తెలుగు అనువాదం : బడుగు భాస్కర్ జోగేష్
1. పదాలు
అస్సామీ : భాబెన్ బారువా
ప్రతి పదం ఒక దేవదూత
ప్రతి ఒక్కటీ వెతకాలి నీవు
పొగమంచు నిశ్శబ్దంలో
సరస్సులో సాయంసంధ్య
సంగమించే చోట
ఇంకా కాటుక కీకారణ్యం
మీదుగా నక్షత్రాలతో నిండిన
ఆకాశ సూచన
అకస్మాత్తుగా కానవస్తుంది
రాత్రి పక్షులు
రెక్కలు తీసుకుని ఎగిరిపోతాయి.
ప్రతిదానికీ
తనదైన అస్తిత్వం ఉంటుంది
ప్రతీ పదానికీ దాని
స్వంత రహస్యలక్ష్యం ఉంటుంది
ప్రతి ఒక్కటి అల్లకల్లోలం
అంతరాన జడత్వంలో అన్వేషించాలి
అక్కడ నీలిమ రహస్యంగా
నిశ్శబ్దంలో నిలిచిపోతుంది
ఇంకా అర్థరహితమైనవి
పలు అర్ధవంతమైన
పొరలుగా రూపాంతరం చెందుతాయి
అన్నిటికీ తారకలవలే
స్థిరస్థానం ఉంటుంది
ఏక ఆకాశంలో
అంతేనా
ప్రతి ఒక్కటి అనేక ఆటుపోట్ల
నిశ్శబ్ద ప్రేక్షకుడు
అల మీద అలవలే
2. విద్యార్థిణి
సింహళి : బుద్ధదాస గలపతి
‘అథన’ పువ్వు వంటి
ధవల దుస్తులు
పాలవర్ణపు బూట్ల జత ధరించి
నిగ్రహ సాధువులా
చూపు మరల్చకుండా
అభ్యసన ఆర్జనకు
బయల్దేరింది బడికి
తన స్థనాల నడుమ
దొంగిలించిన ప్రేమలేఖ
3. జీవిక
సింహళి : తిరుమావలవన్
నాలుగు గాజుగోడల
చిన్ని చెరువు
సమ శీతోష్ణ
కాలుష్య రహిత
శుద్ధజలమూ
విద్యుత్ దీప
మసకకాంతిన
మొలవని మొక్కలూ
కృత్రిమకృతులు
క్రమ విరామాల్లో
సిద్ధహారమూ
పొందికైన ఖైదులో
దుఃఖగానిత చిరుచేప




Discussion about this post