సంస్కృత మూలం: కాళిదాసు
తెలుగు అనువాదం : బడుగు భాస్కర్ జోగేష్
మేఘమా
మెల్లగా వీస్తోంది
మంద మారుతం
ఉత్తర భాగాన మదించి
కమ్మగ కూస్తుంది వానకోయిల
శుభ సూచకమిది
నీ ప్రయాణానికి
నిను గని
బెగ్గురు పక్షులు బారులు తీరాయి
తాము నీళ్ళాడే సమయం
వర్షాకాలమని
సేవించగలవవి
నీ మనోహర రూపాన్ని
చల్లగాలి
చాతక పక్షిరావం
బలాకల దర్మనం
శుభశకునం కదా




Discussion about this post