• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఆంగ్ల కథ : పాప కోసం..

కొల్లూరి సోమశంకర్ by కొల్లూరి సోమశంకర్
August 2, 2025
in అనువాద కథలు
0
ఆంగ్ల కథ : పాప కోసం..

ఆంగ్ల కథా రచయిత : మనోరంజన్ బెహురా (Meaning of Life)

తెలుగు అనువాదం :  కొల్లూరి సోమ శంకర్

ఎలాగైనా ప్రభుత్వోద్యోగం సాధించాలని తపించిపోతున్నాడు పాతికేళ్ళ గ్రాడ్యుయేట్ నిర్మల్. ఎన్నో ప్రయత్నాలు చేసి, విఫలమై, విసిగిపోయి, ఆశలు వదిలేసుకున్నాడు. చివరికి ఓ భవన నిర్మాణ సంస్థలో పనిచేసే మేస్త్రీకి సహాయకుడిగా చేరడానికి సిద్ధమయ్యాడు.

ఉద్యోగం రావడం లేదు. కానీ బతకడానికి ఏదో ఒక పని చేయాలి. ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చదవడం ద్వారా అతను పొందిన నైపుణ్యాలు, పనికిరాలేదు. కొత్త పని ఎంత కష్టమైనదైనా, సర్దుకుపోవాలని ప్రయత్నించాడు. బతకాలి, స్వతంత్రంగా ఉండాలన్నది అతని ఉద్దేశం.

ఓ రోజు నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి కాలినడకన వెళ్తున్నాడు. సన్నగా వాన పడుతోంది. గొడుగు తెరిచాడు. ఉదయం పూట పనివేళల్లో ఆ ఇరుకు దారి ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఓ కుర్రాడు బైక్‍ని విమాన వేగంతో పోనిస్తూ, దూసుకుపోవడం చూశాడు నిర్మల్. ఆ వేగానికి రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళంతా బిత్తరపోయి, ప్రమాదం నుంచి తప్పించుకోడానికి ఫుట్‌పాత్ మీదకి ఎక్కారు.

ఉన్నట్టుండి వేగంగా వెళ్తున్న ఆ బైకర్, ఎదురుగా వస్తున్న మరో బైక్‌ని ఢీ కొట్టాడు, ఓ పాపని కూర్చోబెట్టుకుని నడుపుతున్న ఆ రెండో బైక్ వ్యక్తికి సుమారు నలభై ఏళ్ళు ఉంటాయి, హెల్మెట్ పెట్టుకోలేదు, అతను పది అడుగుల దూరంలో పడ్డాడు, వణికిపోతున్నాడు. స్కూలు యూనిఫారంలో ఉన్న పాప కిందపడింది, ఒంట్లో గాయాలయ్యాయి, బాగా రక్తం కారుతోంది. వీళ్ళని గుద్దిన బైక్ కుర్రవాడికి ఏమీ కాలేదు, తనకేమీ పట్టనట్టు అతను అక్కడ్నించి జారుకున్నాడు. జనాలు చుట్టూ మూగారు. కొందరేమో, ఆ వ్యక్తి చనిపోయాడని అన్నారు. ఆ పాప కూడా కాసేపటికి చచ్చిపోతుందని అన్నారు. వాళ్ళల్లోంచి ఎవరో సన్నగొంతుతో, “అంబులెన్స్‌కి ఫోన్ చేయండి, హాస్పటల్‌కి పంపుదాం” అని అన్నారు.

“అమ్మో! హాస్పటల్‌లో చేర్చిన వాళ్ళని పోలీసులు తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు” అన్నాడు మంచి దుస్తులలో ఉన్న ఓ నడివయసాయన.

కాసేపయ్యాకా, అక్కడ గుమిగూడిన జనాలు ఎవరి దారిన వారు వెళ్ళసాగారు. ఆ బైక్ అతను చనిపోవడం, పాప స్పృహలో లేకపోయినా, బాధతో గిలగిలలాడ్డం నిర్మల్ చూశాడు. వాళ్ళిద్దర్ని దగ్గరలో ఉన్న ప్రైవేటు హాస్పటల్‌కి తీసుకువెళ్ళడానికి సాయం చేయమని అక్కడున్న అతన్ని అడిగాడు. అతనేమీ మాట్లాడకుండా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళని కూడా అడిగి చూశాడు నిర్మల్, అంతా ఏదో ఒక కారణం చెప్పి, అక్కడ్నించి తప్పుకున్నారు.

అదే సమయంలో ఓ కుర్రాడు అక్కడికి వచ్చాడు. తన బైక్‌ని పక్కగా ఆపి, ఏం జరిగిందో చూద్దామని మధ్యలోకి వచ్చాడు. నిర్మల్ ఆ కుర్రాడిని గుర్తుపట్టాడు. తమ పొరుగింటి మనిషే. ఇంతలో అక్కడ కనబడ్డ తన స్నేహితుడిని – పొరుగింటాయన బైక్‌ని స్టార్ట్ చేయమని చెప్పి, తాను వెళ్ళి పాపని ఎత్తుకుని వచ్చాడు. మిత్రుడు బండెక్కి స్టార్ట్ చేయగా, పాపతో సహా నిర్మల్ వెనక కూర్చున్నాడు. బైక్ స్టార్ట్ అయిన చప్పుడు విని పొరుగింటాయన ఇటు చూశాడు.

“నిర్మల్, నా బండి తీసుకెళ్ళద్దు” అని అరిచాడు, అప్పటికే బైక్ ముందుకు సాగిపోయింది.

పాపని జాగ్రత్తగా మధ్యలో కూర్చోబెట్టాడు నిర్మల్. ఉన్నట్టుండి బాధతో గట్టిగా మూల్గుతోందామె. ట్రాఫిక్‍ని దాటుకుంటూ, జనాల్ని తప్పిచుకుంటూ వచ్చి ఓ పైవేటు నర్సింగ్ హోమ్ ముందు ఆగింది.

నిర్మల్ పాపని భుజం మీద వేసుకుని లోపలికి వెళ్ళాడు. అక్కడ బాగా రద్దీగా ఉంది.

“డాక్టర్, డాక్టర్.. డాక్టర్ గారిని పిలవండి. యాక్సిడెంట్, పాపని కాపాడాలి” అంటూ గట్టిగా అరిచాడు.

సన్నగా పొడుగ్గా ఉన్న ఓ యువతి గదిలోంచి బయటకొచ్చింది. “ఎందుకు అరుస్తున్నావు? ఇది ఆసుపత్రి, మార్కెట్ కాదు” అని అంది.

అసహనంగా ఉన్న నిర్మల్, “మేడమ్, ఆ పాప తీవ్రంగా గాయపడింది. ఆమె ఒక ప్రమాదంలో స్పృహ కోల్పోయింది. దయచేసి ఆమె ప్రాణాలను కాపాడండి” అన్నాడు.

పాపని దగ్గర్లోని గదిలోని మంచం మీద పడుకోబెట్టమని చెప్పిందామె. ఆమె పాపను జాగ్రత్తగా పరీక్షించింది. బిపి, పల్స్ రేట్ చెక్ చేసింది. రక్తం కారుతున్న పాప కదలకుండా పడి ఉంది. “ముందుగా, చికిత్స కోసం కౌంటర్‌లో యాభై వేలు డిపాజిట్ చేయండి, అప్పుడు రోగిని ఆసుపత్రిలో చేర్చుకుంటాం” అని చెప్పింది లేడీ డాక్టర్.

నిర్మల్ చేతులు జోడించి, “మేడమ్, నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. దయచేసి ఆ పాప ప్రాణాలు కాపాడండి” అన్నాడు.

“అయితే పేషెంట్‌ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లండి” అని దురుసుగా అందామె. నిర్మల్ ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. “మేడమ్ దయచేసి ఆ బిడ్డ ప్రాణాన్ని కాపాడండి” అంటూ రోగికి చికిత్స చేయమని ఆమెను వేడుకున్నాడు.

పాపని తీసుకుని వెళ్లిపొమ్మందామె. నిర్మల్ నిస్సహాయంగా ఉన్నాడు. 

ఆమె ఆ గది బయటకు నడిచింది. నిర్మల్ ఆమె వెనుకే నడుస్తూ, అసహనంతో, “మీరు చదువుకున్నవారు, ధనవంతులు. కాస్త దయ చూపండి, నిస్సహాయరాలైన ఈ పాప ప్రాణాన్ని కాపాడండి” అని బ్రతిమిలాడాడు.

అంతలో, నిర్మల్ వెనుక నుండి ఒక ఉరుములాంటి శబ్దం వినిపించింది, “బయటకు వెళ్ళు, ఊఁ, నడు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? సెక్యూరిటీ గార్డు ఎక్కడ?” అంటూ.

వెనక్కి తిరిగాడు నిర్మల్. మెడలో స్టెతస్కోప్‌తో పొడుగ్గా, తెల్లగా, లావుగా, బట్టతలతో, తమ వెనుకే వస్తున్న ఆ వ్యక్తిని చూసి నిర్మల్ కాస్త భయపడ్డాడు. అతను చీఫ్ లేదా హెడ్ డాక్టర్ లేదా ఆ నర్సింగ్ హోమ్ యజమాని అని ఊహించాడు.

భయపడిన నిర్మల్ ధైర్యం కూడగట్టుకుని మళ్ళీ చేతులు జోడించి, “సర్, దయచేసి ఆ అమ్మాయి ప్రాణాన్ని కాపాడండి” అని అభ్యర్థించాడు. డాక్టర్ తన చూపుడు వేలును చూపిస్తూ, “ముందు యాభై వేలు డిపాజిట్ చేయండి, తర్వాత మాట్లాడండి” అని హెచ్చు స్వరంతో అన్నాడు. 

ఇంతలో, స్టెతస్కోప్ మెడలో వేసుకుని కళ్లద్దాలు ధరించిన ఓ స్త్రీ, మరో రూమ్ నుంచి బయటకు వచ్చి, “ఇదేమైనా ధర్మ సత్రం అనుకుంటున్నావా?” అని అరిచింది.

నిర్మల్ ఇంకా చేతులు జోడించే, “మేడమ్! ఆ పాప..” అన్నాడు.

“ఆ పాప చనిపోతే నాకేంటి? బయటకు వెళ్ళు” అని, అక్కడున్న గేట్ కీపర్‌ని పిలిచి, “ఇతన్ని బయటకు తీసుకెళ్ళు” అని చెప్పి, ఆ స్త్రీ, ఆ పెద్దమనిషి ఇద్దరూ మరో పేషంట్ దగ్గరకి వెళ్ళిపోయారు.

గేట్ కీపర్‌ వచ్చి, “నువ్వు తీసుకొచ్చిన పేషెంట్‌తో తిరిగి వెళ్ళు. నీకిక్కడ ఎటువంటి సేవలూ లభించవు” అన్నాడు.

నిర్మల్ పరిస్థితిని అంచనా వేయగలిగాడు. అతను పాపని భుజంపై మోసుకుని వచ్చి, బైకి ఎక్కి తన స్నేహితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి పోనివ్వమని చెప్పాడు. ఐదు నుండి ఆరు కిలోమీటర్ల హడావిడి ప్రయాణం తర్వాత, వారు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటారు. ఆ పాపకు స్పృహ లేదు కానీ ఊపిరి పీల్చుకుంటోంది. తెల్లవారుజాము అయింది. రోడ్డంతా ట్రాఫిక్‌తో నిండిపోయింది. ఇద్దరు యువకులు నిరుత్సాహంగా ఉన్నారు. పాప ప్రాణాలను కాపాడటానికి వారు అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ పాప కోసం అన్ని అవాంతరాలను తట్టుకోదలచాడు, ఓపిక పట్టాడు నిర్మల్. తోటి మనిషికి సాయం చేద్దామని చూస్తే, మళ్ళీ మళ్ళీ అవమానమే ఎదురైంది. బండిని జాగ్రత్తగా పోనివ్వమని తన స్నేహితుడిని కోరాడు.

ఓ అరగంట తర్వాత ప్రభుత్వాసుపత్రికి చేరారు. పాపని భుజాల మీద మోసుకుంటూ కాజువాల్టీ వార్డు చేరుకున్నాడు నిర్మల్. అక్కడ కనబడిన నర్సుతో, “మేడమ్, పాపకి యాక్సిడెంట్ అయ్యింది, ఎమర్జెన్సీ” అన్నాడు. నర్స్ చుట్టూ చూసింది. మంచాలేవీ ఖాళీ లేవు. పాపని నేల మీద పడుకోబెట్టమని చెప్పింది. అలాగే చేశాడు.

నిర్మల్ దగ్గర కనీసం దుప్పటి అయినా లేదు. పాప సృహలో లేనప్పటికీ, శ్వాస తీసుకోవడం అతనికి తెలుస్తోంది, దెబ్బల నుండి రక్తం కారుతోంది. “దేవుడా, పాపని కాపాడు” అని మనసులోనే భగవంతుడిని వేడుకున్నాడు.

తన స్నేహితుడిని పిలిచి, వెళ్లి తన పొరుగింటాయని బైక్ ఇచ్చేయమని చెప్పాడు. పాప పక్కనే కూర్చుని ఆమె ముఖం చుట్టూ, గాయాల చుట్టూ ముసురుతున్న ఈగలను తోలసాగాడు. ఆ చిన్నారికి చికిత్స చేయడం కష్టమవుతుందని నిర్మల్ భావించాడు. ఆమెను స్కూలికి తీసుకువెళ్తున్న ఆ వ్యక్తి పరిస్థితి కూడా తీవ్రంగా ఉండే ఉంటుంది. అతన్ని ఆసుపత్రిలో చేర్చారో లేదో అనుకున్నాడు. పాప బంధువులైవరైనా వస్తే నిర్మల్‌కి ఉపశమనం కలుగుతుంది.

స్టెతస్కోప్ పట్టుకుని సన్నగా, అందంగా ఉన్న ఒక యువతి వచ్చి నిర్మల్‌ని అడిగింది, “ఆ పాపకి ఏమైంది?”

“యాక్సిడెంట్,” చెప్పాడు.

ఆ యువ వైద్యురాలు స్టెతస్కోప్‌తో పాపని చెక్ చేసింది. ప్రెజర్ చెక్ చేసింది. ఇంతలో చేత్తో స్టెతస్కోప్ పట్టుకున్న మరో యువ వైద్యుడు ఆమె దగ్గరకు వచ్చి, “హాయ్ ఇవాళ నువ్వు స్మార్ట్ గా, అందంగా కనిపిస్తున్నావు!” అని అన్నాడు. ఆ లేడీ డాక్టర్ రోగిని చెక్ చేస్తూ సిగ్గుపడుతూ, “థాంక్యూ” అంది.

“నిన్న రాత్రి ఫోన్ చేశాను. తియ్యలేదెందుకు?” అని ఆ యువ వైద్యుడు అడిగాడు.

ఆ లేడీ డాక్టర్ పాప నాడి పరీక్షిస్తూ, “నేను రాత్రి పదకొండు తర్వాత పడుకున్నాను. నువ్వు నాకు తెల్లవారుజామున 1.30 తర్వాత ఫోన్ చేసావు” అని సమాధానం ఇచ్చింది.

రోగులు ప్రాణాలతో పోరాడుతున్న ప్రదేశంలో రొమాన్స్ చూసి నిర్మల్ షాక్ అయ్యాడు. రక్తస్రావం అవుతున్న చిన్నారి అనిశ్చిత పరిస్థితి వారి ప్రేమ కోరికలపై ఎలాంటి ప్రభావం చూపలేదు, అలాగే వారి కార్యకలాపాలలో పాప పరిస్థితి పట్ల ఏ మాత్రం ప్రతిస్పందన లేదు.

“వెళ్ళి ఈ మందులు తీసుకురా” అని లేడీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చే వరకు వారి గుసగుసలు కొనసాగుతూనే ఉన్నాయని నిర్మల్ గమనించాడు.

అతను చేతులు ముడుచుకుని, “మేడమ్ నా దగ్గర డబ్బులు లేవు. నేను పేదవాడిని. దయచేసి నా రోగికి ప్రభుత్వ సహాయం ప్రకారం చికిత్స చేయండి” అన్నాడు.

ఆ లేడీ డాక్టర్ నిర్మల్ వైపు చూసి, “పాప పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఆమె అలాంటి మందులకు స్పందించకపోవచ్చు” అంది.

“దయచేసి ఆ పాప బంధువులు వచ్చేవరకు పాపకి చికిత్స చేయండి. యాక్సిడెంట్‌లో పాపకి దెబ్బలు తగిలాయని, నేను స్వచ్ఛందంగా ఆసుపత్రికి తీసుకువచ్చాను,” అని చెప్పాడు నిర్మల్.

ఆ లేడీ డాక్టర్ ఆ యువకుడితో గుసగుసలాడుతూ ప్రిస్క్రిప్షన్ మీద స్టాంప్ వేసి, “వెళ్ళి డిపార్ట్‌మెంట్ వెలుపల ఉన్న గవర్నమెంట్ కౌంటర్ నుండి ఈ మందులను తీసుకురా” అని చెప్పింది.

‘పాప‌కి సీరియస్‌గా ఉంది, కానీ ఆ యువ వైద్యురాలు ఆమెకు నిర్లక్ష్యంగా చికిత్స చేస్తోంది. ఓ దేవుడా! దయచేసి పాపని కాపాడు,’ అని నిర్మల్ తనలో తాను అనుకుంటూ మందుల దుకాణం వైపు పరిగెత్తాడు.

అక్కడి పొడవైన క్యూను చూసి గాఢంగా నిట్టూర్చాడు. ‘అయ్య బాబోయ్! మందులు తీసుకోడానికి గంటకి పైనే పట్టేడట్టుంది,’ అనుకున్నాడు.

నిర్మల్ బిగ్గరగా, “సోదరులారా! ఒక యాక్సిడెంట్ పేషెంట్ ఉంది, చిన్న పాప, స్టూడెంట్. దయచేసి ఆమె ప్రాణాలను కాపాడటానికి నన్ను ముందుగా మందులు తీసుకోవడానికి అనుమతించండి. ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉంది” అని అన్నాడు.

క్యూలో నుండి ఎవరో, “అబద్ధం చెబుతున్నాడు” అన్నారు.

“లేదు, అతను చెప్పింది నిజమే, నేను ఆ పాపని చూశాను” అని ఇద్దరు ముగ్గురు అన్నారు.

క్యూలో విరక్తిగా నిలుచున్న ఓ వ్యక్తి, “అయితే ముందు అతన్నే మందులు తీసుకోనివ్వండి” అన్నాడు.

మందులు తీసుకుని నిర్మల్ క్యాజువాలిటీ విభాగానికి పరిగెత్తాడు, ఆ పాప నొప్పితో కాళ్ళు కొట్టుకుంటోంది. అప్పటిదాకా కదలకుండా ఉన్న పాపకి తెలివి రావడం చూసి నిర్మల్ సంతోషించాడు. పాప బాధతో మెలికలు తిరుగుతోంది.

ఆ లేడీ డాక్టర్ కోసం చుట్టూ చూశాడు నిర్మల్. ఆమె మాయమైపోవడం నిర్మల్‌కి వింతగా అనిపించింది. రోతగా అనిపించింది. వెళ్ళి వెతికాడు. ఆమె, ఇందాకటి యువ వైద్యుడితో హాస్పటల్ ముందున్న లాన్‌లో కబుర్లాడుతోంది.

అక్కడికి వెళ్ళి, ఆమెతో, “మేడమ్ మందులు తెచ్చాను. పాపకి స్పృహ వచ్చింది. కాళ్ళు కదిలిస్తోంది” అని చెప్పాడు.

ఆ లేడీ డాక్టర్ వచ్చి పాపని చూసింది. పాప ఇంకా తన కాళ్ళని నేల కేసి కొడుతోంది, ఏవో మాటలు అస్పష్టంగా చెబుతోంది. లేడీ డాక్టర్ పాపకి ఇంజక్షన్ ఇచ్చింది, సెలైన్ స్టాండ్ తెప్పించి, సెలైన్ ఎక్కించసాగింది. నిర్మల్ వైపు చూసి, “బ్రెయిన్ స్కాన్ రాశాను. ఎందుకైనా మంచిది, బ్రెయిన్ ఇంజరీ ఏమైనా ఉందేమో చూద్దాం” అని అంది. కొన్ని క్షణాల తర్వాత, అక్కడ్నించి లేస్తూ, “ప్రొఫెసర్, డిపార్టు‌మెంట్ హెడ్ వచ్చినప్పుడు పాపని చూస్తారు” అని చెప్పింది.

పాపని ప్రొఫెసర్ గారు పరీక్షిస్తారనేసరికి నిర్మల్‌కి సంతోషం వేసింది. కానీ అంతలోనే ఏదో దిగులు. పాప బంధువులని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఆ పాప అమ్మానాన్నలు వస్తే గానీ తాను అక్కడ్నించి వెళ్ళలేదు.

గోడకున్న గడియారం కేసి పదే పదే చూశాడు. ఐదు నిమిషాల వ్యవధి తర్వాత, ఆ లేడీ డాక్టర్ దగ్గరకెళ్ళి, “ప్రొఫెసర్ గారు ఎప్పుడొస్తారు?” అని అడిగాడు. “మాకు తెలియదు” అందామె.

అప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటిగంట అవుతోంది. ఇంతలో ఎవరో చెప్పారు, డిపార్ట్‌మెంట్ హెడ్ వస్తున్నారని. 

ఓ ఖరీదైన కారు ఆసుపత్రి ప్రాంగణంలోకి దర్జాగా ప్రవేశించింది. కారుని ఆపిన తర్వాత డ్రైవర్ దిగి వెనుక డోర్ తెరిచాడు. ఆయన కారు దిగుతుంటే, ఆయన్ని చూడగానే నిర్మల్‍లో ఏదో గుబులు. వెంటనే పాప దగ్గరకి పరిగెత్తాడు. పాప ఏదేదో అస్పష్టంగా మాట్లాడుతూ, కాళ్ళు నేలకేసి కొట్టుకుంటోంది. డిపార్ట్‌మెంట్ హెడ్‌ని కలవాలనుకోలేదు నిర్మల్. కానీ పాప కోసం, తప్పనిసరిగా కలవాల్సి వస్తోంది.

ప్రొఫెసర్ గారి గదికి వెళ్ళి ఆయనకు నమస్కరించాడు. “సార్, అక్కడ ప్రాణాల కోసం పోరాడుతోంది, దయచేసి కాపాడండి” అని వేడుకున్నాడు. 

ప్రొఫెసర్ తన రివాల్వింగ్ చైర్‌లో కూర్చున్నాడు. ఆయన నిర్మల్ కేసి చూడను కూడా లేదు.

ఆయన కెదురు కుర్చీలో ఓ స్త్రీ కూర్చుని ఉంది. ఆమె నిర్మల్‍ని చూసి, “నువ్వా, ఆ పాపని ఇక్కడికి తీసుకోచ్చావా?” అని అడిగింది. ఉదయం, నర్సింగ్ హోమ్‌లో ‘ఇదేమీ ధర్మసత్రం కాదు’ అని అన్నది ఆవిడే. ఈ దంపతులిద్దరూ కారు దిగుతున్నప్పుడే నిర్మల్ వాళ్ళని గుర్తుపట్టాడు. కానీ ఏం చేయగలడు? తనలాంటి పేదవారికి ఈ సమాజంలో గౌరవం లేదు.

ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి, వచ్చి పాపని పరీక్షించమని బ్రతిమిలాడాడు నిర్మల్. ఆయన మౌనంగా ఉండిపోయాడు, అసలేమీ విననట్టు. నిర్మల్ మళ్ళీ అదే భంగిమలో బ్రతిమిలాడాడు. డబ్బు కావాలన్నట్టు సైగలు చేశాడు ప్రొఫెసర్. నిర్మల్ కాస్త ధైర్యం కూడగట్టుకుని తన దగ్గర ఉన్న ఒకే ఒక వంద రూపాయల నోటును మడిచి ఆయనకి అందించాడు. ఆయన దాన్ని అందుకుని విప్పి చూశాడు. ఉన్నట్టుండి దాన్ని నిర్మల్ వైపు విసిరేస్తూ, “ఏమనుకుంటున్నావ్? ఎవరితో ఎలా ఉండాలో తెలియదా? నాలాంటి ఫేమస్ డాక్టర్‌కి కేవలం వంద రూపాయలు ఇస్తావా? నేనేమైనా ముష్టివాడిననుకుంటున్నావా?” అంటూ అరిచాడు.

నిర్మల్ ఇంకా చేతులు జోడించే ఉన్నాడు, “సార్, నా దగ్గర ఆ వంద రూపాయలే ఉన్నాయి. నా దగ్గర డబ్బులుండి ఉంటే, పాపని మీ నర్సింగ్ హోమ్‍లోనే చేర్చేవాడిని కదా” అన్నాడు.

ఆయన నిర్మల్ కేసి అభావంగా చూశాడు.

“వెళ్ళు, సార్ అలసిపోయారు, ఇప్పుడు ఎవర్నీ చూడరు” అంది ఆయన భార్య.

కింద పడిన నోటుని తీసుకుని బయటకు వెళ్ళబోతుంటే, “ఆగు” అన్నాడాయన.

“దాన్నిక్కడ పెట్టి వెళ్ళు. నేను తర్వాత వస్తాను. నీతో వస్తే జనాలు అనుమానిస్తారు” అన్నాడాయన.

వంద రూపాయల నోటుని ఆయనకందించి బయటకు వచ్చేశాడు నిర్మల్. పాప ఇంకా బాధలోనే ఉంది. అస్పష్టంగా మూలుగుతోంది, కాళ్ళని నేలకేసి కొట్టుకుంటోంది. పాప పరిస్థితి చూసి నిర్మల్ హృదయం ద్రవించిపోతోంది. ‘అయ్యో, దేవుడా, పాపని కాపాడు’ అని మొరపెట్టుకున్నాడు నిర్మల్.

ప్రార్థనలో లీనమై ఉన్న నిర్మల్ ఏకాగ్రత ఒక్కసారిగా భగ్నమయింది. “అయ్యో.. అయ్యో” అన్న వేదన నిండిన అరుపు వెనక నించి వినబడింది. వెనక్కి తిరిగి చూద్దామనుకునే లోపే అదే గొంతు.. మరింత దుఃఖంతో, మరింత పెద్దగా “అయ్యో, పాపా, ఏమైంది నీకు?” అంటూ వినబడింది. నిర్మల్ వెనక్కి తిరిగాడు. ప్రొఫెసర్ రోదిస్తూ, వంగి పాపని చూస్తున్నాడు. భర్త అరుపులు విని, “ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు?” అంటూ లోపల్నించి భార్య గబగబా బయటకు వచ్చింది.

పాపని చూడగానే ఆమె కూడా కెవ్వున కేక పెట్టింది. “అయ్యో, మానవి, నువ్వా, ఏమైంది? పాపని ఎందుకు నేలమీద పడుకోబెట్టారు” అంటూ కింద కూర్చుని పాపని ఒళ్ళోకి తీసుకుంది.

“పాపని ఎవరు ట్రీట్ చేస్తున్నారు?” డిపార్ట్‌మెంట్ హెడ్ అక్కడున్న ఓ నర్స్‌ని అడిగాడు.

ఇందాకటి యువ లేడీ డాక్టర్ ముందుకు వచ్చింది. “సర్, నేను పాపని చెక్ చేశాను. తలలో గాని, గుండెకి గాని ఇంటర్నల్ ఇంజరీస్ ఏమీ లేవు. ఇదిగో ఈ ఇంజక్షన్ ఇచ్చాను” అంటూ ప్రిస్క్రిప్షన్ చూపించింది. 

పాప తల్లి బిడ్డను లేపి, ఎత్తుకోబోయింది.

“ఏం చేస్తున్నావ్?” అన్నాడు ప్రొఫెసర్.

“ముందు పాపని ఛాంబర్ లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడదాం” అంది.

నిర్మల్ పాపని ఎత్తుకుని ప్రొఫెసర్ గారి ఛాంబర్‌లో ఉన్న బెడ్ మీదకి చేర్చాడు. కొంచెం సేపయ్యాకా, పాపకి మెలకువ వచ్చింది. ‘అమ్మా, అమ్మా..’ అంటూ మూల్గసాగింది. 

భార్యాభర్తలిద్దరూ “అమ్మయ్య! పాపకి పూర్తి స్పృహ వచ్చింది” అని నెమ్మదిగా ఒకరితో ఒకరు అన్నారు. 

“ఇక మన నర్సింగ్ హోమ్‍కి తీసుకువెళ్దాం, పాపకి ప్రమాదం తప్పడం మన అదృష్టం” అంది ప్రొఫెసర్ గారి భార్య.

పాపని తీసుకుని రావల్సిందిగా ఆమె నిర్మల్‍ని కోరింది. 

పాప నెమ్మదిగా, ‘అమ్మా, అమ్మా..’ అని అంటోంది.

“నీ పక్కనే ఉన్నానమ్మా, కాస్త ఓర్చుకో. నర్సింగ్ హోమ్‌కి వెడదాం” అంది తల్లి.

ప్రొఫెసర్ గారు ముందు డ్రైవర్ పక్కన కూర్చున్నారు. పాప తల్లి, నిర్మల్ వెనుక కూర్చున్నారు. పాపని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది తల్లి. పాప కాళ్ళు జాపి, నిర్మల్ కాళ్ళ మీద తన కాళ్ళుంచుకుంది.

కొంచెం సేపయ్యాకా, “మనం ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా?” అని పాప అడిగింది.

“ఇంటికి వెళ్తున్నాం మానవి” చెప్పింది తల్లి.

కాసేపయ్యాకా, “నువ్వు పాపని ఎక్కడ చూశావ్?” నిర్మల్‌ని అడిగిందామె.

యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం పేరు చెప్పి, “రోడ్డు మీద ప్రమాదం జరిగింది. పాపని బైక్ మీద తీసుకువెళ్తున్న నడివయసు వ్యక్తి కొంచెం దూరంగా పడి స్పృహ తప్పాడు. నేను పాపని తీసుకుని ముందు మీ నర్సింగ్ హోమ్‌కి, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్‌కీ వచ్చాను” చెప్పాడు నిర్మల్.

“అదేంటి? అన్ని ఫెసిలిటీస్ ఉన్న మా మోడరన్ నర్సింగ్ హోమ్ నుంచి నన్ను గవర్నమెంటు హాస్పటల్‌కి ఎందుకు తీసుకెళ్ళారంకుల్?” అడిగింది పాప.

నిర్మల్ మౌనంగా ఉండిపోయాడు.

“నాన్నా, అమ్మా, అంకుల్ నన్ను గవర్నమెంట్ హాస్పటల్‌కి తీసుకువెళ్ళడానికి మీరెందుకు ఒప్పుకున్నారు?” అని తల్లిదండ్రులను అడిగింది.

భార్యాభర్తలిద్దరూ తమను తాము మేధావులమంటూ గొప్పలు చెప్పుకుంటారు, కానీ తమ కూతురు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక, నిస్సహాయంగా ఉండిపోయారు. పాప అదే ప్రశ్నని మళ్ళీ మళ్ళీ అడిగింది. పాప తల్లి ఏడుస్తూ, పాప ముఖంపై పదే పదే ముద్దులు పెట్టింది.

“పాపా, నువ్వంటే అమ్మానాన్నలకి చాలా ఇష్టం కదా, అందుకని నీ చేతికి ఇంజక్షన్ గుచ్చలేకపోయారు.. అందుకే నిన్ను..” చెప్పాడు నిర్మల్.

“ఓకే.. ఓకే.. అర్థమయింది. అమ్మానాన్నలు నా బాధ చూడలేరు. లవ్ యూ అమ్మా, లవ్ యూ నాన్నా” అంది.

కొద్ది క్షణాల్లో పాపకి గాఢనిద్ర పట్టేసింది. కారు నర్సింగ్ హోమ్ చేరింది. పాప కాళ్ళని మెల్లగా సీట్ లోకి జరిపాడు నిర్మల్. డోర్ తీసుకుని దిగబోయాడు. పాప తల్లి ఓ అందమైన మందపాటి కవర్‌ని నిర్మల్‌కి ఇవ్వబోయింది.

“తీసుకో. ఇది నీకు పారితోషికం. మా పాపని కాపాడావు” అంది.

“ఏంటిది మేడమ్?” అన్నాడు నిర్మల్ నవ్వుతూ.

“మా ఒక రోజు ఆదాయం. లక్షకి పైనే ఉంటుంది” అంది.

“మేడమ్, పాపని నేను కాపాడలేదు. ఆ పైవాడే కాపాడడు. నేను కేవలం మానవత్వంతోనే, పాపని ఆసుపత్రికి తీసుకొచ్చాను” అన్నాడు నిర్మల్.

కొన్ని క్షణాలాగి, “పాపని స్కూలుకి తీసుకువెళ్తూ గాయపడిన అతని పరిస్థితి ఏమైనా తెల్సిందాండీ?” అని అడిగాడు.

“అతను మా స్టాఫ్. మా నర్సింగ్ హోమ్ లోనే చికిత్స జరుగుతోంది. పర్వాలేదు. అతనికి ప్రమాదం తప్పింది” చెప్పాడు ప్రొఫెసర్.

పాప తల్లి ఇవ్వబోతున్న డబ్బు తీసుకోకుండా కారు దిగిపోయాడు నిర్మల్. నర్సింగ్ హోమ్‍కి దగ్గరలో ఉన్న టీ కొట్టుకి వెళ్ళాడు. అక్కడున్న ఓ ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని మూత తెరిచి గడగడా తాగేశాడు. నీరసంగా ఓ కుర్చీలో కూర్చున్నాడు. అతనికి అలసటగా ఉంది, ఆకలిగా ఉంది.

ఇంతలో, “మిస్టర్.. మిస్టర్” ఎవరో పిలుస్తున్నట్టయి, వెనక్కి తిరిగి చూశాడు.

అక్కడ ప్రొఫెసర్ కనిపించాడు.

“సార్?”

ప్రొఫెసర్ వంద రూపాయల నోటుని నిర్మల్‌కి అందించబోయాడు.

“ఏంటి సర్ ఇది?”

“డబ్బు. నువ్వు ఆసుపత్రిలో నాకిచ్చిన లంచం” అన్నాడాయన.

నిర్మల్ సిగ్గుపడ్డాడు. అతని ముఖం పాలిపోయింది. ప్రొఫెసర్ ఇంకా చేయి చాచే ఉన్నాడు. గబుక్కున ఆ నోటు అందుకుని, ఏమనాలో తెలియక, “థాంక్యూ సర్” అన్నాడు నిర్మల్.

నిర్మల్ లేచి వాటర్ బాటిల్‌కి డబ్బు చెల్లించి, అక్కడ్నించి కదలబోయాడు.

“హలో సార్, నాక్కొంచెం హెల్ప్ చేస్తావా?” అడిగాడు ప్రొఫెసర్.

నిర్మల్ విస్తుపోయాడు. “ఏంటి సార్?” అన్నాడు.

“ఇతరుల కోసం జీవించే బ్రతుకు ఎలా ఉంటుందో నాకివాళ రుచి చూపించావు. ఇప్పటిదాకా మేం మా కోసమే బ్రతికాం. నీ సమక్షంలో నాలోనూ, మా నర్సింగ్ హోమ్‌లోనూ కాస్త మానవత్వం చిగురించనీ” అన్నాడాయన.

“కానీ నాలాంటి వాడిక్కడ ఏం చేయగలడు సర్?” అడిగాడు నిర్మల్.

“నువ్వు మామూలోడివి కాదు. మానవతాశిల్పివి. నిన్ను డబ్బు, కీర్తీ తాకలేవు. నీ ద్వారా మానవత్వపు పరిమళం నన్నూ తాకింది. మనం కలిసి పనిచేస్తూ, మన జీవితాలను సార్థకం చేసుకుందాం” చెప్పాడు ప్రొఫెసర్.

“థాంక్యూ సార్. కానీ, నేనే పని చెయ్యాలి?” అడిగాడు నిర్మల్.

“ప్రేమ మానవత్వపు రాయబారిగా; మానేజర్‌గా, నర్సింగ్ హోమ్‍ని పునర్నిర్మించు” చెప్పాడాయన.

నిర్మల్ చిరునవ్వు నవ్వాడు. ప్రొఫెసర్ చేయి ముందుకి చాచి, నిర్మల్‍తో కరచాలనం చేశాడు.

మూల రచయిత పరిచయం:

డాక్టర్ మనోరంజన్ బెహురా రచయిత, పరిశోధకుడు, అనువాదకుడు, విద్యావేత్త, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఇంగ్లీషులోనూ, మాతృభాష ఒడియా లోనూ రచనలు చేస్తారు. ఏడు పుస్తకాలు వెలువరించారు. ‘ది విలేజ్ పోయెట్ అండ్ అదర్ స్టోరీస్’ (2020), ‘హంగర్ అండ్ అదర్ స్టోరీస్’ (2021), ‘లిటరేచర్ ఆన్ స్క్రీన్: ఎ క్రిటికల్ స్టడీ’ (2024), ‘అచింష్నా జియా పెయిన్ ఛటాటియా’ (2024) అనే పుస్తకాలు ఆయనకు పేరు తెచ్చాయి. ఆయన వివిధ వార్తాపత్రికలకు మూడు వందలకు పైగా సామాజిక-రాజకీయ వ్యాసాలను అందించారు. ఆంగ్ల సాహిత్యంపై దాదాపు 30 పరిశోధనా పత్రాలు వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ ఆంగ్ల సాహిత్య పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఒడిశా షేక్‌స్పియర్‌గా ప్రసిద్ధి చెందిన ‘గనా కబీ బైస్నబా పాణి’ ఆత్మకథను మనోరంజన్ ఆంగ్లంలోకి అనువదించారు.

కొల్లూరి సోమశంకర్
కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ. డిగ్రీతో గ్రాడ్యుయేషన్‌. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్‍పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

Previous Post

ఇంగ్లీషు కథ : కర్నల్ బోలాంగ్ గారి వాహనము

Next Post

గ్రీక్ అజ్ఞాత కవితలు 

Next Post
గ్రీక్ అజ్ఞాత కవితలు 

గ్రీక్ అజ్ఞాత కవితలు 

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com