• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

హిందీ కథ: నన్ను పంచుకోండి

వెన్నా వల్లభరావు by వెన్నా వల్లభరావు
July 10, 2026
in అనువాద కథలు
0
హిందీ కథ: నన్ను పంచుకోండి

హిందీ మూలం: సుశాంత్ సుప్రియ్
తెలుగు అనువాదం : వల్లభరావు వెన్నా

నా దేహం నడిరోడ్డుపై పడుంది. తలకి బలమైన గాయమైంది. నా చొక్కా పైన రక్తపు మరకలున్నాయి. నా చుట్టూ పెద్ద గుంపు ప్రోగయింది. గుంపులోని జనాలు చాలా ఆవేశంగా ఉన్నారు. చూస్తూ-చూస్తూ ఉండగానే గుంపు రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం నన్ను హిందువు అంటుంది. కాషాయ పతాకాలు గాలిలో ఊగాయి. రెండోవర్గం నేను ముస్లింనని అంటుంది. ఆకుపచ్చ జెండాలు రెపరెపలాడాయి.

‘ఇతన్ని ముస్లిములే చంపారు. ఇతను హిందువు. ఈ శరీరాన్ని దహనం చెయ్యాలి’- గర్జించింది ఒక వర్గం. ‘ఇతన్ని ఏమైనా చేసే హక్కు మాకే ఉంది’ అరిచింది రెండో వర్గం. ‘ఇతన్ని హిందువులే చంపారు. వీడు మా ముస్లిం సోదరుడు. ఇతన్ని ఖననం చేస్తాం. ఇతనిపై హక్కు మాది’… ఆ తర్వాత ‘జై శ్రీరామ్’, ‘అల్లాహు అక్బర్’ నినాదాలు మిన్నంటాయి.

నేను దగ్గర్లోనే నిలబడి జరుగున్న తతంగం అంతా చూస్తున్నాను. నేను చనిపోయానా!? గుంపు చేస్తున్న గొడవ చూస్తే అలాగే అనిపిస్తుంది.

‘సోదరులారా! నేను చనిపోయినా, ముందు నన్ను హాస్పటల్ కు తీసుకెళ్ళండి. కనీసం నాకు పోస్టమార్టం చేయించండి. నేనెలా చనిపోయానో తెలియాలిగా’ అన్నాను నేను.

గుంపు – ‘వద్దు బాబూ వద్దు. నిన్ను మేము హాస్పటల్ కు తీసుకెళ్ళలేము. పోలీస్ కేసవుతుంది. లేనిపోనిది కోర్టులు-కేసులు. ఆ జంజాటంలో మేము ఇరుక్కోలేము.’

మళ్ళీ ఒక సారి ‘జై శ్రీరామ్’, ‘అల్లాహు అక్బర్’ నినాదాలు ప్రతిధ్వనించాయి. ఇరుపక్షాలు పరస్పరం కొట్టుకోవటానికి-చంపుకోవటానికి సిద్ధపడ్డాయి. భయమేసి నేను దగ్గర్లోని చెట్టెక్కాను. ఈ ఉన్మాదుల్ని నమ్మటమెట్లా? చనిపోయినవాణ్ణి మళ్ళీ చంపినా చంపొచ్చు!.

నేనేం చెయ్యాలో నాకు పాలుపోవటం లేదు. రోడ్డుమీద పడుంది నా శరీరమే. నా శరీరాన్ని దహనం చెయ్యాలా, ఖననం చెయ్యాలా అన్న విషయం నాతో సంప్రదించాలి. కాని గుంపు నేను చెప్పేది వినటానికి సిద్ధంగా లేదు.

‘సోదరులారా! నాలాంటి సామాన్య మానవునికోసం మీరు మతసామరస్యాన్ని మంటగలపొద్దు. దయచేసి సంయమనం పాటించి సోదరభావాన్ని కాపాడండి. మీరంతా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోండి. నన్ను దహనం చెయ్యాలా-ఖననం చెయ్యాలా అన్న విషయం నిర్ణయించుకోండి. సంప్రదింపులతో విషయం తేలకపోతే అప్పుడు కోర్టుకు వెళ్ళండి’ అన్నాను నేను వినమ్ర స్వరంతో.

గుంపు – ‘ఈ కోర్టుల గొడవ మేం పడలేము. కోర్టు తీర్పు చెప్పటానికి చాలా కాలం పడుతుంది. ఇరవై-పాతిక సంవత్సరాల పాటు కేసు నడుస్తూనే ఉంటుంది. క్రింది కోర్టులో తీర్పు వెలువడితే మళ్ళీ హైకోర్టుకి, సుప్రీం కోర్టుకి వెళ్ళటం మామూలైపోయింది. అప్పటివరకు నీ శరీరాన్ని ఏం చెయ్యం?’ అడిగింది.

‘సోదరులారా! మీ మధ్య కొట్లాటలు-రక్తపాతాలు జరగకుండా ఉంచటానికి కోర్టు తీర్పు వచ్చేటంతవరకూ నేను ‘మమ్మీ’ గా ఉండటానికి కూడా సిద్ధంగా ఉన్నాను’ అన్నాను.

ఇరుపక్షాలు ఉద్రేకంగా ఉన్నాయి. మనుషులు పరస్పరం ప్రాణాలు తీసుకోవటానికి

సిద్ధంగాఉన్నారు. అంతకాలం వేచిఉండే ఓపిక ఎవరికీ లేదు. ఇవ్వాళే ఆటో-ఇటో తేలిపోవాలి వాళ్ళకి. నేను వాళ్ళతో ‘సోదరులారా! అయితే మీరు నాణెం ఎగరేసి తేల్చుకోండి. టాస్ లో ఎవరి పక్షంగెలిస్తే వాళ్ళ ఇష్టప్రకారం దహనం చెయ్యటమో-ఖననం చెయ్యటమో చెయ్యండి’ అన్నాను.

‘షోలే’ సినిమా మేమూ చూశాంలే బాబూ! ఈ ఎత్తులు మా దగ్గరేం పారవు’ అంది గుంపు.

చిత్రమైన పరిస్థితి. నేలమీద నా శరీరం పడుంది. చుట్టూ ఉన్మాదుల గుంపు ప్రోగయింది. నేను దగ్గర్లోని చెట్టుపైనున్నాను. నా దేహాన్ని ఈ రకంగా చూడవలసిరావటం ఇది మొట్టమొదటిసారి. నా దేహంపై నాకే జాలేసింది. దానికంటే ఎక్కువ జాలి నాకు నాచుట్టూ చేరిన గుంపుపై వేసింది. నా శవంపై హక్కు పొందేందుకు వీళ్ళు చంపటానికి-చావటానికి కూడా సిద్ధపడుతున్నారు.

అంతలో గుంపులోని చదువుకున్నట్టు కనిపిస్తున్న దుండగుడొకడు నేను కూర్చున్న చెట్టువైపు చూపిస్తూ ఇంగ్లీషులో ఆరిచాడు- ‘సీ దేర్… హీ ఈజ్ ఆన్ ద ట్రీ… బ్లడీ ఫూల్…కిల్ హిమ్…!’ ఉన్మాదులు నా శవాన్ని విడిచిపెట్టి నేనెక్కిన చెట్టు చుట్టూ మూగారు. భయంతో నేను ఇంకొక కొమ్మ పైకెక్కాను.

క్రిందనుంచి ఆవేశపరులు అరిచారు -‘ అసలు నువ్వెవరివో నువ్వే చెప్పు. లేకపోతే నిన్ను మళ్ళీ చంపుతాం.’

చిత్రమైన మనుషులు. చచ్చినవాణ్ణి మళ్ళీ చంపుతామంటున్నారు…. ఇంతకీ నేనెవర్ని? జ్ఞాపకం రావట్లేదు. నా మెదడుకు పనిపెట్టాను. కాని ఎంత ఆలోచించినా జ్ఞాపకం రాలేదు నేను హిందువునా- ముస్లింనా!? ఇంకెవరినైనానా!? తన గురించి తనకే ఏమీ జ్ఞాపకం లేనివాళ్ళు ఏ మతస్థులు? వాళ్ళకి ఏ పేరుంటుంది? రాముడు, రహీమ్, సింగ్, డేవిడ్?

గుంపులో ఉద్రిక్తత పెరిగింది. సంయమనం కనుమరుగవుతుంది. ఇరువైపులనుంచి త్రిశూలాలు-కత్తులు గాలిలో నాట్యమాడుతున్నాయి. ‘జై శ్రీరామ్’, ‘అల్లాహు అక్బర్’ నినాదాలతో ఆకాశం ప్రతిధ్వనిస్తోంది.

ఇక కొట్లాట మొదలౌతుందేమోనని భయపడి నేను మళ్ళీ ఒకసారి ప్రయత్నించాను – ‘సోదరులారా తొందరపడకండి, శాంతించండి. మీలో మీకు ఏ పరిష్కారం దొరక్కపోతే నా శరీరంలో సగభాగాన్ని హిందువులు కోసుకుని దాన్ని దహనం చేసుకోండి. మిగిలిన అర్ధ శరీరాన్ని ముస్లింలు తీసుకోండి, దాన్ని ఖననం చేసుకోండి’.

నాకు న్యాయకోవిదుడైన విక్రమాదిత్యుని తీర్పు జ్ఞాపకమొచ్చింది. అలా చెపితే ఏదో ఒక పక్షం వెనుకంజవేస్తుందని, దానితో నా శవానికి దుర్గతి పట్టకుండా ఉంటుందని నేను ఊహించాను.

కాని గుంపు నిజంగానే గొడ్డళ్ళు, కత్తులు, చురకత్తులు చేతబట్టుకుని నా శరీరాన్ని రెండు ముక్కలు చెయ్యటానికి ముందుకొచ్చింది. నేను చిటారుకొమ్మన కూర్చుని కూడా గజగజ వణికిపోయాను. ఎంతైనా నరకబోతున్నది నా శరీరం కదా!

వీళ్ళేం మనుషులు? శవాన్ని కూడా తెగకోసి పంచుకోవటానికి సిద్ధపడుతున్నారు! నేను వాళ్ళని పరిశీలనగా చూశాను. గుంపులో ఇరువైపులా ఒకేలాంటి ముఖాలు. కాషాయ జెండా పట్టినవారిలాంటి ముఖాలెలా ఉన్నాయో, అలాంటి ముఖాలే ఆకుపచ్చ జెండాలు పట్టుకుని కనిపించారు. అచ్చం అవే పాశవికమైన-ఆటవికమైన కళ్ళు, సరిగ్గా అవే వికృత మందహాసాలు గుంపులో రెండువైపులా ఉన్నాయి. నరసంహారాల్లో ఇలాంటి మనుషులే తారసపడతారు.

గుంపు గొడ్డళ్ళు, కత్తులు, చురకత్తుల పదును పరీక్షించుకుంటుంది. నా వాక్కుకి మహిమ ఉంటే ఎంత బాగుండేది. నేను ‘స్టేట్యూ’ అనగానే ఈ హంతకులందరూ, ఈ రక్తపిపాసులందరూ విగ్రహ సదృస్యులుగా మారిపోయేవారు. అప్పుడు నేను వీళ్ళందర్నీ లోతైన సముద్రంలో ముంచేసి వచ్చేవాణ్ణి.

గుంపు ఆయుధాలు తీసుకుని నా శవంపై ప్రయోగించటానికి సిద్ధంగా ఉంది. ఇంతలో వాళ్ళలో ఎవరో వ్యక్తి గట్టిగా ‘అరే అసలిదంతా ఎందుకు? వీడి ప్యాంటు విప్పి చుస్తే పోలా! హిందువో- ముస్లిమో ఇప్పుడే తేలిపోతుంది’ అరిచాడు.

ఇంకా ఈ అవమానం కూడా మిగులుందా నాకు! ఎన్నో జతల చేతులు నా శవానికున్న ప్యాంటు ఊడపీకటానికి ఉద్యుక్తులయ్యాయి. ఇక నేను ఉండబట్టలేకపోయాను. చెట్టుమీదనుంచి దిగి ‘రక్షించండి-రక్షించండి’ అని గట్టిగట్టిగా అరిచాను.

కాని అక్కడ నా అరుపులు వినేదెవరు? చూస్తూ చూస్తూ ఉండగానే ఆ దుండగులు నా శవాన్ని నగ్నంగా చేసిపారేశారు. సిగ్గుతో నేను కళ్ళు మూసుకున్నాను.

‘ఛీ ఛీ!’… ‘శివ శివా!’… ‘థూ…!’

గుంపులో కలగాపులగంగా ఒక గలబా – ఒక కోలాహలం! కళ్ళు తెరిచానోలేదో నాకు సంగతంతా అర్థమైంది. అప్పుడు జ్ఞాపకమొచ్చింది నేనెవర్నో! కొంతమంది తుంటరులు అశ్లీలమైన పరిహాసానికి ఒడికట్టారు. ఇంకొంతమందైతే ప్రత్యేకమైన పద్ధతిలో చప్పట్లు కొడుతూ ‘బావయ్యా-బావయ్యా’ అంటున్నారు. ఒకరితో ఒకరు ‘అరేయ్ వీడు… అటూ ఇటూ కానోడురా’ చెప్పుకుని నవ్వుకోసాగారు.

అప్పటివరకు అక్కడి వాతావరణంలో చోటుచేసుకున్న విద్వేషమంతా ఒక్కసారిగా చల్లబడింది.

నేనుమాత్రం హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాను.

నెమ్మదినెమ్మదిగా గుంపు చెదిరిపోసాగింది. కాషాయ జెండా వాళ్ళు ఒకవైపుకు వెళ్ళిపోయారు. ఆకుపచ్చ జెండావాళ్ళు మరోవైపుకు పోయారు. అదృష్టవశాత్తు ఈరోజు త్రిశూలాలు – కత్తులు కలియబడలేదు. ఇప్పుడిక నేనొక్కడినే ఒంటరిగా నా నగ్న శవం దగ్గరున్నాను.

నాకనిపించింది – ఈ రకంగా ఘర్షణలు, రక్తపాతాలు ఆగిపోతాయంటే ఆ పైవాడు అందర్నీ ‘నపుంసలుగా’ చేసేస్తే బాగుండు!

వెన్నా వల్లభరావు

తెలుగు నుంచి హిందీకి, హిందీ నుంచి తెలుగుకి కథ, కవిత, నాటకం మొదలైన ప్రక్రియల్లో గత 4 దశాబ్దాలుగా అనువాదాలు. రెండు భాషల్లో స్వీయ రచనలు. ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడలో హిందీ శాఖాధ్యక్షునిగా 3 దశాబ్దాలు పనిచేసి పదవీ విరమణ. 20 పుస్తకాల ప్రచురణతో పాటు పలు పత్రికల్లో అనువాద రచనల ప్రచురణ. సుమారు 60 ఆకాశవాణి జాతీయ నాటకాలు (హిందీ-తెలుగు-హిందీ) అనువాదాలు ప్రసారం. 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం.

Previous Post

ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 

Next Post

ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !

Next Post
ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !

ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • ఆంగ్ల కవిత : ఐనా ఉదయిస్తాను
  • రష్యన్ కథ : లాటరీ టికెట్టు 
  • కన్నడ కవిత: సీసా – ఓడ
  • ఆంగ్ల కవిత :  ఎవరూ…. (లేరు)
  • హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!
  • టర్కిష్ కథ : వలసపిట్ట
  • కన్నడ కథ: నాలుగో ఆయామం
  • ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !
  • హిందీ కథ: నన్ను పంచుకోండి
  • ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 
  • ఆంగ్ల కవిత : దశలు
  • ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న
  • గుజరాతీ కథ: కాకాజీ నీతికథ
  • ఆంగ్ల కవిత : వర్షంలో గాలి తెరలు
  • హిందీ కథ: పెద్దక్క ప్రయాణం 
  • ఆంగ్ల కవిత: గృహ గీతం
  • హిందీ కథ : కంఫర్ట్ జోన్
  • రష్యన్ కథ: భయం

అభిప్రాయాలు

  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply