ఇంగ్లిషు మూలం: జాయ్ హార్జో
తెలుగుఅనువాదం : బొల్లిముంత వెంకట రమణ రావు
గుర్తుంచుకో
గుర్తుంచుకో
నువ్వు పుట్టిన ఆ ఆకాశాన్ని,
ప్రతి నక్షత్రం చెప్పే కథను తెలుసుకో.
గుర్తుంచుకో
చంద్రుణ్ని, ఆమె ఎవరో తెలుసుకో.
గుర్తుంచుకో
ప్రభాతంలో పుడే సూర్యుడి జన్మను,
అది సమయపు బలమైన క్షణం.
సాయంత్రాన్ని గుర్తుంచుకో,
రాత్రికి మార్గం ఇచ్చే ఆ సమయాన్ని.
గుర్తుంచుకో
నీ పుట్టుకను,
నీ తల్లి శ్రమను
ఆమె నీకు రూపమూ, శ్వాసనూ ఇచ్చింది.
నువ్వు ఆమె జీవితానికి సాక్ష్యం,
ఆమె తల్లిదీ, ఆమె పూర్వికులదీ.
గుర్తుంచుకో
నీ తండ్రిని,
అతడూ నీలో జీవం.
గుర్తుంచుకో
నువ్వు పుట్టింది ఈ భూమి పోర నుండి
ఎరుపు భూమి, నలుపు భూమి, పసుపు భూమి,
తెల్ల భూమి, గోధుమ భూమి
భూమి రంగు మారిన అది మన భూమి మాత్రమే.
గుర్తుంచుకో
మొక్కలను, చెట్లను, జంతువులను
వాటికీ తెగలు ఉన్నాయి,
వారి కుటుంబాలు, వారి చరిత్రలు ఉన్నాయి.
వాటితో మాట్లాడు, వాటి మాట విని
అవి సజీవ కవితలు.
గుర్తుంచుకో–
గాలిని, ఆమె స్వరాన్ని.
ఆమె ఈ విశ్వం ఆరంభాన్ని తెలుసు.
గుర్తుంచుకో
నువ్వు అన్నీ ప్రజలవు,
అన్ని ప్రజలు నువ్వే.
గుర్తుంచుకో
నువ్వే ఈ విశ్వం,
ఈ విశ్వమూ నువ్వే.
గుర్తుంచుకో
అన్నీ కదలికలో ఉన్నాయి,
అన్నీ పెరుగుతున్నాయి,
అది నీవే.
గుర్తుంచుకో
భాష ఈ కదలిక నుంచే పుట్టింది.
భాషే నాట్యం,
అది జీవితం.
గుర్తుంచుకో.
![]()
ఒకానొకప్పుడు ప్రపంచం పరిపూర్ణమైంది!
ఒకప్పుడు ఈ ప్రపంచం పరిపూర్ణంగా ఉండేది,
మనం ఆ ప్రపంచంలో ఆనందంగా జీవించేవాళ్లం.
తర్వాత దానిని సహజంగా తీసుకున్నాం.
ఆసంతృప్తి భూమి మనసులో చిన్న గుగ్గిలంలా మొదలైంది.
తర్వాత నిసందేహంు తన ముళ్ల తలతో బయటికి తన్నుకొచ్చింది.
సందేహం ఆ సంబంధ బంధాన్ని చింపగానే,
అన్ని రకాల దయ్యపు ఆలోచనలు లోపలికి దూసుకువచ్చాయి.
మాకు ఇచ్చిన ఆ ప్రేరణా ప్రపంచాన్ని, ఆ జీవన ప్రపంచాన్ని
మేమే నాశనం చేసేశాం.
ప్రతి అసూయ రాయి, ప్రతి భయం, లోభం, ఇర్ష్య, ద్వేషంు
ప్రతి రాయి ఒక్కొక్కటిగా వెలుగును ఆర్పేసింది.
ఎవరూ ఖాళీ చేతులతో లేరుు
ప్రతి ఒక్కరి చేతిలో ఒక రాయి ఉంది.
అలా మనం మళ్లీ మొదటికి వచ్చేశాంు
ఒకరినొకరు చీకటిలో తాకుతూ తిరిగాం.
ఇప్పుడేమో మనకు నివసించే స్థలం లేదు,
ఎందుకంటే ఒకరితో ఒకరు ఎలా జీవించాలో మనం మరచిపోయాం.
అప్పుడు తడబడుతున్న వారిలో ఒకరు
ఇంకొకరిపై దయ చూపించి
ఒక దుప్పటి పంచుకున్నారు.
ఆ దయ మంట ఒక కాంతి వెలిగించింది.
ఆ కాంతి చీకటిలో ఒక ద్వారం తెరిచింది.
అందరూ కలసి ఒక మెట్టు కట్టారు.
గాలి వంశానికి చెందిన ఒక వ్యక్తి ముందుగా
ఆ కొత్త ప్రపంచంలోకి అడుగులు వేసాను
అనంతరం మిగతా వంశాలు, వారి పిల్లలు,
వారి వంశాకురాల అడుగులు
అలా కాల ప్రవాహం జాడలలో
ఈ ఉదయ కాంతిలో నీ చెంతకు చేరిన సందర్భం ఇది.
![]()
అగ్ని
ఒక స్త్రీ
తన ఊపిరితో మాత్రమే
జీవించలేదు.
ఆమె గ్రహించాలి
పర్వతాల స్వరాలను,
ఆమె గుర్తించాలి
నీలి ఆకాశం శాశ్వతత్వాన్ని.
ఆమె ప్రవహించాలి
రాత్రి పిల్లవాయువులు
అస్పష్ట శరీరాలతో,
మీటే ఆమెను
ఆమె లోపలికి తీసుకెళ్తాయి.
నన్ను చూడు
నేను ప్రత్యేక స్త్రీను కాదు,
కొనసాగింపు మాత్రమే
నేను ఆ నీలి ఆకాశం
నిరంతరం
నేను ఒక పర్వతం గొంతుకను
రాత్రి గాలి వీచికను
అనుక్షణం క్షణక్షణం
దహించే అగ్నిని.
![]()
జాయ్ హార్జో 1951 మే 9న టుల్సా, ఓక్లాహోమాలో పుట్టారు. ఆమె అమెరికన్ కవయిత్రి, చిన్నపిల్లల రచయిత, నాటకకారిణి, సంగీతకారిణి, మరియు విశ్వవిద్యాలయ అధ్యాపకురాలు. మువ్వోక దేశీయ అమెరికన్ (Mvskoke) వంశానికి చెందిన జాయ్ హార్జో కవిత్వం మహిళా హక్కులు, ఆధ్యాత్మికత మరియు సమాజ న్యాయం అంశాలతో ప్రేరణ పొందింది. 2019లో ఆమె అమెరికన్ పోయెట్స్ అకాడమీ ఛాన్సలర్‌గా ఎన్నికై, అదే సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్‌లో 23వ పూజ్య కవయిత్రిగా (Poet Laureate) స్థానం సంపాదించారు. జాయ్ హార్జో ప్రతీ కవితను ఒక ఆచార వస్తువుగా భావిస్తూ, కథల ద్వారా తన పూర్వీకులతో మరియు మనతో సంబంధాన్ని కలిగిస్తారని నమ్ముతున్నారు.




Discussion about this post