• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కన్నడ కథ: ఐదు రూపాయల రుణం

కోడిహళ్లి మురళీ మోహన్ by కోడిహళ్లి మురళీ మోహన్
February 10, 2026
in అనువాద కథలు
0
కన్నడ కథ: ఐదు రూపాయల రుణం

కన్నడ మూలం: సరితా నవలి
తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్

“బుజ్జీ, లేవమ్మా.. అప్పుడే ఏడు గంటలైంది. ఎనిమిది గంటలకల్లా తయారవ్వాలి, లేదంటే స్కూల్ బస్ మిస్ అవుతుంది” అని శుభ పిల్లల గది బయట నిలబడి అరిచింది. అర్జున్ పరుపుపై అటు ఇటు దొర్లుతూ, “టూ మినిట్స్ అమ్మా” అని ముసుగు తన్నాడు. అతని అక్క అంజలి, తమ్ముడి కంటే ముందే తాను రెడీ అవ్వాలని పరుగుతీసింది.
అది అమెరికాలోని న్యూజెర్సీలో సెప్టెంబర్ నెల. రెండున్నర నెలల సుదీర్ఘమైన వేసవి సెలవుల తర్వాత బడి తెరుచుకుంది. అంజలి, అర్జున్ సెలవులను చాలా సరదాగా గడిపారు. జూలై నెలలో తల్లిదండ్రులను చూడటానికి పిల్లలతో సహా బెంగళూరు వెళ్లిన శుభ తిరిగి వచ్చినప్పుడు తనతో పాటు సాంబారు పొడి, చట్నీ పొడి, సుబ్బమ్మ అంగడి తినుబండారాలతో పాటు బ్యాగు నిండా కన్నడ పుస్తకాలను తెచ్చుకుంది. పిల్లల స్కూల్ మొదలయ్యాక ప్రశాంతంగా చదువుకోవచ్చని అనుకొంటుండగానే రెండు వారాలు గడిచి పోయాయి.

పిల్లలను బస్ ఎక్కించి వచ్చిన శుభ, భర్త లంచ్ బాక్స్ సిద్ధం చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. వంట గబగబా ముగించి ఈ రోజైనా ఒక మంచి కథల పుస్తకం చదవాలని ఆమె నిశ్చయించుకుంది. బియ్యం, పప్పులు కడిగి, కుక్కర్లో పెట్టి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి, కూరగాయల కోసం ఫ్రిజ్ తీసినప్పుడు బెంగళూరు నుంచి తెచ్చిన తిండి పొట్లాలు, చట్నీ పౌడర్ వగైరాలు కనిపించాయి. ఒక్కసారిగా మనసు బెంగళూరువైపు పరిగెట్టి, ఈ సారి ఇండియా ట్రిప్పు గురించి ఆలోచిస్తుండగా కుక్కర్ ఈల వేసి శుభను వంటను పూర్తి చేయడానికి పురమాయించింది మనం ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా, మాతృభూమి జ్ఞాపకాలు మన హృదయాలను ఎల్లప్పుడూ ఆర్ద్రం చేస్తాయి కదా! వాన ఆగినా చెట్టు చినుకులు ఆగవు అన్నట్లు పుట్టినింటి జ్ఞాపకాలు శుభ తలపులలో చెట్టు చినుకుల మాదిరి బొట్లుబొట్లుగా రాలసాగాయి.

బెంగళూరులో అమ్మానాన్నలు, అత్తామామలు అదెన్నో ఏళ్ళుగా వదలకుండా చూస్తూవున్న కథ ముగింపు ఊసే లేని కన్నడ టెలివిజన్ సీరియళ్ళ టైటిల్ సాంగ్స్ ఒక్కొక్కటే గుర్తు చేసుకుంటూ ‘పుట్ట గౌరియ మొదివె, ఇదు పుట్టగౌరి మొదివె ‘, ‘బారమ్మా, బారమ్మా, లక్ష్మి బారమ్మా’ అంటూ హమ్ చేస్తూ వంట చేయడం కొనసాగించింది.

కూరగాయలు తరుగుతూ తన స్వరనైపుణ్యాన్ని కొనసాగించి చాలా పాటలు పాడుకుంది. అకస్మాత్తుగా ఆమెకు ఒక పాత పాట గుర్తొచ్చింది: “హెణ్ణల్లవే నమ్మనెల్ల పడెద తాయి… హెణ్ణల్లవె నమ్మనెల్ల హొరవవళు …” (మనల్ని కన్న తల్లి ఆడదే కదా, మనల్ని సాకేది ఆడదే కదా). డెబ్భైలలో దూరదర్శన్‌లో వచ్చే ఆ దృశ్యం ఆమె కళ్ళముందు కదలాడింది. ఆసుపత్రి మంచం మీద పడుకున్న ఒక బాలింత తన బిడ్డను చూడటానికి వచ్చిన భర్తతో, కొంత బాధతో, “ఆడపిల్ల” అని చెప్పినప్పుడు, అతను తన చిన్న కూతురిని ఎత్తుకుని తనకు జన్మనిచ్చిన తల్లిని, తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు తనను చూసుకున్న భార్యను తలచుకుంటూ ఆ పాపను ప్రేమగా ముద్దాడతాడు.

ఈ సమాజం తల్లిగా, భార్యగా స్త్రీని గౌరవిస్తుంది కానీ, ఆడపిల్లగా పుట్టగానే అంత సులభంగా అంగీకరించదు. ఈ సమాజంలో ఒక స్త్రీ భార్యగా లేదా తల్లిగా ఉండాలంటే, ఆమె మొదట అమ్మాయిగా పుట్టి, పెరిగి, మంచి జీవితాన్ని గడపాలి అనే వాస్తవాన్ని చాలా మంది ఆలోచించరు. కాలం మారి, మహిళలు చాలా రంగాలలో తమ విలువను నిరూపించుకున్నప్పటికీ, కొన్ని ఇళ్లలో, పిల్లల పుట్టుక, పెళ్ళి, ఆస్తి పంపకాల వంటి విషయాల విషయానికి వస్తే, XY క్రోమోజోమ్‌లు XX క్రోమోజోమ్‌ల కంటే ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఇలా శుభ తన ఆలోచనా తరంగాలను ఎక్కడెక్కడికో పరిగెట్టించి, వంట చేయడం ముగించింది.

కిరణ్ ఆఫీసుకు బయలుదేరిన తర్వాత, ఒక కప్పు కాఫీతో సెప్టెంబర్ ప్రాతఃకాల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ‘నేమిచంద్ర కథెగళు’ పుస్తకాన్ని తీసుకుంది. తన కాలేజీ రోజులలో, ‘సుధా’,’తరంగ’వంటి వారపత్రికలలో అప్పుడప్పుడూ నేమిచంద్ర కథలను చదివిన సంగతి గుర్తు చేసుకుని ఆమె మనసులో ఒక అందమైన భావన కలిగింది. చదువుకునే రోజుల్లో పత్రికలు, కన్నడ పుస్తకాలు పట్టుకుని కూర్చుంటే తనను తాను మరిచిపోయే శుభకు, ఇప్పుడు పుస్తకాన్ని పట్టుకోగానే పక్కనున్న ఫోనులో వాట్సాప్ సందేశాలు నీటి బుడగల్లా పుళక్ పుళక్ మంటూ శబ్దం చేయడం చీకాకును కలిగించింది. పిల్లలు ఇంటికి వచ్చేలోగా కనీసం మూడు నాలుగు కథలైనా పూర్తిచేయాలని అనుకుని ఫోన్ స్విచ్చాఫ్ చేసి చదవడం మొదలుపెట్టింది. చదువులో మునిగిపోయి అదెంత సమయం గడిచిపోయిందో తెలియనే లేదు. చాలా సేపటి తరువాత టైమ్ ఎంతయ్యిందో చూద్దామని ఫోన్ ఆన్ చేసినప్పుడు పక్కింటి స్నేహితురాలు ఆరతి పంపిన మెస్సేజ్ కంటపడింది. ఆమె న్యూజెర్సీలోని ఒక స్వచ్ఛంద సంస్థ గురించి వ్రాసింది. స్కూళ్ళు ప్రారంభమైన రోజులు కాబట్టి ఈ సంస్థ అనాథాశ్రమాలలోని పిల్లలకు, నిరాశ్రయులైన పేద పిల్లలకు అవసరమైన పెన్సిళ్ళు, క్రేయాన్లు, కథల పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు సేకరిస్తోంది. దానిలో మనమూ పాల్గొనవచ్చని పిల్లలు వాడని, వాడి వదిలేసిన స్కూలు సామాగ్రిని ఆ సంస్థకు ఇవ్వ వచ్చని ఆ మెస్సేజ్ సారాంశం. సరే పిల్లలు ఇంటికి వచ్చాక వారితో కలిసి ఇంట్లో ఉన్న పాత సామాగ్రిని ఒక చోట చేరిస్తే సరి అనుకుంది శుభ.

అర్జున్ స్కూల్ బస్సు దిగగానే కారులా కనిపించే పెన్ను, మొబైల్ ఫోన్ లా కనిపించే ఎరేజర్ కావాలని మారాం చేయడం మొదలుపెట్టాడు. తన స్కూల్ స్నేహితుడి దగ్గర ఉన్న వస్తువులు వీడికీ కావాల్సి వచ్చింది. శుభ, తన కొడుకు మొండితనం గురించి తెలుసుకాబట్టి, వాటన్నింటినీ కొని ఇవ్వడానికి అంగీకరించింది. ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తున్న అంజలి కూడా తన కోరికల చిట్టాను తల్లి ముందు పెట్టింది. శుభ పిల్లల డిమాండ్లకు నో చెప్పలేదు. అలాగే వాళ్ళిద్దరూ వారు ఉపయోగించని, పుస్తకాలనూ, పెన్సిళ్ళనూ, క్రేయాన్ బాక్సులనూ అవసరమున్న, కొత్తవి కొనలేని పిల్లలకు ఇవ్వాలని కోరింది. తమకు కొత్త పెన్నులూ, పెన్సిళ్ళూ లభిస్తున్నాయన్న సంతోషంలో పిల్లలూ అంగీకరించారు. సాయంత్రం, ఇద్దరు పిల్లలు, శుభతో కలిసి, తమ గదుల్లోని పెట్టెల్లో దాచుకున్న కథల పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను ఒకచోట చేర్చడం ప్రారంభించారు. వారు వస్తువులను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నప్పుడు, పిల్లలిద్దరూ వాటిని కొనడం, బొమ్మలు గీయడం, కలిసి కథలు చదవడం అంతా జ్ఞాపకం చేసుకున్నారు.

పిల్లలు గుర్తు చేసుకుంటున్న జ్ఞాపకాలలో తానూ భాగమైపోయిన శుభకు పొద్దున చదివిన నేమిచంద్ర కథలోని ఈ వాక్యాలు స్ఫురించాయి. “మనిషంటే అతని వ్యక్తిత్వం, తెలివి, ఆస్తి, అంతస్తు, డిగ్రీ, హోదా ఏమేమో అనుకుంటాం. కానీ మనిషి అంటే జ్ఞాపకాలు. పిడికెడు జ్ఞాపకాలు. నేనెవరు అనే జ్ఞాపకాలు, నీవెవెరు అనే జ్ఞాపకాలు. జ్ఞాపకాలు లేని జీవితం కేవలం తోలుసంచి.” ఎంత అర్థవంతమైన మాటలు అనుకుంటూ ఉన్న శుభకు తన పక్కన ఉన్న పెట్టెలో తన పెయింటింగ్‌లు, పుస్తకాలు కొన్ని కనిపించాయి. పెట్టెను ఇంకోసారి వెతికితే పుస్తకాల సందులో దాగున్న ఒక చిన్న డైరీ (చిరునామా పుస్తకం) కనిపించింది. ఆమె గోధుమ రంగు హార్డ్‌కవర్ డైరీని తీసినప్పుడు, శుభ జ్ఞాపకాల వరద దిశను మార్చుకుని రెండు దశాబ్దాల వెనక్కి ప్రవహిం చింది.

ఇరవై సంవత్సరాల క్రితం, తన పరిచయస్తుల చిరునామాలు, ఫోన్ నంబర్‌లను చిన్న అడ్రస్ బుక్‌లో వ్రాసుకుని తన పర్సులో ఎప్పుడూ ఉంచుకునే శుభకు, ఆ చిన్న గోధుమ రంగు హార్డ్‌కవర్ డైరీ, మొదటి పేజీ మధ్యలో “శ్రీ”, కుడి మార్జిన్‌లో కన్నడలో తన పేరు వ్రాసి ఉండటం కనిపించింది. పేజీ మధ్యలో, ఆమెకు తొంభైల నాటి తనకు ఇష్టమైన కర్ణాటక క్రికెటర్ సంతకం కనిపించింది. ఆమె ఆటోగ్రాఫ్ అడిగినప్పుడు, ఇంగ్లీషులో సంతకం చేసిన ప్లేయర్‌ని “కన్నడలో రాయగలరా?” అని అడిగినట్లు గుర్తుకు వచ్చింది. ముఖం మీద చిన్న చిరునవ్వుతో అతను తన పేరును కన్నడలో వ్రాయగా శుభ అతనికి కృతజ్ఞతలు చెప్పి, పేజీ అంచున నవంబర్ 1, 1997 తేదీని రాసింది. అప్పటికీ, ఇప్పటికీ మారని తన మాతృభాషాభిమానాన్ని తలచుకుని శుభ మొహంలో చిరునవ్వు కనిపించింది. పేజీలు తిప్పే కొద్దీ మనసులో ముసురుకున్న జ్ఞాపకాలతో అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇప్పుడు సంపర్కంలో లేని స్నేహితులు, కాలగమనంలో మూతబడిన కంపెనీలు, కనుమరుగైన పెద్దలు, సడలిపోయిన సంబంధాలు ఇలా ఎన్నెన్నో ఆలోచనలు మదిలో కదిలాడాయి. అలా చివరి పేజీ తెరచి చూడగా పై భాగంలో ఏదో కంపెనీ అడ్రసు కనిపించింది. అడుభాగంలో చిన్న అక్షరాలతో, “”బ్యాంక్ మేనేజర్‌కు 5 రూపాయలు ఇవ్వాలి” అని రాసి ఉంది. “మరచిపోకుండా ఉండటానికి వ్రాసుకున్నాను” అని తనకు తాను చెప్పుకున్న శుభకు ఇరవై సంవత్సరాల క్రితం ధార్వాడ్‌లో జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందు మెరిశాయి.

అది సెప్టెంబర్‌ నెల. గణేష్ చవితి పండుగ జరిగిన రెండు రోజుల తర్వాత, శుభ తల్లి సుమిత్రకు అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు వచ్చాయి. మొత్తం కుటుంబం కొంత దిగ్భ్రాంతికి గురయ్యింది.

శుభ జ్ఞాపకాలు కొనసాగాయి. ఆమె ఇంటికి సమీపంలోని దుకాణంలో సరుకులు కొనుక్కొంటే పోయేది. తొందరపడినందుకు తనను తాను తిట్టుకుంది. కొన్ని క్షణాలు, ఆమె ఏమీ పాలుపోకుండా అక్కడే నిలబడిపోయింది. ఇంక కొన్ని గంటల్లో ఆపరేషన్ చేయించుకోబోతున్న ఆమె తల్లి ముఖం ఆమె కళ్ళ ముందు కదలాడింది. కేవలం ఐదు రూపాయలకోసం తాను ఇంత నిస్సహాయ స్థితికి రావలిసివచ్చింది కదా అని ఆమెకు అనిపించింది. శుభ, ఏదో ఆలోచిస్తున్నట్లుగా, నాలుగు అడుగులు నడిచి బ్యాంకు మేనేజర్ క్యాబిన్ తలుపు తట్టింది.

“సర్, నేను లోపలికి రావచ్చా?”

మేనేజర్ కులకర్ణి చిరునవ్వుతో తనను స్వాగతించడం చూసి శుభకు కాస్త ఉపశమనం కలిగింది. ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని తన పరిస్థితిని వివరిస్తుండగా, శుభ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. “ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మీ అమ్మగారికి ఏమీ కాదు, క్షేమంగా వస్తారు చూడు”

శుభను ఓదార్చి అటెండర్‌ను పిలిచి తక్కువపడిన ఐదు రూపాయలు ఇచ్చి బ్యాంకు గుమాస్తానుండి డి.డి.తీసుకు రమ్మని చెప్పారు. డి.డి. తీసుకుని మేనేజర్‌కు ధన్యవాదాలు చెప్పి, సరుకులున్న సంచీని తీసుకుని ఆత్రంగా వెళుతున్న ఆమెకు “జాగ్రత్తగా వెళ్ళమ్మా” అన్న కులకర్ణిగారి మాటలలో వాత్సల్యం కనిపించింది. బస్సు పట్టుకుని ఇంటికి వచ్చిన శుభకు అమ్మమ్మ సీతాబాయి అంతకు ముందు పోస్ట్‌మ్యాన్ తెచ్చి ఇచ్చిన ఉత్తరాలు ఇచ్చింది. గోపాలరావు పేరుమీద వచ్చిన పెళ్ళి శుభలేఖ, అక్క విభకు బావ రాసిన ఉత్తరంతో పాటు తన పేరుమీద కవరును చూసి ఆశ్చర్యపోయింది. ఇరవై రోజులక్రితం ఇంటర్వ్యూకు వెళ్ళివచ్చిన ప్రభుత్వ పాఠశాల టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి వచ్చే వారం జాయిన్ కావాలని వ్రాసి ఉంది. చాలా కాలం నుండీ ఉద్యోగానికై ప్రయత్నిస్తున్న శుభకు తల్లి సుమిత్రను పిలుచుకుని చెకప్, స్కానింగు అంటూ తిరుగాడిన సమయంలోనే మధ్యలో టీచర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్ళి వచ్చిన సంగతి మరిచేపోయింది. రాత్రి బస్సులో బెంగళూరుకు బయలుదేరుతున్న శుభకు డాక్టర్ అపార్థం కారణంగా తల్లి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం, ఉదయం ఐదు రూపాయల కోసం బ్యాంకులో ఆమె అనుభవించిన నిస్సహాయత, ఉద్యోగం కోసం తిరుగుతున్న తీరు, అన్నీ గుర్తుకు వచ్చి తన బాధను ఆపుకోలేకపోయింది. ఆమె తన అమ్మమ్మ చేయి పట్టుకుని ఏడ్చింది.

“అమ్మడూ, దయచేసి ప్రశాంతంగా ఉండు, సుమిత్రకి ఏమీ కాదు. ఇల్లూ, పిల్లలు అని తన జీవితాన్నే అంకితం చేసింది. నీ పెళ్ళి, మీ అన్నయ్య పెళ్ళి చేయకుండా ఎక్కడికీ పోదు చూడు. ఆమె ఆరోగ్యంగా తిరిగివస్తుంది. చింతించకు. లే. లేచి కాళ్ళూ ముఖం కడుక్కుని రా. భోంచేద్దువుగాని” అని సీతాబాయి శుభను ఓదార్చి వంటగదిలోకి వెళ్ళింది.

“అవును కదా, నేను ఎందుకు ఇంత భావోద్వేగానికి గురవుతున్నాను? తన గర్భంలో ముగ్గురు పిల్లలను పెంచి, జన్మనిచ్చి, పెంచిన తల్లి, ఈ రోజు అదే అవయవాన్ని కోల్పోతోంది కదా? అమ్మ కోసం ఈ మాత్రం చేయలేనా? అమ్మ ఆరోగ్యం కుదుట పడ్డాక మళ్ళీ ఉద్యోగం వెదుక్కొంటే సరి”

ఉపశమనం పొందిన శుభ, బ్యాంకులో తన అనుభవాన్ని మళ్ళీ గుర్తుచేసుకుని, తన పర్సులోంచి ఒక చిన్న డైరీని తీసి, చివరి పేజీ అంచున చిన్న అక్షరాలతో “నేను బ్యాంకు మేనేజర్‌కి రూ. 5 ఇవ్వాలి” అని రాసి, ఆ రాత్రి బెంగళూరుకు బయలుదేరడానికి సిద్ధమైంది.

సుమిత్ర ఆపరేషన్ తర్వాత రోజుల్లో శుభ తన తల్లికి తల్లిలా సేవ చేసింది. ఆమె సంరక్షణలో, సుమిత్ర కొంతవరకు కోలుకుంది. కానీ తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న సుమిత్ర, బెంగళూరు నుండి తిరిగి వచ్చినప్పటి నుండి భర్త గోపాల్‌రావుతో ముంబైలో ఉన్న తన కొడుకు పెళ్ళి చేయాలని పట్టుబట్టడం ప్రారంభించింది. గోపాల్‌రావు, సీతాబాయి కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. వివేకానంద్ వివాహం రెండు నెలల్లో జరిగిపోయింది. తన సోదరుడి వివాహ బాధ్యతలతో బిజీగా ఉన్న శుభకు, రిసెప్షన్‌కు వచ్చిన బ్యాంక్ మేనేజర్ కులకర్ణిగారు కనిపించారు. శుభ అతనితో మాట్లాడటానికి వేదిక వద్దకు వచ్చేసరికి, వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి కులకర్ణి అప్పటికే డైనింగ్ హాల్‌కు బయలుదేరారు. ఇంతలో భోజనానికి ముందు అమ్మకు మందులు ఇవ్వాలని గుర్తుచేసుకుని గదివైపు నడిచింది. ఈ హడావిడిలో ఆమెకు బ్యాంక్ మేనేజర్‌ను పలకరించడానికి వీలుకాలేదు. తరువాతి రెండు వారాల్లో, శుభ ఇంట్లో పూజలు, వేడుకలతో బిజీగా ఉంది. ముంబై వెళ్ళడానికి సిద్ధమౌతున్న అన్న, వదినల సామాగ్రి ప్యాక్ చేయడానికి సహాయం చేస్తోంది. ఒకరోజు బ్యాంకుకి వెళ్ళిన గోపాల్‌రావు కొన్ని వార్తలు మోసుకొచ్చాడు.

“మేనేజర్ కులకర్ణి ఢిల్లీకి బదిలీ అయ్యి, తన కుటుంబాన్ని తన స్వస్థలంలో వదిలి, ఒంటరిగా ఢిల్లీకి వెళ్ళారట. వారం క్రితం ఆయన తీవ్రమైన గుండెపోటుతో మరణించారట, మరుసటి రోజు ఉదయం వచ్చిన పాలవాడు ఛూశాకనే ఆ విషయం తెలిసింది. పాపం. చాలా మంచి మనిషి.”

“అయ్యో, నేను వారికి ఐదు రూపాయలు ఇవ్వాలి. నేను నా డైరీలో కూడా రాసుకున్నాను. చాలా భోళా మనిషి. పాపం, ఇలా జరిగి ఉండకూడదు” ఆ రోజు తనకు సహాయం చేసిన వ్యక్తికి సహాయం చేయడానికి ఎవరూ లేరని శుభ విలపించింది.

ఇప్పుడు న్యూజెర్సీలో ఉన్న శుభ, ఆ పాత డైరీని చూసి మళ్ళీ అదే బాధకు గురైంది. ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? అవసరంలో ఉన్న ఇతరులకు సహాయం చేస్తే ఆ రుణం తీరుతుందేమో అనుకుంది. వెంటనే స్నేహితురాలు ఆరతికి ఫోన్ చేసి, అనాథ పిల్లల కోసం భారీగా సహాయం చేయడానికి సిద్ధపడింది.

శుభ నిర్ణయం చాలా ప్రశ్నలను లేవనెత్తింది. శుభ సుమిత్ర, గోపాల్‌రావుల కూతురిగా ఈ ఐదు రూపాయల అప్పును తీర్చిందా లేదా అంజలి, అర్జున్‌ల తల్లిగా తీర్చిందా? కొడుకులు మాత్రమే తల్లిదండ్రుల అప్పులు తీర్చగలరని ఇప్పటికీ నమ్మే, పరిస్థితి ఎలా ఉన్నా తమ కొడుకు వివేకానంద్ తరపున మాట్లాడే గోపాల్‌రావు, సుమిత్రలకు శుభ ఇచ్చిన సమాధానమా ఇది? లేదా తన జీవిత అనుభవంతో అవసరంలో ఉన్నవారికి ఎక్కువగా సహాయం చేయడం తన పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నించిందా? ఏమో. అప్పుడు కూడా శుభ మనసులో అదే పాట మెదిలింది… “హెణ్ణల్లవే నమ్మనెల్ల పడెద తాయి… హెణ్ణల్లవె నమ్మనెల్ల హొరవవళు …”

కోడిహళ్లి మురళీ మోహన్

రచయిత, సాహిత్యాభిమాని, అనువాదకుడు, సంపాదకుడు వికీపీడియన్. తెలుగు కన్నడ భాషలలో అనువాదాలు చేస్తున్నారు. కథాజగత్, సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం, జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు, రైలు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులంకథ, క్రీడాకథ, రామకథాసుధ, పదచదరాలు, స్వాతంత్ర్యభారతికి అమృతోత్సవ హారతి అనే పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రముఖ హేతువాది, విద్యావేత్త డా.హెచ్.నరసింహయ్య ఆత్మకథను పోరాటపథం పేరుతో తెలుగు ప్రజలకు పరిచయం చేశారు.

Previous Post

రైదాస్

Next Post

ఒరియా కథ : నాకీ పెళ్ళొద్దు

Next Post
ఒరియా కథ : నాకీ పెళ్ళొద్దు

ఒరియా కథ : నాకీ పెళ్ళొద్దు

Discussion about this post

ఈ సంచికలో…

  • ఒరియా కథ : నాకీ పెళ్ళొద్దు
  • కన్నడ కథ: ఐదు రూపాయల రుణం
  • రైదాస్
  • మహిళల మధ్య
  • తమిళ కథ : చెడ్డ కుమారుని కథ
  • నేను నిన్ను ప్రేమిస్తున్నాను !
  • గుజరాతీ కథ : వైట్ హార్స్
  • తొలి ప్రేమ
  • కన్నడ కవిత : నవ్వు
  • 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు
  • కన్నడ కథ: ఆ ఒక విధంగా …
  • రష్యన్ కథ : మాస్క్
  • తమిళ కథ : పుష్పించని చెట్టు
  • యుగోస్లేవియా కథ : కాప్టెన్
  • అనువాద కవిత : నూతన సంవత్సర ఉదయం
  • ఆంగ్ల కథ : టెలిఫోన్ కాల్ 
  • కన్నడ కథ :  అంతర్వాహిని
  • అనువాద కవిత : ఒక సంవత్సరం

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com