• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కాలమే కవిత్వం

అల్లూరి గౌరీలక్ష్మి by అల్లూరి గౌరీలక్ష్మి
July 1, 2025
in వ్యాసాలు
0
కాలమే కవిత్వం

..అల్లూరి గౌరీలక్ష్మి 

మారుతున్న సామాజిక పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుగు కవితలో ప్రతిబింబిస్తూ వచ్చాయి. మనం గమనిస్తే, కాలంలో వచ్చే మార్పులు కవిత్వంలో ప్రతిఫలిస్తూ ఉండడం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ”రసాత్మక వాక్యమే కావ్యం” అన్నారు. “రమణీయ శబ్దమే కావ్యం” అన్నారు. ఒకోసారి చిన్న కవిత కూడా ఎంతో పెద్ద భావాన్ని వ్యక్తీకరించగలదు. పఠితల మనసును సూటిగా తాకగలదు.

తెలుగు కవిత మారుతున్న సామాజిక పరిస్థితుల్ని చక్కగా అర్ధం చేసుకుని, తదనుగుణంగా తన రూపాన్ని మార్చుకుని  పాఠకులను చేరుతోంది. సమాజంలో ఆయాకాలపు అవసరాలను బట్టి, సందర్భాన్ని అనుసరించి కవిత్వం వస్తోంది.

బాల్య వివాహాల కాలంలో గురజాడ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ వంటివి వచ్చాయి. కన్యాశుల్కం కాలంలో ఆ దురాచారంపై కవితలొచ్చాయి. అలాగే వరకట్నపు రోజుల్లో, దాని కోరల్లో చిక్కి ఎంతమంది యువతుల జీవితాలు ప్రాణాంతక పరిస్థితుల్ని ఎదుర్కొన్నాయో చూసాము. ఆ సమయంలో ఆ దురాచారాన్ని ఖండిస్తూ వచ్చిన సినిమాలతో పాటు కవిత్వం కూడా చాలా వచ్చింది.

ఆ తర్వాత ఎనభై దశకం నుంచి మహిళా సాధికారత గురించిన కవిత్వం ఉధృతంగా వచ్చింది.  అప్పుడు మహిళా సాధికారత గురించి రాసిన వారికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. సాధికారత దిశగా మహిళ అడుగులు వెయ్యడం మొదలు పెట్టి, ప్రస్తుత కాలానికి కొంత వరకూ ముందుకు నడిచిందని చెప్పవచ్చు. పూర్తి సాధికారతకి చాలా దూరంలో కూడా ఉన్న మాట కూడా వాస్తవమే! మహిళలు విద్యాధికులవుతున్నట్టు కనబడుతున్న నేటి తరుణంలోనూ, కొన్ని తరగతుల, వర్గాల బాలికలు ఇప్పటికీ ప్రాధమిక విద్యకి కూడా నోచుకోలేక పోతున్న కఠిన వాస్తవాలున్నాయి. మన దేశ జనాభాలో సగం ఉన్న స్త్రీలకు, మూడింట ఒక వంతు చట్టసభల్లో సీట్లు ఖచ్చితంగా అమలు పరచవలసి ఉన్నమహిళా బిల్ మూడు  దశాబ్దాల తర్వాత 2023లో లోక్ సభలో ఆమోదానికి నోచుకుంది. అయినప్పటికీ 2024 సార్వత్రిక ఎన్నికలలో 33 % రిజర్వేషన్ అమలులోకి రాలేదు. అందుకు మరికొన్ని అడ్డంకులు ఉన్నాయి. అవి తొలగితే తప్ప, ఈ మూడోవంతు రిజర్వేషన్ స్త్రీలకి వర్తించదు.ఒక విధంగా ఇది కొంతవరకూ స్త్రీ వాద కవిత్వ  విజయం అనుకోవచ్చు.

అలాగే పీడిత తాడిత జనావళి కోసం దళిత కవిత్వం, బహుజన కవిత్వం వచ్చింది. తమ సాధక బాధకాలను, కవులుగా కొందరు స్వయంగా చెప్పుకున్నారు. ఆ విధంగా ప్రజా బాహుళ్యానికి వారి సమస్యల పట్ల అవగాహన ఏర్పడింది. నేడు ఆ తరగతి విద్యార్థులకు ప్రభుత్వసహాయం గతంలోకంటే కాస్త మెరుగ్గా అందుతున్నందువల్ల, కొంతవరకూ వారు ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నారు. ఇంకా ఎంతోమందికి ఆ సహాయం అందవలసి ఉంది. రాజకీయరంగంలో వారికి ఇప్పుడు ప్రోత్సాహం లభిస్తోంది. అవకాశాలివ్వడం జరుగుతోంది. ఇంకా చాలావరకూ ఇవ్వవలసి ఉంది. 

-2-

కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా మానవాళి జీవితాలను అతలాకుతలం చేసినపుడు కోవిడ్ మీద పుంఖానుపుంఖాలుగా కవిత్వం వచ్చింది. కరోనా వల్ల ఎందరి జీవితాలో అస్తవ్యస్తం అయ్యాయి. కరోనా బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కవిత్వం వచ్చింది. కొందరు తమ జీవితాల్లోని ముఖ్యులను కోల్పోయారు. అప్పుడు కరోనా వల్ల తమవారిని కోల్పోయిన వారికి ఉపశమనం ఇచ్చే విధంగా వారిలో తిరిగి ధైర్యం నింపే కవిత్వం వచ్చి వారిని ఓదార్చింది.

ప్రస్తుత కాలంలో సన్మానాల, సత్కారాల, అవార్డుల పోటీలో జరుగుతున్న తోపులాట మీద కవితలొస్తున్నాయి. ఉద్యోగాల్లో, ఇతర లాభాల్లో అస్మదీయ తస్మదీయ భావనలూ కవితల్లో ప్రతిబింబిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు విడిపోయే సమయంలో జరిగిన ఉద్యమాల కాలంలో ఎంతో కవిత్వం వచ్చింది. ఉద్యమ నేపధ్యాన్ని గురించి కొందరు, దోపిడీకి గురయ్యామని భావించేవారు కొందరు తమ అభిప్రాయాలను కవిత్వంగా రాసారు. ఈ సందర్భంగా కొందరు నూతన కవుల ఆవిర్భావం కూడా జరిగింది. రాష్ట్రాల విభజన జరిగాక ఆ ఆవేశకావేశాలు సమసిపోయాయి. ఆ తరహా కవిత్వమూ ఆగిపోయింది. సాహిత్యపరంగా రెండు ప్రాంతాలవారూ మిత్రులవలె మెలగుతున్నారు. కలిసి సాహిత్య సేవ చేస్తున్నారు. ప్రాంతీయ భేదాల పరిధి దాటి, కవులకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ  సముచిత గౌరవం దక్కుతోంది. అక్కడక్కడా స్వల్ప భేద భావం ఉన్నప్పటికీ కాలక్రమేణా అది కూడా తొలగిపోవడం చూస్తున్నాం. ఇది ఇప్పుడు   ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనబడుతున్న ఆరోగ్యకర పరిణామం.

అలాగే విద్యావ్యవస్థలోని లోపాలూ, కీచక టీచర్ల ఉదంతాలూ, అధ్యాపకుల క్రూరప్రవర్తనలూ కవిత్వంలో చోటుచేసుకున్నాయి. అవి ప్రజలను జాగృతం చేసి సమస్యను ఎదుర్కొనేలా చేస్తాయి. నిరాశాజనకంగా కనబడుతున్న, నేటి అస్తవ్యస్త రాజకీయ వ్యవస్థ మీద నిత్యం అనేక కవితలు వస్తుంటాయి, అవి ఓటర్లను అప్రమత్తం చేసి, వారి కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. సామాన్య ప్రజల్లో రాజకీయావగాహన  పెంచే అటువంటి కవిత్వం నేటి సమాజపు అత్యవసరం.

ఎప్పుడూ నిత్యనూతనంగా ఉండే వస్తువులు కొన్నిఉంటాయి. అవి-ప్రేమ, ప్రేయసి, విరహమూ, ఎడబాటూ, స్వీయదుఃఖం, వర్గవివక్ష, దోపిడీ, వేదన లాంటివి.

అందరికీ ఆనందాన్నిచ్చే సౌందర్యారాధనా, ప్రకృతి ఆరాధనాకవిత్వం ఎప్పుడూ ముందువరసలో ఉంటుంది. కవి అంటే భావుకతా, ప్రకృతి ఆరాధనా కలగలిసిన మూర్తిమత్వం అన్న భావం అందరిలోనూ ఉంటుంది. ఇవన్నీ కాక కొందరు పలు తరగతుల మానవులమధ్య వైషమ్యాలు తొలగించే సర్వమానవ సౌబ్రాత్రం, తోటివారి పట్ల సేవా భావం విపులీకరిస్తూ సమన్వయ కవిత్వం రాస్తున్నారు. అటువంటి కవిత్వం  ఎల్ల కాలాల్లోనూ ఉండాలి. వాటి అవసరం ఎప్పటికీ ఉంటుంది.

-3-

మనోల్లాసం కొరకు రాసే కవిత్వమూ ఎంతమందినో సేదదీరుస్తుంది. ప్రకృతి రామణీయకతను వర్ణిస్తూ రాసిన కవిత పాఠకుల మనసును రంజింపచేస్తుంది. దైనందిన రొటీన్ జీవితం నుంచి ఒక ఉపశమనాన్ని ఇస్తుంది. చదివేవారికి కూడా జీవితాన్ని పైనుంచి చూసే శక్తినిస్తుంది, ప్రకృతి నుంచి ఉత్తేజాన్ని, సందేశాన్నీ  పొందమని చెబుతుంది.పాఠకులు కవులు కాలేకపోయినా ఆస్వాదనా శక్తి ఉంటే చాలు, కవి భావనా జగత్తులోకి ప్రవేశించిన అందరికీ ఆనందం అందుతుంది.

సమాజంలో సమస్యలు, కాంతి విరజిమ్మినప్పుడు ఉన్నన్ని కోణాలుగా ఉంటాయి.ఆ కోణాలన్నిటినీ పట్టుకుని కవి ఆయా వ్యక్తులపై సానుభూతితో, సహానుభూతి చెంది రాయగలగాలి. ఆ సమస్యలు పూర్తిగా తీరేవరకూ ఆ వస్తువుపై కవితలు వస్తూనే ఉంటాయి.సమస్య చెప్పి పరిష్కారం చెప్పే కవితలు కొన్నైతే, కేవలం సమస్య  ఎత్తి చూపించి పరిష్కారం వెతుక్కోమని  చెప్పేవి  కొన్ని ఉంటాయి.

‘పాతకాలం పద్యం-వర్తమాన కాలం వచనం’అని కుందుర్తిగారన్నట్టు, నేడు రాజాస్థానాల్లో కూర్చుని క్లిష్టపదాలతో యతిప్రాసలతో కూడిన చిక్కని కవిత్వాన్ని ఆస్వాదించే పండితులూ లేరు,రాసేవారూ తక్కువే. సామాన్య జనావళికి అర్ధమయ్యే భాషలో “ ఫ్రీవర్స్” పేరిట వచన కవిత్వంగా, నేటి కవిత్వం ఉండడం జరుగుతోంది. ఉరుకుల పరుగుల నేటి ఆధునిక జీవితాల్లో, వచన కవితలకు ఆదరణ ఎక్కువగా ఉంటోంది.కారణం ఎవరికీ తీరిక సమయం లేదు.రాసేవారికీ, చదివేవారికీ కూడా! కవిత చదవడానికి రెండు మూడు నిమిషాలు చాలు.సులభమైన,వ్యావహారికభాష అవడం వల్ల అందరూ చదవొచ్చు.కవిభావం సులువుగా చదువరిని చేరుతుంది. ఉభయతారకం! కాబట్టి వచన కవితలకు ఇది స్వర్ణయుగమే! వందల పేజీల నవలలూ,కనీసం నాలుగైదు పేజీల కధలూ చదివే ఓపిక లేని రోజులివి. ఆ భావనలని రచయిత కవితలో కూడా చెప్పగలడు. అలాగే చెబుతున్నాడు.

-4-

కవిత్వంలో, మళ్ళీ మరింత సంక్షిప్తతకి పెద్ద పీట వెయ్యడం జరుగుతోంది. అవి – మినీ కవితలు,నానీలూ,రెక్కలు, హైకూలూ వగైరా! అసలు కవి మదిలో అనుకున్నభావాన్ని కాగితంపై పెట్టేసరికి సగం పోతుందట.అది పాఠకుడిని చేరేటప్పటికి మరో కొంత పోతుందట. ఇన్ని అడ్డంకులు దాటుకుని వచన కవిత చదువరిని చేరుతోంది అంటే కవిత్వం ఈ కాలపు అవసరం అని అర్ధం అవుతోంది. ఇక ఆబ్ స్ట్రాక్ట్  (ABSTRACT) పోయెట్రీ అయితే పాఠకుడి ఊహాశక్తిని బట్టి అనేక రకాలుగా ఎవరికి నచ్చినట్టు వారికర్ధమయ్యి వారిని ఉల్లాసపరుస్తుంది. అది రాసేవారూ, ఇష్టపడే వారూ ఉన్నారు.

కొన్ని రగులుతున్న సమస్యలుంటాయి. మనిషి ప్రాధమిక అవసరం అయిన ఆకలి సమస్య ఏనాటి నుండో అలాగే ఉంది. వర్గ సమస్యలూ,పీడనలూ ఉన్నాయి.పీడకులూ, పీడితులూ ఉన్నారు. ఈ  విషయాలపై  కూడా కవితలు బాగా వస్తుంటాయి.

మహిళలకి,సాధికారతపై చాలావరకు అవగాహన పెరిగింది. గతంతో పోలిస్తే మహిళలు ఎక్కువ కష్టపడుతున్నారు.తమ శ్రమ ఇంటివారి కోసమే పరిమితం చేసుకోకుండా సంపాదన వైపు దృష్టిని మళ్లించారు. వారు పని చేసే ఆయా రంగాల్లోని సమస్యలు అనేకమున్నాయి. స్త్రీలు ఇంటా బయటా పని చెయ్యడం వల్ల వారిపై పెనుభారం పడుతోంది. ఆరోగ్యరీత్యా మాత్రమే కాక మానసికంగానూ వారు ఒత్తిడికి లోనవుతున్నారు. స్త్రీలపై హింస పెరిగింది.గృహిణులపై గృహహింస,బైటికి వెళ్లి పనిచేస్తున్న స్త్రీలపై మేల్ డామినేషన్,బాలికలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి.ముక్కుపచ్చలారని చిన్నారులపై కూడా కనికరం లేని సైకోలు పెరుగుతున్నారు. ఈ సమస్యలపై ప్రజలని అప్రమత్తం చేసే కవిత్వం ఇంకా రావాలి.

నేటి సమాజంలో హింస పెరిగింది. అది అన్ని వైపులా విస్తరించింది.మనుషుల్లో క్రూరత్వం మరీ దారుణంగా ఉంది.సున్నితత్వం,మానవత్వం అడుగంటింది.తోటి మానవుడిపై కరుణా,దయా కలిగేటట్లుగా కవిత్వం రావలసి ఉంది.

యువతకి ఉపాధి అవకాశాలు కొత్త కొత్త రంగాల్లో వస్తున్నాయి. అక్కడ కూడా కొత్త చికాకులుంటాయి.వాటిని కూడా అక్కడ పని చేసే యువత కవితల ద్వారా వెల్లడించాలి. అందరూ కలిసికట్టుగా ఉంటే చిక్కుముళ్లను విడదీసుకోవచ్చు. అలా నలుగురికీ అవగాహన కల్పించాలి అంటే కవితలు అన్ని రంగాలనుంచీ రావాలి.అందరూ రాయాలి. ముఖ్యంగా యువత ఇంకా ఎక్కువగా  కవితలు రాయాలి.  అందుకోసం యువకవులు, ముందుగా సీనియర్లు రాసిన కవిత్వం చదవడం మంచిది. అప్పుడు వారికి భావ వ్యక్తీకరణ సులువవుతుంది.

-5-

ఈ ఇంటర్నెట్ యుగంలో ఫేస్-బుక్ లో ఎవరి గోడపై వారు కవితలు రాసుకోవచ్చును.ఇంకా ‘కవిసంగమం’ వంటి కొన్ని పోయెట్రీ గ్రూప్ లు యువతను ప్రోత్సహిస్తున్నాయి. రచనలపై ఆసక్తీ,తృష్ణా ఉన్న యువతీయువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇది శుభపరిణామం! నూతనతరం అవసరాలూ, ఆకాంక్షలూ వారికే తెలుసు, కనుక వారి సమస్యలూ,ఇబ్బందులూ వారే చెప్పాలి. గతంలోలా పత్రికా సంపాదకులు రచనల్ని ‘ప్రచురణకు అర్హం కావు’ అంటూ తిప్పి పంపేసే బాధ ఇప్పుడు లేదు.స్వేచ్ఛగా ఎవరి భావాల్ని వారు వెలిబుచ్చుకోవచ్చు.ఎవరూ ఎడిట్  చేసే ప్రసక్తి లేదు.

దాదాపుగా అన్ని పత్రికలూ ఆన్ లైన్ పత్రికలవుతున్న తరుణంలో ఎవరి కవితనైనా ప్రచురిస్తున్నారు.రచనల వేగం పెరిగింది. ఉరుకుల పరుగుల జీవితంలో సాధన సమయం తగ్గింది. మొత్తానికి యువత కవిత్వం వైపు మొగ్గు చూపెడుతోంది.తమకున్న తక్కువ సమయంలో తమ భావాల్ని ఈ కవితల ద్వారా ప్రకటించడం వల్ల వారికీ గుర్తింపు,ప్రోత్సాహం  లభిస్తున్నాయి. దీనివల్ల కొంత పొల్లు పోయినా కొందరైనా తమ సాధనలో పరిణతి చెంది, సమాజానికి ఉపకరించే మంచి కవిత్వం రాస్తున్నారు.ఇది మేలైన పరిణామం.

కళ కళ కోసం మాత్రమే కాదు.అది ఒక బాధ్యత కూడా! కవి సామాజిక బాధ్యత గుర్తెరగాలి. కవులు ప్రజల తరఫున నిలబడే ఎన్నుకోబడని శాసన కర్తలు కనుక, వారు సంఘంలో ఉన్న సమస్యల  మూలాల్ని  చర్చించి, పాఠకుడిలో ఆలోచన రేకెత్తించి ఒక పౌరునిగా అతని బాధ్యత కూడా గుర్తుచెయ్యాలి.నేటి ఆధునిక జీవితంలో, మనుషులకి ఏం కావాలి? అన్న ఆలోచనతో కవి రాయాలి.

కవిత్వం బాధ్యత వాస్తవ పరిస్థితులకు అద్దం పడితే సరిపోదు.కాగడా పట్టాలి. అందుకోసం కవి దూరదృష్టితో ఉండాలి.భవిష్యత్ దర్శనం చేసి రాయాలి. సమాజానికి హితం చెప్పేవాడుగా నిలబడాలి. కవిత్వం మనుషుల మధ్య పరస్పర సహకారకాంక్ష పెంచేదిగా, ఒకరికొకరు సహానుభూతి,  సానుభూతి అందించేందుకు పాఠకులని సమాయత్తపరిచేట్టుగా ఉండాలి. అప్పుడే ఆ కవిత్వం స్థాయి పెరిగి చదివే వారి స్థాయిని కూడా పెంచుతుంది.

అల్లూరి గౌరీలక్ష్మి

అల్లూరి గౌరీ లక్ష్మి

కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, నాలుగు నవలలూ, మూడు కవిత్వ సంపుటాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు. APIIC Ltd.లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈమె రచనలకు పలు అవార్డులు, పురస్కారాలూ లభించాయి.

Previous Post

ఇరానీ కథ : అగ్ని పర్వతం

Next Post

పూలతావుల కథాపరిమళాలు

Next Post
పూలతావుల కథాపరిమళాలు

పూలతావుల కథాపరిమళాలు

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com