• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి

చింతకుంట్ల సంపత్ రెడ్డి by చింతకుంట్ల సంపత్ రెడ్డి
April 11, 2026
in అనువాద కథలు
0
జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి

జర్మన్ మూలం: వూల్ఫ్ గాంగ్ బోర్షర్ట్

ఇంగ్లీష్ అనువాదం:బ్రియాన్ డోనార్స్కి; ఇ.జె.కాంప్ ఫీల్డ్

తెలుగు స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి

బాంబుల వర్షం ఆగిపోయింది. కానీ, యుద్ధం కొనసాగుతూనే ఉన్నది.

ఒంటరి మొండి గోడలోని కిటికీ ఆవులించింది. సాయంకాలపు నీలిరంగు ఎర్ర సూర్యుడు కిటికీలోనుండి దిగిపోతున్నాడు. ఇంకా మిగిలివున్న చిమ్నీ గొట్టాల చుట్టూతా మేఘాల్లా మెరిసిపోతున్నది దుమ్ము. శిథిలాల కుప్పలు కునికిపాట్లు పడుతున్నాయి.

ఝర్గెన్ కళ్లు మూసుకున్నాడు. అకస్మాత్తుగా చీకటి కమ్ముకున్నది. ఎవరో తన ముందు వచ్చి నిలబడినట్లు అనిపించింది… నల్లగా నిశ్శబ్దంగా. “వాళ్ళకు నేను దొరికిపోయాను.” అనుకున్నాడతను. కళ్ళు తెరచి చూస్తే మాసిపోయిన దుస్తులు వేసుకున్న ఓ కాళ్ల జత కనబడింది. ఆ రెండు వంకర కాళ్ల మధ్య ఆవలికి చూడగలిగేంత సందు ఉన్నది. ధైర్యం చేసి తలెత్తి చూశాడు. ఆ కాళ్ళు ఓ ముసలివాడివి. ఓ చేతిలో ఓ బుట్ట, ఓ కత్తి ఉన్నాయి. అతని వేళ్ల చివర్లు మట్టి కొట్టుకుని ఉన్నాయి.

ఝర్గెన్ చింపిరి జుత్తు వైపు చూస్తూ “అయితే నీవు పడుకున్నావన్నమాట?” అడిగాడా ముసలి. 

ఆ కాళ్ళ సందులో నుండి కనపడుతున్న సూర్యుణ్ణి చూస్తూ, “లేదు నేను పడుకోలేదు. నేను కాపలా కాయాలి ఇక్కడ.” చింపిరి జుత్తు అన్నాడు.

అతను తలూపాడు. “అదా సంగతి! అందుకోసమా,  అంత పెద్ద కర్ర ఉంది నీ దగ్గర?

“అవును.” ఝర్గెన్ కర్రను మరింత గట్టిగా పట్టుకున్నాడు.

“సరే, ఇంతకీ దేనికోసం కాపలా కాస్తున్నావు నువ్వు?”

“చెప్పలేను. ఏదో ఒకటి.” కర్రపైన ఝర్గెన్ వేళ్లు బిగుసుకున్నవి.

“బహుశా డబ్బు కోసమే కదా?” బుట్ట కింద పెట్టి కత్తిని తన దుస్తులతో తుడుచుకున్నాడతను. 

“అస్సలే కాదు.” అలక్ష్యంగా అన్నాడు ఝర్గెన్. “ఇది పూర్తిగా వేరే దానికోసం.”

“అయితే మరి దేనికోసం?”

“చెప్పలేను. వేరే ఒకటి. అంతే.”

“పర్వాలేదు, చెప్పొద్దులే.” బుట్టను కాలితో తడుతూ కత్తి మూసివేసి అన్నాడా ముసలి. “ఇక్కడ ఈ బుట్టలో ఏముందో నేను కూడా నీకు చెప్పనులే.”

“ఆ! నేను చెబుతా బుట్టలో ఏముందో. బుట్టలో ఏముందో నాకు తెలుసు. కుందేళ్ళ మేత.” పరిహాసంగా అన్నాడు ఝర్గెన్.

“ఓ! నీకు తెలిసిపోయిందే,” ముసలి ఆశ్చర్యపోయాడు. “నువ్వు తెలివైన వాడివే. నీ వయసెంత?”

“తొమ్మిది.”

“తొమ్మిదా, అయితే మూడు తొమ్మిదులు ఎంతో నీకు తెలిసే ఉండాలి, అవునా?”

“అవును,” మనసులోనే లెక్కించడానికి సమయం తీసుకుంటూ, “అది చాలా సులభం.” అంటూ ఆ కాళ్ళ సందుల్లోకి చూశాడు ఝర్గెన్. “మూడు తొమ్మిదులు కదా. నాకు తెలుసు.” మళ్లీ అడిగాడు. “ఇరవై ఏడు.  నాకు వచ్చు.”

“అవును. ఖచ్చితంగా నా దగ్గర అన్ని కుందేళ్లు ఉన్నాయి.”

ఆశ్చర్యంతో ఝర్గెన్ నోరు గుండ్రంగా తెరుచుకున్నది.

“నువ్వు వచ్చి చూడొచ్చు. నిజానికి అందులో చాలా వరకు చిన్న చిన్న పిల్లలే. చూస్తావా?”

“రాను. నేను కాపలా కాయాలి గద?”

“అస్తమానం కాపలా కాస్తావా? రాత్రి కూడానా?”

“రాత్రి కూడా. పొద్దస్తమానం.” ఝర్గెన్ అతని కాళ్ల వైపు చూశాడు. “శనివారం నుండి.” గుసగుసగా అన్నాడు.

“మరి ఇంటికి వెళ్ళవా, ఏదైనా తినాలి గదా?” 

ఝర్గెన్ ఓ రాయిని లేపాడు.  దానిక్రింద ఓ సగం రొట్టెముక్క, ఓ డబ్బా ఉన్నాయి.

“చుట్ట కాలుస్తావా నువ్వు? అడిగాడతను “చుట్ట ఉందా?”

ఝర్గెన్ చేతివేళ్ళు కర్రపై బిగుసుకున్నాయి. కాస్త భయంగా, “చుట్ట కాల్చడం నాకిష్టముండదు.”

“అదేం బాగాలేదు.” అంటూ తన బుట్ట వైపు వంగాడు ముసలి. “కుందేళ్ళను చూడాల్సిందే. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలను. నీకు కూడా ఒకటి కావాలనిపిస్తుంది. కానీ నువ్వు రాలేవు కదా?”

“లేదు,” ఝర్గెన్ విచారపడ్డాడు. “లేదు లేదు.”

“సరే ఇక్కడే ఉండదల్చుకుంటే  అది నీ దురదృష్టం.” తన బుట్టను తీసుకొని లేచి నిటారుగా నిలబడ్డాడతను; వెనక్కి తిరిగి వెళ్లిపోబోయాడు.

“నువ్వు నన్ను మోసపుచ్చను అంటే నేనిక్కడ ఎలుకల కోసం ఉన్నాను,” ఝర్గెన్ వెంటనే అన్నాడు.

వంకరకాళ్లు ఒక అడుగు వెనక్కి పడ్డాయి. “ఎలుకల కోసమా?”

“అవును, అవి చనిపోయిన వారిని తింటున్నవి. మనుషులను. అవి అలాగే బ్రతుకుతాయి.”

“ఎవరు చెప్పారు నీకు?”

“మా టీచర్.”

“అయితే నువ్వు ఎలుకలకు కాపలా కాస్తున్నావా?” 

“కాదు. వాటిని కాదు.” ఝర్గెన్ నెమ్మదిగా మాట్లాడాడు, “మా తమ్ముడు అక్కడ పడుకున్నాడు.” కృంగిపోయిన గోడను కర్రతో చూపిస్తూ అన్నాడు. “మా ఇంటి మీద బాంబు పడింది. ఒక్కసారిగా సెల్లార్ లో దీపాలు ఆరిపోయాయి. అంతే, వాడు వెళ్ళిపోయాడు. మేము కేకలు వేశాం. నా కన్నా చిన్న పిల్లవాడు. చాలా చిన్నవాడు. నాలుగేళ్లే. వాడు అక్కడే ఉండి ఉంటాడు. వాడు నాకన్నా చాలా చిన్నవాడు.”

 కిందకు ఆ చింపిరి జుట్టు వైపు చూశాడా ముసలి. “అవునూ, మరి రాత్రిపూట ఎలుకలు నిద్రపోతాయని మీ టీచర్ చెప్పలేదా?”

“లేదు.” గుసగుసలాడాడు ఝర్గెన్. అకస్మాత్తుగా అలసిపోయినట్లుగా కనబడుతూ, “అతను చెప్పలేదు.”

“సరే అది కూడా తెలియనివాడు ఏం టీచర్ మరి? ఎలుకలు కూడా రాత్రిపూట పడుకుంటాయి. రాత్రి పూట నువ్వు ఇంటికి పోవచ్చు. అవి రాత్రిళ్లు నిద్రపోతాయి. చీకటి పడగానే.”

ఝర్గెన్ తన కర్రతో ఆ శిథిలాల మట్టిలో చిన్న చిన్న రంధ్రాలు పొడిచాడు. చిన్న చిన్న పరుపులు. చుట్టూ చిన్న చిన్న పరుపులు, అనుకున్నాడు మనసులో. 

వంకరకాళ్లు అటు ఇటు కదిలాయి. “నీకు తెలుసా నేను తొందరగా వెళ్ళి నా కుందేళ్ళకు మేత వేస్తాను. చీకటి పడగానే నీ దగ్గరకు వస్తాను. వీలైతే ఒకదాన్ని తీసుకువస్తాను. ఓ బుజ్జి దాన్ని. ఏమంటావ్ నువ్వు?”

ఝర్గెన్ ఆ మట్టిలోకి చిన్న చిన్న రంధ్రాలు పొడిచాడు. చిన్న చిన్న బుజ్జి కుందేళ్లు. తెల్లవి, బూడిద రంగువి. తెలుపు బూడిద రంగువి. “నాకు తెలియదు.” ఆ వంకర కాళ్లవైపు చూస్తూ మృదువుగా అన్నాడు. అవి నిజంగా రాత్రిపూట పడుకొంటాయా అనుకుంటూ.  

కూలిపోయిన గోడ దిబ్బలు ఎక్కిన వంకర కాళ్ళు వీధిలోకి నడిచాయి. అక్కడి నుండే, “మీ టీచర్ ను ఉద్యోగం నుండి తీసివేయాలి, అది కూడా ఆయనకు తెలియకపోతే,” అన్నాడతను.

ఝర్గెన్ లేచి నిలబడి అడిగాడు, “నిజంగా! నాకు ఒకటిస్తావా? బహుశా ఒక తెల్లటిదానిని.”

“చూస్తాను.” నడుస్తూనే అన్నాడతను. “కానీ నీవు ఇక్కడే ఉండాలి. నేను వచ్చేదాకా. తర్వాత నేను మీ ఇంటి దాకా వస్తాను. సరేనా? మీ నాన్నకు చెప్పాలి. కుందేళ్ళ గూడు ఎలా చేయాలో. మీకు అది తెలిసి ఉండాలి.”

“అలాగే,” ఝర్గెన్ అన్నాడు. “నేను చీకటి పడేదాకా కాపలాగాయాలి గదా. తప్పకుండా ఉంటాను.” ఆ తర్వాత అరిచాడు. “ఇంట్లో మా దగ్గర కొన్ని పెట్టెలు ఉన్నాయి. అట్టపెట్టెలు.”

ఆ ముసలికి వినరాలేదు. తన వంకర కాళ్లతో అతడు సూర్యుడి వైపు వడివడిగా వెళుతున్నాడు. అప్పటికే ఎర్రబడ్డ సూర్యుడు అతని కాళ్ళ సందులో నుండి మెరుస్తూ కనపడుతున్నాడు ఝర్గెన్ కు. అంత వంకరగా ఉన్నాయి అతని కాళ్ళు.  అతని బుట్ట ఉత్సాహంగా వెనక్కి ముందుకు ఊగుతున్నది. అందులో కుందేళ్ళ మేత ఉన్నది. బూడిద రంగు మట్టి అంటుకున్న ఆకుపచ్చ కుందేళ్ళ మేత.

అనువాదకుడు:  చింతకుంట్ల సంపత్ రెడ్డి పుట్టింది 11 మే, 1953 రోజున. స్వస్థలం: తెలంగాణలోని జనగాం జిల్లా ఘణపూర్ (స్టేషన్) గ్రామం. 

ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యాల బోధనలో 45 సంవత్సరాల పరిశ్రమ. పాలిటెక్నిక్ లో హెడ్ ఆఫ్ సెక్షన్ గా పదవీ విరమణ తర్వాత రాసిన  English Grammar Fundas (తెలుగు వివరణలతో) అనే పుస్తకం విశాలాంధ్ర, నవచేతన వారి ద్వారా ప్రచురించబడి ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడు అవుతున్న గ్రామర్ పుస్తకాల్లో ఒకటి. పాలిటెక్నిక్ విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, టీచర్స్ బుక్స్, PPT Presentatiions రూపకల్పనలో ప్రముఖ పాత్ర. అనేక ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కంటెంట్  ఎడిటర్ అనుభవం.

 “భిన్న దేశాల విభిన్న ఉత్తరాలు-ఉపన్యాసాలు; హాన సూట్కేస్;  బాపు – నా మాతృమూర్తి; సామ్యవాదం నుండి సర్వోదయ వరకు; భిన్న దేశాల విభిన్న కవిత్వం, హిందువులకో ఉత్తరం”  ఇతర అనువాదాలు. ఫోటోగ్రఫి ఆసక్తిపరంగా కొన్ని అవార్డులు, గుర్తింపులు.

Phone Number: 98495 01696

E-mail ID: sampathreddych@gmail.com

Instagram: @sampathreddy.c 

Facebook: https://www.facebook.com/sampathreddy.chintakuntla/

చింతకుంట్ల సంపత్ రెడ్డి
చింతకుంట్ల సంపత్ రెడ్డి

73 ఏళ్ల సంపత్ రెడ్డి ఎం.ఏ (హిస్టరీ), ఎం.ఏ (ఇంగ్లిష్), పి.జి.సి.టి.ఐ (CIEFL) చదివారు. సాంకేతిక విద్యాశాఖలో ఇంగ్లిష్ లెక్చరర్ గా చేసి… 2011 లో హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్ గా రిటైరయ్యారు. పుస్తకాలు చదవడం, అనువాదాలు చేయడం, ఫోటోగ్రఫీ ఆయన వ్యసనాలు
అత్యధికంగా అమ్ముడయే గ్రామర్ పుస్తకాల్లో ఒకటైన English Grammar Fundas (తెలుగు వివరణలతో) ప్రచురించారు. అనువాదాలు.. 1. మనుబెహన్ గాంధీ రచన బాపు-నా మాతృమూర్తి, 2. భిన్న దేశాల విభిన్న ఉత్తరాలు-ఉపన్యాసాలు (32 ఉత్తరాలు-32 ఉపన్యాసాల సంకలనం) 3. భిన్న దేశాల విభిన్న కవిత్వం (అనువాద కవితల సంకలనం) 4. హిందువులకో ఉత్తరం- లియో టాల్స్టాయ్ 5. సామ్యవాదం నుండి సర్వోదయ వరకు- లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ వెలువడ్డాయి.
ఫోటోగ్రఫీ ఆసక్తి: తెలుపునలుపు ఛాయాచిత్రపు రోజుల్లో ఏతావాతా తీసిన ఫోటోలు కొన్ని భారతదేశంలోని అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్స్ లో ప్రదర్శితమయ్యాయి. 1982 లో ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ (FIP) వారు నెలనెలా నిర్వహించిన మెంబర్స్ మంత్లీ కాంపిటేషన్ ‘బిగినర్స్ సెక్షన్’ ఫోటో పోటీలో “గ్రాండ్ అవార్డ్” (సిల్వర్ మెడల్) అవార్డు. 1984 లో ‘Decade of the Girl Child (1975-85) కార్యక్రమాల్లో భాగంగా UNICEF నిర్వహించిన Focus on the Girl Child ఫోటో పోటీలో 2200 మంది ఫోటోగ్రాఫర్లు పంపిన 6500 చిత్రాలలో మొత్తం 150 చిత్రాలు ఎంపిక కాగా, నా చిత్రాలు మూటికి మూడు (3) “గ్రాండ్ జ్యూరి అవార్డ్” గెలుచుకున్నాయి. అక్టోబర్, 2025 లో ప్రపంచ వన్యప్రాణి సంస్థ (WWF), తెలంగాణా అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలో రెండవ బహుమతి.

Previous Post

తమిళ కథ : బిరియానీ (హాస్య కధ)

Next Post

రష్యన్ కథ : శిక్ష

Next Post
రష్యన్ కథ : శిక్ష

రష్యన్ కథ : శిక్ష

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • హిందీ కవితలు: గోధుమ + గోవు
  • సచ్చిదానందన్ కవితలు రెండు..
  • హిందీ కవిత: నా చిరునామా
  • ఇంగ్లిషు కవిత : మనోచిత్రం
  • సమీక్ష: విస్మృతికి లోనవుతున్న సుగుణాన్ని గుర్తు చేసే పుస్తకం
  • ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి
  • ఇంగ్లిషు కవిత :  కోరిక
  • ఇంగ్లీషు కవిత:   “వృక్షం”
  • హిందీ కవిత: ఇక్కడే ఎక్కడో ఉండాలి ఇల్లు
  • ఆంగ్ల కథ: నది మది
  • తమిళ కథ : ఎస్తర్
  • కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’
  • ఉర్దూ కథ : పీరున్
  • ఉర్దూ కథ: భ్రమ
  • హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • కన్నడ కథ : భీమ వచ్చింది
  • ఫ్రెంచి కథ : కల చెదిరింది, కథ మారింది!

అభిప్రాయాలు

  • విహారి on కన్నడ కథ : భీమ వచ్చింది
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Dr.Kvl sandhya Rani on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • Lahari on ఉర్దూ కథ : పీరున్
  • Raghunath Thotapalli on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Jashwanth on ఉక్రెయిన్ జానపద కథ: వజ్రాల కంచె
  • కొల్లూరి సోమ శంకర్ on ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి
  • Reddy on హిందీ కథ : లెక్క తప్పింది !
  • Gopal Venuraja Rao on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Rajeshwari Srimallik on టర్కిష్ కథ : వలసపిట్ట

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply