• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఆఫ్రికన్ కథ : దంతపు గాజులు 

స్వాతి శ్రీపాద by స్వాతి శ్రీపాద
January 6, 2026
in అనువాద కథలు
0
ఆఫ్రికన్ కథ : దంతపు గాజులు 

ఆఫ్రికన్ కధ: ఎరిక్ సికువా మార్యో 
అనువాదం : స్వాతీ శ్రీపాద 

 

అతని కాళ్ళు అతని ఇంటికి, ఆ ఇంటి కాంపౌండ్ లోకి, చుట్టూ ఉన్న అరటి తోటలోకి నడిపించాయి, కాని అతని మనసు మాత్రం సంచరిస్తూనే ఉంది. దారి నుండి పక్కకు తప్పుకున్నాడు తనను తాను నిభాయించుకుందుకు, కాని ఒక చిన్న ధార అతనిముందున్న చెట్టు బోదెను తడిపేసింది. 

ఆ యోగి మాటలు ఆందోళన కలిగించాయి. అతనికి ఆ యోగి పట్లచాలా బలమైన అనుమానమే ఉంది. కాని ఒక కోయజాతి యోగి, అక్కడి జనాలకు పురోహితుడు. తను నరికిన మేక కాలేయం మీద రక్తపు చారలు చూసాక ఆ యోగి సలహా కోసం వెళ్ళి తీరాల్సిన అవసరం వచ్చిందతనికి. ఆ యోగి గులకరాళ్ళు చెప్పినదాని ప్రకారం ఒక భార్య చనిపోబోతోంది. వయసు మళ్ళే వరకూ , అవ్వగా ఆమెను పిలిచే వరకూ భర్త వల్ల ఏ హానీ జరగని ఒక స్త్రీని చూసి సంతోషంగా ఉండే ఒక భార్యను చూసి ఆత్మలు అసూయ పడుతున్నాయనీ,  గులకరాళ్ళు చెప్పాయి మరి. 

అతనికి వెంటనే తెలిసిపోయింది-అది తన భార్యేనని.

“దీన్ని తప్పించడానికి ఏం చెయ్యగలను?”

ఆమెను కసిదీరా బాదాలని గులక రాళ్ళు చెప్పాయి. కొట్టిన తరువాత ఆమెను పుట్టింటికి పంపెయ్యాలని గులకరాళ్ళు చెప్పాయి. 

దాని ఉపశమనానికి మరో దారి కూడా ఉంది. కావలసినన్ని మేకలనిస్తాను. 

ఆమెను కసిదీరా బాదాలని గులక రాళ్ళు చెప్పాయి. కొట్టిన తరువాత ఆమెను పుట్టింటికి పంపెయ్యాలని గులకరాళ్ళు చెప్పాయి. 

అతని భార్య వచ్చి అతని లెదర్ సాండల్స్ విప్పదీసి ఇంటి వెనకాలకు, వాలు బల్ల దగ్గరకు తీసుకు వెళ్ళి అతనికి స్నానం చేయించి చుక్కని సువాసనా తైలాలతో మర్దనా చేసింది. అతని బిగిసిన నడుం, భుజాల కండరాలు పళ్ళూడిపోయిన కుక్కల్లా పనిచెయ్యడం మానేసాయి. 

” ఓ పిల్లా, తన ముసలి భార్యతో ముసలిభర్త అన్నాడు,” పిల్లా నేనొకటి విన్నాను ఈ రోజున” 

“మంచిది మనం దానిగురించి తిన్నాక మాట్లాడుకుందాం ” 

ఆ సాయంత్రం లోంచి ఇద్దరూ ఇంట్లోకి వచ్చి మధ్యలో నిప్పుల కుంపటితో ఎదురెదురుగా కూర్చున్నారు. ఆమె నిప్పుల కుంపటి కోసం కొయ్యముక్కనొకదాన్ని అందుకుని రెండుగా చీల్చి కనిపిస్తున్న పేళ్ళను లాగి బొగ్గులమీద చెకుముకి దూదిని చెక్కపేళ్ళను కుంపట్లో అమర్చింది. చిన్న మంటలు చిన్న చెక్కపేళ్ళకు అంటుకుని చెక్కలకు వ్యాపించి ముసలాయన మొహం మీద దిగులు ప్రకాశవంతం చేసాయి. 

“పిల్లాడు ఎలా ఉన్నాడు?” వారి ఒకే ఒక్క సుపుత్రుడి కొడుకును వాళ్ళు పాడు చేసేందుకు ఒదిలేసిన పిల్లవాడి గురించి అడిగాడు. 

“వాడు నిద్రపోతున్నాడు. ” వాడు వాడి నానమ్మ మంచం మీద పడుకున్నాడు. తొందరలో అలా పడుకుందుకు కుదరనంత పెద్ద వాడైపోతాడు. “తిను తిను చల్లారిపోతోంది”

“ఈ సాయంత్రం ఎక్కడికి వెళ్ళానో తెలుసా? ” అహారాన్ని నములుతూ తడబాటుగా మొదలుపెట్టాడు మళ్ళీ. 

” యోగి దగ్గరకు” ఆమె జవాబు.

” నీ కెలాతెలుసు?” తినడం ఆపి అడిగాడు. 

“ఊహించాను” మామూలుగా ఉంది జవాబు. 

ఆరిపోబోతున్న నిప్పు ఎగురుతున్న మంట ఆమె చిరునవ్వును, తెల్లని ఆమె పళ్ళను మరింత తెల్లగా కింది రెండుపళ్ళ మధ్య అందంగా కనిపించే సందును పట్టి చూపాయి. ఆమె ఇంకా పిల్లలానే అనిపిస్తుంది. 

ముసలాయన గొణిగాడు. ఆ గులక రాళ్ళు చెప్పిన మాటల చర్చకు ఇది సరైన వాతావరణం కాదు. ఇప్పుడిహ నెమ్మదిగా తినడం సాగించాడు, పచ్చి అరటి కాయలు, సన్నగా తురిమిన మాంసం, నీళ్ళు, కూరగాయలు, ఆకులు అన్నీ కలిపి చేసిన అంబలిలో ముఖ్యంగా ఆమె స్పర్శ తో ప్రతిచిన్న రుచిభేదాన్నీ, కమ్మని వాసననూ ఆస్వాదిస్తూ తిన్నాడు. ఇది మిగతా ఏ ఇతర మాంసం అరటికాయ వంటకంలా లేదు. వేయించిన సిరగడదుంప ఓ ముక్క కొరికి నమిలాడు, జాగ్రత్తగా దాన్ని గిన్నెలోని రసంతో కలిపి మింగాడు.

“బాగా వండావమ్మా” ఒళ్ళువిరుచుకుంటూ ఆవులిస్తూ కృతజ్ఞతలు చెప్పాడు. 

” దీర్ఘాయుష్మాన్ భవా ప్రభువు కుమారుడా ” ఆమె జవాబు. చెక్క గిన్నెను ప్లేట్ ను ముసలాయన దగ్గర నుండి అందుకుంది. అతనో వండ్రంగి, అతని తండ్రికూడా. మంచి యోధుడు. గొప్ప ధైర్యసాహసాలున్న యోధుడు. 

యుక్తవయసులో ఉన్నప్పుడు ప్రభువుకు సలహాదారుగా నియమితుడయ్యాడు. అది ప్రస్థుతం ఉన్న ప్రభువు తండ్రి గారి హయాం లో. అతనిప్పటికీ ప్రభువు సలహాదారే, ఎంతో గౌరవాన్నిస్తారు. కాని అతని గురించి చాలానే మాట్లాడుతారుకూడా, కారణం ఒకే ఒక్క భార్య ఉండటం.  సలహాదారు కూడా ఒక చిన్న ప్రభువే. ప్రభువుకు ఎక్కడైనా ఒకే భార్య ఉండటం ఎవరైనా విన్నారా? వయసు పెరుగుతున్న ప్రభువు అతనికి మరో భార్యను తెచ్చుకోమని చెప్పినప్పుడు, అది అయిదు వర్షపు దినాల యుధ్ధం లో తన ధైర్య సాహసాలు ప్రదర్శించిన సందర్భంగా అతనిని సలహాదారును చేసుకున్న కొత్తలో, అతనొక పొడుపు కధతో జవాబిచ్చాడు. ఒక స్త్రీ నదీ తీరం వైపు వెళ్ళింది. నీళ్ళు తేవడం కోసం నదికి వెళ్ళిందా స్త్రీ. ఆమె దగ్గర ఉన్నది ఒకే ఒక్క కుండ. ఆమె నీటి చేరుకునే సరికి అక్కడ మరో కుండ కనిపించింది. ఆమె కుండతో ఇంటికి తిరిగివచ్చింది, ఆ కుండ పెంకులు కుండలో వేసుకుని వచ్చింది కాని నీటితో కాదు. పెద్ద ప్రభువు పడీ పడి నవ్వాడు. ” ఒక భార్య, ఒక సవతి, చేతబడీ చావు,” అతను అరిచాడు, “కాని ఆగు” 

“ఆగు. అయితే ప్రభువు కుండలు ముక్కలవడానికి ఎంత పెద్దవిగా ఉండాలి?” అన్నాడు. 

“మీ కుండలు పగలవు ప్రభూ” ఆ యువ యోధుడు జవాబిచ్చాడు. “మీ కుండలు ఇనుముతో చేసినవి”

“ఇహ నేను పడుకుంటాను” ముసలాయన చెప్పాడు. 

ఆమె లేచింది. ఆమె పొడుగ్గా ఇంకా బిగువుగానే ఉంది. ఆమె చేతికి వేసుకున్నతన ఇరవైనాలుగు దంతపు గాజులు కదిలినప్పుడు చిడతల్లా ధ్వనించాయి. ఆ విషయంలో ఆమె విలక్షణమే. ఒక్కోచేతికి ఎనిమిదేసి గాజులు, రెండు కాళ్ళకు కడియాల్లా నాలుగు నాలుగు బరువైనవి.ఆమె చేతులకున్న వాటి మీద దీర్ఘ ప్రేమ కావ్యపు జ్ఞాపకాల గుర్తులు చెక్కి ఉన్నాయి. అవి వారి తొలి సంతానం  అబ్బాయి, (ఇప్పుడు ఒకే ఒక్కడు) నామకరణం రోజున అతను బహుకరించాడు. అమె అచ్చం ప్రభువు భార్యలా అనిపించింది. 

“నీ భార్య సొగసుగా ఉంది” ప్రభువు అతనితో అన్నాడు. 

“మేమంతా మీ మనుషులం ప్రభూ” అన్నాడు. 

“ఆమె వేసుకున్న బోలెడన్ని దంతపు గాజుల్లో చాలా అందంగా ఉంది” 

“నేను వాటిని తయారు చేసాను. సర్, ఆ దంతం నేను విషపు బాణంతో చంపిన ఏనుగు తాలూకుది. ఆచారం ప్రకారం ఒక దంతం మీకు తెచ్చాను”

“జనం నువ్వు గాజులు కొన్నావని చెప్తున్నారు.”

వాళ్ళు నేను చెక్కుడు పని చేస్తానని మరచిపోయారు ప్రభూ, ఇంకా నేనెక్కడ అన్ని గవ్వలు తేగలను?” 

ఆమె గిన్నెలు కడిగి మట్టి నేల మీద నీళ్ళు చిలకరించింది. నిప్పుల్లోకి ఒక పిడకముక్క విసిరింది. దానితో తెల్లారే వరకూ నిప్పుకొనసాగుతుంది.  భర్తతో కలిసి నిద్రపోడానికి బదులు ఆ యువకుడు, తన చర్మాలను తొలగించి ఆ ముసలాయన పక్కన విశ్రమించింది.

 “నేనా యోగి దగ్గరకు వెళ్ళాను” అతను మొదలుపెట్టాడు, కాని ఆమె చెయ్యి అతని ఎదమీద ఉంది. ఆమె స్పర్శకు దాదాపు వేడిగా ఉంది. – లేదూ అతను చల్లబడుతున్నాడా? నెమ్మదిగా మరణిస్తున్నాడా? అతను ఆమెకు స్పర్శకు జవాబుగా మరింత దగ్గరకు జరగ్గానే ఆమె కొద్దిగా వణికింది. అతను నెమ్మదిగా దూకుడు తగ్గించుకున్నాడు. కాని  వచ్చినప్పుడు ఒక డ్రమ్ మీద సంక్లిష్టమైన పచ్చబొట్టులా వచ్చింది. హఠాత్తుగా రావడం ఉన్నట్టుండి ఆగడం, గాలిని  ప్రశాంతంగా తాజాగా వదలడం. అతను నిస్త్రాణగా…  జాగ్రత్తపడేముందు ఎంత తొందరగా ఇలా జరిగిపోతుందా అని ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లవాడు గమనించకూడదు. 

“ఆ యోగి గురించి చెప్పు” ఆమె అడిగింది.

నేను నిన్ను సాంప్రదాయిక ఆచారంగా కొట్టాలని ఆత్మల కోరిక 

“అహా, ఆ యోగి నువ్వు నన్ను కొట్టాలని కోరుతున్నాడా?”

“ఆ యోగి మనను వదిలి వెళ్ళిన పూర్వీకుల ఆత్మకు  అక్షర రూపం అమ్మా’ 

“నాకా యోగి గురించి తెలుసు” ఆ ముసలావిడ చెప్పింది. 

అతను నిశ్శబ్దంగా ఉన్నాడు.

“అతనొకప్పుడు  నన్ను పెళ్ళిచేసుకోవాలనుకున్నాడు. అతను నా మీద మంత్ర ప్రయోగం చేస్తానని చెప్పాడు. ఇది తరచు పునరుక్తమవుతున్న కధ. సంతోషంగా ఉన్న క్షణాల్లో అతను జవాబు చెప్పేవాడు. “కాని నువ్వు నా దానవు. .” కాని ఇప్పుడు అతను కోపంగా అన్నాడు. 

“ఆ మేక కాలేయం మీద రక్తపు చారికలు ఉంచినది అతను కాదు గదా” 

“ఆ ముసలి గద్ద” ఆమె గిణిగింది. 

“ఏదో ఒక దారి ఉండే ఉంటుంది” అతను అన్నాడు అసౌఖ్యంగా పక్క కు మారుతూ.

“అవును తప్పకుండా, నేను చెప్తానునీకు” ఆమె అంది. 

తన జీవితం అందులో చేర్చి ఉందని ఆమెకు తలియడం లేదా? అతను ఆశ్చర్యపోయాడు. ఆమె మాట్లాడుతూనే ఉంది తన ప్రణాళిక గురించి దాని సాధారణత్వం చతురత కు గాల్లో తేలిపోతూ. 

తరువాతెప్పుడో అతను నిద్రపొయాడని గమనించింది. నిశ్శబ్దంగా ఆమె భర్తవంక జరిగింది. అతను కూడా గాఢ నిద్రలో ఉన్నాడు. 

మరుసటి రోజు ఉదయం ఆ మనిషి తనపనిమీద తనువెళ్ళాడు. ఆమె, ఆ మధ్యాన్నం మార్కెట్ కి వెళ్ళింది. జనాలు అడవి దగ్గరలో ఉండే ఏనుగుల గురించి ఏదో మాట్లాడుకోడం వింది. ” ఆ గుంపు ఇప్పుడు సమతల ప్రదేశాలకు వస్తోంది’ ఒక మనిషి చెప్పాడు. మరొకడు ఆ జంతువులు మొక్కలు ఎలా నాశనం చేస్తాయో వివరించాడు. విషపు బాణాలు ఎలా ఉపయోగించాలో తెలిసిన వాళ్ళు వాటిని అనుసరించారు. విషపు బాణాలతో చాల ఏనుగులనే చంపుతారు. ” మరొకరు అన్నారు.

సంత ప్రదేశంలో జనాలు చాలా మందే ఉన్నా, జనాల మాటలు మరో మూడు రెట్లున్నాయి. ఆమె ముందుకు కదిలింది. ఆమె గాజులు మెత్తగా ధ్వనించగా దంతపు మెరుపులతో వెలిగే ఒక ప్రేమికురాలైన స్త్రీ లాగా. ఆమె ఆలోచిస్తోంది-ముందు నేను ఇంటికి వెళ్తాను. ఆ మనిషి కోసం వంట చేస్తాను. తరువాత నా సోదరుడి ఇంటికి వెళ్తాను. సోదరుడంటే ఆమె కన్న పెద్ద వాడు, అన్న, మరణించిన తలిదండ్రుల ఇంటి భారం తీసుకున్నాడు. ఇప్పుడు తండ్రి స్థానం లో ఉన్నాడు. ఆమె ప్లాన్ అక్కడికి ఏడుస్తూ వెళ్ళడం, , కారణ రహితంగా భర్త కొట్టాడని ఫిర్యాదు చేసేందుకు. తన భర్త వచ్చి తనతో వెనక్కు రమ్మనే వరకూ అక్కడే ఉండి, వచ్చి అడిగాక నిరాకరించి తమ వైపు వారు అతని వైపు వారు కలిసి రాజీ పడేవరకూ బలవంత పెట్టడం. ముక్కోపి అయిన భర్తకు పెనాల్టీ వెయ్యడం ఆ పైన రాజీ గా బీర్. ఆత్మలు తప్పకుండా వెర్రిమొహాలవుతాయి. జీవితం ఇదివరకులా యధావిధిగా సాగుతుంది. 

తనదగ్గరున్న గవ్వలతో హడావిడిగా రకరకాల వస్తువులను కొంది. ఒక పెద్ద కోడి పుంజుకు బదులుగా ఒక బాగ్ నిండా బఠానీలు , ఒక నిలువెత్తు చెరుకు గడ పిల్లడికి ఇవ్వడానికి ముసలాడికి కొంచం నశ్యం తీసుకుంది. కొంచం , ఉప్పు,  సోడా, కాసిని వేరు శనగలు కూడా తీసుకుంది అవి ఉడికించుకు తినడం ఆమెకు ఇష్టం – వేయించుకుని కాదు. , నెమ్మదిగా ఇంటి ముఖం పట్టాక అరుపులు వినిపించాయి ఆమెకు. వాళ్ళు స్కౌట్స్ నుండి వచ్చారు. చెట్లపైకెక్కి ఏనుగులను గమనిస్తూ జనాలకు వాటి కదలికల గురించి హెచ్చరికలు చేస్తున్నారు. ఆ కేకలు ఒకరినుండి ఒకరికి చేరుతున్నాయి. ఈ మనుషుల శబ్దాలతో ఏనుగులు జన సమూహాలకు దురంగా వెళ్ళే వరకూ సాగుతాయి. ” జాగర్త, జాగర్త, అంటూ వాళ్ళు అరుస్తున్నారు. ” జాగర్త ఆరు ఏనుగులు, ఒక మగ, అయిదు ఆడ ఏనుగులు కొండ దిగుతున్నాయి” 

“అవి సాంగ్యో వద్ద ఉన్నాయి. జాగర్త …మార్వె నదిని దాటాయి … ఆగిపోయింది…జాగర్త… జాగర్త…మోర్బొ జనావాసం ప్రజలు అయిదు ఆడ ఏనుగులిప్పుడు మీ అరటి తోటలో ఉన్నాయి. మగ ఏనుగు ప్రవాహం వద్ద నుండి దారిలో ఉంది” 

అరుపులిప్పుడు దూరంగా అస్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ అరుపులన్నీ పొడవైన చెట్ల కొమ్మల పైనుండి రావడం,

ఏనుగులు తగుమాత్రం దూరాన ఉండటం తో ఆమె వేగంగా ఇంటివైపు కదిలింది. నేను వెళ్ళి వంట చేసి ఆపైన నా అన్న ఇంటికి వెళ్తాను అనుకుంది.

భర్త కోసం వంట పూర్తి చేసాక, జాగర్తగా అన్నింటిపైనా మూతలు పెట్టే సరికి ఇంకా సూర్యాస్తమయం కాలేదు. పిల్లవాడు తిని పక్క పిల్లలతో ఆడుకుందుకు బయటకు జారుకున్నాడు. ఎందుకో అంత తొందర అనుకుంది. నేను తోటలో కలుపు మొక్కలు కొంచం తవ్వి తీసేస్తాను. దాంతో నా కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ నా అన్న ఇంటికి వెళ్తాను. ఆమె తన్లో తనే నవ్వుకుంది. 

ఇది కలుపు మొక్కలున్న చోటు. వంగుతూ అనుకుంది. చిన్న గునపం వేగంగా వెళ్తోంది. చేతుల మీద బరువైన దంతపు గాజులున్నాఅలవాటు పడిన వేగం అది. ఆ శబ్దం ఇప్పుడు లయబద్ధంగా వుంది. 

ఆమె ఎలాటి సంబంధం లేకుందా అదో ఇదో ఆలోచిస్తూనే ఉంది. ఆమె చేతిలోని పలుగును ఒక పెద్ద బలిసిన జెర్రి తప్పించుకుంది. “నువ్విప్పుడే చావ దలుచుకోలేదా? పిచ్చిమొహమా ” నవ్వింది పెద్దగా. 

ఒక చిన్న జోల పాట పాడింది ఆమె. అహా,  వదిన ముసలి ముకుసారో , ఏమంటుంది. ఓహ్, ఈ ప్రాంతం నిజంగా కలుపుమొక్కల మయం. కేవలం నాలుగు, కాదు కాదు మూడు వారాల క్రితమే కదా నాకోడలు లివరీ తో కలిసి కలుపు తీసాను. ఆమె మొగుడు ఆమె సమాధికి గోరంత దూరం వెళ్ళేంతగా కొట్టాడు. నాకొడుకు తండ్రికి మధ్యన ఎందుకంత తేడా? ఇప్పుడు ఏడుస్తున్నదెవరు? అది కబంద. అతను అదే కోరుకున్నాడు. నిన్ను ఏడిపించే జనాలతో ఆడటం ఎందుకు? ఆ పిల్లాడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉన్నాడు. జనాలు నేను వాడికి తిండి సరిగా పెట్టడం లేదంటారు. తడి నేల వాసన, పగటి ఎండకు వేడెక్కడం అది పొట్టి గా ఉంది. ఆమె విరిగిన శబ్దం వింది. తలతిప్పి చూసింది. అది నల్లటి గృహం. అది పిచ్చిగా అరుస్తూనే ఉంది. ఆమెను భౌతికంగా పైకెత్తింది. దాంతో ఆమె చాలా కోపంతో తన నగ్నత్వాన్ని కప్పుకుందుకు బట్టలు సరిచేసుకుంది. అంతే. 

ఆమెను చెట్లకేసి అరటి మొక్కల కేసి కొట్టాక గాయపడిన మగ ఏనుగు ఆమెను నేలపై పారేసి కసకసా తొక్కింది. ఆమెను వాళ్ళు లోతుతక్కువ సమాధిలో కనుక్కున్నారు. రక్తమయమైన మాంసం ముద్ద తో పాటు విరిగిన దంతపు గాజుల ముక్కలు కూడా. 

  

స్వాతి శ్రీపాద

కథాసాహిత్యం, నవల, కవిత్వం, అనువాదం ఇదే జీవితం. కేవీ లో పీజీ టీచరుగా ఉద్యోగ విరమణ. హైదరాబాద్‌లో ఆరునెలలు అమెరికాలో ఆరునెలలు నివాసం. రాత 69 నుండీ. తొలికథ వసుధలో 69-70. విపుల లో చాలానే అనువాద కథలు వచ్చాయి. కవిత్వం నా ఉనికి లానే.

Previous Post

రష్యన్ కథ : కట్నం

Next Post

అనువాద కవిత : ప్రేమ ఒక జ్వాల

Next Post
అనువాద కవిత : ప్రేమ ఒక జ్వాల

అనువాద కవిత : ప్రేమ ఒక జ్వాల

Discussion about this post

ఈ సంచికలో…

  • కన్నడ కథ: బేలా
  • ఒరియా కథ : నాకీ పెళ్ళొద్దు
  • కన్నడ కథ: ఐదు రూపాయల రుణం
  • రైదాస్
  • మహిళల మధ్య
  • తమిళ కథ : చెడ్డ కుమారుని కథ
  • నేను నిన్ను ప్రేమిస్తున్నాను !
  • గుజరాతీ కథ : వైట్ హార్స్
  • తొలి ప్రేమ
  • కన్నడ కవిత : నవ్వు
  • 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు
  • కన్నడ కథ: ఆ ఒక విధంగా …
  • రష్యన్ కథ : మాస్క్
  • తమిళ కథ : పుష్పించని చెట్టు
  • యుగోస్లేవియా కథ : కాప్టెన్
  • అనువాద కవిత : నూతన సంవత్సర ఉదయం
  • ఆంగ్ల కథ : టెలిఫోన్ కాల్ 
  • కన్నడ కథ :  అంతర్వాహిని

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com