• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

జర్మన్ కథ : రొట్టె

చింతకుంట్ల సంపత్ రెడ్డి by చింతకుంట్ల సంపత్ రెడ్డి
May 25, 2026
in అనువాద కథలు
0
జర్మన్ కథ : రొట్టె

జర్మన్ మూలం: వూల్ఫ్ గాంగ్ బోర్షర్ట్ 
ఇంగ్లీష్ అనువాదం: ఇ.జె.కాంప్ ఫీల్డ్
తెలుగు అనువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి

రాత్రి 2:30 గంటలు. 

అకస్మాత్తుగా మెలకువ వచ్చింది ఆమెకు. 

ఎందుకు మెలకువ వచ్చిందో అనుకున్నది. ఓ, అవును! వంట గదిలో ఏదో శబ్దం. చెవులు రిక్కించి విన్నది. ఇప్పుడు శబ్దాలేవి వినరావడం లేదు. 

చేయిచాపి పక్కన పరుపులో తడిమి చూసింది. ఖాళీగా ఉన్నది. అదీ సంగతి! కొంచెం దీర్ఘంగా ఉండే అతని శ్వాస శబ్దం వినరావడంలేదు. అందుకనే అంత నిశ్శబ్దంగా ఉన్నది. 

లేచి తడుముకుంటూ వంట గదివైపు నడిచింది. సమయం 2:30. తెల్లటి ఆకారం ఒకటి అక్కడ నిలబడి ఉన్నది. ఆమె లైట్ వేసింది. ఇప్పుడతను స్పష్టంగా కనిపిస్తున్నాడు. వారిద్దరూ తమ తమ చొక్కాల్లో ఎదురుగా నిలబడి ఉన్నారు. రాత్రి 2:30 గంటలకు, వంటగదిలో.  

టేబుల్‌ పైన ఓ పళ్ళెం పెట్టి ఉన్నది. అందులో కొన్ని రొట్టె ముక్కలు. పళ్ళెం పక్కనే కత్తి ఉన్నది. టేబుల్ క్లాత్ పైన రొట్టె రజను. ప్రతి రోజు పడుకోబోయే ముందు టేబుల్ క్లాత్ ను శుభ్రం చేస్తుంది తను. ప్రతి రాత్రి. కాని… ఇప్పుడది శుభ్రంగా లేదు. గచ్చు నుండి చల్లదనం ఆమె ఒంట్లోకి పాకింది. పళ్ళెం నుండి చూపులు మరల్చింది. 

వంట గది చుట్టూ చూస్తూ, “ఇక్కడ ఏదో ఉన్నట్లు అనిపించింది.” అన్నాడతను.

“నేను కూడా ఏదో అలికిడి విన్నాను,” జవాబిస్తూ ఆ చొక్కాలో అతను ముసలివాడయ్యాడని అనుకున్నదామె. అతనికిప్పుడు అరవై మూడు. పగటి పూట అప్పుడప్పుడు అంతకన్నా తక్కువ వయసే అనిపించేది. ఆ చొక్కాలో ఆమె కూడా ముదుసలి అయిపోయిందని అనుకున్నాడతను. బహుశా ఆ వెంట్రుకల వల్ల కావచ్చు. ముఖ్యంగా రాత్రి పూట ఎప్పుడైనా ఆడవాళ్ల విషయంలో అంతే. అకస్మాత్తుగా వాళ్ల వయసు పెరిగిపోతుంది. 

“నువ్వు చెప్పులు వేసుకోవాల్సింది. చెప్పుల్లేకుండా… అలా చల్లటి గచ్చు మీద. నీకు జలుబు చేస్తుంది.”

ఆమె అతనివైపు చూడలేదు. అతను అబద్ధమాడడం ఆమె తట్టుకోలేకపోయింది. పెళ్లయిన ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత అతను అబద్ధమాడాడు.

“ఇక్కడ ఏదో ఉన్నట్లు అనిపించింది,” అతను మళ్లీ ఓసారి అన్నాడు. ఈ మూల నుంచి ఆ మూలకు మళ్లీ చూశాడు ఓసారి అర్ధం లేకుండా, “నేను ఏదో శబ్దం విన్నాను. అందుకని ఇక్కడ ఏదో ఉన్నట్లు అనిపించింది.”

“నేను కూడా ఏదో విన్నాను. కానీ బహుశా ఏమీ లేదేమో.” పళ్ళెం తీసి టేబుల్ క్లాత్ పై ఉన్న రొట్టె రజనును  విదిలించిందామె.

“లేదు. బహుశా ఏమి లేదు.” జవాబిచ్చాడతను మరిక ఏమి అనలేక.

ఆమె అతనికి మద్దతిచ్చింది, “రండి, అది బయట అయి ఉంటుంది. నేను ఇక్కడ అనుకున్నాను.”

“వచ్చెయ్యండిక,” అంటూ లైట్ ఆర్పివేసింది, “అది బయటే అయి ఉంటుంది. గాలి బాగా వీచినప్పుడు వర్షపు నీరు గోడకు కొట్టుకుంటుంది. అది తప్పక వర్షం నీరే. గాలి ఎక్కువగా ఉన్నపుడు ఎప్పుడైనా అలాగే చప్పుడు వస్తుంది.”

ఇద్దరు హాల్ గుండా పడక గదిలోకి నడిచారు. చెప్పుల్లేని వారి పాదాలకు చల్లగా తాకుతున్నది గచ్చు. 

“అవును, గాలి బాగా వీస్తున్నది,” అతను అన్నాడు. “రాత్రంతా గాలే.” 

పడుకునేపుడు ఆమె అన్నది, “అవును, రాత్రంతా గాలులే. బహుశా అది వర్షపునీటి చప్పుడే.”

“అవునవును. నేనేదో వంటగదిలో చప్పుడు అనుకున్నా. బహుశా అది వర్షపునీటి చప్పుడే.” అప్పటికే సగం నిద్రలో ఉన్నట్టు మాట్లాడాడు అతను.

కానీ అబద్ధం చెబుతున్నప్పుడు అతని గొంతులో ఏదో మార్పు ఆమె గమనించింది. “చలిగా ఉంది.” అంటూ నెమ్మదిగా ఆవులించిందామె, “నేను దుప్పట్లో దూరుతున్నాను. గుడ్ నైట్.”

“నైట్,” అంటూనే, “అవును, నిజంగా బాగా చలిగా ఉంది.” అన్నాడు.

ఇక నిశ్శబ్దం రాజ్యమేలింది. చాలా సేపటి తర్వాత జాగ్రత్తగా అతను ఏదో నమలడం ఆమె విన్నది. తాను ఇంకా మెలకువగానే ఉన్నానని అతను అనుకోకుండా కావాలనే దీర్ఘంగా ఓకే మోస్తరుగా శ్వాస ఆడించింది. అతని నమలడం ఎంత లయబద్ధంగా ఉందంటే… అదే  ఆమెను నిద్రలోకి జార్చింది.

మరుసటి సాయంత్రం భోజనాల వేళ, నాలుగు రొట్టె ముక్కలను అతనివైపు తోసింది. అంతకు ముందు ఎప్పుడైనా అతను మూడే తినేవాడు. 

“కానివ్వండి, నాలుగు తినండి. రొట్టె తినలేకపోతున్నాను, నాకు వద్దు.” అతను పళ్ళెం పైనే దృష్టి పెట్టడం ఆమె గమనించింది. అతను తల పైకి ఎత్తలేదు. ఆ క్షణంలో ఆమెకు అతని పైన జాలి కలిగింది. 

“నువ్వు రెండే తిని ఉండలేవు.” తన పళ్ళెంతోనే అన్నాడతను.

“సాయంత్రం రొట్టె పడడం లేదు నాకు. కానివ్వండి, తినండి.” 

ఆ తర్వాత కాసేపటికి టేబుల్ దగ్గర దీపం పక్కన కూర్చున్నది ఆమె.

చింతకుంట్ల సంపత్ రెడ్డి
చింతకుంట్ల సంపత్ రెడ్డి

73 ఏళ్ల సంపత్ రెడ్డి ఎం.ఏ (హిస్టరీ), ఎం.ఏ (ఇంగ్లిష్), పి.జి.సి.టి.ఐ (CIEFL) చదివారు. సాంకేతిక విద్యాశాఖలో ఇంగ్లిష్ లెక్చరర్ గా చేసి… 2011 లో హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్ గా రిటైరయ్యారు. పుస్తకాలు చదవడం, అనువాదాలు చేయడం, ఫోటోగ్రఫీ ఆయన వ్యసనాలు
అత్యధికంగా అమ్ముడయే గ్రామర్ పుస్తకాల్లో ఒకటైన English Grammar Fundas (తెలుగు వివరణలతో) ప్రచురించారు. అనువాదాలు.. 1. మనుబెహన్ గాంధీ రచన బాపు-నా మాతృమూర్తి, 2. భిన్న దేశాల విభిన్న ఉత్తరాలు-ఉపన్యాసాలు (32 ఉత్తరాలు-32 ఉపన్యాసాల సంకలనం) 3. భిన్న దేశాల విభిన్న కవిత్వం (అనువాద కవితల సంకలనం) 4. హిందువులకో ఉత్తరం- లియో టాల్స్టాయ్ 5. సామ్యవాదం నుండి సర్వోదయ వరకు- లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ వెలువడ్డాయి.
ఫోటోగ్రఫీ ఆసక్తి: తెలుపునలుపు ఛాయాచిత్రపు రోజుల్లో ఏతావాతా తీసిన ఫోటోలు కొన్ని భారతదేశంలోని అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్స్ లో ప్రదర్శితమయ్యాయి. 1982 లో ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ (FIP) వారు నెలనెలా నిర్వహించిన మెంబర్స్ మంత్లీ కాంపిటేషన్ ‘బిగినర్స్ సెక్షన్’ ఫోటో పోటీలో “గ్రాండ్ అవార్డ్” (సిల్వర్ మెడల్) అవార్డు. 1984 లో ‘Decade of the Girl Child (1975-85) కార్యక్రమాల్లో భాగంగా UNICEF నిర్వహించిన Focus on the Girl Child ఫోటో పోటీలో 2200 మంది ఫోటోగ్రాఫర్లు పంపిన 6500 చిత్రాలలో మొత్తం 150 చిత్రాలు ఎంపిక కాగా, నా చిత్రాలు మూటికి మూడు (3) “గ్రాండ్ జ్యూరి అవార్డ్” గెలుచుకున్నాయి. అక్టోబర్, 2025 లో ప్రపంచ వన్యప్రాణి సంస్థ (WWF), తెలంగాణా అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలో రెండవ బహుమతి.

Previous Post

ఇంగ్లిషు కథ : వెన్నుపోటు

Next Post

రష్యన్ కథ : దైవ సంకల్పం

Next Post
రష్యన్ కథ : దైవ సంకల్పం

రష్యన్ కథ : దైవ సంకల్పం

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • హిందీ కవితలు: గోధుమ + గోవు
  • సచ్చిదానందన్ కవితలు రెండు..
  • హిందీ కవిత: నా చిరునామా
  • ఇంగ్లిషు కవిత : మనోచిత్రం
  • సమీక్ష: విస్మృతికి లోనవుతున్న సుగుణాన్ని గుర్తు చేసే పుస్తకం
  • ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి
  • ఇంగ్లిషు కవిత :  కోరిక
  • ఇంగ్లీషు కవిత:   “వృక్షం”
  • హిందీ కవిత: ఇక్కడే ఎక్కడో ఉండాలి ఇల్లు
  • ఆంగ్ల కథ: నది మది
  • తమిళ కథ : ఎస్తర్
  • కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’
  • ఉర్దూ కథ : పీరున్
  • ఉర్దూ కథ: భ్రమ
  • హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • కన్నడ కథ : భీమ వచ్చింది
  • ఫ్రెంచి కథ : కల చెదిరింది, కథ మారింది!

అభిప్రాయాలు

  • విహారి on కన్నడ కథ : భీమ వచ్చింది
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Dr.Kvl sandhya Rani on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • Lahari on ఉర్దూ కథ : పీరున్
  • Raghunath Thotapalli on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Jashwanth on ఉక్రెయిన్ జానపద కథ: వజ్రాల కంచె
  • కొల్లూరి సోమ శంకర్ on ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి
  • Reddy on హిందీ కథ : లెక్క తప్పింది !
  • Gopal Venuraja Rao on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Rajeshwari Srimallik on టర్కిష్ కథ : వలసపిట్ట

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply