హిందీ కవి : ద్వారికా ప్రసాద్ మహేశ్వరి (‘వీర్ తుమ్ బఢే చలో ‘)
తెలుగు అనువాదం : ఆకొండి (ముద్దు) వెంకటలక్ష్మి,
వీరుడా! ముందుకు సాగిపో!
ధీరుడా! ముందుకు సాగిపో !
చేతిలో పతాకతో
బాలల దండూ కదలండీ!
పతాక ఎపుడూ తలవంచదు,
బాలసేన ఎపుడూ ఆగిపోదు.
“వీరుడా”
కొండలే ఎదురవనీ,
సింహమే ఎదురుపడనీ,
భయపడకోయీ ఓ సాహసీ
అచటనే నిలిచి పోరాడవోయీ.
“వీరుడా”
మేఘాలు గర్జించనీ,
మేఘాలు వర్షించనీ,
ఉరుములే ఉరమనీ,
మెరుపులే మెరవనీ,
“వీరుడా”
పగలైనా రాత్రైనా
తోడెవరున్నా లేకున్నా
సూర్యుని మించి సాగిపో,
చంద్రుని మించి సాగిపో.
“వీరుడా”
ఒకటే పతాక మనదీ,
ఒకటే శపథం మనదీ,
మాతృభూమి కోసం,
పితృభూమి కోసం,
“వీరుడా”
అన్న, జలాలు సమృద్ధిగా
ఉన్న నేల మనదీ,
శాయశక్తులా శ్రమించవోయీ,
రాగల కాలం నీదేనోయీ.
వీరుడా! సాగిపో!
ధీరుడా! సాగిపో!
.
జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.




Discussion about this post