• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

గుజరాతీ కథ : గొలుసు

పాలెపు బుచ్చిరాజు by పాలెపు బుచ్చిరాజు
September 5, 2025
in అనువాద కథలు
0
గుజరాతీ కథ : గొలుసు

గుజరాతీ మూలం: రఘువీర్ చౌదరి

అనువాదం: పాలెపు బుచ్చిరాజు. 

బస్సు పదిహేను నిముషాలు అక్కడ  ఆగుతుంది. 

ఎదురుగా సీట్లో కూర్చున్న పెద్దమనిషి, ఎవరినీ లెక్కచేయకుండా, క్రిందకు దిగాడు. వాళ్ళపిల్ల మంచికోనీళ్ళకి పేచీ పెడుతోంది. అతని భార్యకూడా భర్త నిర్వాకం తెలిసిందే కాబట్టి, తనకీ మంచినీళ్ళు కావాలని అడిగింది. ఆమెకి తెలుసు. ఆయనకి ఇక్కడి నీళ్ళుతాగడం ఇష్టం ఉండదని. ఇప్పటికే ఒకసారి అడిగి చూసింది. కాని ఆయన “ముప్పావు గంటలో అహమ్మదాబాదు చేరుకుంటాము. ఈ కాస్త టైములో మంచినీళ్ళు తాగకపోతే ప్రాణాలు పోతాయన్న దాఖలాలు ఏమీ లేవు. కాస్త ఆగు” అని గదమాయించాడు. 

పిల్ల కూడా అడగడంతో ఇక తప్పదని, బస్సు దిగి వెళ్లి గుప్పెడు చాక్లెట్లు, పిప్పరమెంట్లు కొని తెచ్చి, భార్య దోసిట్లో పోశాడు. పెద్దవాళ్ళ మాట ఎలా ఉన్నా పాప చాలా సంతోషించింది. ఒకటి తండ్రికి, మరొకటి తల్లికి ఇచ్చి, మిగిలినవన్నీ తన సొంతం చేసుకుంది. తల్లి వాటిని పిల్ల ఫ్రాకు జేబులో నింపబోయింది. అది సగం లోనే నిండి పోయింది. ఇదేమిటా అని తల్లి ఆమె జేబులో చెయ్యిపెట్టి చూసింది. ఆమె చేతికి తగిలిన వస్తువుని చూసి ఆమెకి నవ్వు వచ్చింది. ఆగలేక ఇంట్లో లాగే ఫక్కున గట్టిగా నవ్వేసింది. ఆయనకీ ఆమె నవ్వు ఇష్టమే అయినా, ఇలా బస్సులో, అదీ అసందర్భంగాను, అనవసరంగానూ అనిపించింది. ఇంతలో ఆ తల్లి, పాప జేబులోంచి, సుమారు ఒక  అడుగు పొడవు ఉన్న పెంపుడు జంతువుల్ని కట్టే తుప్పుపట్టిన ఇనుప గొలుసు ఒకటి పైకి తీసింది. ఆయనకైతే పీకల వరకు కోపం వచ్చింది. ఆమె దాన్ని ఎత్తి పట్టుకుని ఆయనవైపు చూపిస్తోంది. పాప దానికోసం చేతులు పైకి పెట్టి, అందుకో బోతోంది. 

“బైటికి విసిరేయ్ ! “ అన్నాడాయన.

“ఏడిచి గొడవ చేస్తుంది.” అందామె. 

అంతటితో ఆ సంభాషణ ఆగిపోయింది. ఇంతలో పాప ఆ గొలుసుని అంది పుచ్చుకుని, దానిని ఎక్కడ దాచాలా? అని స్థలం కోసం వెదక సాగింది. 

 

2

“నీకెవరంటే ఇష్టం? అమ్మా? నాన్నా? “ అని అడిగితే, పాప నెల క్రిందటి నుంచే, “నాన్నే” అని  చెప్పుతోంది. అందువల్ల పాప ఆ గొలుసుని నాన్నచొక్కా జేబులోనే దాచుకుంది. అది తుప్పుపట్టి ఉన్నప్పటికీ, పాప ఏడుస్తుందన్న భయంతో తీసి పారేసే సాహసం చేయలేదాయన. 

బస్సు బయల్దేరగానే, పాప పోయి అమ్మ వొళ్ళో చేరి, కిటికీ లోంచి బైటికి చూడసాగింది. గొలుసు బరువుకి వేళ్ళాడుతున్న ఆయన చొక్కాజేబు చూస్తే భార్యకి నవ్వు వచ్చింది. 

“నవ్వీ, నవ్వీ నీ కాయాసం రాదా?” 

“నేను నవ్వుకుంటే నీకెందుకో ఆయాసం?”

“ఇంకనువ్వు బాగుపడవు. ఎప్పుడూ ఒకలాగే ఉన్నావు.” 

“అంటే! నీ ఉద్దేశం? నేను రోజుకోలా ఉండాలనా?”

అతని మంచితనాన్ని వాడుకుని, ఆమె ఏనాడూ అతనికి తిన్నగా సమాధానం ఇచ్చిఎరుగదు. ఆయనింక మాట్లాడకుండా కిటికీ లోంచి బైటికి చూడసాగాడు. పాప ఇటు జరిగి నాన్న దగ్గర చేరి, జేబులోంచి గొలుసు తీసింది. తరవాత ఏదో అంది. కాని ఆ ముద్దు మాటలు ఎవరికీ అర్ధంకాలేదు. తన ఉనికి నెవరూ గుర్తించడం లేదని తెలుసుకుని, తనంతట తానే గొలుసులో రింగుల్ని లెక్కపెట్ట సాగింది. 

“ఒకతీ, రెందు, మూలు, నాలుగు, అయిదు పది. “

ఆయన సాభిప్రాయంగా భార్యవైపు చూశాడు. అందులో ‘నువ్వింత వరకు పాపకి పదివరకూ అంకెలు లెక్కపెట్టడం కూడా నేర్పలే’దన్న నెపం ఉంది

ఆమె చూపుడు వ్రేలితో పాపని మందలిస్తూ. “పది కాదు ఏడు రింగులున్నాయి.” అంది. 

“కాదు ఇవి పదే!” అంది పాప. 

“బళ్ళో పడేసే ముందు దీనికి పదివరకు లెక్కపెట్టడం కూడా నేర్పలేక పోయావు నువ్వు.” 

3

“ఇది వింటే కదా! పొద్దుట నేను అత్తయ్యతో ఇవాళ ఆదివారం అంటే, తన అధికతెలివి తేటలతో ఇది, ‘కాదు ఈరోజు శనివారం’ అంది. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళనే రకం.” 

అయన అది వింటున్నాడు. పాప గొలుసుతో ఆడడం పరిశీలిస్తున్నాడు. ఆమె తన సంజాయిషీ పూర్తిచేయగానే, ఇలా అన్నాడు.

 “నువ్వు ఒక సంవత్సరం టీచరుగిరీ కూడా వెలగ బెట్టావు. ఇన్ని నిదర్శనాలు ఇస్తున్నావు కాని, ఒక చిన్నపిల్లని అదుపులో పెట్టలేక పోయావు. 

“కాని, నేను చదివినప్పుడు, చదివించి నప్పుడు ఇటువంటి అనుభవాలేమీ కలగ లేదు. “

“భగవంతుడిచ్చిన బుద్ధి అరిగి పోయినట్టుంది !“

“రాయితో రాపాడితే అంతకంటే ఏం మిగులుతుంది?”

“అయితే నేనొక రాయిననా నీ ఉద్దేశం?” 

“రాయినయితే తెలుసుకోవచ్చు.” 

“నాలో అంత తెలియరానిదేముంది? అయినా ప్రతిభాభాశాలిని అర్థం చేసుకోవడం బుద్ధి ఉన్న వాళ్ళకే  సాద్యం.” 

“నీ వంటి సీదా సాదా వాడికి ఈ సగం బుద్ధే ఎక్కువ. పూర్తి బుధ్ధి మంతురాలు రానందుకు సంతోషించు. లేకపోతే నీ నెత్తినెక్కి కూర్చునేది,”

“చాలు! చాలించు నీ మంగళాష్టకాలు. “

“పురుషజాతి అంతా  మంగళాష్టకాల మీదే ఆధారపడి ఉంటుంది. “

పాప బస్సులోంచి దిగిపోతానని పేచీ పెట్టడంతో వాళ్ళ సంభాషణ అక్కడితో ఆగిపోయింది. 

“ఇక్కడ కాదు. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి” అని బుజ్జగించ బోయాడు ఆయన. పాప ససేమిరా వినలేదు. ఏడుపు లంకించుకుంది. తల్లికి వళ్ళుమండి, బస్సు కిటికీ చూపించి, దానిలోంచి దూకేయమంది. 

4

ఆయనకది నచ్చలేదు. కోపం కూడా వచ్చింది. అందరికీ తెలుసు. చిన్న పిల్లలని లాలించి, నచ్చజెప్పాలి. అది వారి అభివృద్ధికి దోహదకారి అవుతుందని. అన్నీ తెలిసి ఉండి బార్య పిల్ల మీద కోపగించుకుంటుంది. వారంలో నాలుగైదు సార్లయినా దానిని చితక బాదుతుంది, చెప్పిన మాట వినలేదని.

ఇదుగో! ఈ పల్లెలో ఉన్న గతవారంలోనే ఆమెకా అవకాశం రాలేదు. ఆమెకు తెలుసు అక్కడ వారం రోజుల కంటే ఎక్కువ ఉండరని. ఉన్నవాలుగు రోజుల్లోనూ అత్తగారి మెప్పు పొందడం కోసం ఇంట్లో పనులన్నీ నెత్తినేసుకుని చాకిరి చేసేది. పాప ఇరుగు పొరుగు పిల్లలతో ఆటలకి వెళ్లి పోయేది. ఒక్కోసారి పెరట్లో పశువుల కొట్టంలోకి వెళ్లి, బుల్లి, బుల్లి బుజ్జాయితో ఆడుకునేది. దానికి మేతవేసి, “తినవే! కడుపునిండా తిను. ఆకలేస్తుంది. ఇంకా కావాలంటే ఆడుగు.” అని ఏవేవో దానితో మాట్లాడేది. అలా పశువులకి మేత వేస్తూ, నాయనమ్మ అనడం విని తానూ నేర్చుకుంది. 

బస్సులో ప్రయాణికుల్లో కలకలం బయలుదేరింది. బస్సు సిటీలో ప్రవేశించింది. ఒక్కొక్కళ్ళు దిగే ప్రయత్నంలో ఉన్నారు. భార్య అడిగింది.

”మనం ఈ స్టాండులోనేనా దిగడం?” 

“లేకపోతే? పెద్ద బస్సు స్టాండు దాకా వెళ్లి ఆటోలో తిరిగి వస్తావా?” 

“నీ యిష్టం. నువ్వు అవునంటే, నేను కాదన గలనా!” 

ఈ వారం రోజుల్లోనూ భార్యలో కొంత మార్పు వచ్చిందని పించింది ఆయనకి. ‘ఎడ్డెం అంటే తెడ్డెం అనడం’ ఎక్కువైంది. ఇదివరకులేని కొత్త కాంతి కనిపిస్తోంది ఆ మొహంలో. 

పాప ఆ గొలుసుని బస్సులోనే మరిచిపోతే బాగుండునని పించింది తల్లికి. కాని ఆటోలో కూర్చున్నాక, పాప దానిని జాగ్రత్తగా తండ్రి జేబులో దాచి ఇంటిదాకా తెచ్చింది. ఇంటికి వెళ్ళగానే ముందుగా ఆ గొలుసుని అటక మీదికి విసిరేసింది ఆమె. అది పాపకి తెలియకుండా చేశాననుకోవడం ఆమె చేసిన పొరపాటు. పాప, తిన్నగా ఒక అనువైన స్థలానికి వెళ్లి, తీరిగ్గా కూర్చుని, గొలుసు కావాలని ఏడుపు లంకించుకుంది. కాళ్ళు, చేతులు కొట్టుకోవడం కూడా ఆరంభించింది. తల్లి వారం రోజులుగా ఇంట్లో పట్టిన దుమ్ము, ధూళి దులిపి తుడవడంలో నిమగ్నమయింది. పాప ఆ దుమ్ములో పొర్ల సాగింది.

5

ఇంక భరించలేక, ఆమె టేబిలు వేసుకుని, అటక మీది నుంచి, గొలుసు తీసి పాపవైపు కోపంగా విసిరేసింది. అయినా పాప ఏడుపు ఆపలేదు. తప్పదురా! భగవంతుడా! అని తల్లి తగ్గి వచ్చి, గొలుసు చేతికి ఇచ్చింది.

అదేమీ పనిచెయ్యలేదు. దగ్గరసా వచ్చి, “మా తల్లివి కదూ! మంచిదానివి కదూ! తీసుకో” అని బ్రతిమిలాడింది. ఊహూ(! పాప మరో స్థాయి హెచ్చించింది. 

 “మరయితే నీ కేం కావాలి?” అడిగింది తల్లి. 

“నాకు బుజ్జాయి కావాలీ!” ఏడుస్తూ అంది పాప. 

“బుజ్జాయా! ఇప్పుడెక్కడి నుంచి వస్తుంది?” 

పాప శృతి పెంచింది. తల్లి ఎలాగైనా మరిపిద్దామని, “తల్లివి కదూ! బుజ్జాయిని రేపు తెస్తాను.ఇవ్వాల్టికి దీనితో ఆడుకో!” అంది. 

బైట హాలులో కూర్చుని ఈ నాటకం అంతా చూస్తున్న తండ్రికి ఈ విధానం నచ్చలేదు. అబద్ధం చెప్పి పిల్లల ఏడుపు మానిపించడం కంటే, వాళ్ళని ఏడవనివ్వడమే మేలు అని ఆయనగారి అభిప్రాయం. ఎక్కడో చదివినట్టు జ్జాపకం. పిల్లలు అబద్ధాలు చెప్పడం తలిదండ్రుల దగ్గర నుంచే నేర్చుకుంటారని. లేకపోతే ఏది నిజమో ఏది అబద్ధమో వాళ్ళకేం తెలుసు?  

ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఆయన భార్యకి హితబోధ చేయబోయాడు. “అబధ్ధం చెప్పుతావెందుకు? రేపు మాత్రం బుజ్జాయిని ఎక్కడినుంచి తెస్తావు? “

“దానికేం తెలుసు? నిజమేదో? అబద్ధమేదో? అసలిది అక్కడి నుంచి బయలు దేరినప్పుడే బుజ్జాయిని వెంట తీసుకొస్తానని పేచీ పెట్టింది. దాన్ని మభ్య పెట్టడానికి ‘ఇంతకంటే మంచి బుజ్జాయిని మన ఊరిలో ఖాదీ బండారు నుంచి తెస్తానులే’ అని చెప్పి తీసుకొచ్చాను.”

ఆయన వచ్చే నవ్వుని ఆపుకోలేక పోయాడు. విషయం అంతా వివరంగా చెప్పిందామె. “ పాప ప్రతిరోజూ క్రమం తప్పకుండా, ఆ పల్లెలో బుజ్జాయికి రొట్టెలు, అన్నం తినిపించేది. అది  దీని కోసం ఎదురు చూస్తూ ఉండేది. వాళ్ళిద్దరికీ అలా స్నేహం కుదిరింది.” ఇవన్నీ చిత్రాతి చిత్రంగా వర్ణించి , అసలు రహస్యం బైట పెట్టిందామె. 

6

“ఇదే గొలుసు నువ్వు బజారు నుంచి తెస్తే ఊరుకుంటుందనుకున్నావా? ఈ గొలుసుని, పాప తనకి ఆ బుజ్జాయితో ఉన్న మమతానురాగాలకి చిహ్నంగా తెచ్చుకుంది.” 

పెద్దాయన ఆలోచనలో పడ్డాడు. పిల్లలందరి విషయంలోనూ ఇది నిజమేనా? 

వంటింట్లో పనిలో సతమతమౌతూ, తల్లి తను పెట్టుకున్న బంగారు వస్తువులు – గాజులు, గొలుసులు తీసి, గట్టుమీద పెట్టింది. మంచినీళ్ళ కోసం లోపలికి వచ్చినాయన “వస్తువులన్నీ ఇలా పారేశావేం?” అన్నాడు. 

“పారేయలేదు. అక్కడ పెట్టాను. చేయ్యిఖాళీగా లేదు. దయచేసి, నువ్వు వాటిని పెట్టెలో భద్ర పరచగలవా?” అందామె ఈసడింపుగా. వెంటనే, “ఆ( ! అందులో ఏమైనా డబ్బూ దస్కం ఉంటే, కాజేసే ప్రయత్నం మట్టుకు చేయకు.” అని రెట్టించింది.

“నా మీద అంత అనుమానమా?” 

“అనుమానం కాదు. నమ్మకం.”  

“సంతోషించాం. కానీ ఇక చాలించు.” అని కోపంగా ఆయన వస్తువులు తీసికెళ్ళాడు. పెట్టె మూత తెరిచి వస్తువులు అందులో పెడుతుంటే, పాప వచ్చి ఆ గొలుసుని కూడా పెట్టెలో దాచమంది. “పాప ఈ తుప్పుపట్టిన ఇనప గొలుసుని కూడా దాచమంటోంది. ఏం చెయ్యను?” అని అడిగాడు. 

“దాచు. దాచు. ధనలాభం.” అందామె. 

తండ్రికి ఆశ్చర్యం వేసింది. పాప సంతోషంగా వెళ్ళిపోయింది. 

భోజనాల దగ్గర, మధ్యలో రొట్టె ముక్క పట్టుకుని, పాప ఉన్నట్టుండి లేచింది. 

“ఎక్కడికి?”

“బుజ్జాయికి పెట్టడానికి.”

“వెర్రిదానా! బుజ్జాయి పల్లెలో ఉండిపోయింది.”

“నేను అక్కడికి వెళ్తాను.” 

7

తండ్రి పాపకి నచ్చజేప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తల్లి మనసులోనే అనుకుంది. ‘ఆ యింట్లో కూడా బుజ్జాయి గుమ్మం ముందు నిలబడి పాప కోసం ఎదరు చుస్తూ ఉంటుంది.’ 

పాలెపు బుచ్చిరాజు

స్వస్థలం గునుపూడి, విశాఖపట్నం జిల్లా. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర పట్టా పుచ్చుకుని, ‘చమురు సహజవాయు సంస్థ’ లో భూభౌతిక శాస్త్రజ్జుడిగా, ఉద్యోగ రీత్యా 1965 డిశంబరు నెలలో మొట్టమొదటి సారిగా గుజరాత్ నేల మీద అడుగుపెట్టారు. 1968లో బరోడా వచ్చి స్థిరపడ్డారు. 40 సంవత్సరాలుగా కథలు, వ్యాసాలూ, నవలలు సుమారు రెండు వందల వరకు రాశారు. వీటిలో స్వంత రచనలేకాక , గుజరాతీ, ఆంగ్ల భాషల్లోంచి చేసిన అనువాదాలు కూడా ఉన్నాయి. నాలుగవ ప్రపంచ మహా సభల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు, ‘రాష్ట్రేతరాంధృడిగా తెలుగు భాష వ్యాప్తికి వీరు చేస్తున్న కృషిని గుర్తించి 2012 లో సత్క రించారు.
2016 లో ”గుజరాతీ సాహిత్యం – ఒక విహంగ వీక్షణం” పేరున పుస్తకం ప్రచురించారు. శ్రీకాకుళంలో శ్రీ కాళీపట్నం రామారావు గారు స్థాపించిన ‘కథానిలయం’ లో వీరి కథలు చదివిన ఒక విద్యార్థిని, వ్రాసిన సిద్ధాంత వ్యాసం ‘పాలెపు బుచ్చిరాజు కథలు – పరిశీలన’కు, 2022 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం పిహెచ్ డి ప్రదానం చేసింది.

Previous Post

అపార్ట్మెంట్ మిస్టరీ

Next Post

సింహళి, అస్సామీ అనువాద కవితలు

Next Post
సింహళి, అస్సామీ అనువాద కవితలు

సింహళి, అస్సామీ అనువాద కవితలు

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com