• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఉర్దూ కథ : ఒక రాత్రి ప్రయాణం 

రంగనాధ రామచంద్రరావు by రంగనాధ రామచంద్రరావు
August 2, 2025
in అనువాద కథలు
0
ఉర్దూ కథ : ఒక రాత్రి ప్రయాణం 

ఉర్దూ మూలం: శిరీన్‌ నియాజి

హిందీ అనువాదం: జనాబ్‌ జహీర్‌ నియాజి

తెలుగు అనువాదం : రంగనాథ రామచంద్రరావు

సాయంత్రం అయ్యేసరికి పొలం పనులు ఆగిపోయాయి. 

రైతులందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. 

ఈ రోజుల్లో సాయంత్రాలు త్వరగా వచ్చేవి, రాత్రుళ్ళు దీర్ఘంగా మారేవి.

దీర్ఘమైన చల్లటి రాత్రి. వెన్నెల ఇప్పుడు ముంగిట్లోకి దిగటంతో పగటిపూట ఉదాసీనంగా కనిపించే వాతావరణం ఒక్కసారిగా చంచలమయ్యేది. 

చిన్న పిల్లలు తమ తమ అమ్మమ్మ-నానమ్మల ఒడిలో దూరుకుని కథలు చెప్పమని వేధించేవారు. నిష్కపటమైన అమ్మాయిలు ముంగిట్లో ఈ చివర నుండి ఆ చివరకు పరుగులు తీస్తూ, దూకుతూ, దాగుడుమూతలు ఆడుతున్నారు. ఇలాంటి రాత్రుల్లో దాగుడు మూతలు ఆడటంలోని ఆ మజానే వేరు.

తల్లులు తమ కూతుళ్ళ భుజాలపై శాలువలు వేయడం కోసం వాళ్ళ వెంబడి తిరుగుతూ తిట్టి తిట్టి అలసిపోయేవారు. తర్వాత వంట చేస్తూ, పొయ్యిలో పుల్లలు కాలుస్తూ తమతమ జ్ఞాపకాల కిటికీలను తెరిచేవారు. అప్పుడు వాళ్ళు కూడా ఈ అమ్మాయిల్లా చంచలంగా,  నిర్లక్ష్యంగా ఉండేవారు. ఇలాంటప్పుడు ఎవరో వేటగాడు వచ్చి వల వేసి వెళ్ళేవాడు. తర్వాత నవ్వుతూ, ఆడుతూ, త్రుళ్ళుతున్న ఈ అమాయకమైన ముఖాలపై గాంభీర్యాన్ని అలుముకోవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడేది. ఇక అత్తగారింటి గడపలో కాలు పెడుతూనే వారి అమాయకపు నవ్వులు పొంగుతున్న ధాన్యపు గింజల్లా, దాని కింద మండుతున్న అగ్నిజ్వాలల కింద అణచివేయబడేవి. ఎప్పుడైనా ఏదైనా కన్నీటి చుక్క రాలినప్పటికీ, వేడి బూడిద మీద పడి శాశ్వతంగా మౌనం వహించేది. తర్వాత వారికి తమదైనవేవి దక్కేవికావు. వారి కన్నీళ్ళు, వారి నవ్వులు అన్నీ ఇతరులకు రుణగ్రస్తమయ్యేవి. ఆమె తన కోసం నవ్వనూ లేకపోయేది, ఏడవనూ లేకపోయేది. 

ఇలాంటి చల్లని వెన్నెల్లో స్నానం చేసిన ఒక రాత్రి.  ఒక యువతి తన ఇంటి ముంగిట్లో తన చిట్టి మేనకోడలితో అమాయకంగా దాగుడుమూతలు ఆడుకుంటూ ఉంది. ఆమె ముసలి తండ్రి నదికి వెళ్ళడానికి తన వలల తాళ్ళను సరిచేసుకుంటున్నాడు. ఆమె తల్లిపొయ్యి దగ్గర కూర్చుని తడి పుల్లలను ‘ఉఫ్‌ ఉఫ్‌’ మని ఊదుతూ పుల్లలను మండించే ప్రయత్నం చేస్తోంది. ఆమె వెంట్రుకల మీద పొయ్యిలోంచి ఎగిసిపడిన బూడిద పొరలు పొరలుగా పేరుకుంటోంది. 

మిగిలిన పనంతా ఆ యువతి పొద్దు మునిగేలోపు పూర్తి చేసింది. అయితే ఆమెకు రొట్టెలు నిప్పుల మీద కాల్చడం రాదు. ఆమె ఇక్కడ కొద్ది రోజుల అతిథి మాత్రమే. ఎందుకంటే ఆమె వివాహం జరిగిపోయింది. ఆమె దేహంపై సువాసిని వస్త్రాలు. ఆమె ఒత్తయిన జుట్టు మధ్యలో సింధూరం లేతగా మెరుస్తోంది. దానిని దాచడానికి ఆమె తన జుట్టును పక్కకు దువ్వుకుంది.

ఆమె వయస్సు పదిహేనో-పదహారో ఉండొచ్చు. ఆమె పెద్ద పెద్ద కళ్ళు మెరుస్తున్నాయి. ఆమె చెంపలు గు•బీల్లా ఉన్నాయి. ఆమె కంఠస్వరం మధురంగా ఉంది. ఈ సమయంలోనూ ఆమె తన మేనకోడలితో ఒక పాటను మెల్లిగా పాడుకుంటోంది. 

హఠాత్తుగా తలుపుల దగ్గర అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో మెల్లగా తలుపు తట్టారు.

రొట్టెలు చేస్తున్న ఆమె తల్లి తల తిప్పి చూసింది. 

తర్వాత వృద్ధ జాలరి చెవుల్లో , ‘‘ఈ చల్లని చీకటి రాత్రిలో మన తలుపు తట్టింది ఎవరు?’’ అని గుసగుసలాడింది.

‘‘బహుశా ఎవరో దారి తప్పిన బాటసారి కావచ్చు’’ వృద్ధజాలరి చేతిలో పట్టుకున్న వలను ఒక వైపు పెడుతూ అన్నాడు. 

తర్వాత తన నొప్పెడుతున్న నడుము మీద చేయి పెట్టి మెల్లగా లేచి, తలుపుల దగ్గరికి వెళ్ళి చెక్క గడియ తీశాడు. అతను ఒక చేత్తో లాంతరును పైకెత్తి, వచ్చిన వ్యకి ముఖాన్ని చూడటానికి వీలుగా పట్టుకున్నాడు. 

గడియ తీయగానే గాలి వేగానికి తలుపు తనంతట తాను తెరుచుకుంది. 

ఎదుట నిలుచున్న వ్యక్తిని చూడగానే వృద్ధుడి నోటి నుంచి-‘‘అరే బేటా, నువ్వు ఈ సమయంలో, ఇంత అకస్మాత్తుగా’’ అనే మాటలు వెలువడ్డాయి.

‘‘ఎవరది?’’ తల్లి తలుపుల వైపు తిరిగి, కళ్ళను చికిలిస్తూ వచ్చిన వ్యక్తిని గుర్తుపట్టడానికి ప్రయత్నించింది. 

‘‘నేనేనమ్మా’’ వచ్చిన వ్యక్తి వంగి ఆమెకు సలామ్‌ చేసి, ఆమె దగ్గరే కూర్చున్నాడు. 

ఆ తల్లి పిండితో తడిచిన చేతిని పైకెత్తి అతన్ని ఆశీర్వదించింది. తర్వాత-

‘‘ఈ సమయంలో అకస్మాత్తుగా ఎందుకు రావలసి వచ్చింది బేటా? ఏదైనా అత్యవసరమైన పని ఉండిందా?’’ అని అడిగింది.

ముసలిదాని ప్రశ్న విని ఆ నవయువకుడు, ‘‘నేను ఇక్కడ కేవలం రెండు గంటలకు మాత్రమే ఉండగలను. నేను ఒక సుదీర్ఘ ప్రయాణానికి బయలుదేరాలి. నా తల్లి ఒంటరిగా ఉంది. ఆమె తన కోడలి  కోసం ఎదురుచూస్తోంది. తీసుకుని రమ్మని మొండితనం చేస్తోంది. నేను అన్శూను తీసుకునిపోవడానికి వచ్చాను’’  అన్నాడు. 

నవయువకుడి శరీరం మీద నావికాదళపు సైనికుడి యూనిఫాం చాలా బాగా నప్పింది. అతని ఉంగరాల జుట్టు మెరుస్తున్న నుదుటి పై చెల్లాచెదురుగా పడివున్నాయి, అతని బాహువులు దృఢంగా ఉన్నాయి. 

‘‘హఠాత్తుగా ఈ సమయంలో?’’ తల్లి కంగారు పడింది. 

‘‘కనీసం ఈ రాత్రయినా ఉండవా? అంతేకాదు అన్శూ వీడ్కోలు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇంకా మిగిలివున్నాయి. మేము పేదవాళ్ళం…’’ ఆమె చెబుతూ చెబుతూ  భర్త వైపు చూసింది.

వృద్ధుడు ఆ నవయువకుడితో, ‘‘నాయనా, ఇప్పుడు సరైన సమయం కాదు’’ అని అన్నాడు. 

వృద్ధుడి చెవులు ముంగిలి వైపు నిగిడివున్నాయి. 

ఇప్పుడు అక్కడ గాఢమైన నిశ్శబ్దం ఆవరించింది. 

పాటలు నిశ్శబ్దమైపోయాయి. 

నవ్వుల సందడి ఎక్కడో మాయమైంది. 

‘‘నేను మీ నుండి ఎప్పుడూ ఏమీ అడగలేదుకదా బాబా. మా అమ్మ కూడా ఏమీ అడగలేదు. ఆమె కేవలం ‘నీ మాటలు నిజమైతే,    మీరిద్దరూ ఒకరినొరు ప్రేమించుకునివుంటే, నా కోడలిని ఇంటికి తీసుకునిరా’ అని అంటోంది.  మా అమ్మ తన కోడలి కోసం చాలా కలలు కన్నది. హారతి పళ్ళెం సిద్ధం చేసి పెట్టుకుంది. కోడలి కోసం ఎదురుచూస్తూ తలుపులు తెరిచి కూర్చుంది’’ అన్నాడతను.

‘‘కానీ ఆమె … ఆమె ఎందుకో తెలియదు…’’

‘‘నాకు తెలుసు బాబా, నన్ను చూడగానే ఆమె పాటలు ఎక్కడో మాయమవుతాయి. ఆమె నన్ను చూసి భయపడుతోందని నాకు అనిపిస్తోంది. లేదా మరేదో విషయం ఆమెను నా దగ్గరికి రాకుండా ఆపుతోంది. అయితే ఆమె ఇంకా చిన్నదని, నెమ్మదిగా జీవిత అవసరాలను అర్థం చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను’’ 

‘‘దేవుడు అలాగే చేస్తాడు’’ ముసలి తండ్రి దేవుడి ఆశీర్వాదం కోసం చేతులు పైకెత్తాడు. 

అర్ధరాత్రి అవుతోంది. 

చంద్రుడు మెల్ల-మెల్లగా అస్తమిస్తున్నాడు. 

గాలి ఒత్తిడి పెరుగుతూ పోయింది.  

ఒక పడవ నది అలలతోపాటు మెల్ల-మెల్లగా ముందుకు సాగిపోతూవుంది. 

చుక్కాని పట్టే ఆ యువకుడు తన ముందు కూర్చున్న యువతిని, ‘‘ఆ రాత్రి నది ఒడ్డున నా పడవ ఆగటం నీకు గుర్తుందా? నువ్వు ఆ వెన్నెల రాత్రిలో, నది ఒడ్డున నిలబడి, అల్లకల్లోలంగా ఉన్న నది అల•లో ఏమి వెతుకుతున్నావో నాకు తెలియదు…’’

‘‘అవును, నాకు గుర్తుంది. ఆ సమయంలో నేను తెల్లటి దుస్తులు ధరించాను. మీరు నన్ను చూసి కాస్త భయపడ్డారు’’ 

‘‘నేను… నేను నిజంగా భయపడ్డాను. రాత్రి నిశ్శబ్దం. నదితీరం. అటువంటి సమయంలో, తెల్లటి దుస్తులలో ఉన్న ఒక నీడ, చెల్లాచెదురైన వెంట్రుకలతో,  గాలికి ఎగురుతున్న  పొడవైన దుపట్టా కొన … నాకైతే ఆకాశంలో ఎగురుతున్న దేవదూత అకస్మాత్తుగా దారి తప్పి కిందకు వచ్చిందని అనిపించింది!’’ అని నవ్వసాగాడు.

ఆ అమ్మాయి నవ్వులో అతనితో జత కలవలేదు. అందువల్ల ఆ యువకుడి నవ్వు ఎక్కువసేపు నిలవలేకపోయింది.

‘‘అన్శూ! నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? ఏమీ మాట్లాడటం లేదు, ఎందుకు?’’

ప్రతిస్పందనగా, అన్శూ అతని చేతి నుండి చుక్కాని తీసుకుంది. పడవ నడపసాగింది.

‘‘ఎందుకు, ఏం జరిగింది, అన్శూ?’’ యువకుడు మళ్ళీ అడగాడు. 

ఆ యువతి తల వంచుకుని, ‘‘ఆకాశ్‌, నా నావను నేనే నడపాలని అనుకుంటున్నాను!’’ అంది.

‘‘ఎందుకు, నేను పడవను నడపలేనా?’’ ఆకాశ్‌ చిరునవ్వుతో అడిగాడు, 

దానికి ఆమె, ‘‘బహుశా అలా కూడా ఉండొచ్చు’’ అని సమాధానం ఇచ్చింది.

అన్శూ ఆ మాట చాలా గంభీర్యంగా చెప్పింది. 

ఆ మాటలతో ఆకాశ్‌ నవ్వు ఎక్కడో మాయమైపోయింది. అతని పెదవులు విచిత్రంగా  పొడిబారాయి. పెదవులపై నాలుక కదిలిస్తూ అన్నాడు – ‘‘నిజం చెబుతున్నావా అన్శూ?’’

‘‘అవును ఆకాశ్‌, నీతో కలిసి జీవితనావను లాగలేనని అనిపిస్తోంది’’

‘‘ఏంటి?’’ యువకుడి మాటలు గొంతులోనే ఆగిపోయాయి. 

కొద్దిక్షణాల తర్వాత అతను తనను తాను నియంత్రించుకుంటూ, ‘‘అలా అయితే నేను పెళ్ళిప్రతిపాదనతో మీ ఇంటికి వచ్చినపుడు ఆ సమయంలో ఎందుకు ఒప్పుకున్నావు?’’ అని అన్నాడు.

అలా అంటుండగా అతని కాళ్ళు, చేతులు పూర్తిగా బలహీనమయ్యాయి.

‘‘అది క్షణికావేశం కావచ్చు’’ అంది అన్శూ తగ్గుస్వరంతో. 

హఠాత్తుగా ఆమె టప్‌మనే  శబ్దం విని ఉలిక్కిపడింది.

ఆమె అతని వైపు చూసింది. 

అయితే ఆకాశ్‌ అక్కడ లేడు! 

………..

అతని పడవ నది మధ్యలో ఊగిసలాడుతోంది.

అతని చేతుల్లోంచి చుక్కాని జారిపోయింది.  

అతను రెండు చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు. 

ఇప్పుడు పడవ నది అలల ఆధారంగా ఊగూతూ కదుతోంది…..

……

అన్శూ తన ముఖాన్ని చేతుల్లో దాచుకుని తనలో తాను, ‘నువ్వు చాలా తొందర పడ్డావు ఆకాష్‌. నేను చెప్పబోయే తర్వాతి మాటలు  వినలేకపోయావు! నేను చెప్పింది కాక ఇంకా చెప్పాలనుకున్నది ఏమిటంటే- ఈ పడవ అవతలి ఒడ్డుకు చేరే సమయానికి, బహుశా నా హృదయంలో నీపై ప్రేమ మేల్కుంటుందేమో! లేదా నేను మీఇంటి గడపను చేరుకునే సమయానికి, మీ అమ్మ ప్రవర్తన నా హృదయంలో ప్రమిదలా ప్రేమ జ్యోతిని వెలిగిస్తుందేమో!’అని అనుకుంది.

చంద్రుడు తన ముఖాన్ని ఎక్కడో దూరంలో మేఘాలలో దాచుకున్నాడు. 

చీకటి తన నల్లటి దుప్పటితో వాతావరణం మొత్తాన్ని కప్పివేసింది.

ఒక్కసారిగా నది కెరటాలు ఎగసిపడ్డాయి. నదిలో సుడిగాలులు మొదలయ్యాయి. ఆ సుడిగుండంలో ఆ చిన్న పడవ కొంత సేపు గిర్రున తిరుగుతూ ఉంది, అలా తిరుగుతూ-తిరుగుతూ నదిలో పొడుచుకొచ్చిన రెండు ఖాళీ రాళ్ళ మధ్యనున్న చీలికలో చిక్కుకుంది! కానీ నీటి శక్తి దానిని రాళ్ళ నుండి దూరంగా నెట్టివేసింది!

 తెల్లవారుజామున తుఫాను తగ్గుముఖం పట్టింది. ఆకాశంలో సూర్యుడు రాగానే చుట్టుపక్కల తీరాలు ఎర్రగా మారడంతో మత్స్యకారులు తమ తమ వలలు నదిలో విసిరారు. నది అలలు పొంగుతూ ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి. మత్స్యకారులు తమ వలల్లో చేపలు పడటం కోసం ఎదురుచూస్తున్నారు.  వలను కొంత సమయం పాటు నీటిలో ఉంచిన తర్వాత, ఒక మత్స్యకారుడు వలనులాగి చూస్తే అందులో రెండు మూడు చేపలు కనిపించాయి. చేపలను నది అలలు బహుశా ఎక్కడికో దూరానికి తీసుకుని వెళ్ళాయి. ఆ కొన్ని చేపలలో ఒకదాని నోటిలో ఒక ఎర్రటి గుడ్డ ముక్క ఇరుక్కుపోయి ఉండడం మత్స్యకారుడు చూశాడు. ఇది బహుశా దానిని మింగడానికి ప్రయత్నించింది, కానీ అది సాధ్యం కాలేదు.

ముసలి జాలరులు ఆ ముక్కను ఆశ్చర్యంగా చూసి, దాన్ని ఆ చేప నోటిలోంచి బయటికి తీయడం మొదలుపెట్టారు. అది ఒక ఎర్రటి స్కార్ఫ్ ముక్క, దానికి బంగారు పిన్‌ జత చేయబడింది. బహుశా అందుకే ఆ చేప మింగలేకపోయిందేమో!

నదినీరు ఎర్రగా మారిందని వృద్ధుడు గ్రహించాడు. 

అతను ఆ నీటికి భయపడసాగాడు. 

అతని  కాళ్ళుచేతులు వణుకుతున్నాయి.

వణుకుతున్న చేతులతో అతను వలలో చిక్కిన చేపలన్నింటినీ రెండుసార్లు నీటిలోకి విసిరాడు. 

ఇప్పుడు అతని చేతిలో బంగారు పిన్నుతో ఉన్న ఎర్రటి స్కార్ఫ్ ముక్క తప్ప ఇంకేమీ లేదు. 

అప్పుడు అతని అడుగులు ఇంటి వైపు పడటం ప్రారంభించాయి.

అ4•ను తన ఇంటికి చేరుకోగానే, ముంగిట్లో పడుకున్న వ•ద్ధురాలు అతని అడుగుల చప్పుడును గుర్తించి లేచి కూర్చుని అడిగింది-

‘‘ఎందుకు ఈ రోజు ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు?’’

వృద్ధుడు సమాధానం చెప్పకుండా, ఆమె ముందుకు వెళ్ళి  నిలబడ్డాడు.  ఆమె ముందు చేతులు చాపాడు. ‘‘ఇది ఏమిటి?’’ అని  ఆ వృద్ధురాలు ఆ ముక్కను గుర్తించడానికి ప్రయత్నిస్తూ అడిగింది. తర్వాత ఆమె ఉలిక్కిపడి లేచి నిలబడింది. కానీ ఈసారి ఆమె లేచి నిలబడుతున్నప్పుడు ఆమె పెదవులు కదలకుండా ఉన్నాయి. ఆమె మౌనంగా నిలబడి వృద్ధుడి చేతులను చూస్తూ ఉంది.

‘‘అతను నిజంగా ఒక సుదీర్ఘమైన ప్రయాణం మీద వెళ్ళిపోయాడు’’ వ•ద్ధుడి స్వరం చాలా దూరం నుండి వచ్చినట్లుంది!

‘‘అయితే అతను పిరికివాడు కాదుకదా!’’ వృద్ధురాలు అకస్మాత్తుగా అంది- 

‘‘అతను  తనంతట తాను ఇలా చేసి వుండడు! కానీ ఆ అన్శూ…’’ అని మాట్లాడుతూ మాట్లాడుతూ ఆమె ఒక్కసారిగా మౌనం వహించింది.

‘‘ఆమె విషయంలో అతను తన వంతు పాత్రను నిర్వర్తించాడు. బహుశా వారిద్దరి గమ్యస్థానం ఒకటే అయివుండొచ్చు!’’ వ•ద్ధుడు మెల్లగా అన్నాడు.

‘‘మరి అతని తల్లి?’’

‘‘బహుశా ఆమె ఇప్పుడు కూడా హారతి పళ్ళేన్ని సిద్ధం చేసుకుని  తన కోడలు కోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు.  ఆమె ఇంటి తలుపు తెరిచి ఉంటుంది!  ఇకపై అది ఎల్లప్పుడూ తెరిచే ఉండొచ్చు!’’

రంగనాధ రామచంద్రరావు

రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 14 అనువాద నవలలు, 17 అనువాద కథా సంకలనాలు, 5 ఆత్మకథలు, ఒక జీవిత చరిత్ర, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన 9 అనువాదాలు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి. కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన ‘ఓం ణమో’ నవలానువాదానికి 2020 సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు.

Previous Post

రష్యన్ కథ : పెళ్లి

Next Post

ఇంగ్లీషు కథ : కర్నల్ బోలాంగ్ గారి వాహనము

Next Post
ఇంగ్లీషు కథ : కర్నల్ బోలాంగ్ గారి వాహనము

ఇంగ్లీషు కథ : కర్నల్ బోలాంగ్ గారి వాహనము

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com