి రీత్యా మెకానికల్ ఇంజనీర్. తెలుగు ఆంగ్ల కథా సాహిత్యం పై ప్రత్యేకమైన ఆసక్తి. హర్షణీయం పాడ్కాస్ట్ నిర్వాహకుల్లో ఒకరు.

హర్షణీయం పాడ్కాస్ట్ లింక్ – https://bit.ly/harshspot

Page 3 of 3
Prev123
Previous Post

పూలతావుల కథాపరిమళాలు

Next Post

కువైట్ కథ : బొమ్మల దుకాణం

Next Post
కువైట్ కథ : బొమ్మల దుకాణం

కువైట్ కథ : బొమ్మల దుకాణం

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com