• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

హిందీ కథ : చీకటి గీతం

విఎల్ నరసింహం శివకోటి by విఎల్ నరసింహం శివకోటి
April 11, 2026
in అనువాద కథలు
0
హిందీ కథ : చీకటి గీతం

హిందీ మూలం : జసింత కెరకెట్ట
తెలుగు సేత : డా. వి.ఎల్.నరసింహం శివకోటి
 

రాత్రి …. కరెంటు పోయింది. కొవ్వొత్తులు తెచ్చి పెట్టుకోవడం మరచిపోయాను. కొంచెంసేపు అలా చీకట్లోనే కూర్చుండిపోయాను. కరెంటు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాను. చాలాసేపయిపోయింది …. కానీ కరెంటు మాత్రం రాలేదు. అయితే, మరికొంతసేపు గడిచేసరికి చీకట్లో కూడా అంతా స్పష్టంగా కనబడటం మొదలయింది. మసకమసకగా ఉన్న ఆకారాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కిటికీలోంచి చూస్తూంటే బయట దృశ్యాలు స్పష్టంగా, మనోహరంగా కనిపిస్తున్నాయి. అదిగో, అవతల చెట్లున్నాయి. అవును, ఆ చెట్టు కొమ్మలపైనే రోజూ రెండు పిట్టలు కూర్చుని ఉంటాయి …. ఉదయం పూట. పొద్దున్న పొద్దున్న ఆ నులివెచ్చని సూర్యకిరణాలకి చలికాగుతూ ఉంటాయి ఆ రెండు పిట్టలు. అవతల దూరంగా దట్టమైన అడవి …. మొత్తం చెట్లు. ఇప్పుడు ఆ దృశ్యం అంతా ఎంతో, మరెంతో స్పష్టంగా …. వెన్నెల రాత్రంతా స్పష్టంగా కనిపిస్తోంది. కరెంటు లైట్ల వెలుగులో ఉండి-ఉండి బయట ఉన్న వెన్నెలని పట్టించుకోనేలేదు ఇంతసేపూ. ఇప్పుడు కరెంటు పోయిన తర్వాత తెలిసింది ఇది వెన్నెల రాత్రి అని. దాని అందం కూడా ఇప్పుడే తెలిసొచ్చింది.

ఆకాశం వైపు చూస్తే …. చంద్రుడు …. నిండు చంద్రుడు కాదు. కొంచెం వంకరగా, ఎంతో వెన్నెల కురిపిస్తూ ఉన్నాడు. అందంగా నవ్వుతున్నాడు. చెట్ల ఆకుల మధ్య కొద్దికొద్దిగా చీకటి. ఆ ఆకుల మధ్య ఉన్న చీకట్లో కొన్ని మిణుగురులు వెలుగులు చిమ్ముతున్నాయి. ఆ ఆకులను పట్టుకుని ఉయ్యాలూగుతున్నాయి. మరికాస్త దూరాన ఉన్న ఏదో ఒక చిన్న పల్లెలో ఎవరో టపాసులు పేల్చినట్టున్నారు. ఆ చప్పుడు, అల్లంత దూరం నుండి కూడా ఇంటిగోడలను తాకింది. గాలిలో పేలే ధమాకా చప్పుడు ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. 

ముందుగదిలోకి వచ్చి కిటికీలో నుండి బయటకి చూసాను. కాసేపాగి డాబాపైకి వెళ్ళాను. నాలుగు వైపులా పరికించి చూసాను. కరెంటు పోవడంతో ఎన్నెన్ని చూడగలుగుతున్నానో కదా అని ఆశ్చర్యపోయాను. అదే కరెంటు ఉంటే ఈ మిణుగురులుని, వాటి ఈ అందాలనీ చూడటం కుదిరే పనేనా! ఆకులలో కలిసి ఈ మిణుగురులు ఆడే సయ్యాటలు చూడటం వీలయ్యేదా! మిణుగురులు ఇంకా ఈ భూమిమీద మిగిలే ఉన్నాయన్న ఆలోచనే ఎంతో హాయిగా అనిపించింది. మౌనంగా, తన్మయత్వంతో వాటికేసి చూస్తూ నిలబడ్డాను. గదిలోకి తిరిగొచ్చి లైట్లు స్విచ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇంక కరెంటు వచ్చినా లైట్లు వెలిగే అవకాశం లేదు. ఎందుకంటే ఆ వెలుతురులో ఈ దృశ్యాలన్నీ పూర్తిగా మారిపోతాయి. ఎదురుగా ఉన్న వస్తువులు ఆ వెలుతురులో స్పష్టంగా కనబడతాయి. అంతకుమించి మరెన్నో వస్తువులు, దృశ్యాలు మనం ఊహించలేనంతగా మారిపోతాయి. చీకట్లో నిలబడిన ఆ ప్రకృతి, కరెంటు వెలుగుల కింద కూర్చున్న నన్ను చూడగలుగుతుంది. అయితే నేను మాత్రం ఆ ప్రకృతిని, ఆ చీకటి సౌందర్యాన్ని చూడలేను. 

ఇంతలో మెదడులో ఏదో ఒక మెరుపు మెరిసింది. అందరూ ‘వెలుగు’ అని పిలుస్తున్న ఈ ఆధునిక విద్య కూడా కరెంటు వెలుగులాంటిదే అనిపించింది. దాని వెలుగులో కొన్ని వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే మరెన్నో మరుగునపడిపోతాయి. మనం వాటిని ఈ ఆధునిక చదువుల సాయంతో ఎప్పటికీ చూడలేం. ఎప్పుడైనా కొంతకాలం ఆ ‘వెలుగు’ ఆరినప్పుడే మనం ఈ ప్రపంచాన్ని కొత్త కంటితో చూడగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం! అంతే కాదు, రెండవ పార్శ్వాన్ని కూడా అర్థంచేసుకుని గౌరవించగలుగుతాం. అడవి చుట్టుపక్కల ఉండేవాళ్ళకి చీకటి ఎప్పుడూ ‘అశుభం’ కాదు, ‘అపశకునం’ కాదు. వాళ్ళకి అది కూడా జీవితంలో ఒక భాగం. అడవిలో ఉండే ఎన్నో జంతువులకు, పక్షులకు ‘రాత్రే’ ‘పగలు’. అదే వాటి ‘సమయం’. ఆ ‘చీకటే’ వాటికి ‘వెలుతురు’. ఈ వెలుతురులోనే వాటికి మనుషుల ఇళ్ళు కనిపిస్తాయి. మూసిఉన్న ఇంటి తలుపులు చూసి వాకిటి వరకు వెళ్ళి కూడా వెనక్కి తిరిగొచ్చేస్తాయి. రాత్రి వాకిట్లో పెట్టిన నీళ్ళు తాగి చప్పుడు చెయ్యకుండా వెనుతిరుగుతాయి. రాత్రిళ్ళు ఎక్కడో దూరం నుంచి ఆ జంతువుల నవ్వులు-ఏడుపులు వినిపిస్తాయి. పల్లెకారు ఆ శబ్దాలను బట్టి వాళ్ళ ఊరికి జరిగే మంచి-చెడులను బేరీజు వేసుకుంటూ ఉంటారు. మళ్ళీ తెల్లవారి వెలుగురేఖలు విచ్చుకుంటూనే అడవి మరింత లోపలకి వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు, మనుషుల ‘సమయం’ మొదలవుతుంది. వాళ్ళు తమ-తమ పనుల్లో మునిగిపోతారు. ఇలా ఇద్దరూ ఒకరి ప్రపంచాన్ని ఒకరు తెలుసుకుంటారు. వంతులేసుకుని ఒకరికి ఒకరు కాపలా కాస్తారు. అప్పుడప్పుడు అనిపిస్తూంటుంది – ఈ ఆధునిక చదువుల వెలుగుని ఆర్పేసి కాసేపు ఒక మూలన పెట్టెయ్యడం నయమని….! అది ఎంతో అవసరం కూడా అని! అప్పుడు కానీ ఈ విశాల ప్రకృతి యొక్క రెండవ పార్శ్వాన్ని చూడలేం. అర్థంచేసుకోలేం. 

ఇంక నాకు నిద్రొస్తోంది. కానీ నా నిద్రలో కూడా రాత్రి మేల్కునే ఉంది. వీచే గాలిలో కొన్ని శబ్ద తరంగాలు ఎగురుకుంటూ వస్తున్నాయి. బహుశా కీచురాళ్ళేమో! నాకైతే తెలవదు. అయితే అది ‘గోల’ మాత్రం కాదు. ఏదో గీతం! రాత్రి, అడవితో స్వరం కలిపి మంద్రంగా పాడుతున్న గీతం …. చీకటి గీతం!   

జసింత కెరకెట్ట

 

ప్రముఖ ఆదివాసీ రచయిత్రి జసింత కెరకెట్ట 3 ఆగష్టు 1983 న ఝార్ఖండ్ లోని పశ్చిమ సింహభూమి జిల్లా ఖుదపోస్ గ్రామంలో జన్మించారు. ఝార్ఖండ్ జిల్లాలోని ఉరాఁవ్ గిరిజన తెగకి చెందిన జసింత నాలుగు కవిత సంకలనాలతో పాటు చిన్నపిల్లల కోసం రెండు పుస్తకాలు వెలువరించారు. వీరి కవితలు పలు భారతీయ, విదేశీ భాషల్లోకి అనువదించబడ్డాయి. 

ఎన్నో జాతీయ-అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న జసింతకి UNDP Fellowship కూడా లభించింది. 2022 లో ఫోర్బ్స్ ఇండియా భారతదేశపు 22 ‘సెల్ఫ్ మేడ్ విమెన్’ జాబితాలో జసింతకి చోటు దక్కింది. 2023 మరియు 2024 సంవత్సరాలలో మణిపూర్ హింసాకాండ, ఫిలిస్తాన్ ప్రజల వేదనకి సంఘీభావం తెలుపుతూ జసింత రెండు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను తిరస్కరించారు. ‘ఔరత్ కా ఘర్’ వీరి తాజా కథా సంకలనం. 

Jcntkerketta7@gmail.com  

 

డా.వి.ఎల్.నరసింహం శివకోటి 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఎమ్.ఏ. (ఫంక్షనల్ హిందీ & ట్రాన్సలేషన్) (గోల్డుమెడల్), ఎమ్.ఫిల్., (హిందీ) (గోల్డుమెడల్), పిహెచ్.డి., (హిందీ) పట్టాలు పొందిన డా. నరసింహం శివకోటి హిందీ-తెలుగు భాషల మధ్య పరస్పర అనువాదం, తులనాత్మస సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారు. వీరు ఈమధ్య కాలంలో సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా గారి రెండు పరిశోధనాత్మక గ్రంథాలను ‘ప్రభాత్ కిరణేఁ’, ‘అనావరణ్’ శీర్షికన తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రచురించారు. అలాగే, ప్రముఖ హిందీ కవి శ్రీ నరేష్ సక్సేనా గారి ఎంపిక చేసిన కవితలను తెలుగులోకి, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ హిందీ రచయిత్రి
శ్రీమతి మమతా కాలియా గారి రెండు నవలికలను ‘పరుగు’, ‘అదే నీవు, అదే నీవు’ శీర్షికన తెలుగులోకి అనువదించి ప్రచురించారు. వీటితోపాటు సుమారు 20 కథలు, కొన్ని కవితలను తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో ప్రచురించారు. ప్రస్తుతం వీరు రక్షణ మంత్రిత్వ శాఖలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో డిప్యూటీ మేనేజరు (రాజభాష) గా సేవలు అందిస్తున్నారు.  

Mobile : 8247069811 

sivakoti.litt@gmail.com 

విఎల్ నరసింహం శివకోటి
విఎల్ నరసింహం శివకోటి
Previous Post

గుజరాతీ కథ: సైనికుడి సంతానం 

Next Post

ఒడియా కథ : భయమే బంధమా?

Next Post
ఒడియా కథ : భయమే బంధమా?

ఒడియా కథ : భయమే బంధమా?

Discussion about this post

ఈ సంచికలో…

  • ఆంగ్ల కవిత : బందీ 
  • వయసు మీద పడిన …. తరువాత… !
  • ఆంగ్ల కవిత : మహావృక్షాలు కూలినప్పుడు!
  • ఆంగ్ల కవిత: నేను  అనుక్షణం ఎగసిపడతాను!
  • ఆంగ్ల రచన : వేకువ పాఠం 
  • ఆర్ద్రత, సాంద్రత నిండిన అనువాదం ‘దిగులు కొంగ’
  • రష్యన్ కథ : శిక్ష
  • జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి
  • తమిళ కథ : బిరియానీ (హాస్య కధ)
  • కన్నడ కథ : వర్షరూపిణి
  • ఒడియా కథ : భయమే బంధమా?
  • హిందీ కథ : చీకటి గీతం
  • గుజరాతీ కథ: సైనికుడి సంతానం 
  • నిజమే చెప్తాను
  • కన్నడ కథ : ఉత్తమ నటుడు
  • ఒడియా కథ : తప్పెవరిది?
  • అనువాద కవిత: పరిచయం
  • ఒళ్ళు అమ్ముకున్న స్త్రీ కోసం..

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com