• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

రష్యన్ కథ : శిక్ష

కేశవ్ గోపాల్ by కేశవ్ గోపాల్
June 29, 2026
in అనువాద కథలు
0
రష్యన్ కథ : శిక్ష

రష్యన్ మూలం : అంతోన్ చేహొవ్
తెలుగు అనువాదం : కేశవ్ గోపాల్

 

శరదృతువు. ఒక చీకటి రాత్రి. పదిహేనేళ్ల క్రితం అలాంటి ఒక రాత్రి వృద్ధ బ్యాంకర్ తానిచ్చిన విందు గుర్తు చేసుకుంటూ చదువుల గదిలో పచార్లు చేస్తున్నాడు. విందుకు వచ్చిన వారిలో చాలామంది మేధావులున్నారు. ఎంతో ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. ఇతర విషయాలతోబాటు, వారు మరణశిక్ష గురించి చర్చించారు. అనేకమంది పండితులు, పాత్రికేయులతో సహా విచ్చేసిన అతిథులలో అనేకులు మరణశిక్షను వ్యతిరేకించారు. మరణశిక్షకు కాలం చెల్లిందనీ, క్రైస్తవ రాజ్యాలకు అనుచితమైనదీ, అనైతికమైనదీ అని భావించారు. మరణశిక్ష స్థానంలో ప్రపంచ వ్యాప్తంగా యావజ్జీవ కారాగార శిక్షను ప్రవేశపెట్టాలని కొందరు విశ్వసించారు.

‘‘నేను మీతో ఏకీభవించను’’ అన్నాడు బ్యాంకర్. ‘‘నేను మరణశిక్షను గానీ, యావజ్జీవ కారాగార శిక్షను గానీ ఎప్పుడూ అనుభవించలేదు. కానీ, యావజ్జీవ కారాగార శిక్ష కంటే మరణశిక్షే ఎక్కవ నైతికమైనది, మానవీయమైనది. మరణశిక్ష తక్షణమే చంపుతుంది. కానీ యావజ్జీవ కారాగార శిక్ష నెమ్మదిగా చంపుతుంది. ఏ హంతకుడు మానవతావాది? నిముషాల్లో చంపేవాడా లేక సంవత్సరాల తరబడి ప్రాణాల్ని పీల్చి పిప్పిచేసేవాడా?’

‘‘రెండూ సమానంగా అనైతికమైనవే’’ అని అతిథులలో కొందరు వ్యాఖ్యానించారు. ‘‘ఎందుకంటే రెండిటి లక్ష్యం ఒక్కటే- ప్రాణం తీయడం. రాజ్యం దేవుడు కాదు. తిరిగి యివ్వలేని దాన్ని తీసేసుకునే హక్కు రాజ్యానికి లేదు’’ అన్నారు. 

అతిథులలో సుమారుగా ఇరవై ఐదేళ్ల యువకుడైన ఒక న్యాయవాది వున్నాడు. అతని అభిప్రాయం కోరగా అతను ఇలా అన్నాడు:

‘‘మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష- రెండూ సమానంగా అనైతికమైనవే. కానీ ఈ రెండిట్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే నేను నిస్సందేహంగా రెండోదాన్నే ఎంచుకుంటాను. అసలు ప్రాణం పోగొట్టుకోవడం కంటే, ఏదోవిధంగా ప్రాణాలతో బతికివుండడం మేలు!’’ అన్నాడు.

తీవ్రంగా వాగ్వాదం జరిగింది. అప్పటికింకా వయసులో చిన్నవాడు, వుద్రేకి అయిన బ్యాంకర్ సహనం కోల్పోయి బల్లపై పిడికిలితో గట్టిగా గుద్ది ఆ యువకుణ్ని గద్దించాడు.

‘‘నువ్వు చెప్పేది నిజం కాదు. నువ్వు చెరసాలలో ఐదేళ్లు కూడా బతకలేవని నేను నీతో ఇరవై లక్షల రూబుళ్లు పందెం కాస్తాను!’’

‘‘మీ నిర్ణయం నిజంగా ఇదే అయితే నేను ఐదు కాదు, ఏకంగా పదిహేనేళ్లు శిక్ష అనుభవిస్తానని పందెం కాస్తాను’’ అన్నాడు యువ న్యాయవాది. 

‘‘పదిహేనేళ్లా? సరే! పందెం.. మహాశయులారా! నేను ఇరవై లక్షల రూబుళ్లు పందెం ఒప్పుకుంటున్నాను’’ అని బ్యాంకర్ ప్రకటించాడు.

‘‘సరే! మీరు లక్షల్లో పందెం కాయండి. నేను నా స్వేచ్ఛను పందెం కాస్తాను!’’ అన్నాడు యువ న్యాయవాది.

అలా ఈ పిచ్చి, అర్థంపర్థం లేని పందెం జరిగింది. ఆ సమయంలో లక్షలాది రూబుళ్లంటే లక్ష్యపెట్టని, గారాబంగా పెరిగిన విలాసప్రియుడైన బ్యాంకర్ ఆ పందెంతో చాలా సంతోషించాడు. ఆ రాత్రి భోజనం చేసే సమయంలో బ్యాంకర్ న్యాయవాదితో ఇలా అన్నాడు పరిహాసంగా:

‘‘నాయనా! సమయం మించిపోకముందే బాగా ఆలోచించుకో; ఇరవై లక్షలు నాకొక లెక్కకాదు. కానీ ఈ పందెం వల్ల నువ్వు నీ జీవితంలో ఎంతో విలువైన మూడు, నాలుగు సంవత్సరాలు కోల్పోతావు. మూడు నాలుగు- అంటున్నాను. అంతకుమించి నువ్వు ఎక్కువ కాలం బతకలేవు. దురదృష్టవంతుడివి! తప్పనిసరి నిర్బంధం కన్నా స్వచ్ఛంద నిర్బంధం ఎంతో కష్టమని మర్చిపోకు. ఏ క్షణంలోనైనా స్వేచ్ఛ పొందే హక్కు నీకు వుందన్న ఆలోచనే చెరసాలలో నీ అస్తిత్వం మొత్తాన్ని విషపూరితం చేస్తుంది. నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది!’’ అన్నాడు బ్యాంకర్.

ఇప్పుడు అటూ ఇటూ పచార్లు చేస్తున్న బ్యాంకర్‌కు ఇదంతా గుర్తుకొచ్చి తనలో తాను యిలా ప్రశ్నించుకున్నాడు.

‘‘ఈ పందెం వల్ల వుపయోగమేమిటి? ఆ న్యాయవాది తన జీవితంలోని పదిహేనేళ్లు కోల్పోయి, నేను ఇరవై లక్షల రూబుళ్లు వృథా చేసి ప్రయోజనమేమి? దీనివల్ల యావజ్జీవ కారాశిక్ష కంటే మరణశిక్ష మంచిదో చెడ్డదో రుజువౌతుందా? అస్సలు కానేకాదు.. ఇదంతా అర్థంలేని తెలివి తక్కువ పని! నా విషయంలో ఇది కడుపునిండా తిన్న మనిషి చేసే ఆవేశపూరితమైన ఆలోచన. ఇక, న్యాయవాది విషయానికొస్తే, అతనిది కేవలం డబ్బు మీది దురాశ…’’

ఆరోజు ఏం జరిగిందో బ్యాంకర్ ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు. బ్యాంకర్‌కు చెందిన తోటలోని ఒకానొక భవనంలో అత్యంత కఠినమైన పర్యవేక్షణలో న్యాయవాది తన శిక్షను అనుభవించాలని నిర్ణయం జరిగింది. ఆ కాలంలో అతనికి ఆ భవనం గడపదాటే హక్కు, సజీవంగా వున్న మనుషులను కలుసుకునే హక్కు, మానవ స్వరాలను వినే హక్కు, లేదా ఉత్తరాలు, వార్తాపత్రికలు స్వీకరించే హక్కు వుండదని అంగీకారం జరిగింది. అతనికి ఒక సంగీత వాద్య పరికరం వుంచుకోడానికి, ద్రాక్షసారా తాగడానికి, పొగాకు కాల్చడానికి అనుమతి వుంటుంది. ఒప్పందం ప్రకారం ఇందుకోసం ప్రత్యేకంగా నిర్మించిన ఒక చిన్న కిటికీ ద్వారా, నిశ్శబ్దంగా మాత్రమే బయటి ప్రపంచంతో సంబంధం వుంటుంది. అతనికి అవసరమైన ఏ వస్తువునైనా- పుస్తకాలు, ముద్రిత స్వరలిపి ప్రతులు, ద్రాక్షసారా మొదలైనవి- ఒక చీటీ రాయడం ద్వారా ఎంత పరిమాణంలోనైనా పొందవచ్చు. కానీ కేవలం కిటికీ ద్వారా మాత్రమే. పందెం ముగింపు, ఏకాంత ఖైదు- వీటికి సంబంధించిన కచ్చితమైన, అతిసూక్ష్మ వివరాలు ఒప్పందంలో వున్నాయి. అతని శిక్ష సరిగ్గా  1870 సంవత్సరం నవంబరు 14న మధ్యాహ్నం 12 గంటలకు మొదలై 1885 సంవత్సరం నవంబరు 14న మధ్యాహ్నం 12 గంటలకు ముగియాలి. ఈ షరతులను వుల్లంఘించే ఏ స్వల్ప ప్రయత్నమైనా- కనీసం ముగింపు గడువుకు రెండు నిముషాలు ముందైనా సరే- జరిగితే ఇరవై లక్షల రూబుళ్లు చెల్లించాల్సిన బాధ్యత నుంచి బ్యాంకర్ విముక్తుడౌతాడు- షరతు రద్దవుతుంది.

న్యాయవాది సంక్షిప్తంగా రాసుకున్న వివరాలను బట్టి కొన్ని విషయాలు స్పష్టమౌతాయి. అతడు తన మొదటి ఏడాది ఖైదులో ఒంటరితనంతో, విసుగుతో తీవ్రంగా బాధపడ్డాడు. అతడున్న భవనం నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరం పియానో చేస్తున్న శబ్దాలు వినిపించేవి. అతడు మద్యం, పొగాకు వాడకం మానేశాడు. మద్యం కోరికలను రేకెత్తిస్తుందనీ, కోరికలే ఖైదీకి అతిపెద్ద శత్రువులనీ అతడు రాశాడు. అంతేగాక, మంచి మద్యం సేవిస్తూ ఎవరినీ చూడలేకపోవడం కంటే విసుగు పుట్టించేది మరొకటి లేదు. ఇంకా- పొగాకు అతని గదిలోని గాలిని కలుషితం చేస్తుంది. మొదటి ఏడాది అతనికి పంపిన పుస్తకాలు చాలా వరకూ సరళమైనవి- వినోదానికి సంబంధించినవి- సంక్లిష్టమైన ప్రేమకథలు, నేరం, కాల్పనిక కథలు, హాస్యప్రధానమైన నవలలు లాంటివి.

రెండవ సంవత్సరం వచ్చేసరికి- ఆ భవనం నుంచి సంగీతం ఆగిపోయింది. కేవలం ప్రాచీన సాహిత్యం మాత్రమే కావాలని న్యాయవాది కోరాడు. ఐదో ఏట మళ్లీ సంగీతం వినిపించింది. మద్యం కావాలని ఖైదీ కోరాడు. కిటికీ లోంచి అతణ్ని గమనించిన వాళ్లు చెప్పిన దాన్ని బట్టి ఆ ఏడాది మొత్తం అతడు తినడం, తాగడం, మంచం మీద పడుకుని తరచూ ఆవలిస్తూ తనలో తాను కోపంగా మాట్లాడుకోవడం తప్ప మరేమీ చేయలేదు. పుస్తకాలు చదవలేదు. కొన్ని సార్లు రాత్రిపూట రాయడానికి కూచుని, చాలాసేపు రాసి ఉదయానికి తను రాసిందంతా చింపేసేవాడు. ఎక్కువసార్లు ఏడుస్తూ వుండేవాడు.

ఆరో ఏడాది చివరి ఆరు నెలల్లో అతడు భాషలు, తత్వశాస్త్రం, చరిత్ర అధ్యయనంతో గడిపాడు. వీటిని ఎంత ఆసక్తిగా చదివాడంటే, అతడు కోరిన పుస్తకాలను అందించడానికి బ్యాంకర్ చాలా ఇబ్బంది పడ్డాడు. నాలుగేళ్లలో అతని అభ్యర్థన మేరకు ఆరువందల పుస్తకాలు తెప్పించాల్సి వచ్చింది. ఆ కాలంలో బ్యాంకర్ కు ఖైదీనుంచి వుత్తరం అందింది: ‘‘నా ప్రియమైన జైలర్! నేను ఈ పంక్తులను ఆరు భాషల్లో రాస్తున్నాను. ఈ భాషలు తెలిసిన జ్ఞానులకు వీటిని చూపించండి. వారిని చదవమనండి. వారు ఒక తప్పు కూడా కనుక్కోలేకపోతే తోటలో ఒకసారి తుపాకీ కాల్చమని ఆదేశించండి. అలా చేస్తే నా ప్రయత్నాలు వృథా కాలేదని నాకు అర్థమౌతుంది.

శతాబ్దాలుగా దేశదేశాల మేధావులు వేర్వేరు భాషలు మాట్లాడుతున్నారు. కానీ, వారందరిలో ఒకే జ్వాల రగులుతూ వుంది. ఓహ్..! వాళ్లను అర్థం చేసుకోగలిగాననే వాస్తవం వల్ల నా ఆత్మ ఇప్పుడెంత అలౌకిక ఆనందాన్ని పొందుతోందో మీకు  తెలిస్తే ఎంత బాగుంటుంది!

ఖైదీ కోరిక నెరవేరింది. తోటలో రెండుసార్లు తుపాకీ పేల్చమని బ్యాంకర్ ఆదేశించాడు. 

ఆ తర్వాత పదో ఏడాది ముగిశాక న్యాయవాది తన బల్ల దగ్గర కదలకుండా కూచుని కేవలం సువార్త మాత్రమే చదివాడు. నాలుగేళ్లలో ఆరువందల క్లిష్టమైన గ్రంథాలు చదివి ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తి, సులభంగా అర్థమయ్యే ఒకే ఒక పుస్తకాన్ని చదవడానికి దాదాపు ఒక ఏడాది తీసుకోవడం బ్యాంకర్‌కు వింతగా తోచింది. సువార్త స్థానంలో మతాల చరిత్ర, వేదాంత శాస్త్రం వచ్చి చేరాయి.

తన నిర్బంధంలోని చివరి రెండేళ్లలో ఖైదీ విచక్షణా రహితంగా విపరీతంగా చదివాడు. కొన్ని సార్లు ప్రకృతి శాస్త్రాలను అధ్యయనం చేసేవాడు. మరికొన్ని సార్లు బైరన్, షేక్‌స్పియర్ పుస్తకాలు కావాలని కోరేవాడు. అతడు ఏకకాలంలో రసాయనశాస్త్ర పుస్తకం, వైద్యసంబంధ పాఠ్యపుస్తకం, ఒక నవల, ఏదైనా తాత్విక లేదా దైవశాస్త్ర గ్రంథం కావాలని చీటీలు పంపేవాడు. ధ్వంసమైపోయిన తన ఓడశిథిలాల మధ్య తన ప్రాణం కాపాడుకోవడానికి ఆశగా మొదట ఒక శకలం, తర్వాత ఇంకొక శకలం పట్టుకుని ఈదుతూ వున్నట్లు అనిపిచింది అతని చదువు.

-2-

వృద్ధ బ్యాంకర్ ఇదంతా గుర్తుచేసుకుంటూ ఇలా అనుకున్నాడు:

‘‘రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఖైదీ మళ్లీ తన స్వేచ్ఛను పొందుతాడు. ఒప్పందం ప్రకారం నేను అతనికి ఇరవై లక్షల రూబుళ్లు చెల్లిస్తే అంతా ముగిసిపోతుంది. నేను సర్వనాశనమైపోతాను!’’

పదిహేనేళ్ల క్రితం బ్యాంకర్‌కు ఇరవై లక్షలంటే లెక్కలేదు. ఆ క్షణంలో తన దగ్గర ఏవి ఎక్కువగా వున్నాయి- అప్పులా? ఆస్తులా అని తనకు తాను ప్రశ్నించుకోడానికే భయపడ్డాడు. తాను నిర్లక్ష్యంగా ఆడిన స్టాక్  మార్కెట్ జూదం, ప్రమాదకరమైన వూహాగానాలు, వృద్ధాప్యంలో కూడా వదులుకోలేని ఉద్రేక స్వభావం క్రమంగా అతని సంపద కరిగిపోవడానికి దారితీశాయి. ఆ నిర్భయ, అహంకార, గర్విష్ఠి ధనవంతుడు తన స్టాక్ విలువకు ఎదురయ్యే హెచ్చుతగ్గులకు వణికిపోయే ఒక మధ్యస్థాయి బ్యాంకర్ గా మారిపోయాడు.

‘‘దిక్కుమాలిన పందెం!’’ అంటూ ముసిలాయన తల పట్టుకుని గొణుక్కున్నాడు. ‘‘పందెం కాసిన ఆ మనిషి- న్యాయవాది ఎందుకు చావలేదు? వాడికి నలభై ఏళ్లే కదా! నా దగ్గర వాడు చివరి కోపెక్కు కూడా లాక్కుని, పెళ్లి చేసుకుని సుఖంగా బతుకుతాడు. స్టాక్ మార్కెట్లో జూదం ఆడుతాడు. నేను మాత్రం ఒక బిచ్చగాడిలా అసూయతో చూస్తూవుండిపోవాలి. వాడు రోజూ వల్లించబోయే ఒకే వాక్యాన్ని వింటూ వుండాలి: ‘‘నా జీవితంలో మీరు తెచ్చిన సంతోషానికి మీకు రుణపడి వుంటాను. మీకు సాయం చెయ్యనివ్వండి!’’ అని. లేదు.. లేదు. నేనది భరించలేను. నేను దివాలా తీయకుండా, అవమానం పాలుగాకుండా నన్ను రక్షించగలిగేది ఒకే ఒకటి- అతడి చావే!’’

తెల్లవారు ఝాము మూడు గంటలైంది. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో వున్నారు. కిటికీల బయట గడ్డకట్టిన చెట్ల గలగలలు తప్ప మరే శబ్దమూ లేదు. చప్పుడు చేయకుండా వుండేందుకు ప్రయత్నిస్తూ బ్యాంకర్ పదిహేనేళ్లుగా తెరవని ఇనప్పెట్టె తెరిచి తోటలోని భవనం తలుపు తాళం చెవి తీసుకున్నాడు. ఓవర్ కోటు వేసుకుని ఇంట్లోనుంచి బయటకొచ్చాడు.

తోటలో చీకటిగా, చలిగా వుంది. వర్షం పడుతోంది. తోటంతా జివ్వున వీచే గాలికి చెట్లు వూగుతున్నాయి. బ్యాంకర్ కళ్లు చికిలించి చూశాడు. కానీ అతనికి ఏమీ స్పష్టంగా కనిపించడం లేదు. కష్టం మీద ఖైదీ వున్న భవనం దగ్గరికి వెళ్లి కాపలాదారుణ్ని రెండుసార్లు కేకేశాడు. ఎలాంటి సమాధానం రాలేదు. బహుశ అతడు తుఫాను నుంచి తలదాచుకుని ఏ వంటగదిలోనో, హరిత గృహంలోనో ఎక్కడో నిద్రపోతున్నట్లుంది.

‘‘నా వుద్దేశం నెరవేర్చుకునే సాహసం చేస్తే మొట్టమొదట కాపలాదారుణ్నే అనుమానిస్తారు’’ అనుకున్నాడు వృద్ధ బ్యాంకర్ మనసులో.

అతడు చీకట్లో మెల్లగా భవనంమెట్ల దగ్గరి తలుపుగుండా హాల్లో ప్రవేశించాడు. తర్వాత తడుముకుంటూ సన్న నడవలోకి వెళ్లి అగ్గిపుల్ల వెలిగించాడు. అక్కడ ఒక్క ప్రాణి కూడా లేదు. అక్కడొక మంచం వుంది. కానీ పరుపులేదు. ఒక మూల ఇనుప పొయ్యి కనిపించింది. ఖైదీ వున్న గదుల్లోకి దారితీసే తలుపు మీద వేసిన సీళ్లు చెక్కుచెదరలేదు.

అగ్గిపుల్ల ఆరిపోగానే వృద్ధుడు ఉద్వేగంతో వూగిపోతూ చిన్న కిటికీలోంచి లోపలికి తొంగిచూశాడు. ఖైదీ వున్న గదిలో కొవ్వొత్తి మందంగా వెలుగుతోంది. అతడు బల్లదగ్గర కూచుని వున్నాడు. అతని వీపు, తలమీది జుత్తు, చేతులు తప్ప ఏమీ కనిపించలేదు. తెరిచిన పుస్తకాలు బల్లమీద, రెండు పడక కుర్చీల మీద, తివాచీ మీద వున్నాయి. 

ఐదు నిముషాలు గడిచాయి. ఖైదీ కదల్లేదు. పదిహేనేళ్ల కారాగారశిక్ష కదలకుండా కూచోవడం అతనికి నేర్పింది. బ్యాంకర్ వేలితో కిటికీ మీద తట్టాడు టకటక. కానీ ఖైదీ కదల్లేదు. మెదల్లేదు. తర్వాత జాగ్రత్తగా తలుపు మీది సీళ్లను పగలగొట్టాడు. తాళంలో తాళం చెవి దూర్చాడు. తుప్పు పట్టిన తాళం కర్కశంగా శబ్దం చేసింది. తలుపు కిర్రుమంది. వెంటనే అడుగుల చప్పుడు, ఆశ్చర్యం నిండిన అరుపు వినిపిస్తుందని బ్యాంకర్ అనుకున్నాడు. మూడు నిముషాలు గడిచాయి. ఎప్పటిలాగే గదిలో నిశ్శబ్దం. లోపలికి అడుగుపెట్టాలని నిశ్చయించుకున్నాడు.

బల్లదగ్గర అసాధారణమైన మనిషి నిశ్చలంగా కూచుని వున్నాడు. ఎముకల మీది చర్మం బిగుసుకపోయిన అస్థిపంజరంలా వున్నాడు. ఒక స్త్రీలాగా పొడవాటి వుంగరాల జుత్తు, గుబురు గడ్డం. ముఖం పసుపు పచ్చగా పాలిపోయిన ఛాయతో బుగ్గలు లోపలికి నొక్కుకపోయాయి. వీపు పొడుగ్గా బక్కగా వుంది. జుత్తులో వెండిరంగు పాయలున్నాయి. చిక్కిపోయిన ముసలి ముఖాన్ని చూస్తే అతనికి కేవలం నలభైఏళ్లేనని ఎవరూ నమ్మలేరు. అతడు నిద్రపోతున్నాడు… వాల్చిన తల ముందు బల్లమీద ఒక కాగితం వుంది. దానిమీద చిన్న అక్షరాలతో ఏదో రాసివుంది. 

‘‘నిర్భాగ్యజీవి!’’ అనుకున్నాడు బ్యాంకర్. ‘ఇతడు నిద్రపోతున్నాడు. బహుశ లక్షల రూబుళ్ల గురించి కలలు కంటున్నాడు! నేను చేయాల్సిందల్లా దాదాపు సగం చచ్చిన ఈ మనిషిని మంచం మీద పడేసి దిండుతో వూపిరాడకుండా చేయడమే. అప్పుడు ఎంత నిశితంగా ఫోరెన్సిక్ పరీక్ష చేసినా హత్యకు సంబంధించిన ఆనవాళ్లేమీ దొరకవు. కానీ, ముందుగా ఇక్కడ ఏం రాసివుందో చదువుదాం…’’ 

బ్యాంకర్ బల్లమీది కాగితం తీసి చదివాడు:

‘‘రేపు మధ్యాహ్నం నాకు స్వేచ్ఛ, ఇతరులను కలిసే హక్కు లభిస్తాయి.. కానీ, నేనీ గది విడిచి సూర్యుణ్ణి చూడబోయే ముందు కొన్ని మాటలు చెప్పడం అవసరమని భావిస్తున్నాను. దేవుని సాక్షిగా పూర్తి నిజాయితీతో నేను మీకు ప్రకటిస్తున్నాను. స్వేచ్ఛ, జీవితం, ఆరోగ్యం, ఇంకా మీ పుస్తకాలలో ఈ ప్రపంచ వరాలుగా వర్ణించే ప్రతిదాన్నీ నేను అసహ్యించుకుంటున్నాను.

‘‘పదిహేనేళ్లుగా నేను ఐహిక జీవితాన్ని శ్రద్ధగా అధ్యయనం చేశాను. నిజమే.. నేను బాహ్యప్రపంచాన్ని గానీ, మనుషులను గానీ చూడలేదు. కానీ, మీ పుస్తకాల్లో నేను పరిమళ భరితమైన ద్రాక్షాసవం తాగాను. పాటలు పాడాను. అరణ్యాల్లో జింకలను, అడవి పందులను వేటాడాను. స్త్రీలను ప్రేమించాను… ప్రతిభావంతులైన మీ కవులు మాయాజాలంతో సృష్టించిన మేఘాల్లాంటి దివ్య సౌందర్యవతులు రాత్రిళ్లు నన్ను సందర్శించి నా మదిని మైమరపించే అద్భుత గాధలను నా చెవుల్లో గుసగుసలాడారు. మీ పుస్తకాల్లో నేను ఎల్బ్రస్, మౌంట్ బ్లాంక్ శిఖరాలను అధిరోహించాను. అక్కణ్నించి ప్రత్యూష వేళల్లో సూర్యుడెలా ఉదయిస్తాడో, సాయంత్రాల్లో ఆకాశాన్ని సముద్రాలను, పర్వతశిఖరాలను స్వర్ణకాంతులతో ఎలా ముంచెత్తుతాడో చూశాను. మేఘాలను చీల్చుకుంటూ నా తలపైన మెరుపులు ఎలా మెరుస్తాయో తిలకించాను. పచ్చని అడవులను, పొలాలను, నదులను, సరస్సులను, నగరాలను దర్శించాను. జలకన్యల గానాన్ని, గొర్రెల కాపరుల వేణునాదాలను విన్నాను. దేవుని గురించి మాట్లాడ్డానికి నా దగ్గరికి ఎగిరొచ్చిన అందమైన దయ్యాల రెక్కలను స్పృశించాను… మీ పుస్తకాల్లో నేను అంతులేని అగాధాల్లోకి దూకాను. అద్భుతాలు సృష్టించాను. హత్యలు చేశాను. పట్టణాలను కాల్చి బూడిద చేశాను. కొత్త మతాలను బోధించాను. రాజ్యాలకు రాజ్యాలనే జయించాను.

మీ పుస్తకాలు నాకు జ్ఞానాన్నిచ్చాయి. శతాబ్దాలుగా అలుపెరుగని మానవ మేధ సృష్టించినదంతా నా పుర్రెలోని చిన్న పొరలో ఇమిడివుంది. మీ అందరి కన్నా నేనే తెలివైన వాణ్ణని నాకు తెలుసు.

మీ పుస్తకాలను నేను అసహ్యించుకుంటున్నాను. ఈ ప్రపంచంలోని సమస్త వరాలను, సమస్త జ్ఞానాన్ని అసహ్యించుకుంటున్నాను. ప్రతిదీ ఎండమావిలాగా అల్పమైనది, అశాశ్వతమైనది, భ్రాంతిపూర్వకమైనది, మోసపూరితమైనది. మీరు గర్విష్టులు, జ్ఞానులు, అందమైన వాళ్లు కావచ్చు. కానీ, నేలమాళిగలో ఎలుకలను తుడిచిపెట్టినట్టు మృత్యువు మిమ్మల్ని భూమ్మీది నుంచి తుడిచిపెడ్తుంది. మీ వారసులు, మీ చరిత్ర, మీ మేధావుల అమరత్వం భూగోళంతోబాటు స్తంభించిపోతాయి.

మీకు పిచ్చిపట్టింది. తప్పుడు దారిలో వెళ్తున్నారు. అసత్యాలను సత్యాలని, వికారాన్ని అందమని పొరబడుతున్నారు. ఏదో కారణాల వల్ల మీ ఆపిల్ చెట్లకు, నారింజ చెట్లకు పండ్లకు బదులు అకస్మాత్తుగా కప్పలు, బల్లులు మొలిచినా, లేదా గులాబీల నుంచి చెమట పట్టిన గుర్రం వాసన వచ్చినా అద్భుతమని మీరు శ్లాఘిస్తారు. అందుకని, స్వర్గానికి బదులుగా భూమిని కౌగలించుకుంటున్న మిమ్మల్ని చూస్తే నాకు ఆశ్చర్యమేస్తుంది.  మిమ్మల్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం నాకు ఇష్టం లేదు. 

మీ ఉనికి పట్ల నాకున్న ధిక్కారాన్ని ప్రదర్శించడానికై నేను ఒకప్పుడు స్వర్గంగా కలలుగన్న, ఇప్పుడు అసహ్యించుకుంటున్న ఇరవై లక్షల రూబుళ్లను నేను వదులుకుంటున్నాను. వాటిపై నాకున్న హక్కును నేనే స్వయంగా కోల్పోడానికై ఒప్పుకున్న సమయానికన్నా ఐదుగంటలు ముందే ఇక్కణ్ణించి వెళ్లిపోతాను. ఆ విధంగా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తాను…’’

ఇది చదివింతర్వాత బ్యాంకర్ ఆ కాగితాన్ని బల్లమీద పెట్టి, ఆ వింతఖైదీ తలను ముద్దాడి, కన్నీళ్లు పెట్టుకుని భవనం నుండి బయటికి వెళ్లిపోయాడు. స్టాక్ ఎక్స్‌చేంజిలో భారీ నష్టాలు వచ్చినప్పుడు కూడా అతనికి ఇప్పుడు కలిగినంతటి ఏహ్యభావం తనపట్ల ఇంతకుముందెన్నడూ కలగలేదు. ఇంటికి చేరుకుని అతడు పడుకున్నాడు. కానీ ఆందోళన, కన్నీళ్లు చాలా సేపటి వరకు అతణ్ని నిద్రపోనివ్వలేదు.

మరుసటి రోజు వుదయం పాలిపోయిన ముఖాలతో కాపలాదారులు పరుగెత్తుకుంటూ వచ్చి ఖైదీ కిటికీలోంచి దూకి గేటు బయటికెళ్లి, అదృశ్యం కావడం తాము చూశామని బ్యాంకర్ కు తెలియజేశారు. బ్యాంకర్ తన సేవకులతో వెంటనే భవనానికి వెళ్లి, ఖైదీ తప్పించుకున్నాడని నిర్ధారించుకున్నాడు. తర్వాత వూహాగానాలను నివారించడానికి బల్లపై వున్న ఒప్పంద త్యాగపత్రాన్ని తీసుకుని తన గదికి తిరిగివచ్చి దాన్ని ఇనప్పెట్టెలో పెట్టి తాళం వేశాడు.

-1889 లో ప్రచురితం

కొన్ని వివరణలు:

  1. మౌంట్ ఎల్బ్రస్ : రష్యాలోని కాకనస్ పర్వతశ్రేణిలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తులో వుంది. 
  2. మౌంట్ బ్లాంక్ : ఫ్రాన్స్-ఇటలీ సరిహద్దులోని ఆల్ప్స్ పర్వతశ్రేణిలో అత్యంత ఎత్తైన పర్వతశిఖరం. సముద్ర మట్టానికి 4,807.3 మీటర్ల ఎత్తులో వుంది.
కేశవ్ గోపాల్

ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో సీనియర్ రష్యన్ డిప్లొమా చేశారు. 6 ఏళ్లు మాస్కోలో అనువాదంలో శిక్షణ పొంది, ఉద్యోగం చేశారు. జర్మన్ భాషతో కూడా పరిచయం ఉంది.

అభిరుచులు: చిత్రలేఖనం,ఫోటోగ్రఫీ, భాషల అధ్యయనం

Previous Post

జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి

Next Post

ఆర్ద్రత, సాంద్రత నిండిన అనువాదం ‘దిగులు కొంగ’

Next Post
ఆర్ద్రత, సాంద్రత నిండిన అనువాదం ‘దిగులు కొంగ’

ఆర్ద్రత, సాంద్రత నిండిన అనువాదం ‘దిగులు కొంగ’

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

by రమేశ్ రాచపూటి
September 14, 2026
0

...

హిందీ కథ : కొత్త గాలి

హిందీ కథ : కొత్త గాలి

by విఎల్ నరసింహం శివకోటి
September 10, 2026
0

...

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

by పి. శ్రీనివాస్ గౌడ్
September 10, 2026
0

...

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

by తిరువాయపాటి రాజగోపాల్
September 10, 2026
0

...

మళయాళ చిన్న కథలు

మళయాళ చిన్న కథలు

by ఎడిటర్
September 10, 2026
0

...

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

by డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
September 10, 2026
0

...

హిందీ కథ : ఓడిపోయాను 

హిందీ కథ : ఓడిపోయాను 

by వెన్నా వల్లభరావు
September 10, 2026
0

...

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

by కేశవ్ గోపాల్
September 10, 2026
0

...

కన్నడ కథ : చావు

కన్నడ కథ : చావు

by చందకచర్ల రమేశబాబు
September 10, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

by శివ చల్లా
September 10, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026
హిందీ కవిత: అడవిలో వర్షం
అనువాద కవితలు

హిందీ కవిత: అడవిలో వర్షం

September 10, 2026
హిందీ కవితలు: గోధుమ + గోవు
అనువాద కవితలు

హిందీ కవితలు: గోధుమ + గోవు

September 10, 2026
సచ్చిదానందన్ కవితలు రెండు..
అనువాద కవితలు

సచ్చిదానందన్ కవితలు రెండు..

August 15, 2026
హిందీ కవిత: నా చిరునామా
అనువాద కవితలు

హిందీ కవిత: నా చిరునామా

August 15, 2026

అభిప్రాయాలు

  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply