• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

గుజరాతీ కథ: సైనికుడి సంతానం 

పాలెపు బుచ్చిరాజు by పాలెపు బుచ్చిరాజు
April 11, 2026
in అనువాద కథలు
0
గుజరాతీ కథ: సైనికుడి సంతానం 

గుజరాతీ మూలం: రావ్ జీ పటేల్
అనువాదం: పాలెపు బుచ్చిరాజు 

రాజు వరండాలో కూర్చుని బియ్యం బాగు చేస్తోంది. అలవాటుగా ఒక బియ్యపు గింజ నోట్లో వేసుకుంది. ఉన్నట్టుండి ఆమెకు ఒకప్పటి చిన్న సంభాషణ గుర్తుకి వచ్చింది. 

“చూడు! రాజూ! నీ యీ అలవాటు నాకు నచ్చదు.”

“ఏం? ఎందుకు?”

ఆ తరవాత ఆ ప్రశ్నకు జవాబు లేకుండానే వాదన పూర్తయింది. ఆ బియ్యపు గింజతో స్థిరమైన మౌనం ఆ వరండాలో అలుముకుంది. పండు ముసలి అత్తగారు ఆ మౌన విలాపాన్ని గుర్తించి, నిద్ర లేపుతున్నట్టుగా ఆమెను పిలిచింది.

“అమ్మా! రాజూ!”

రాజు తనని తాను సంబాళించుకుని, ‘ఆ’ అని పలికింది, బియ్యం బాగు చేసే పనిలో లీనమైనట్టు నటిస్తూ. 

“వెళ్లినవాడు వెళ్లి నట్లే వెళ్ళాడు. నువ్విలా అయిపోయావు. వాడు ఎప్పుడు తిరిగి వస్తాడో తెలీని పరిస్థితిలో వాడిని ఎందుకు వెళ్ళనిచ్చావు?”

వడిలి పోయిన కమలం లాంటి ముఖం మీద చిరునవ్వు తెచ్చుకుని అంది రాజు. ” ఏం మాట్లాడుతున్నారు అత్తయ్యా! దేశం కోసం తుపాకి పట్టినవాడిని ఎవరైనా అడ్డుకోగలరా? అయినా ఆయన తిరిగి రాడని నేను కలగన్నానా?…అయినా ….” ఆమె చేతిలో చేటని అలాగే వదిలి పెట్టి లేచి నిలబడింది. ఆ ముసలి ప్రాణం “అయినా…..” అన్న తరవాతి మాటలు వాచ్యంగా చెప్పగలిగేవి కావు అన్న విషయం అర్థం చేసుకుంది. 

గత సంవత్సరం నుంచి మాధవ్ ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. ఏం అయి ఉంటుందో! అయన మిలిటరీలో చేరిన కొత్తలో ఎన్ని ఉత్తరాలు రాసేవాడని! రాజు భద్రంగా దాచుకున్న ఆ ఉత్తరాల పెట్టె తెరిచింది. అందులో అన్నీ ఆయన రాసిన ఉత్తరాలే! ఒక్కొక్క ఉత్తరమూ తీసి అప్పుడే వచ్చిన ఉత్తరంలా చదవ సాగింది. 

ఈ ఉత్తరం డాకోర్ లో మొదటిసారి హోమ్ గార్డు ఆఫీసులో ఉన్నప్పుడు రాసినది. ఆమెకు నవ్వు వచ్చింది. ఒక రోజు దూరంగా ఉన్నందుకే ఇంటిలో ఉన్న వాళ్ళ మీద బెంగ. “ఈ రోజు నేను ఆఫీసుకు వెళ్ళాను. నా గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోకు. నువ్వు భోజనం చెయ్యి.“ అది చదివినప్పుడు ఆమెకు అతనితో డాకోర్ లో నే ఉన్నట్టు అనిపించింది. 

ఇది తరువాతి ఉత్తరం. ఇదయితే యుద్ధపు ఛాయల్లోంచే రాశాడు. దీనికి ముందు ఓ డజనుకి పైగా ఉత్తరాలు వచ్చాయి. అవన్నీ మధ్యలో కలిసి పోయాయి. రాజు మనసు చింతించసాగింది. ఉత్తరం చాలా పెద్దది. ఒకనాటి మధ్యాహ్న సమయం. అత్తయ్య ఇంట్లో లేదు. ఆయన పెద్ద తుపానే సృష్టించాడు. ఇంట్లో మేము ఇద్దరమే ఉన్నామని, నన్ను గట్టిగా కౌగలించు కున్నాడు. నేను తప్పించుకుని అత్తయ్య గదిలోకి పరుగు తీశాను. నావెనకనే వచ్చి నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. చేతికున్న గాజులు పగిలిపోయేలా. ఆ సంఘటనని గుర్తు చెసుకుంటూ ఈ ఉత్తరం రాశాడు. 

“ఈ ఉత్తరం నా టెంటులో నుంచి రాస్తున్నాను. కాళ్ళకున్న బూట్లు కూడా విప్పకుండా మంచం మీద పడుకున్నాను. ప్రక్కనే నీ చేతిలా నా తుపాకి పడి  ఉంది. ఏ నిముషంలోనైనా శత్రువు ఎటాక్ చేయవచ్చు. పారిపోయి ట్రెంచ్ లో దాక్కోవాలి. నా కైతే …. ఆ గాజుల సంగతే గుర్తుకి వస్తోంది….. అదుగో! అంతలోనే సిగ్గుపడి పోతున్నావు…..”  

మాధవ్ కి అక్కడ ఒంటరిగా ఉండి, ఉండి ఏడవాలనిపిస్తుంది కాబోలు. తను జవాబు రాసింది. “అలా ఎందుకు రాస్తావు? నేను రోజూ నీ భద్రత కోసం భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాను.” వెంటనే జవాబు వచ్చింది. “నువ్వు  ఏమీ బాధపడకు. నేను ఆట్టే ఆలోచించ కుండా అలా రాశాను.” అంటూ. రాజు ఆ ఉత్తరం మీద, నిద్రపోతున్న భర్త వీపు మీద రాస్తున్న భావనతో సుతారంగా రాయ సాగింది. 

మాధవ్ దగ్గర్నుంచి మరో ఉత్తరం వచ్చింది. అది చదవ కుండానే తను అర్థం చేసుకోగలదు. అది దీపావళి ముందు వచ్చింది. ఈ దీపావళి  అతను లేకుండా గడపాలి. ఉత్తరం వచ్చాకే ఇంట్లో దీపావళి పనులు ఆరంభం అయ్యాయి. 

ఆ ఉత్తరంలో ఇలా రాశాడు. “ఇక్కడ మా దీపావళి గురించి ఎంతని చెప్పగలను! ఒక్కొక్క తుపాకి గుండు ఒక్కొక్క శత్రువు గుండెల్ని పేల్చేస్తుంది. ఎటాక్ చేసిన వాళ్ళు ఎలుకల్లా అయిపోతారు. వాళ్లకి ఏం జరుగుతోందో కూడా అర్థం కాదు. నిన్నటి గురించే చెప్పుతాను. మేం పదిహేను మందిమి పాటలు పాడుకుంటూ ఆనందిస్తున్నాము. నీ పేరు లాంటి పేరున్నవాడు -అదే- రాజు- వాడిపేరు, ఒకడున్నాడు. వాడికింకా పెళ్లి కాలేదు. ఇక్కడికి వచ్చేముందయినా అయి ఉంటే, సుఖంగా చచ్చేవాడు. కాని ఇప్పుడు చావడానికి కూడా లేదు అని మేము వాడిని ఏడిపిస్తూ ఉంటాము. ఇంకా కొత్త పెళ్లి కూతురిలా నెత్తి మీద కుండ పెట్టినట్టు తుపాకి పెట్టి నటిస్తూ వాడిని ఆట పట్టిస్తాము. నువ్వు పాడే దానివి కదా! “ఓ రాజా! చెరువు నీళ్ళకు వెళ్ళానోయ్ “ అని, ఆ పాట గుర్తుకి వచ్చింది. ఆ(! ఏం రాస్తున్నాను నేను? మేం పాటలు పాడుకుంటూ ఆనందిస్తున్నామని కదూ! ఇంతలో హఠాత్తుగా బాంబుల వర్షం ఆరంభం అయింది. నా పరాక్రమం గురించి చెప్పడం కాదు. నువ్వు చాలా అమాయకురాలివి. చినుకులు మీద పడినా భయపడి పోతావు. ఈ దీపావళి  ఆనందంగా జరుపుకొ!” 

“ఇంకా ముఖ్యంగా రాద్దా మనుకున్న దేమిటంటే, అక్కడ నా బట్టల్లో ఒక కోటు ఉంది. అది ‘గబా’కి ఇచ్చెయ్యి. చలికాలం వస్తోంది. పాపం బీదవాడు చలి భరించ లేడు. “

రాజుకి ఉన్నట్టుండి నవ్వు వచ్చింది. ఉండబట్టలేక ఆమె ఉత్తరంలో చివరి భాగం అత్తగారికి చదివి వినిపించి, “మీ అబ్బాయి చాలా చిలిపివాడు.” అంది. అదే రోజున కోటు తీసుకుని ‘గబా’ ఉండే పూరి గుడిసెకి వెళ్లి ఇచ్చి వచ్చింది. పెద్దింటి ఆడపడుచు పేదవాడి ఇంటికి వెళ్ళడమా అని  కూడా ఆలోచించలేదు. ఉత్తరం చదవడం పూర్తి కాగానే ఆమె కళ్ళు చెమర్చాయి. ఆ అక్షరాలలో ఎన్నో మధుర భావాలు.  

ఒకసారి పొలంలో పొగాకు నాట్లు వేస్తున్నారు భార్యా భర్తలు. ఇద్దరి మధ్య పోటీ వచ్చింది. షరతులు పెట్టుకున్నారు. ఎవరు ఓడిపోతే వారు గెలిచిన వారికి అయిదు రూపాయలు ఇవ్వాలి. రాజు ఆ ఉత్తరాన్ని పొగాకు ఆకులా అనుభూతి పొందుతూ తన చెంపల మీద రాసుకో సాగింది. ఉత్తరం చదవ సాగింది. 

“ప్రియా! రాజు!”

ఆ సంబోదన చదువుతూనే ఆమె ఎవరో పిలిచినట్టుగా “ఆ(!” అని పలికింది. అంతలోనే తను చదువుతున్నది ఉత్తరం అన్న విషయం గుర్తు తెచ్చుకుంది. 

“నేను నిన్నెంతగా తలుచు కుంటూన్నానో తెలుసా! దిల్లి వెళ్ళినప్పుడు నీకు ఉలెన్ బట్టలు పంపాను. అలాగే అమ్మకి శాలువా కూడా. ఆ తరవాత చాలా జరిగాయి. యుద్ధం కూడా ఆగిపోయింది. సెలవు దొరికింది కూడా. రిగ్యులర్ గా ఉన్న సైనికులకి ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. కాని నేను రిగ్యులర్ కాదు. అత్యవసర పరిస్థితుల్లోనే కాని సెలవు దొరకదు. నీకొక శుభ వార్త. నాకు దిల్లీలో ఎన్ . సి . సి. అండర్ ఆఫీసర్ గా ప్రమోషను వచ్చింది. ఉండడానికి అన్నీ సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడే ఒక కాలేజి ప్రొఫెసర్ తో నాకు పరిచయం అయింది. ఆయన కూతురు ‘రేణు’ నన్ను ఎన్నోసార్లు భోజనానికి ఆహ్వానించి ఆదరించింది. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నీకు రెండు చీరలు పంపుతున్నాను. రేణుయే సెలక్టు చేసింది. నీకు నచ్చుతాయని అనుకుంటాను. వెంటనే ఉత్తరం రాయి. “  

రాజు ఉత్తరం ప్రక్కన పెట్టి లేచి నిలబడింది. తలుపులు తెరిచి, ఎదురుగా బాత్రూము వైపు చూసింది. అక్కడ ఉన్న ఒక చెట్టు మీద  చిలక వచ్చి కూర్చుంది. ఆ చెట్టు పచ్చరంగులో అది కలిసి పోయింది. ఏదో తెలియని భావన! ఆ చిలకకి కూడా చెట్టులాగే ముళ్ళు ఉంటాయా? మనసు పరి పరి విధాల పోతోంది. ఆమె తిరిగి ఉత్తరాల దగ్గరికి వచ్చింది. కొన్ని ఉత్తరాలు చదవకుండానే, చదివిన వాటి వైపు పడేసింది. తరవాత తనని తాను సంబాళించుకుంది. 

ఆ ఉత్తరం వచ్చినప్పుడు తనకేమీ కొత్తగా అనిపించ లేదు. తిరిగి జవాబు కూడా రాసింది. “చూడూ! నువ్వు నన్నేమీ మరిచిపోవు కదా!” అంటూ. 

కాని ఆ ఉత్తరం తరవాత ఆరు నెలలు గడిచాయి. ఏ కబురూలేదు. ఈ పోస్ట్ మేన్ గానే చచ్చాడా? ఏమిటి? అనిపించింది తనకి. పొలంలో రెండు పంటలు పండాయి. గబా కి ఇచ్చిన కోటు తూట్లు పడి చినిగిపోయింది.  

చాలా కాలానికి పోస్ట్ వాడు ఒక ఉత్తరం గదిలో పడేలా విసిరేసి వెళ్ళిపోయా డు. ఆమె ఆనందానికి హద్దుల్లేవు. చటుక్కున వెళ్లి ఉత్తరం చేతిలోకి తీసుకుంది. అత్తగారు చూడకుండా ఒక మూలకి పోయి కూర్చుని ఉత్తరం చదవ సాగింది. 

“ఏం రాశాడు?” అత్తగారు అడగనే అడిగింది. 

ఆ ఉత్తరం చదువుతూ ఉండగానే ఆమెలో సుడిగాలిలా వచ్చిన ఆనందం చల్లారిపోయింది. 

“బాగానే ఉన్నారు.” ఆమె పేలవంగా జవాబు ఇచ్చింది. 

“ఒకసారి చదివి వినిపించ రాదూ! ఏం రాశాడో!”

ఏం చదువు తుంది? తను. మాధవ్ ఉత్తరంలో రాశాడు. అతను రేణుతో కలిసి జీవిస్తున్నాడు. ఆగ్రాలో వ్యాయామ శిక్షకుడిగా ఉద్యోగం దొరికింది. ఇంతటి ఘోరమైన నిజాన్ని అతనెల రాయగలిగాడు? కాని రాజుకి ఎందుకో అంతగా దుఃఖం కలగ లేదు. 

ఎందుకంటే…..

ఈ విషయం తనకి ముందు వచ్చిన ఉత్తరంలోనే అర్థం అయింది. అదే సంగతి తన జవాబులో రాసింది. “ఇందులో ఆశ్చర్య పడవలసిన అగత్యం ఏమీ లేదు. కాని ఈ వార్త అత్తయ్యకి చెప్పను. ఇది విని ఆమె ఏ మైపోతారో! ఆమె ఎంత అందంగా ఉందో కాస్త రాయ కూడదూ! నాకేమీ బాధ అనిపించదు లే! బాధ అంటూ ఉంటే అది ఒక్కటే!  రెండేళ్ళ పాటు నువ్వు నాకేమీ తెలియ జేయలేదు. ఉత్తరం కూడా రాయలేదు. మన పొలంలో పొగాకు బాగా పండింది. మంచి ధర వచ్చింది. డబ్బు ఏమైనా అవసరం అయితే తెలియజేయి.”

ఆ ఉత్తరం అందుకున్న మాధవ్, అంతమంచి భార్య దగ్గర ఈ విషయం ఇంతకాలం దాచి ఉంచడం నేరమే అనిపించింది. అతను సమాధానం రాశాడు. “నేను చాలా విషయాలు నీ దగ్గర దాచాను. నన్ను క్షమించు. మేము ఆగ్రాలో ఈ రెండేళ్ళనుంచి సుఖంగా జీవిస్తున్నాము. అమ్మకి, ముఖ్యంగా నీకు చాలా బాధగా ఉంటుందని చెప్పలేదు. నన్ను మనసారా క్షమించమని వేడుకుంటున్నాను. నీకో విషయం చెప్పనా!  రేణుకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. కవలలు. ఇద్దరూ ఒకే పోలికలో ఉంటారు. ఇప్పుడు ఇద్దరూ నడుస్తున్నారు. ఒకరు పడుకుని, ఒకరు లేచి ఉంటే, ఎవరు పడుకున్నారో, ఎవరు లేచి ఉన్నారో  చెప్పలేం! పేర్లు పెట్టినా సరే, ఎవరు ఎవరో పోలిక పట్టలేం! ఆనవాలు కోసం మేము ఒకదాని ముంజేతికి ఎర్ర రంగు దారం కట్టాము. దానికి రేణు ‘డాలీ’ అని పేరు పెట్టింది. రెండో దానికి పక్కింటి వాళ్ళు ‘మల్లీ’ అని పేరు పెట్టారు. ఇద్దరూ ముద్దుముద్దుగా ఇప్పుడే మాటలు నేర్చుకుంటున్నారు. భలే పెంకితనం చేస్తారు. డాలీకి చేతికున్న రంగు దారం నచ్చలేదు. తీసిపారేసింది. దాని నుదురు అచ్చం నా నుదురే! రంగులో మాత్రం  ఇద్దరూ తల్లినే పోలారు. 

రాజూ! నేనేం చేయను చెప్పు? నాకు అక్కడికి రావాలని ఉంటుంది. నీతోను, అమ్మతోను మాట్లాడాలని ఉంటుంది. మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. కాని భయంగా ఉంది. విషయం తెలిసి అమ్మ ఏమై పోతుందో నని. నేను నిన్నేమీ దూరం చేసుకోలేదు. ఇంత జరిగినా కూడా నువ్వెప్పుడూ నాకు దగ్గరగానే ఉంటావు. మొదట్లో ఎలా ఉన్నామో అలా. అంతకంటే కూడా…..”

రాజు ఆ ఉత్తరం వచ్చాక కూడా మనసుని చిక్కబట్టుకుని ప్రశాంతంగా ఉండ సాగింది. అత్తగారు ఎన్నో సార్లు అడుగుతోంది. అబద్ధం చెప్పి అసలు విషయం దాచి  పెడుతూ వస్తోంది. ప్రాణాలు కళ్ళలో పెట్టుకుని జీవిస్తున్న ఆ వృద్ధమాత దేనినీ రహస్యంగా ఉంచలేదు. కాని ఒక విషయం మాత్రం ఆమె జీర్ణించుకోలేక పోతోంది. భర్త దగ్గర్నుంచి ఉత్తరం వచ్చిన వెంటనే పరుగులు పెట్టి తెచ్చుకుని చదివి ఆనందించే కోడలు ఈ మధ్య ముభావంగా ఉండ సాగింది. ఒక్కరితే పోయి ఒక మూలన కూర్చుని చదువు కుంటోంది. తనకి చదివి వినిపించడం లేదు. ఈ రహస్యం ఏమిటో తనకి అర్థం కావడంలేదు. ఒకనాడు వచ్చిన ఉత్తరం ఆమె ఎక్కడ పెట్టిందో తెలుసుకుని, కోడలు నీళ్ళకోసం చెరువుకు వెళ్ళినపుడు, పక్కింటి కుర్రాడి చేత ఆ ఉత్తరాన్ని చదివించింది. వాడికేం తెలుసు? పాపం వాడు ఉన్నదున్నట్లు చదివి వినిపించాడు. వెంటనే ఆమె వాడి చేతిలోంచి ఉత్తరం లాక్కుని వాడి బెల్లం  మిఠాయి ఇచ్చి పంపించింది. 

అంటే… వాడు పెళ్ళాన్ని వదిలేసి మరొక దాన్ని పెళ్లి చేసుకున్నాడన్నమాట. ఆమె కళ్ళలో నీళ్ళు నిండాయి. ఇంట్లో సతీదేవి లాంటి భార్యని వదిలి పెట్టి ……  వాడి కిదేం పోయేకాలం! తన కొడుకే తనని గుండెల మీద గొడ్డలి దెబ్బ కొట్టాడని విలపించింది. రాజు చెరువు నుంచి వచ్చేవరకూ ఆముసలమ్మ చేతిలోని ఉత్తరం అలానే ఉంది. లోపలి వస్తూనే రాజు అత్తగారి చేతిలో ఉత్తరం చూసి గాభరా పడిపోయింది. 

“అత్తయ్యా! ఈ ఉత్తరం …. మీకెక్కడిది?”

“తీశాను తల్లీ! నా ఖర్మ కాలి తీశాను. నీ గుండెల్లో ఇంత విషాదాన్ని దాచుకుని నాకన్ని అబద్ధాలు చెప్పుతూ వచ్చావా? అమ్మా! నువ్వింకా బతికే ఉన్నావా?”

“అరె! అత్తయ్యా! ఇదేమిటి? మీరు. చిన్నపిల్లలా.” 

కాని రాజుని వినిపించు కోకుండా ఆముసలి ప్రాణం విలపిస్తూనే ఉంది. ఆఖరికి రాజు అంది.

“అంతా అయిపోయాక ఇప్పుడు తల బాదుకుని ఉపయోగం ఏముంది? జరిగినదేదో జరిగిపోయింది. కాని మనకి వారసులంటూ ఇద్దరున్నారు. అని సంతృప్తి పడ్డాను.”

అది విన్న ముసలమ్మ ఇంకా ఎక్కువ కోపంతో ఇలా అంది. “ఆ( ! వారసులుట! వారసులు. ఆ పరాయివాళ్ళు మనకి వారసులు ఎలా అవుతారు?”

“అలా అనకండి అత్తయ్యా! ఇందులో బాధపడవలసినది ఏముంది? ఈ పిల్లలే నాకు పుట్టి ఉంటే, పరాయి వాళ్ళు అయేవారా?”

ఇంక అక్కడ ఉండలేక అత్తగారు ఆ పిల్లల్ని తిట్టుకుంటూ బైటికి వెళ్లి పోయింది. తను మాధవ్ కి ఈ విషయం తెలియ జేస్తూ ఉత్తరం రాసింది. ఇంకా అందులో,

“పిల్లలకి నువ్వు అలాంటి పేర్లు పెట్టావేమిటి? ఎవరైనా వింటే “అలీ- మలీ” అన్నట్టు ఉంటాయి. మరేవైనా మంచి పేర్లు పెడదాము. వాళ్ళ ఫోటోలు పంపించు. వాళ్ళ పేర్లు “సోనా-రూపా“ గా వెంటనే మార్పు చెయ్యి. మీరందరూ ఇక ఆగ్రా మరిచిపోయి మన ఇంటికి వచ్చెయ్యండి. అత్తయ్యని నేను సంబాళించుకుంటాను.”

రాజు రాసిన ఉత్తరం చదవగానే మాధవ్ నిశ్చేష్టుడై పోయాడు. అతను చాలా గాభరా పడిపోయాడు. అమ్మకీ విషయం తెలిసిందంటే ఇక తనని ఏ దేముడూ రక్షించ లేడు. ఇప్పుడు తను భార్యా పిల్లల్ని వెంట బెట్టుకుని వెళ్తే ఊరిలో ఎంత అవమాన కరంగా ఉంటుంది! ఆ సీత లాంటి భార్యని కాదని ఈ రెండోదానిని ఎలా మోహించ గలిగావు? అని అందరూ తిట్టరూ! అంతటి అవమానాన్ని భరించే శక్తి తనలో లేదు. ఇలా ఆలోచించి అతను మౌనం వహించడానికే నిర్ణయించుకుని జవాబు రాయలేదు. 

ఒక వర్షాకాలం పూర్తిగా కళ్ళనుంచి వర్షించింది. రాజు మాధవ్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఆమె ఉత్తరాలు వచ్చినపుడల్లా అతను పశ్చాత్తాపంతో కృంగి పోతూనే ఉన్నాడు. అతను జవాబు రాయడానికి కూడా సిగ్గు పడుతున్నాడు. 

రాజు నిత్యం ఈశ్వరుడిని ప్రార్తిస్తూనే ఉంది. కాని భగవంతుడు ఆమె విన్నపాలని మన్నించలేదు. ఈ రోజు తాను బియ్యం బాగు చేస్తూ ఉండగా నోట్లో బియ్యపు గింజ వేసుకోవడంతో అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఉన్నట్టుండి ఆమె కళ్ళు చెమర్చాయి. బైటికి తీసిన ఉత్తరాలన్నీ తిరిగి పెట్టె లో వేసి, కిటికీ దగ్గరికి వచ్చింది. ఆ చెట్టు మీద వాలిన చిలుక అక్కడ లేదు. ఎగిరిపోయింది. రాజుకి శరీరం అంతా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అనిపించ సాగింది. 

“అమ్మా! రాజూ!” పిలుపు వినబడి ఆమె కిటికీ దగ్గర నుంచి కదిలింది. 

“ఇలా రా! ఏదో టెలిగ్రాము వచ్చింది. “ అని అత్తగారు పిలిచింది.

రాజు పరుగెత్తుకుంటూ వరండాలోకి వచ్చింది. టెలిగ్రాము తీసుకుని వణుకుతున్న చేతులతో దాన్ని చదువుతూనే నిశ్చేష్టురాలయింది. అది పైకి చదవ వలసిన అగత్యం లేకుండానే ఆ ముసలి అత్తగారు ఆశుభాన్ని అవగతం చేసుకుంది. 

మాధవ్ మోటారు యాక్సిడెంటులో చనిపోయాడు.

ఆ రోజంతా  ఏడుపులతో గడిచిపోయింది.  మర్నాడు అత్తగారు కోడల్ని అడిగింది. “అసలేం జరిగిందో నాకు కాస్త వివరంగా చెప్పు. వాడికి ఇలాంటి దుస్థితి పట్టిందేమిటి? దేశం కోసం యుద్ధం చేస్తానని వెళ్ళాడు. పోనీ ఆ యుద్ధంలో ప్రాణం పోయినా ఇంత బాధ అనిపించేదికాదు. కాని ఈ మోటారు వాహనమే నా కొడుకుని ఎగరేసుకు పోయింది. నేను బ్రతికి ఉండగానే నిన్ను విధవగా చూసే దుర్భాగ్యం నాది. అమ్మా! రాజూ! విచారించకు. నీ నుదుట భగవంతుడిలా రాశాడు. మన చేతుల్లో ఏమీ లేదు.”

రాజు కూడా తనని తాను సంబాలించుకుంది. ఆ ముసలామెకి ధైర్యం చెప్పింది. “ఫరవాలేదు అత్తయ్యా! ఈ బాధని నేను భరించగలను. నేను మిమ్మల్ని చూసుకుంటాను. నిశ్చింతగా ఉండండి.” అని ఊరడించింది. వెంటనే ఆమె సజల నేత్రాలతో ఆగ్రాకి ఒక ఉత్తరం రాసి పడేసింది. “నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చెయ్యి. ఇంటి సామాను తరవాత చూసుకో వచ్చును. ముందుగా నువ్వు పిల్లలతో వచ్చేయి.” అని. 

ఆ తల్లి, ఇద్దరు పిల్లలు వచ్చే సమయానికి రాజు డాకోర్ స్టేషనుకి వెళ్ళింది. రైలు వచ్చింది. ప్రయాణికులు ఒక్కొక్కరు దిగి వెళ్తున్నారు. రైలు కూడా ముందుకు సాగిపోయింది. స్టేషను సుమారు ఖాళి అయింది. దూరంగా ఒక విద్యుత్తు స్తంబానికి ఆనుకుని గుంపులో తప్పిపోయిన వారిలా ముగ్గురు ఆడ పిల్లలు రాజుకి కనిపించారు. ఆమె పరుగు పరుగున వారిని చేరుకుంది. తను చూసిన ఫోటోలోలాగే ఇద్దరు పాపలు. వారిలో మాధవ్ నుదురుని పోలిన నుదురు ఉన్న పాపని గుర్తించి ఎత్తుకుంది. “అమ్మా!” అంటూ ముద్దులు పెట్టుకో సాగింది. చేతికి దారం లేని ఆ పాపని తీసుకుని స్టేషను బైటికి వచ్చింది. మిగిలిన వాళ్ళు రావడం కోసం కూడా ఆగలేదు. అక్కడ ఒక వేపచెట్టు నీడన ఆగింది. వెనకనే తెల్ల చీర కట్టుకుని వచ్చిన రేణుని ఒకసారి ఎగాదిగా చూసింది. ఆమె అందాన్ని చూసి ముగ్దురాలయింది. 

“నువ్వెంత అందంగా ఉన్నావు! ఆడదాన్ని నాకే మనోహరంగా కనిపించావు. ఇక మగవాడు ఆయన్ని ఎలా తప్పుపట్టగలను? ఈశ్వరుడు నా ఒక్క మనిషిని తీసుకుపోయి ముగ్గురు పిల్లల్ని ఇచ్చాడు. నేను ఎవరికి కృతజ్ఞు లిని? నీకా ఆ భగవంతుడికా? నిన్నిలా తెల్లబట్టలు కట్టుకోమని ఎవరు చెప్పారు? నువ్వింకా చిన్న పిల్లవి. నా మూడో కూతురు లాంటి దానివి. “ అంటూ ఆమెను అక్కున జేర్చుకుంది. రేణు ఆమెను కౌగలించుకుని ఏడ్చింది.

 కన్నీళ్ళు కారుస్తూ రేణు అంది. “ఇప్పుడు ఆయన పోయారని, నేను అనాధనని అనుకోవడం లేదు.”

 

పాలెపు బుచ్చిరాజు

స్వస్థలం గునుపూడి, విశాఖపట్నం జిల్లా. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర పట్టా పుచ్చుకుని, ‘చమురు సహజవాయు సంస్థ’ లో భూభౌతిక శాస్త్రజ్జుడిగా, ఉద్యోగ రీత్యా 1965 డిశంబరు నెలలో మొట్టమొదటి సారిగా గుజరాత్ నేల మీద అడుగుపెట్టారు. 1968లో బరోడా వచ్చి స్థిరపడ్డారు. 40 సంవత్సరాలుగా కథలు, వ్యాసాలూ, నవలలు సుమారు రెండు వందల వరకు రాశారు. వీటిలో స్వంత రచనలేకాక , గుజరాతీ, ఆంగ్ల భాషల్లోంచి చేసిన అనువాదాలు కూడా ఉన్నాయి. నాలుగవ ప్రపంచ మహా సభల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు, ‘రాష్ట్రేతరాంధృడిగా తెలుగు భాష వ్యాప్తికి వీరు చేస్తున్న కృషిని గుర్తించి 2012 లో సత్క రించారు.
2016 లో ”గుజరాతీ సాహిత్యం – ఒక విహంగ వీక్షణం” పేరున పుస్తకం ప్రచురించారు. శ్రీకాకుళంలో శ్రీ కాళీపట్నం రామారావు గారు స్థాపించిన ‘కథానిలయం’ లో వీరి కథలు చదివిన ఒక విద్యార్థిని, వ్రాసిన సిద్ధాంత వ్యాసం ‘పాలెపు బుచ్చిరాజు కథలు – పరిశీలన’కు, 2022 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం పిహెచ్ డి ప్రదానం చేసింది.

Previous Post

నిజమే చెప్తాను

Next Post

హిందీ కథ : చీకటి గీతం

Next Post
హిందీ కథ : చీకటి గీతం

హిందీ కథ : చీకటి గీతం

Discussion about this post

ఈ సంచికలో…

  • ఆంగ్ల కవిత : బందీ 
  • వయసు మీద పడిన …. తరువాత… !
  • ఆంగ్ల కవిత : మహావృక్షాలు కూలినప్పుడు!
  • ఆంగ్ల కవిత: నేను  అనుక్షణం ఎగసిపడతాను!
  • ఆంగ్ల రచన : వేకువ పాఠం 
  • ఆర్ద్రత, సాంద్రత నిండిన అనువాదం ‘దిగులు కొంగ’
  • రష్యన్ కథ : శిక్ష
  • జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి
  • తమిళ కథ : బిరియానీ (హాస్య కధ)
  • కన్నడ కథ : వర్షరూపిణి
  • ఒడియా కథ : భయమే బంధమా?
  • హిందీ కథ : చీకటి గీతం
  • గుజరాతీ కథ: సైనికుడి సంతానం 
  • నిజమే చెప్తాను
  • కన్నడ కథ : ఉత్తమ నటుడు
  • ఒడియా కథ : తప్పెవరిది?
  • అనువాద కవిత: పరిచయం
  • ఒళ్ళు అమ్ముకున్న స్త్రీ కోసం..

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com