తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకట రమణారావు.
ట్రాఫిక్ జామ్
అస్సామీ మూలం : నీలిమ్ కుమార్
ఇంట్లో నుంచి బయటికి బయలుదేరగానే
ఎక్కడికి వెళ్తున్నానో ఒక్కసారిగా నేను మర్చిపోతాను.
కానీ, తొందరగా ఎక్కడికైనా చేరాల్సిన సమయాల్లో
ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంటాను.
అప్పుడు అసహనంగా మారిపోతాను
మళ్లీ గుర్తుకు వస్తుంది!
చాలామంది అంటుంటారు –
‘నిన్న ట్రాఫిక్‌లో మిమ్మల్ని చూశాం!’’
అవును!
నాలో ఒకే ప్రశ్న ఇది
నన్ను ట్రాఫిక్‌లో చూసింది ఎవరూ?!
నేను తెలుసుకోవడానికి `
ఇప్పుడు నేను
ఇంకొక ట్రాఫిక్ జామ్‌లోకి ప్రవేశించాల్సిందే!
![]()
వర్షం
అస్సామీ మూలం : నీలిమ్ కుమార్
వర్షం చేతిని ఎత్తి
బస్సును ఆపింది.
అనంతరం గర్జిస్తూ వేగంగా
బస్సు లోపలికి వచ్చేసింది.
ఏ ఖాళీ సీటు లేదు.
వర్షం నిలబడిరది.
నన్ను తాకుతూ, పక్కనే.
వేగంగా ప్రయాణించే ఆ బస్సులో
హోరుగాలి, మేఘాలు, ఉరుములు,మెరుపులేవి
వర్షానికి తోడుగా నడిచే నేస్తాలు
అక్కడ మాత్రం కూర్చుని లేవు.
అక్కడ కూర్చున్న మనుషులెవరూ
వర్షాన్ని గుర్తించలేదు
వారు వర్షానికి పరాయివారు.
బస్సు ఒక్కోసారి ఉలికిపాటుగా ఊగుతుంటే
వర్షపు బిందువులు చినుకు చినుకుగా
వారి దేహాన్ని ముద్దడుతున్నాయి.
ఎవరైనా మెడ ఎత్తి చూస్తారు.
కొందరూ భుజాల మీద నుంచి చూస్తారు
ఆమెలా నిలబడిన వర్షాన్ని.
అనుకోకుండా`
బస్సు మొత్తం క్రమంగా
వర్షపు నీటితో నిండి పోయింది.
కానీ ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
ఒక నిశ్శబ్దం.
ఆ నిశ్శబ్దం మధ్య
వర్షం నా భుజంపై చేయి వేసింది.
నా షర్ట్‌లోని కాగితాలు,
నా శరీరంతడియిపోయింది.
ఆ తడిగా మారిన పత్రాల్లో
నిముషాల క్రితం వ్రాసిన నా కవితలో
వర్షపు నీరుతో తడిబారింది.
నా పెదవులు
నాకు తెలియకుండానే
వర్షపు నీటిని ముద్దాడినట్టయ్యాయి.
ఇలాగే
నాకు తెలియకుండానే
వర్షం నా లోపలికి వచ్చింది.
నా లోపల
ఒక చిన్న ఆకాశం ఉంది.
ఆ ఆకాశాన్ని చూసి
వర్షం మళ్లీ కురవడం మొదలెట్టింది.
ఇప్పుడు`
లోపల తడి, బయట తడి
నన్ను పూర్తిగా తడిపేశాయి.
అప్పుడు నిదానంగా వర్షం నా చెవిలో చెబుతుంది:
‘‘నీకు తడిసిపోవడం నచ్చలేదు కదా?’’అని.
![]()
విభిన్న ధోరణులు
రచన : అజర్ నదీమ్
ఉర్దూ నుండి అనువాదం – కామ్రాన్ అవాన్
ఆమె అంటుంది
గులాబీ ముఖంపైని మంచుబిందువులు ఆవిరైపోతాయనీ
సీతాకోకచిలుక రంగులు క్రమంగా వాడిపోతాయనీ
కన్నీళ్లు ఏ జ్ఞాపకాలను మిగల్చవూ
సువాసన కూడా మోసగించగలదు.
నేను అంటాను-
నీ చిత్తశక్తిని పిలుచుకో,
నీ జీవితపు చివరి దశను ఒక్కసారి తడిమి చూడు
ఒక అందమైన క్షణం,
జీవితంలోని ప్రతి క్షణాన్నీ సువాసనగానూ,
ఒక్కసారిగా జీవనాన్ని మారుస్తూనూ ఉంచగలదు.
![]()
యుగాల రహస్యాలను వర్షించే వర్షం!
రచన : అజర్ నదీమ్
ఉర్దూ నుండి అనువాదం – కామ్రాన్ అవాన్
ఈ వర్షసువాసన, గత కాలపు పుటలు తిప్పుతోంది.
ఈ వర్షాకాలం, పాత జ్ఞాపకాల లోకంలో లోతుగా విహరిస్తోంది.
అది ఎడారి తీరని దాహాన్ని తెలుసుకుంటుంది.
ఈ వర్ష వాసన, భూమి మీద పొంగిన చీకటిని
అంతటా వ్యాపించిన మబ్బుల్ని గుర్తిస్తోంది.
ఎక్కడో ఒక చోట దృశ్యం ఉంది
ఎక్కడో ఒక చోట దూరమైన దృశ్యరేఖ,
ఎక్కడో జ్ఞాపకాలతో తడిసిన క్షణరు
గుర్తుండే కథలు, మరచిపోయిన కథలు.
ప్రతి వానబిందువులో ఒక కథ ఉందిు
దూరంగా విస్తరించిన నూలుపోగులా నడుస్తూ పోతుంది.
ఈ వర్షం అనేది కథలు పాడే స్వరం.
ఇప్పుడే పడిన ఈ వాను
యుగాల రహస్యాలను మెల్లగా చాటుతోంది.
![]()




Discussion about this post