• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఒడియా కథ : భయమే బంధమా?

బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి by బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
April 11, 2026
in అనువాద కథలు
0
ఒడియా కథ : భయమే బంధమా?

మూలం :  అరవింద్ రాయ్
అనువాదం : బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

 

కిశోర్ ఫోన్ చేశాడు.

            మొదట తడబడుతూ,’ రాజేంద్రా! నీవెక్కడున్నావు?’ అని అడిగాడు.

రాజేంద్ర మామూలుగా, ‘ఆఫీసులో’ అని బదులిచ్చాడు.

              కిశోర్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. తర్వాత నీళ్ళు నములుతూ, అన్యమనస్కంగా ‘నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను… నీవు మరి… ఆఫీసులో..’

               రాజేంద్ర, ‘అరె, ఫర్వాలేదు. నేను ఫ్రీగానే ఉన్నా’నంటూ చెప్పగానే, కిశోర్ మళ్ళీ తడబడుతూ, ‘చెప్పాలంటే..’ ఇంకా ఏదో అనేలోగా లైన్ కట్ అయిపోయింది.

          రాజేంద్ర మొబైల్ వైపు చూశాడు. నెట్ వర్క్ లేదు. ఏమైందో ఏమో. ఆఫీసులో ఫోన్ కనెక్ట్ కాదు. ఫోన్ వచ్చినా, చేయాలన్నా బయటకు వెళ్ళాల్సొస్తుంది.

               రాజేంద్ర మళ్ళీ మొబైల్ వైపు చూశాడు. కిశోర్ ఏం చెప్పాలనుకున్నాడో? మాటిమాటికీ నీవు ఆఫీసులో ఉన్నావు అంటున్నాడంటే..ఏ సంగతి అయి ఉంటుందో! ఇంట్లో ఉంటే చెప్పేవాడేమో. చెప్పాల్సిందేదో చెప్పొచ్చుగా! నీళ్ళు నమలాల్సిందేముంది?

          ‘మూడు నెల్లముందే కలిశాము, మాట్లాడాము. ఏదో పని మీద వాడు ఆఫీసుకొచ్చాడు. రాజేంద్రకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇద్దరూ కాలేజ్ లో కలిసే ఆనర్స్ చేశారు. ఇద్దరిమధ్య సంబంధాలు గట్టిగానే ఉండేవి. తర్వాత జీవనప్రవాహంలో ఎవరెటో కొట్టుకుపోయారు. కానీ ఇద్దరిమధ్య అనుబంధానికి ఏమీ లోపం రాలేదు. వారానికోసారి ఇద్దరూ కలిసేవారు. ఒకసారి రాజేంద్ర సైకిల్ తీసుకొని కిశోర్ ఇంటికెళ్తే ఒకసారి కిశోర్ రాజేంద్ర ఇంటికొచ్చేవాడు. ఇద్దరి ఉద్యోగాలు వేర్వేరు. క్రమంగా ఉద్యోగరీత్యా రాజేంద్ర భువనేశ్వర్ లో నివసించసాగాడు. కిశోర్ ఊళ్ళోనే మార్కెట్లో పనిచేసేవాడు. కొన్ని రోజులు ట్యూషన్ చెప్పేవాడు. ఉద్యోగం వచ్చేలా లేదని ఊళ్ళో కూరల ఫారమ్ పెట్టాడు.

              భువనేశ్వర్ వచ్చాక కూడా రాజేంద్ర మధ్యమధ్యలో కిశోర్ ఫారానికి వెళ్ళేవాడు. కిశోర్ నిస్సహాయంగా కనిపించేవాడు.’ఈ ఫారమ్ చాలా కాలం నడిపించలేనేమో. ఎప్పుడూ కరెంట్ పోతుంటుంది. లిఫ్ట్ పనిచేయదు. జనాలు కూరలు కొట్టేస్తుంటారు. ఊరోళ్ళతో ఎంతని కొట్లాడగలం? కిరాణా కొట్టు పెడదామనుకుంటున్నాను.’ అన్నాడోసారి.

                ఎకనామిక్స్ బాగా తెలిసిన మిత్రుని ఆలోచన విని రాజేంద్ర గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత ఎవరికి వారు తమ జంజాటంలో పడిపోయారు. నెలల పాటు ఏ కబురూ వార్తా లేవు.

2️⃣

ఇది జరిగి ఏళ్ళు గడిచాయి. 

            ఇప్పుడు కిశోర్ పైన కుటుంబభారమంతా ఉంది. తండ్రి తర్వాత, తల్లి, ఇద్దరుపిల్లలు, పెళ్ళికాని చెల్లెలు. ఊళ్ళో చిన్న స్కూల్ టీచరు. ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.

కానీ ఆఫీసులో వాణ్ణి చూసి ఉలిక్కిపడ్డాడు.

              కిశోర్ కేమైంది? మంచి రంగు, రాకుమారునిలాంటి ముఖము చూసి ఎవరికైనా గుండె లయ తప్పాల్సిందే. ఏమైపోయిందదంతా? ఇలా నల్లబడిపోయాడే? ఏదైనా జబ్బు చేసిందో ఏమో? ఎప్పుడూ తెల్లని పాంటు, షర్టు, తళతళలాడే చెప్పులతో ఉండే వాడు ఇలా మాసిన బట్టల్లో ఉన్నాడే? ఏదో మాసిన బట్టలమూటలోంచి బట్టలు తీసి వేసుకుని వచ్చినట్టు..! కొన్ని నెల్ల నుంచి చీపురుపుల్లలా బక్కపల్చగా అయిపోయాడు. మెడ కొంగ మెడలా సాగి, పొడుగ్గా కనిపిస్తోంది. పక్షి గూట్లోంచి పక్షి పిల్ల అమాంతం కిందపడినట్టు!

          రాజేంద్ర అతడిని టీకొట్టు వైపు తీసుకెళ్ళాడు. ‘ఒంట్లో బాగుంది కదా?” 

పేలవంగా నవ్వుతూ కిశోర్,’ ఏం! బాగానే ఉన్నానుగా!’

                ‘ఏదోలా ఉన్నావు. షుగరూ గిగరూ ఏమైనా వచ్చిందా ఏం?’ రాజేంద్ర రెట్టించాడు. కిశోర్,’ టెస్టులేం చేయించలేదు గానీ యాభై నిండాయి. ఎవరికెరుక..!’ అన్నాడు.

 రాజేంద్ర టీగ్లాసు పక్కన పెట్టి,’ఊరెలా ఉంది చెప్పు?’ అని అడిగాడు.

  కిశోర్ టీ గుక్క నోటికందిందో లేదో, గ్లాసు తిరిగి పడింది. దీర్ఘంగా నిట్టూర్చి,’ఏమి చెప్పను? మావాడు హైస్కూలు పూర్తి చేశాడు. రిజల్ట్ వచ్చాక దగ్గర్లోని కేంద్రపాడాలోనే చదివిస్తా. కానీ వాడికి భువనేశ్వర్ బిజెబి కాలేజ్ లో చదవాలనుంది. వాళ్ళమ్మ సంగతి తెలుసుగా!’ అన్నాడు. 

రాజేంద్ర ఉలిక్కిపడ్డాడు. ‘లేదే లేదే! ఆమెకేమైంది?’ నాలుగు నెల్లనుంచి కిశోర్ ను కలవనేలేదు. ఆమెకు గైనిక్ ప్రాబ్లం ఉంది. ఊళ్ళోనే డాక్టర్ రథ్ కు చూపించారు. ఒకరోజు బండిలో బాగా బ్లీడింగ్ అయింది. చనిపోయేదే! రాత్రికి రాత్రి కటక్ తీసుకొచ్చాను. హెస్టెరెక్టమీ జరిగింది. అయినా శాంతి లేదు. తల్లి బయట మెట్లమీద పడింది… అప్పటి నుంచి లేవలేకపోతోంది. రెండు నెల్లనుంచి మంచంలోనే ఉంది. అన్నీ ఇలాంటివే!’

కిశోర్ మళ్ళీ నవ్వాడు. పేలవంగా. చల్లారిన టీ ఒక్క గుక్క తాగగానే నేలపాలైంది. ‘సర్లే వదిలెయ్. నీ పిల్లలు బాగున్నారు కదా?’ అన్నాడు.

రాజేంద్ర ఉదాసీనంగానే, ‘ఆ.. ఉన్నారు.’ అన్నాడు.

కిశోర్, ‘ బస్ టైమైంది. ఉంటానిక. అవసరమైతే ఫోన్ చేస్తాను. నీవూ ఎప్పుడైనా ఫోన్ చేస్తుండు.’ అన్నాడు.

‘ఏం చేయాలి? బిడ్డకు ఈసారి పరీక్షలు. పొద్దున, రాత్రి కోచింగ్. కొడు పదిలో ఉన్నాడు. ఊపిరి విడిచే టైం కూడా లేదు.’ అన్నాడు రాజేంద్ర.

 

3️⃣

కిశోర్ టీ గ్లాసు బల్ల మీద పెట్టి బయల్దేరుతున్నాడు. ఇంకాసేపు ఉండమని గానీ, ఇంటికి రమ్మని గానీ రాజేంద్ర అనలేకపోయాడు.

కిశోర్ వెళ్తుంటే చూస్తుండిపోయాడు. తర్వాత దీర్ఘంగా నిట్టూర్చాడు.

ఇప్పుడు మూడు నెల్లయినాక మళ్ళీ ఫోన్.

ఏం చెప్పాల్సింది వాడికి?

అప్పుడేమో అవసరమైతే ఫోన్ చేస్తాను అన్నాడు.

రాజేంద్రకొకటి గుర్తొచ్చింది. కొడుకు బిజెబి కాలేజ్ లో చేరాలని పట్టు పట్టి ఉంటాడు. కిశోర్ అదే చెబ్దామనుకొని ఉండుంటాడు. కొడుకును నా ఇంట్లో పెట్టి చదివిద్దామనా? నాకుండేదే రెండు చిన్న చిన్న గదులు, ఒక వంటగది అని వాడికి తెలీదూ? వరండాలో బాత్ రూం తలుపు కూడా విరిగింది. ఇంట్లో ఎదిగిన కూతురుంది. పెద్దవాడైన వాడికొడుకును నేనెక్కడ ఉంచగలను? వాడెప్పుడూ పల్లెలోనే ఉండిపోయాడు. పట్టణాల పరిస్థితి ఏమిటో వాడికేం తెలుసు? ఇక్కడ నీళ్ళు, గాలి కూడా కొనవలసిందే. అలాంటిది మూడేళ్ళు నా ఇంట్లో ఉంచి చదివిద్దామని ఎలా అనుకున్నాడు?

ఆలోచించే కొద్దీ రాజేంద్రకు మనసు వికలమైంది. దీర్ఘంగా నిట్టూర్చి ఊరుకున్నాడు.  మనసంతా చికాగ్గా తయారైంది. మళ్ళీ మొబైల్ వైపు చూశాడు. నెట్ వర్క్ లేదు. ఫోన్ కట్ అయింది మంచిదే అయింది. లేకపోతే నా ఇంట్లో చోటు లేదని ఎలా చెప్పగలడు? కిశోర్ సిగ్గులేకుండా అడిగితే కుండ బద్దలు కొట్టినట్టు నిజం చెప్పడానికి నాకు మాత్రం బాధెందుకు? రాజేంద్ర తనకు తాను నచ్చజెప్పుకొని కిశోర్ ఫోన్ కోసం సిద్ధం కాసాగాడు.

కానీ ఫోనేమీ రాలేదు. ఫైల్ తెరిస్తే అందులో కిశోర్ ముఖం కనిపించింది. కొలీగ్స్ వైపు చూస్తే ప్రతి ఒక్కరూ కిశోర్ లాగే కనిపిస్తున్నారు. కుర్చీలోంచి లేచాడు. బద్ధకం వదిలించుకుని, ఒకమారు అలా తిరిగివద్దమని ఆలోచించాడు. బయటికి పోతే నెట్ వర్క్ కూడా వస్తుందేమో. కిశోర్ ఫోన్ చేయొచ్చు. లేదా వద్దులే బయటకు వెళ్ళడమే వద్దు. రాజేంద్ర మళ్ళీ ఫోన్ వైపు చూశాడు. మళ్ళీ మౌనంగా కుర్చీలో కూర్చుండిపోయాడు.

కుర్చీలో వెనక్కి వాలాడో లేదో ఫోన్ మోగింది. ఉలిక్కి పడ్డాడు. మొబైల్ మోగిందా లేదా, కొరివి వచ్చి ఛాతీమీద తాకిందా అనిపించింది. చేయి కూడా వణుకుతున్నట్టుంది. కోపంలో ముక్కు పుటాలు పెద్దవైనాయి. అరికాళ్ళలో చెమటలు పట్టాయి. గుండె వేగం పెరిగింది.

బజ్జర్ ఆగకుండా మోగుతోంది.

మెల్లగా ఫోన్ తీయబోయాడు. అవతల కిశోర్ ఉంటాడు. ‘ఏం చేయను? కొడుకు చదవాలంటాడు. నీవు సహాయం.. నీకెప్పటికీ ఋణపడి ఉంటాను.’ అంటాడు.

మనసు చీకాగ్గా అయిపోయింది. జేబులోంచి మొబైల్ తీశాడు. కిశోర్ మళ్ళీ చేశాడు.

ఫోన్ తీయనా? వద్దా? మోగుతూ ఉండనివ్వనా?

 

4️⃣

ఇక్కడేదో పనిలో ఉన్నానని అనుకుంటాడులే. లేదా బండి నడుపుతున్నాననైనా అనుకుంటాడు. అదీ కాకపోతే ఐదు ఇంకా కాలేదు కాబట్టి సైలెన్స్ మోడ్ లో పెట్టాడనో.. లేక ఫైల్ తిరగేస్తున్నాడనో అనుకుంటాడు.

తీసేది లేదు. మోగనీ అలాగే.

ఇప్పుడు తీయకపోతే, సాయంత్రం చేస్తే? అప్పుడు? స్విచ్ ఆఫ్ చేద్దునా? నేను అవాయిడ్ చేస్తున్నట్టు తెలిసిపోతుందేమో!  అలాంటప్పుడు నేరుగా చెప్పేస్తే సరి.

ఫోన్ మోగుతూనే ఉంది.

రాజేంద్ర మనసులో కూడా అదే తాళంలో ప్రతిధ్వని వినిపిస్తోంది.  చివరకు తనను తాను సిద్ధం చేసుకుని, ఫోన్ తీశాడు.

అవతల వణుకుతున్న స్వరం,’రాజేంద్ర, నీవు బిజీగా ఉన్నావా?’

రాజేంద్ర కొంచెం చిరాకుగా, ‘అవును. అర్జెంట్ పని ఉంది. చెప్పు.’ అన్నాడు.

కిశోర్ నీళ్ళు నమిలి,’నేను .. అమ్మ.. హలో.. ఆసుపత్రి… పది.. హలో… నెట్ వర్క్ సమస్యతో కిశోర్ మాటలు సరిగా వినపడలేదు. హలో హలో అంటూ కట్ అయిపోయింది.

రాజేంద్రకు గుర్తొచ్చింది. వాళ్ళమ్మ కిందపడిందని, కాలు విరిగిందని చెప్పాడోసారి. అమ్మ పూర్తిగా మంచం పట్టిందన్నాడు. నేనేం చేయగలను? కిశోర్ అమ్మను భువనేశ్వర్ లో మంచి ఆసుపత్రిలో చూపించాలనుకుంటున్నాడు. ఆలోచిస్తుంటే గుండె వేగం పెరుగుతోంది. అయ్యో భగవంతుడా! కిశోర్ వాళ్ళమ్మను గానీ తీసుకొస్తే? నేనేం చేయగలను>

రాజేంద్ర ఆలోచిస్తున్నాడు.’ఏదో చెప్పబోయాడు. ఆసుపత్రి.. పది.. ఓ! అదీ సంగతి. నేరుగా చెప్పకుండా ఈ దాగుడుమూతలేంటి?

రాజేంద్రకు నిశ్చయంగా అనిపించింది. మొదట్నించీ ఇదే చెప్పాలనుకున్నాడు. అప్పు లాంటిదే. ఆ మాట ఆఫీసులోనే చెప్పవచ్చునే!

ఇప్పుడు తనలో తాను, ‘ఏమి చేయను? మొదటి సారి అడిగాడు. అసలే అమ్మ ఆసుపత్రిలో ఉంది. కిశోర్ వాళ్ళమ్మ మాటలు గుర్తొచ్చాయి.

అప్పుడప్పుడూ నలుగురైదుగురు స్నేహితులు కలిసి కిశోర్ ఇంటికెళ్ళేవారు. కిశోర్ వల తీసుకొని పెరటివైపు కుంట దగ్గరికెళ్ళేవాడు. అక్కడ చేపలు ఈదుతూ ఉంటాయి. కిశోర్ వాళ్ళమ్మ మసాలా కూరలు వండుతుంది. ఎప్పుడూ నవ్వుముఖంతో పలకరించేది. ఏళ్ళు గడచిపోయాయి గానీ అప్పట్లో పక్కన కూర్చోబెట్టుకొని తినిపించేది. ‘అరె, కూరా బాగా కుదరలేదా? ఎందుకు ఇలా కొంచెం తింటున్నావు?’ అంటూ అడిగేది. మట్టి జాడీలోంచి మామిడికాయ ఊరగాయ తీసేది. తినిపించేది. జాడీని చూడగానే నోట్లో నీళ్ళూరిపోయేవి. ‘పిన్నీ, ఇంకొంచెం అన్నం తింటా’నని అడిగేవాడు తను. కిశోర్ వాళ్ళమ్మ కంచంలో అన్నం ఇంకొంచెం పెట్టేది. ‘ఇదిగో ఇదసలు తిననే లేదే! బాబూ, ఈ పూటకిక్కడే ఉండిపో. సాయంత్రం ఆకుకూరతో మంచి కూర చేస్తాను.’ అనేది.

5️⃣

           రాజేంద్రకు ఆరోజులన్నీ గుర్తొచ్చాయి. గట్టిగా గాలి పీల్చాడు. ఒకవేళ ఎటూ వీలుకాకుంటే ఒక పది అడుగుతాడేమో. కానీ తిరిగి ఇవ్వగలడా? ఇవ్వలేకపోతే సంబంధాలు దెబ్బతింటాఅయి. అప్పుడే సుధాంశు గుర్తొచ్చాడు. తూఫాన్ లా వచ్చి కొడుక్కు అడ్మిషన్ దొరికిందని చెప్పాడు. ఒక నెలకోసమే పదివేలు ఇవ్వమన్నాడు. కష్టపడి సమకూర్చాల్సొచ్చింది. తిరిగి తీర్చడానికి సంవత్సరం పట్టింది. తీర్చమని అడిగామా, రాజేంద్రగాడు చాలా స్వార్థపరుడంటారు. డబ్బులివ్వడం అంటే స్నేహం వదులుకోవడమే. బిడ్డ కోచింగ్, కొడుకు ట్యూషన్, పాలు, పేపరు, గ్యాస్, కరెంట్ . ఒకటికి రెండు ఫ్యాన్లు లేవు. చేపలు, మాంసం కల అనుకోవల్సిందే. పదివేలెక్కడివి? నేరుగా చెప్పేయనా?

              రాజేంద్ర మళ్ళీ చూశాడు. నెట్ వర్క్ లేదు. ‘సారీ, లేవు ‘ అని చెప్పెయ్యనా అని మనసులో అనుకున్నాడు. పావుగంట గడచిపోయింది. లేవనా! బయట నెట్ వర్క్ ఉంది. మొబైల్ నాట్ రీచబుల్. కొలీగ్,’ఎవరో బద్మాషీ చేస్తున్నారు.’ అన్నాడు.

రాజేంద్ర, ‘కాలేజ్ రోజులనాటి ఫ్రెండ్. అవాయిడ్ చేస్తున్నా, అప్పు అడుగుతూనే ఉన్నాడు.’ అన్నాడు.

       కొలీగ్ ఫోన్ తీసుకొని చూసి, ‘మీ ఫోన్ లో ఆ అప్షన్ లేదా’ అన్నాడు.

‘లేదే!’  రాజేంద్ర ఉలిక్కిపడుతూ అన్నాడు.

      రాజేంద్ర కొంచెం ఆలోచించి తనపైన తానే చిరాకుపడ్డాడు. రేపు కొత్త సిమ్ తీసుకుందామనుకున్నాడు.

ఐదు గంటలు. అయినా కూర్చునే ఉన్నాడు.

           ప్యూన్ వచ్చి, ‘ఈరోజు ఇంకా ఉంటారా?’ అని అడిగాడు.

రాజేంద్ర చిరునవ్వుతో, ‘కొంచెం లేటవుతుంది. వెయిట్ చేస్తున్నాను. ‘ అన్నాడు.

           ఒకడే మిగిలాడు. నేను తప్ప అందరూ సుఖంగానే ఉన్నట్టున్నారు. అనిపించింది. నిస్సహాయంగా అనిపించింది. పాత ఫ్రెండ్స్ ను తిట్టుకున్నాడు.

         ఎలాగో ధైర్యం కూడగట్టుకుని – నేరుగా కిశోర్ తో చెప్పేస్తాను, డబ్బులు లేవని. అనుకున్నాడు.

బయటకు వచ్చాడు.

           ఇంటికెళ్ళి కిశోర్ కు ఫోన్ చేస్తాను అని దార్లో అనుకున్నాడు. ఇంట్లో వస్తే బిడ్డను మాట్లాడమని ఫోన్ ఇవ్వాలనుకున్నాడు.

ఇంటికొచ్చి  కిశోర్ ఫోన్ చేయవచ్చని మొదటే భార్యకు హెచ్చరిక చేసి ఉంచాడు. ఫోన్ వదిలేసి మార్కెట్ కు బయల్దేరాడు.

         ‘రాత్రి పొద్దుపోయాక చేస్తేనో?’ భార్య అడిగింది.

రాజేంద్రకు చికాగ్గా అనిపించింది. ‘ఏదో ఒకటి చెప్పి మాటదాటేస్తే సరి’ అన్నాడు.

మళ్ళీ అడిగిందామె. ‘కిశోర్ అంటే ఊళ్ళో ఉన్న ఫ్రెండేనా? ఏమైంది?’ 

‘పది వేలు అడుగుతున్నాడు.’ రాజేంద్ర చెప్పాడు.

6️⃣

         ‘ఏమి ఇల్లు గాని కట్టిస్తున్నాడా?’ అడిగిందామె.

‘ఇల్లో మన్నో! ఇంటామెకు ఆపరేషనో! ఇప్పుడు పా..!’

             పత్ని చింతలో పడింది.’మంచి చెడు కోసం మనిషి డబ్బులు కూడబెట్టి ఉంచుకోవాలి. ఎవరిదగ్గర మాత్ర ఎక్కువ డబ్బుందని అప్పులిస్తారు?’

            అదే అంటున్నా. ఫోన్ వస్తే, నేను లేనని చెప్పు.’ కిశోర్ వచ్చి ఇంటి బయట నిలబడి అడుగుతున్నాడేమో అన్నట్టు కంగారు పడుతూ అన్నాడు.

‘నన్నే అడిగితేనో!’

                           ఈ మాటకు అతడు ఉలిక్కి పడ్డాడు. ‘ఫోన్ పాపకివ్వు. అమ్మా, నాన్న ఇద్దరూ ఇంట్లో లేరని, బయటకెళ్ళారని చెప్పమను. వాడు మరీ చిన్నపిల్లలనడిగేంత అవివేకి కాదులే.’

‘ఈ కాలంలో వివేకం ఎక్కడుంటోంది?’ అందామె.

           ‘నేనే నేరుగా చెప్పేస్తాను. క్షమించేస్తాడు.’ అన్నాడు రాజేంద్ర.

‘అలాంటివాళ్ళకు నేరుగానే చెప్పు. లేకపోతే మళ్ళీమళ్ళీ సతాయిస్తారు.’ అంది.

       రాజేంద్రకు ఈ మాట నచ్చింది.

సాయంత్రమంతా ఏ విషయం తెలీకుండానే గడచిపోయింది. ఫోన్ కాల్ వస్తుందనే బెంగలో జాగ్రత్తగా ఉన్నాడు.

              ధైర్యం చేసి ఫోన్ కోసం ఎదురుచూడడం మొదలెట్టాడు. ఎలా జవాబివ్వాలనేది నిశ్చయించుకున్నాడు. కానీ కిశోర్ నుంచి ఫోన్ రాలేదు. కానీ కిశోర్ వాళ్ళమ్మ ముఖం కదలాడింది. ఆమెను మరచిపోలేకపోతున్నాడు.

       రాజేంద్ర మామూలుగా ఉండలేకపోయాడు. పత్రిక తిరగేశాడు. అప్పుడు ఫోన్ మోగింది. బింకం సడలిపోయింది.

ఫోన్ తీయండి ఎవరో ఒకరు అని గట్టిగా అరిచాడు.

           బిడ్డ హనుమాన్ చాలీసా చదువుతోంది. కొడుకు ట్యూషన్ కు వెళ్ళాడు. ఫోన్ మోగుతోంది.

ఉఫ్! ఎవరూ లేరు.

రాజేంద్ర బెదిరాడు. ఓ ఇది కిశోర్ ది కాదు. ఎవరిదో వేరే నంబరు

భార్య బెడ్ రూమ్ లోంచి వచ్చింది. ‘ఏదైనా ఫోన్ వచ్చిందా?’ అని అడిగింది.

బిచ్చగాడు బయట నిల్చుని నిల్చుని వెళ్ళిపోయినట్టు నెమ్మది కలిగింది.

           జరిగింది విని, ‘అతడేనేమో, కొత్త నెంబర్ తో చేశాడేమో . మనమే కష్టాల్లో ఉన్నాము. డబ్బులిచ్చేవాళ్ళెవరూ లేరు. మనల్నెందుకు అడుగుతున్నాడు?’ అంది.

7️⃣

మళ్ళీ మోగింది ఫోన్. ‘అదే నెంబర్.’ అన్నాడు రాజేంద్ర.

కిశోర్ ఫోన్ లో దాక్కుని ఉన్నట్టు, వింటాడన్నట్టు గుసగుసగా చెప్పాడు రాజేంద్ర.

          భార్య ధైర్యం చేసి, ‘ఇలా ఇవ్వండి. నేనే లేవని చెప్పేస్తాను.’ అంది. ఫోన్ తీసి, కొంచెం గట్టిగా, ‘ఎవరు?’ అని ఆడిగింది.

రాజేంద్ర కంగారుగా వింటున్నాడు.

‘అయితే రేపు… రండి. ‘ ఫోన్ పెట్టేసింది.

‘అక్వాగార్డ్ వాడు ఫోన్ చేశాడు.’ 

అది పాడైందని గుర్తొచ్చింది. 

‘ఏమన్నాడు?’

‘వాళ్ళంతే. మెకానిక్ లేడట. ఎల్లుండి వస్తాట్ట.’

      రాజేంద్ర చిరాకు పడి, తేరుకున్నాడు. భార్య లోపలికెళ్ళింది.

         ‘ఈరోజు కిశోర్ ఫోన్ చెయ్యడు. చాలా సార్లు ట్రై చేశాడు. కలవలేదు. ఇక ట్రై చేయడు. కట్ అయింది. పాపను కోచింగ్ క్లాసుకు తీసుకెళ్ళానని అనుకుని ఉంటాడు. ఎనిమిదికి తిరిగొచ్చే టైమ్. ‘ అనుకున్నాడు.

మళ్ళీ అంతలోనే.’స్విచ్ ఆఫ్ చేయనా? వద్దులే అవాయిడ్ చేస్తున్నానుకుంటాడు. అమ్మకు తెలిస్తే!’ 

టైమ్ చూశాడు.

పది..!

        కిశోర్ ఫోన్ రాలేదు. బతికాడు! ఉఫ్! భగవంతుడా!

రాజేంద్ర ఫోన్ గట్టిగా పట్టుకొని ఉండడం చూస్తే అది కిశోర్ గొంతు పట్టుకున్నట్టుంది. ఫోన్ ఆఫ్ అయ్యాక నెమ్మది కలిగింది.

రాత్రి భార్య, ‘ఫోన్ రాలేదుగా’ అని అడిగింది.

         ‘వదిలెయ్’ చిరాకు పడ్డాడు రాజేంద్ర.

‘మీ ఫ్రెండ్’ కితకితలు పెడ్తూ అడిగింది. 

‘చెయ్యనీ! నేను తీయను.’ 

                సమర్థుడూ, గట్టివాడూ అయిన తన భర్తకు ముద్దిచ్చి,’రాత్రి చాలా పొద్దుపోయింది. ఇక పడుకో. వచ్చెటప్పుడే అలసిపోయి వచ్చావు.’ అంది.

‘ఆ.. ఆ కిశోర్ గాడు మైండ్ ఫాడు చేశాడు. పదివేలట.. ‘దిగులుగా అన్నాడు రాజేంద్ర.

8️⃣             

            మేనల్లుడికి ఫోన్ చేయాలని పొద్దున గుర్తొచ్చింది. అంతలో కిశోర్ గుర్తొచ్చాడు. వాడు చేస్తాడు. పొద్దున్నే బుఱ్ఱ తింటాడు. పోన్లే!

ఫోన్ ఇలా ఇవ్వు అని బిడ్డనడిగాడు.

‘నా ఫోన్ లో బాలెన్స్ లేదు’ బిడ్డ చెప్పింది.

మళ్ళీ నిట్టూర్పు విడిచాడు.

            మెల్లగా ఫోన్ స్విచాన్ చేశాడు. కిశోర్ కు వినబడకూడదు. వెల్ కమ్ టోన్. మేనల్లుడికి త్వరత్వరగా ఫోన్ చేసి మళ్ళీ స్విచాఫ్ చేశాడు. ‘నా ఫోన్ ను ముట్టుకోకండెవరూ.’ అన్నాడు.

త్వరగా ఆఫీసుకు బయల్దేరాడు.

      అక్కడికెళ్తే ఇక సమస్య లేదు. నెట్వర్కే ఉండదు. 

      కానీ చేరాక ఎందుకో కిశోర్ కు దూరమైనానని అనిపించింది. ఈ గోడలు అభేద్యమనిపించింది. కిశోర్ నూ, వాళ్ళ అమ్మనూ పిలుస్తున్నట్టు తోచింది. ఫైల్ లో మునిగిపోయే ప్రయత్నం చేశాడు.

                మధ్యాహ్నానికల్లా కిశోర్ మాట మరిచిపోయాడు. కొలీగ్స్ మధ్యాహ్నం టీ తాగడానికి వెళ్తుంటే వాళ్ళతో పాటే నిర్భయంగా వెళ్ళాడు.

          వేటపులిలా కిశోర్ కాచుకున్నట్టున్నాడు. బయటకు రాగానే ఫోన్ మోగింది. బెదురుతూనే తీశాడు. అవతల కిశోర్!

ఎలాగో ధైర్యం చేశాడు. ‘ అయ్యే పని కాదు. చెప్పేస్తా’ అనుకున్నాదు.

         చిరాకు, కోపం కలిసిన స్వరంతో పెద్దగా అరిచాడు.’ఏమైంది? మాటిమాటికీ ఫోన్ ఎందుకు చేస్తున్నావు? నాకెంత పని ఉందో తెలుస్తా? టైం లేదు. తొందరగా చెప్పు ఏమైందో! బిజీగా ఉన్నాను.’ అన్నాడు.

          కిశోర్ దిగులుగా చెప్పాడు. ‘పని ఉంటుంది. తెలుసు. అందుకే డిస్టర్బ్ చేయలేదు.’ 

 మళ్ళీ నీళ్ళు నములుతూ. ‘పది పన్నెండు రోజుల్నించీ అమ్మ హాస్పిటల్లో ఉండింది. నిన్న రోజంతా నిన్నే తలచుకుంది.                                             

             నీవు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుందని అనిపించింది. ‘నాకు ఇంకొక కొడుకున్నాడు. చాలా రోజుల్నించీ చూడనే లేదు’  అంది.

‘ఆ.. అవునా!’ కుంచించుకు పోయాడు రాజేంద్ర.

9️⃣

కిశోర్ ఒక్క క్షణం పాటు మౌనంగా ఉండిపోయాడు.

‘నిన్న రాత్రి పది గంటలకు! అమ్మకు సీరియస్ అయింది. ఫోన్ చేశాను. స్విచాఫ్ అయి ఉంది.’                                                     

        ‘ఔనా! ఇప్పుడు? పిన్నికి ఇప్పుడెలా ఉంది?’ రాజేంద్ర భయంతో వికలమైపోయి అడిగాడు.

‘రాత్రి పన్నెండు గంటలకు అమ్మ.. వెళ్ళిపోయింది.’ కిశోర్ చెప్పాడు.

బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
Previous Post

హిందీ కథ : చీకటి గీతం

Next Post

కన్నడ కథ : వర్షరూపిణి

Next Post
కన్నడ కథ : వర్షరూపిణి

కన్నడ కథ : వర్షరూపిణి

Discussion about this post

ఈ సంచికలో…

  • ఆంగ్ల కవిత : బందీ 
  • వయసు మీద పడిన …. తరువాత… !
  • ఆంగ్ల కవిత : మహావృక్షాలు కూలినప్పుడు!
  • ఆంగ్ల కవిత: నేను  అనుక్షణం ఎగసిపడతాను!
  • ఆంగ్ల రచన : వేకువ పాఠం 
  • ఆర్ద్రత, సాంద్రత నిండిన అనువాదం ‘దిగులు కొంగ’
  • రష్యన్ కథ : శిక్ష
  • జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి
  • తమిళ కథ : బిరియానీ (హాస్య కధ)
  • కన్నడ కథ : వర్షరూపిణి
  • ఒడియా కథ : భయమే బంధమా?
  • హిందీ కథ : చీకటి గీతం
  • గుజరాతీ కథ: సైనికుడి సంతానం 
  • నిజమే చెప్తాను
  • కన్నడ కథ : ఉత్తమ నటుడు
  • ఒడియా కథ : తప్పెవరిది?
  • అనువాద కవిత: పరిచయం
  • ఒళ్ళు అమ్ముకున్న స్త్రీ కోసం..

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com