మూలం : మోసాబ్ అబు తోహా
స్వేచ్ఛానువాదం : మణి వడ్లమాని
అతను కంప్యూటర్ కీ బోర్డుని
టక టక లాడిస్తూ టైప్ చేస్తున్నాడు
పక్కింటి వాళ్ళ రేడియో నుండి
అలలు అలలు గా వచ్చే
ధ్వని తరంగాలు వినిపించ కుండా
ఆమె, ఉదయపు వార్తాపత్రికను పైకే చదువుతోంది.
అపురూపంగా ఉంది ఆ దృశ్యం,
వాళ్ళిద్దరూ మనోహరంగా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు.
విరిగిన కిటికీ రెక్కలో నుండి వచ్చే గాలి,
పై కప్పు ఉన్న దీప కాంతి చుట్టూ తిరిగే శలభాలు
అటూ ఇటూ ఎగురు తున్నాయి.
గోడలపై ఉన్న నలుపు తెలుపు చిత్రాలు,
రాత్రి రంగుల కోసం వెతుకుతున్నాయి
పొయ్యి పైన గిన్నె లో నీళ్ళు మరుగుతున్నాయి.
ఇంటి మీద పెద్దపెద్ద వాన చినుకులు
టప్ టప్ మని పడుతున్నాయి
మెరుపులూ లేవు,
ఉరుములూ లేవు,
మేఘాలు అసలే లేవు
కానీ వర్షం పడుతోంది. ఎడతెగని దుఃఖంలా, లుంగలు చుట్టుకుంటూ
దుమ్ము ధూళి తో పాటు
ఛిద్రమైన శరీర భాగాలు ఎగిరి వచ్చాయి.
ఇక ఎప్పటికీ ఆ పొయ్యిమీద నీళ్ళుమరగవు.
ఎందుకంటే ముక్కలు ముక్కలుగా పడ్డ ఇనుపరజను దాని గొంతు కోసేసింది.
నీరు నిశ్శబ్ధం గా, నిస్సహాయంగా మిగిలిపోయింది,
![]()




Discussion about this post