• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

సంపాదకీయం : స్వార్థ ప్రయత్నం!

కె ఎ మునిసురేష్ పిళ్లె by కె ఎ మునిసురేష్ పిళ్లె
July 28, 2025
in సంపాదకీయం, సాహిత్య వ్యాసం
0
సంపాదకీయం : స్వార్థ ప్రయత్నం!

సాహిత్యం కేవలం వినోదం కాదు, అధ్యయనం. అధ్యయనం వికాసానికి మార్గం. ఆలోచనకు పదును పెడుతుంది.. మనల్ని దారిలో పెడుతుంది.  సాహిత్యం చదవడమే మనల్ని మనం తీర్చిదిద్దుకునే ప్రయత్నం. అధ్యయనమే స్వార్థం. సాహిత్యం కూడా. 

రకరకాల కారణాల నేపథ్యంలో తెలుగులో పత్రికల ప్రచురణ తగ్గిన పరిస్థితులు సాహిత్యం- పాఠకులకు చేరువయ్యే మార్గాలను మూసేశాయి. ఈ విపరిణామానికి విరుగుడుగా ఆధునిక సాంకేతికత కొత్త మార్గాలను తెరచి చూపించింది. ముద్రణ మాధ్యమంలో పత్రికలు లేని లోటును అనేక ఆన్‌లైన్ పత్రికలు చక్కగా భర్తీ చేస్తున్నాయి. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుండడం వల్ల సాహిత్యానికి జరుగుతున్న మంచి పరిణామం ఆన్‌లైన్ పత్రికలు. ముద్రణ మాధ్యమం లాగా వీటి మధ్య పోటీ ఉండదు. లాభాపేక్ష ఉండదు. కేవలం సాహిత్యాభిలాష మాత్రమే. కేవలం సాహిత్యం కోసం నడుస్తున్న పత్రికలు. వీటిలో చాలా వరకు ఉచితంగానే పాఠకులకు అందుతున్నాయి. ఈ రంగంలోకి కొత్తవి రావడం.. ఎవ్వరి ‘మార్కెట్’నూ దెబ్బతీసే అవకాశం లేదు. చదివేవాళ్లు అన్నింటినీ చదువుకుంటారు. రాసేవాళ్లకు మరిన్ని ప్రచురణ సంస్థల వెబ్ మేగజైన్లు అందుబాటులోకి వచ్చాయి. 

తెలుగు సాహిత్యానికి ప్రచురణల పరంగా కొత్తగా ఏర్పడుతున్న లోటును భర్తీ చేయడానికి జరుగుతున్న అనేకానేక కొత ప్రయత్నాల్లో.. మా ప్రయత్నం kathavasudha.com కూడా ఒకటి. ఎన్ని వెబ్ మేగజైన్లు వచ్చినప్పటికీ.. కేవలం అనువాద సాహిత్యం కోసం ప్రత్యేకించినది ఏదీ లేదు. సాధారణ పత్రికల్లాగే వెబ్ పత్రికలు కూడా అడపాదడపా అనువాద సాహిత్యానికి చోటు ఇస్తున్నాయి. అయితే ఇది చాలదు.  అనువాద సాహిత్యం మన ఆలోచనల విస్తృతికి ఉపయోగపడుతుంది. అనువాద సాహిత్యం వలన వైవిధ్యభరితమైన, విలక్షణమైన రచనలు మనకు అందివస్తాయి. భాష, సాహిత్యాన్ని సుసంపన్నం చేయడానికి ఇవి ఖచ్చితంగా ఉపకరిస్తాయి.  రాసేవాళ్లకు కొత్త కోణాలను స్ఫురింపజేస్తాయి. చదివేవాళ్లకు కొత్త రకం వంటకాల విందుభోజనం అవుతాయి. ఆ రకంగా అనువాద సాహిత్యాన్ని ఆదరించడం అనేది.. మన కోసం మనం చేయవలసిన పని. అలాంటి స్వార్థ ప్రయత్నమే ‘కథావసుధ’!

‘కథావసుధ తెలుగు అనువాద సాహిత్య మాసపత్రిక’ కేవలం అనువాద కథలు, అనువాద కవితలు, సాహిత్య వ్యాసాలకు మాత్రమే పరిమితం అవుతున్న వెబ్ మాసపత్రిక. కేవలం అనువాద సాహిత్యానికి మాత్రమే ప్రత్యేకమైన వేదిక కల్పించే లక్ష్యంతోనే kathavasudha.com పనిచేస్తుంది.

ఈనాడు గ్రూపు ప్రచురించే ‘విపుల’ మాసపత్రిక మూత పడిన తర్వాత.. అనువాద సాహిత్యానికి నిర్దిష్టమైన వేదిక లేకుండా పోయింది. అనువాద సాహిత్యం సృజించేవారికి అవకాశాలు కుంచించుకుపోయాయి. ఇతర భాషలపై పట్టుఉండి అక్కడి సాహిత్యాన్ని మక్కువతో చదువుతూ.. నచ్చిన వాటిని ఎంతో ఇష్టంగా అనువదించేవాళ్లు.. ఆ రచనలను ఎక్కడకు పంపాలో తెలియక తమ వద్దనే అలా ఉంచేసుకున్న సందర్భాలున్నాయి. కథావసుధ ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత.. అనువాద రచయితల్ని సంప్రదించే క్రమంలో నాకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. రెండు భాషల సాహిత్యం మీద అభిమానం, పట్టు, అనువాద రచనలో అనుభవం ఉన్న పెద్దలు ‘మంచి ప్రయత్నం’ అని ఆశీర్వదించి ప్రోత్సహించారు. అనువాద రచనలకు, తద్వారా సాహిత్యానికి, పాఠకులకు ఇటీవలి కాలంలో ఏర్పడిన లోటును ‘కథావసుధ’ భర్తీచేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మా కోరిక కూడా అదే. 

ఇప్పుడున్న సాహిత్య పత్రికలు website/ text ఫార్మాట్‌లో ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. కొందరు pdf book/ flipbook రూపంలో అందిస్తున్నారు. ‘కథావసుధ.. తెలుగు అనువాద సాహిత్య మాసపత్రిక’ ఈ రెండు ఫార్మాట్లలోనూ పాఠకులకు అందుబాటులో ఉంటుంది. వెబ్‌సైట్ లో టెక్ట్స్ ఫార్మాట్‌లో అందరూ చదువుకోవచ్చు. ప్రతినెల మొదటి తేదీన సంచిక విడుదల అవుతుంది. 20వ తేదీన ఫ్లిప్ బుక్ అందుబాటులోకి వస్తుంది. దానిని పాఠకులు పీడీఎఫ్ పుస్తకంగా డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది. కొన్ని వెబ్ పత్రికలు text రూపంలో మాత్రం, కొన్ని flipbook రూపంలో మాత్రం ఇస్తుండగా ‘కథావసుధ తెలుగు అనువాద సాహిత్య మాసపత్రిక’ మాత్రం ఈ రెండు ఫార్మాట్లను మేళవించి పాఠకులకు అందిస్తుంది.

మా ఉద్దేశం.. అనువాద తెలుగు సాహిత్యానికి మన శక్తిమేర వ్యాప్తి కల్పించడం మాత్రమే. అందుకే ‘కథావసుధ’ వెబ్‌సైట్‌లో ఇతర ఆన్‌లైన్ సాహిత్య పత్రికలన్నింటి చిరునామాలను కూడా లింక్‌ల రూపంలో ఇస్తున్నాం. చదవడం ఇష్టమైన వాళ్లు ‘కథావసుధ తెలుగు అనువాద సాహిత్య మాసపత్రిక’తో పాటు వాటన్నింటినీ కూడా చదవవచ్చు. సాహిత్యాన్ని ఆస్వాదించండి. సాహిత్యం మాత్రమే కాదు, భాష కూడా సజీవంగా ఉండాలంటే.. చదివే ఇష్టం ఉన్న ప్రతిఒక్కరూ చదవడాన్ని ఆపకపోవడమే మార్గం. మనం చదవడంతో పాటు, మరొకరికి చదవడాన్ని అలవాటు చేయడం ముఖ్యం. తమకు నచ్చిన ప్రతి దానినీ తామెరిగిన పదిమందికీ షేర్ చేసి అందరితోనూ చదివింపజేయడం అవసరం. ఇలా చదివే అలవాటు ఒకరినుంచి మరొకరికి అంటుకుంటూ ఉంటే.. ఆధునిక ధోరణులు, సాంకేతిక విప్లవాలు కొత్త పుంతలు తొక్కుతున్న తీరులోనే.. తెలుగు సాహిత్యం కూడా.. మరింత సమృద్ధంగా, సముజ్వలంగా మారుతుంది.

అలాంటి స్వార్థంతో జరుగుతున్న ‘కథావసుధ’ ప్రయత్నాన్ని ఆదరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ.. కృతజ్ఞతలతో..

 .. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు, 99594 88088

కె ఎ మునిసురేష్ పిళ్లె
కె ఎ మునిసురేష్ పిళ్లె

మౌలికంగా జర్నలిస్టు. రచయిత. సుమారు ముప్ఫయ్యేళ్లుగా రాస్తున్నారు. తండ్రి ఎల్లయ్య స్థాపించిన ఆదర్శిని పత్రికతో రచనలు మొదలు పెట్టారు. మూడు కథా సంపుటులు ‘పూర్ణమూ.. నిరంతరమూ..’, ‘రాతి తయారీ’, ‘గారడీవాడు’, ఒక కవితా సంపుటి ‘షష్ఠముడు’, రెండు నవలలు ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’, ‘పుత్రికాశత్రుః’, ఒక సంపాదకీయ వ్యాసాలసంపుటి ‘మునివాక్యం’ ప్రచురించారు. శీలా వీర్రాజు కథానిక పురస్కారం సహా ఆరు పురస్కారాలు లభింంచాయి.

sureshpillai.com
Previous Post

ఇటాలియన్ కథ : దూరప్రయాణం

Next Post

చైనా కథ : అమ్మ

Next Post
చైనా కథ : అమ్మ

చైనా కథ : అమ్మ

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com