• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

తమిళ కవిత: అమ్ము +2

జిల్లేళ్ల బాలాజీ by జిల్లేళ్ల బాలాజీ
July 1, 2025
in అనువాద కవితలు
0
తమిళ కవిత: అమ్ము +2

తమిళ మూలం : శీను రామసామి

అంతర్జాతీయ పురస్కార సినీ దర్శకులు, కవి.

అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత

 

అమ్ము

 

ఏ సమయంలోనైనా నన్ను వదిలించుకోవాలనే 

ఒక విధమైన 

మానసిక దౌర్భల్యంలోనే 

నన్ను అంటిపెట్టుకోవటంలో 

అలా నీకు ఏం లభిస్తుంది

అమ్మూ?…

 

నువ్వు ఎత్తుకుని తిరిగేంతగా 

ఒక పెంపుడు జంతువుగానే

నన్ను మార్చేశావు…

 

నీ ప్రేమ రహదారిలో 

బలహీనత ఆవహించిన నాకు 

అది తప్పుగా అనిపించటం లేదు. 

అయినా

ఎప్పుడైనా సరే 

నన్ను బయటికి పంపించేలాగానే ఉన్నాయి

 

నీ ఎగిరే

ప్రతి పైటచెంగు చూపులూ…

 

అలా చెయ్యకు, 

ముడుచుకునే 

రాత్రి గురించిన అయోమయాలు 

భయంకరమైనవి.

 

నువ్వు వదిలించుకోకుండా ఉండేందుకు 

ఏం చెయ్యాలో చెబితే 

దాన్ని నిర్మొహమాటంగా 

చెయ్యటానికి సాహసిస్తాను.

 

ఈ వసంత కాలంలో 

ఓ కవిత రాసి 

నీకు సమర్పించనా?

 

స్వేచ్ఛగా కవిత్వం రాసే నాకు 

బానిస సంకెళ్లు తొడగటం 

న్యాయమేనా అమ్మూ…

 

ఈ ఆదుర్దా అనవసరం 

దీని తత్త్వాన్ని వివరించటం 

నా బాధ్యత.

 

చాలాకాలంగా 

ఆడవాళ్లకు 

మగవాళ్లు 

ఇలానే చేస్తూ… 

వృద్ధాప్యంలో 

ప్రేమను కురిపించటానికి మనిషిలేక 

నలిగిపోయారు.

 

అంతే 

నేను చెప్పగలిగేది.

 

మనోవీణ

 

ఆమో

ఇవ్వనూ లేదు 

అతను 

తీసుకోనూ లేదు 

ఎందుకంటే 

మధ్యన ఒక పిచ్చిపువ్వు 

వికసించకుండా ఉంది. 

అందుకు 

మానవజాతి చరిత్ర 

కారణమై ఉంది 

ఏం చెయ్యను?

 

పువ్వు 

కంటికి 

కనిపించలేదు.

 

అయితే 

ఇద్దరూ గ్రహించేలా 

ఒక చోటున ఉంది

అది వికసించాలని 

కోరుకుంటోంది

 

అది ప్రకృతి 

స్వాభావికమైన పద్ధతే.

 

స్త్రీ పురుషుల విలువలతో సమాజం 

అది కవచ చెరశాలలో 

తాళం వెయ్యబడింది.

 

అర్పించే ఆమె, స్వీకరించే అతను 

అధిగమించి 

ఇద్దరూ అందుకోవటానికి 

తయారైతే 

తాళం 

జైలు ఊచలూ 

కరిగిపోతాయి.

 

తర్వాత 

వికశించటమూ 

తుఫానులో అది కొట్టుకుపోవటమూ 

పుష్పం తానుగా రాలి 

గాలిలో తేలిపోతున్నట్టుగా 

మేఘాలు పలచబడతాయి

ఒక్క క్షణంలో… 

వాళ్లను 

తమ యవ్వన గుర్తులను 

మర్చిపోయి 

ఈ వసంతకాలానికి 

మంచి చెయ్యండి అన్నాను.

కిటికీని తెరువు

 

నీకంటూ 

లేత వంగపువ్వు కూడానా 

పుష్పించకుండా పోతుంది?

 

నీకంటూ 

నేలబావిలో

ఒక చుక్కనీరు

ఊరకుండానా పోతుంది?

 

నీకంటూ 

ఒక యువకుడు

నీకు నచ్చిన పాటను 

పాడటానికి రాకుండా ఉంటాడా?

 

నీకంటూ

ఈ చదరంగ జీవితంలో

ఒక సిపాయి

తోడు రాకుండానా పోతాడు?

 

నీకంటూ

కులుకు చీటీలో

ఒక స్పూనయినా

బహుమతిగా రాకుండానా పోతుంది?

 

నీకంటూ

అరిచెయ్యి ఎర్రబడేందుకు

గోరింటాకును

 

కాలం నూరకుండానా వదిలిపెడుతుంది?

నీకోసం

దారి లేకుంటేనేం కూతురా

నువ్వు నడిస్తే

నీ పాదాలు

ఓ కాలిబాటను రూపొందించవా?

 

నీ తండ్రి

తల్లికి

నిన్ను ఇష్టపడే

కోడి, లేగదూడకూ

తిండి సహించనంతగా

ఈ తాడుతో బిగించుకుని

కాలమంతా

ఊపిరాడకుండా చేస్తున్న పాపా

 

నీకు విముక్తి

వాళ్లకు చెరశాల

 

తాడును

మెడ నుండి తీసి

మెల్లగా దించి

మంచంపై పడుకోబెట్టి

 

ఈసారి తూర్పుగాలి

వీచనున్నది

నీ తల పైనుండే

ఫ్యాను రెక్కలు

 

నువ్వు తుడవనున్న

పరాయి కన్నీటికి

నీ చేతుల్ని

బ్రతకనివ్వు పాపా

 

కిటికీని

ఓసారి తెరిచి చూడూ

 

నీ ప్రేమకోసం 

నిన్ను వెతికే గాలి 

నీలో నిండిపోతుంది…

జిల్లేళ్ల బాలాజీ

1961 మే 1 న తిరుత్తణిలో జన్మించారు. ఎస్వీ విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో ఎంఏ చేశారు. 1983 రచనలు చేస్తున్న ఆయన 161కి పైగా కథలూ, 123 పైగా కవితలూ రాశారు. ఏడు కథాసంపుటాలు, ఒక కవిత్వ సంపుటి, ఒక నవల వెలువరించారు. వీరి సాహిత్య కృషికి పలు పురస్కారాలు లభించాయి. తమిళం నుంచి తెలుగులోకి అనువాదాలు చేస్తుంటారు. తమిళం నుండి 130 కి పైగా కథలు, 11 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం అనువదించారు. అనువాదంలో చేసిన కృషికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు మరిన్ని అవార్డులు లభించాయి.

Previous Post

హృదయ వేదనావీచికలు – అర్విందర్ కౌర్

Next Post

రష్యన్ కథ: ప్రపంచానికి కనిపించని కన్నీళ్ళు

Next Post
రష్యన్ కథ: ప్రపంచానికి కనిపించని కన్నీళ్ళు

రష్యన్ కథ: ప్రపంచానికి కనిపించని కన్నీళ్ళు

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com