• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

పరిశోధనాత్మక విశ్లేషణం – సినారె కథా కావ్య సమాలోచనం

అరుణ ధూళిపాళ by అరుణ ధూళిపాళ
August 2, 2025
in సమీక్షలు
0
పరిశోధనాత్మక విశ్లేషణం – సినారె కథా కావ్య సమాలోచనం

– ధూళిపాళ అరుణ

సాహిత్య సృజనలో పద్యకావ్యాలలోను, గేయకావ్యాలలోను, విమర్శనాత్మక వివేచనలోను తమకంటూ ప్రత్యేకతను ఆపాదించుకున్న సాహితీ పిపాసి ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు. విమర్శనా పద్ధతిలో ఆయన ఏర్పరచుకున్న విలక్షణమైన విధానం చేకూరి రామారావు గారిచేత ‘భౌమమార్గం’ గా ప్రశంసించబడింది. దీనికే “Down to Earth Approach” అని మరొక అర్థం. సంభాషణాత్మకమైన ఈ శైలి పురాణాల్లో, ప్రాచీన కావ్యాలలో మనకు కనిపిస్తుంది.

అటువంటి విధానంలో భూమయ్యగారు నవ్యత సాధించారు. ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధించినట్టుగా ప్రశ్న, జవాబు రెండూ తానై విద్యార్థికి వచ్చే సందేహాలను ముందుగానే ఊహించి, కావ్యపరిమళాన్ని మొత్తం మెల్లమెల్లగా విద్యార్థి హృదయగతం చేస్తారు. విద్యార్థి స్థాయినెరిగి అదే స్థాయిలో కవిత్వ విశ్లేషణ చేస్తారు. ఇది

భూమయ్యగారికే సొంతం. అనితరసాధ్యం. ఇంతకుముందే ఈ మార్గంలో తొమ్మిది పుస్తకాలు వెలువరించగా ఇటీవలే ‘సి. నారాయణరెడ్డి కథాకావ్య సమాలోచనం’ అనే పేరిట మరొకటి వెలువడింది.
నారాయణరెడ్డి గారి పట్ల భూమయ్య గారికున్న అభిమానం ఎనలేనిది. గతంలోనే ఆయన ‘సినారె వైభవము’ అనే గేయకావ్యాన్ని రాయడమే కాక ‘కర్పూర వసంతరాయలు- కథాకళా ఝంకృతులు’ అనే పేరుతో
భౌమమార్గంలో మరో కావ్యాన్ని రచించారు. అంతటితో సంతృప్తి చెందక సినారె గారి కథాగేయకావ్యాలు నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయడు, ఋతుచక్రం.. ఈ నాలుగు కావ్యాలను ఒకేచోట ఈ ప్రత్యేక విమర్శపద్ధతిలో రాయడం విశేషం.
‘ప్రతిభా నవనవోన్మేష శాలినీ’ అన్నట్లు సంప్రదాయ సాహిత్య బలాన్ని, ప్రాచీన సాహిత్య కథాబలాన్ని ఒడిసి పట్టుకున్న సినారె గారు వాటిని వినూత్నరీతిలో ప్రయోగాత్మకంగా గేయకావ్యాలుగా మలిచారు.

1. నాగార్జున సాగరం:-

ఇక్ష్వాకుల రాజుల కాలం నాటి చారిత్రక కథా కావ్యమైన ‘నాగార్జున సాగరం’ కావ్యాన్ని అయిదు విభాగాలుగా చేసి వాటికి ‘తరంగాలు’ అని పేరు పెట్టి కావ్య నామ సార్ధక్యాన్ని కల్పించారు సినారె గారు. బౌద్ధమత ప్రచారం చేసిన నాగార్జునుని పేరుతో శ్రీ పర్వతం నాగార్జున కొండగా నామాంతరం చెందింది. కొండమీద ఉన్న శిల్పాలను చెక్కినవారిలో పద్మదేవుడు అనే శిల్పి ఈ కావ్య కథానాయకుడు. ఆ శిల్పాలను చూడడానికి వచ్చిన శాంతిశ్రీ బౌద్ధమత విద్యార్థిని మాత్రమే కాక బౌద్ధమతాభిమాని, కళాభిమాని కూడా.
ఆమె సౌందర్యానికి పద్మదేవుడు, అతని కళా నైపుణ్యానికి ఆమె పరస్పరం అనురాగ మనస్కులు అవుతారు. వారి మధ్య అంకురించిన ప్రేమను వర్ణిస్తూ..

“నేలపై కదలు వె/న్నెల నురుంగుల వోలె/ నింగిలో మెదలు వ/ న్నెల సింగిణుల వోలె/ మబ్బు పింజల వోలె / మధు లిహమ్ముల వోలె/ అలల వలె కలల వలె/ కలల వలె కళల వలె / ఎగసి పోయిరి వారు/ తేలి పోయిరి వారు/ తూలిపోయిరి వారు”
ఇక్కడ భూమయ్యగారు సినారె గారి పదచిత్ర మందారాలను, శబ్ద సౌందర్యాన్ని వివరిస్తూ ఆయన కావ్య నిర్మాణ నైపుణ్యాన్ని వివరిస్తారు.
బౌద్ధమత విరుద్ధమైన ఈ విషయాన్ని సంఘం తప్పుపట్టడం, అది తెలిసి ప్రేమకు, మత నియమాలకు

మధ్య శాంతిశ్రీ మానసిక సంఘర్షణకు లోనైన విధానాన్ని అద్భుతంగా వర్ణిస్తారు సినారె గారు. మొదటగా మతం పట్ల విశ్వాసం సన్నగిల్లినా “సుఖం వెంట పడితే మిగిలేది పరితాపమే” అని బౌద్ధమతానుయాయిగా ఆమె మారడం, బౌద్ధమత సంఘం పద్మదేవుని బహిష్కరించడంతో వియోగాత్మక కావ్యంగా ముగుస్తుంది. ఇదంతా బౌద్ధం బాగా ప్రచారంలో ఉన్న సంగతిగా చెబుతూ అక్కడి ఆరామాలను, స్థూపాలను, వాటిలోని శిల్పకళా వైభవాన్ని, బౌద్ధమత సిద్ధాంతాలను సినారెగారు వర్ణించిన తీరును భూమయ్యగారు వివరిస్తారు.

2. కర్పూర వసంత రాయలు:-

కొండవీడును రాజధానిగా చేసుకొని పాలించిన కుమారగిరిరెడ్డి అనే రాజు చారిత్రక గేయకథ ఇది. ప్రతియేటా రాజు వైభవోపేతంగా వసంతోత్సవాలు జరుపుతుండడం, ఆ వెన్నెల రాత్రులలో కర్పూరం వెదజల్లబడుతూ పరిమళాలు అందించడం వల్ల ఆ రాజుకు ‘కర్పూర వసంతరాయలు’ అనే బిరుదు కలిగింది. ఈ కావ్యం అయిదు ఆశ్వాసాలుగా వింగడించబడింది.

వసంతోత్సవాల్లో లకుమ అనే నర్తకి నాట్యాన్ని చూసిన వసంతరాయలు పరవశుడై ఆమెకు ఆకర్షితుడవుతాడు. విరహాంతరంగుడై ఆమెను పిలిపించి రాజనర్తకిగా పట్టం కడతాడు. ఆమెను వెంట తీసుకొని విహారయాత్రకు వెళతాడు. తిరిగి రాజ్యానికి వచ్చిన రాజు కామ కేళీ విలాసాలలో మునిగి, చివరకు రాజ్యక్షేమాన్ని మరచిపోతాడు. ఇంద్రియలోలత్వం ఎంతటివారినైనా అథః పాతాళానికి పడదోస్తుంది కదా!
రాజును మెప్పించడానికి లకుమ నవలాస్య భంగిమలతో నూతనమైన నాట్య ముద్రలు అభినయిస్తుండగా రాజు పరవశిస్తూ వాటిని రాస్తూ ఉంటాడు. అవి భరతుని నాట్యశాస్త్రంలో లేనట్టివి.

“భరతుడు చూపించనట్టి/ భావమ్ములు చూపె లకుమ/ భరతుడు రచియించనట్టి / భంగులు రచియించె రాజు”
అట్లా భరతశాస్త్రంలో లేని విధంగా రాజు నాట్య శాస్త్రాన్ని రచించాడు. అదే ‘వసంతరాజీయం’.అనే నాట్యశాస్త్ర గ్రంథం. దానిని లకుమకు సమర్పించుకుంటాడు. ఇది రాజుకున్న నాట్యశాస్త్ర కళా నైపుణ్యాన్ని తెలుపుతుంది.

ఈ కావ్యంలో రాణి పాత్ర అద్భుతమైనది. ప్రజాక్షేమాన్ని కాంక్షించి ఒక మహారాణిగా తన కర్తవ్య నిర్వహణ దిశగా సాగింది. అందుకోసం ఏదైనా చేయడానికి పూనుకొన్నది. రాజుకు తెలియకుండా లకుమ దగ్గరికి వెళ్తుంది. లకుమ పాదాలకు నమస్కరిస్తుంది. ఇది చదివిన పాఠకుడు ఉద్విగ్నతకు లోనుకాక తప్పదు.
“రాణి మూర్ధము లకుమ చరణా/ గ్రముల యందు వినమ్రమయ్యెను/ లకుమ వెంటనె చకితయై మ/ స్తకము చేతుల లేవనెత్తెను”
నిజానికి లకుమకు కూడా ఇది అనూహ్యం, ఆశ్చర్యమైన విషయం అయినప్పటికీ రాణి వచ్చిన కారణం ఏదైనా నెరవేర్చడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతుంది. రాణి రాజ్యక్షేమం, ప్రజా సంక్షేమం కోసం రాజును విడిచిపెట్టమని లకుమను బతిమాలుతుంది. తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి లకుమ చివరగా రాజుముందు నాట్యం చేస్తూ ఆ అభినయంలోనే పిడిబాకుతో పొడుచుకొని చనిపోతుంది. ఈ రెండు స్త్రీ పాత్రలు ఈ కావ్యంలో ఉదాత్తంగా నిలుస్తాయి.
ఇక్కడ మాత్రా ఛందస్సుల అశ్వ హృదయం తెలిసిన క్రీడాకారునిగా భూమయ్య గారు సినారెను వర్ణిస్తారు. ఆయనలోని కవితా శక్తి, వర్ణనా వైభవంతో కావ్యమంతాఒక రసఝరిలా సాగుతుందని ప్రశంసిస్తారు. అనురాగానికి, రాజ ధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణను అనితరసాధ్యంగా ఈ కావ్యంలో చిత్రించారు సినారె గారు.

3. విశ్వనాథ నాయడు:-

సినారె గారు రచించిన మూడవ చారిత్రక గేయ కథా కావ్యం విశ్వనాథ నాయడు. శ్రీకృష్ణ దేవరాయల దళవాయి నాగమ నాయని పుత్రుడు. కృష్ణ దేవరాయల ఆజ్ఞానుసారం నాగమ నాయడు పాండ్య దేశాన్ని ఆక్రమించుకున్న చోళ రాజు మీద దండెత్తి చోళరాజును విడిపించి పాండ్య దేశానికి తనను రాజుగా ప్రకటించుకుంటాడు. విషయం తెలిసిన రాయలు నాగమ నాయని పట్టి బంధించి తీసుకురమ్మని కోరగా విశ్వనాథ నాయడు ఆ పనికి పూనుకొని

“కన్న తండ్రి యటన్న ఎవ్వడు / కరగి పోవడు? కాని స్వామీ!/ ధర్మదండము బూనినప్పుడు/ తండ్రి యెవ్వడు? తనయు డెవ్వడు?”
అని ధర్మబద్ధుడై సేనతో వెళ్లి యుద్ధం చేసి తండ్రిని ఓడించి బంధించి తీసుకువచ్చి తన దేశభక్తిని ప్రకటించుకుంటాడు. ఈ కావ్యం ఆరు ఖండాలుగా విభజించబడింది.

నిన్ను రాజుగా చేయడం కోసమే ఈ వ్యూహరచన చేశానని చెప్పిన తండ్రితో
“అక్రమముగ గడియించిన/ అమృతమైనను హేయము”
“ఒక్క మాట మరల మరల / నొక్కి చెప్ప సాహసింతు/ స్వామి ద్రోహము చేసిన/ జనకుడైన శిక్షార్హుడు”
అని విశ్వనాథ నాయడు చెప్పడం అతని ధర్మదీక్షా తత్పరతకు, కర్తవ్య నిర్వహణా సామర్థ్యానికి, ప్రభుభక్తికి నిదర్శనం.
“అతని చరిత్రము/ ధర్మ పృతనాధిప కోటీర శ్రేణికి కల్కి పచ్చతురాయిని కైసేసెను” అంటూ విశ్వనాథ నాయని గొప్పతనాన్ని వర్ణిస్తారు సినారె గారు.
కావ్యకన్యకకు వర్ణనలు, అలంకారాలు అందాన్నిస్తాయి. అందుకే సినారె గారు ఈ కావ్యాన్ని సూర్యోదయ కాల వర్ణనతో ప్రారంభించారు. గాన యోగ్యమైన మాత్రా ఛందస్సుతో కావ్యంలో ఎక్కువగా సరళీకృత రచన కొనసాగినా వర్ణనలు ఉన్నచోట కొంత సమాసభూయిష్టంగా ఉందని, విశ్వనాథ నాయని పాత్ర ద్వారా కావ్యాన్ని రసవత్తరంగా తీర్చారని భూమయ్యగారు సినారె గారిని ప్రశంసించారు.

4. ఋతుచక్రం:-

ఈ కావ్యంలో ఆరు ఋతువులను ఆరు ఖండాలుగా విభజించి ఋతువర్ణన చేశారు సినారె గారు.
“చిగురు చిగురున రాగ శీకరము లొలికించి
ఆకు నాకున మరకతాకృతులు పలికించి
పూవు పూవున మధువు పుకిలింత లొనరించి
వచ్చె కుసుమాస్త్ర భాస్వంతము వసంతమ్ము”
అంటూ చేసిన వసంత ఋతు వర్ణనతో కావ్యం ప్రారంభమవుతుంది.
ఇది చదివినప్పుడు…
“ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నును లేత రెమ్మనై అన్న కృష్ణశాస్త్రి పాట తలపుకు వస్తుంది.
వసంత ఋతువులో ఎండిన చెట్లు చిగురించడం, కోకిల రాగాలు వినిపించడం, చిలుకలు వాలడం, తుమ్మెదల ఝంకారాలు వీటిని గురించి చెబుతూ మధ్య మధ్యలో
తన బాల్యంలోని ఆటపాటలను కూడా కవి వర్ణిస్తారు.

“ప్రసవ బాణుని రెప్ప పాటున/ భస్మ సాత్క్రతు చేసి

వైచిన/ నాటి రుద్రుని క్రోధమా య/ న్నట్లు తీండ్రించినది గ్రీష్మము”
అని వేసవి తాపము వల్ల ప్రాణికోటికి కలిగిన బాధలను కవి వర్ణిస్తారు. అక్కడక్కడ ఉత్ప్రేక్ష, ఉపమ, రూపకం లాంటి ఆలంకారిక ప్రయోగాలు కావ్యానికి వన్నెలద్దాయి.

“అవిగో అవిగో మబ్బులు, ఆత్మోరఃస్థిత భాస్వత్/ చంచలాప్రియములు….శితి కంఠ సహోదరములు”
అని నల్లని మబ్బులను నీల మేఘశ్యాముడైన కృష్ణునితోను, గరళకంఠుడైన శివునితో పోలుస్తూ వర్షఋతువును వర్ణిస్తారు.

“పిండి వెన్నెల గందవొడి మెయి/ నిండ నలది వియద్ధునీ
సిక/ తా వితర్దిక పైన సాక్షా/ త్కార మొందెను శారాదేందిర” అని శరత్కాలాన్ని స్త్రీ మూర్తిగా అభివర్ణిస్తారు సినారె గారు.

“నీల నీల నభోంగణమ్మున/ కాలియందెలు ఘల్లుఘల్లన/ ఆణి ముత్తెపు ముగ్గులిడి దర/ హాసములు కురిసెను శరత్సతి” అంటూ శరదృతువును వర్ణిస్తారు.

“మంచు గడ్డపైన చేయి/ నుంచగ ముని వ్రేళ్ళు కొంక/ రలు వోయిన యట్లు; దిన/మ్ములు ముడుచుకుపోయిన పుడు” అని హిమవంతుని ప్రతాపాన్ని అనుభూతి చెందిస్తారు.
“శిశిరమ్ము వచ్చె వచ్చె……. తెరలుగ ధరిత్రిపై తెప్ప దేలినయట్లు” అని శిశిర ఋతువర్ణన చేస్తారు.
ఋతువులతో పాటు కాలగమనంలో మనిషి జీవితయాత్ర కూడా అట్లాగే కొనసాగుతుంది.
“ఋతు చక్రమట్ల జీవితచక్ర మనిశమ్ము భ్రమణ శీలమ్ము” అని కావ్యాన్ని ముగిస్తారు సినారె గారు.

ఆశానిరాశల, వివిధ ఆకాంక్షల, అనుభవసారాల, అనుభూతుల సమ్మిళితాల సంసార చక్రంలో మనిషి భ్రమణం చేస్తూనే ఉంటాడు. ఇదే జీవన సత్యం.
భూమయ్యగారు ఈ కావ్యంలో గేయ ప్రక్రియకు ఉండాల్సిన లక్షణాలు ఎక్కడెక్కడ ఏ విధంగా పాదాలలో ప్రయోగించబడ్డాయో కూడా ఉటంకిస్తూ, సినారెగారి కవితా వైశిష్ట్యాన్ని మనకుప్రత్యక్షానుభూతం చేశారు.
సినారె గారి గేయ కావ్యాలను మొత్తం ఒక్కసారిగా చదవాలన్న కోరికను భూమయ్య గారి పుస్తకం తీరుస్తుంది. సరళమైన పద్ధతిలో కావ్యాలను ఆయన

విపులీకరించిన విధానం అన్ని వర్గాలవారిని ఆనందింప చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. భూమయ్య గారి రచన పాటవాన్ని, ఆయన భౌమ మార్గ
విధానాన్ని ఈ ‘కథా కావ్య సమాలోచనం’ ద్వారా మరోసారి మనం దర్శించవచ్చు.

అరుణ ధూళిపాళ

ధూళిపాళ అరుణ ఎమ్. ఏ తెలుగు చదివి, తెలుగు పండిట్ ట్రైనింగ్ పూర్తి చేశారు.  25 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా, ఉపసన్యాసకురాలిగా వివిధ విద్యాసంస్థల్లో బోధనానుభవం ఉంది., వైస్ ప్రిన్సిపాల్ గా అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతల నిర్వహించారు. వివిధ పత్రికల్లో కవితలు, కథలు, వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. తరుణి, మయూఖ ఆన్ లైన్ పత్రికలకు ఇప్పటివరకు ప్రముఖ సాహితీవేత్తలను, 25 మందిని ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగింది. ‘జ్ఞాపకాల సంతకం’, ‘చేతనాశిల్పం’ కవితా సంపుటులు, ‘మిగిలేవి గురుతులే’ కథా సంపుటి , “ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్యావలోకనం”, ‘మయూఖ ముఖాముఖి’, “మసన చెన్నప్ప సమగ్ర సాహిత్యం” పుస్తకాలు వెలువరించారు. 

Previous Post

కన్నడ కథ : దావానలం

Next Post

టర్కిష్ కథ : మనిషి, కొన్ని సందర్భాలు

Next Post
టర్కిష్ కథ : మనిషి, కొన్ని సందర్భాలు

టర్కిష్ కథ : మనిషి, కొన్ని సందర్భాలు

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com