• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 

రంగనాధ రామచంద్రరావు by రంగనాధ రామచంద్రరావు
July 10, 2026
in అనువాద కథలు
0
ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 

ఉర్దూ మూలం: శిరీన్ నియాజి
హిందీ అనువాదం : జనాబ్ జహీర్ నియాజీ
అనువాదం : రంగనాథ రామచంద్రరావు

 

 గుల్‌మొహర్ చెట్టు. తన పువ్వులన్నిటినీ రాల్చుకుని నిలబడిన, మోడువారిన ఆ చెట్టు తలపైనున్న  ఆకాశాన్ని చూస్తోంది! గాలి వేడిగా ఉంది. బూడిద గుడారాల్లో ఇంకా కొన్ని నిప్పుకణికలు పడివున్నాయి! ఎప్పుడైతే గాలి అలలు అణిగివున్న బూడిదను గెలుకుతుందో, అణగివున్న నిప్పుకణికలు ఏడుస్తూ సూర్యుడి వెక్కుతున్న కిరణాల్లో మెరుస్తాయి.

ఈ రోడ్డుకు ఒక వైపున నగిషీపని చేసిన గుండ్రటి ఎత్తయిన కప్పు ఉన్న మసీదు ఉంది. మరోవైపు అందమైన ఒక మందిరం. రెండు వైపులా ఆకర్షణీయమైన గుల్‌మొహర్ చెట్ల ఆకర్షణీయమైన పంక్తులు ఉన్నాయి. అవి రోడ్డు చివరి వరకు విస్తరించి 

ఉన్నాయి! వీటి కొమ్మలు పైభాగంలో కలిసిపోయి, ఒక రకమైన ముసుగును ఏర్పరుస్తున్నాయి.

వేసవి కాలంలో, శుక్రవారం ప్రార్థనలు చేయడానికి వచ్చే వాళ్లు ఈ గుల్‌మొహర్ చెట్ల నీడలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేవారు. ఆలయంలో కథా- కీర్తన జరిగినప్పుడల్లా, రాత్రంతా పాటలతో అలసిపోయిన భక్తులు ఈ గుల్‌మొహర్ చెట్ల నీడలో నిద్రపోయేవారు. ఎందుకంటే ఈ రోడ్డులో చాలా తక్కువ వాహనాలు తిరిగేవి. ఎక్కువగా కాలినడకన వెళ్లేవారు మాత్రమే ఈ దారిలో వెళ్ళేవారు. పొద్దు వాలుతుండగా వాహనాలు ఇక్కడికి వచ్చేవి. ఎందుకంటే ఈ రోడ్డు ముందుకు సాగుతూ  రెండు వీధులతో  కలిసేది. అక్కడ లోపల వేశ్యల బస్తీ ఉండేది. ఈ రోడ్డు మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ చెత్త కుప్పలు లేవు.

ఇక్కడ గుల్‌మొహర్ పూలు చెల్లాచెదురుగా ఉన్నాయి! చాలా జాగ్రత్తగా కలిసి పరిచిన  మఖమల్  తివాచీలాగా… ఒకటి మరొకదానితో  కలిసిన పూలను చూసి, ఎవరూ కూడా ఏ పువ్వు- ఎటు వైపు  చెట్టుదో- మసీదు వైపు ఉన్న చెట్టుదో లేదా ఆలయం వైపు ఉన్న చెట్టుదో చెప్పలేరు.

ఈ రోజు పూలతో అలంకరించబడిన, ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే  రోడ్డు మీద రక్తపు పెద్ద పెద్ద మరకలు ఉన్నాయి. లేదా బూడిద కుప్పలు- లేదా కాలిపోయిన దేవత.. లేదా ఊగిసలాడే గోపురాలు- లక్షలాది మంది శ్రమతో నిర్మించిన ఈ భవనాలు రక్తం, బూడిదతో నిండిపోయి తమ ఉనికిని కోల్పోతున్నట్లు కనిపించాయి.  వాటి శిథిలాల కుప్ప దగ్గర, కొన్ని బియ్యం గింజలు చెల్లాచెదురుగా పడివున్నాయి. చిరిగిన చొక్కా ముక్క అక్కడ పడివుంది… దాని మీద ఎవరి చూపు పడలేదు…

మసీదు వాళ్ల చూపులు హోలీ రంగుల చుక్కలు పడివున్న మసీదు గోడలపై పడ్డాయి… మందిరానికి సంబంధించిన వారికి రక్తంలో ముంచిన ఐదు వేళ్ల ముద్ర కంటపడింది- అంటే అమ్మవారి రక్తం…? రెండు వైపుల నుండి హింస జ్వాలలు ఎగిసిపడ్డాయి. 

మధ్యాహ్నం రెండు గంటల నుండి కర్ఫ్యూ. 

రాత్రి తొమ్మిది గంటల వరకూ మృతదేహాలను ఎత్తే పని జరుగుతూ ఉంది… 

దుఃఖంతో చంద్రుడు మేఘాల వెనుక నుండి ఆ మానవుని వైపు తొంగి చూసి ఏడవసాగాడు.. గుల్‌మొహర్ కూడా అలాగే చేసింది..

భిక్ష ద్వారా దొరికిన ధాన్యపు చిన్నమూటను మోసుకుని ఎనిమిదేళ్ల పిల్లవాడు వేశ్యల బస్తీ నుండివస్తున్నాడు. రోజంతా నగరంలోని పెద్దల చేతిలో అవమానాలు పొందిన తర్వాత, అతను పొద్దువాలగానే ఆ బస్తీ వైపు  వైపు వచ్చాడు. తిరిగి వెళుతున్నప్పుడు  ఇక్కడి నుండి ఆ  బస్తీ వైపు వెళుతుండగా, ఒక ప్రసిద్ధ వ్యక్తికి చెందిన కారు చాలా తీవ్రంగా తొక్కేసి ప్రాణాలు తీసింది.

ఈ రక్తపు చుక్కలు ఆ అమాయకపు పిల్లవాడి- తేలికగా విరిగిన  బిడ్డ గొంతు నుండి వచ్చిన ధారలే!  

ఇక ఆ మందిరపు గోడల మీద పడివున్న  ఆ ఐదు వేళ్ల ముద్రలు కూడా ఈ చిన్నారి చేతులవే..

అతను తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతూ గోడకు పోయి కొట్టుకున్నాడు.. ఆ తర్వాత ఆ అమాయకపు పిల్లవాడి శవాన్ని కుక్కలు  లాక్కుంటూ తీసుకెళ్లిపోయాయి!

ధాన్యపు ఈ గింజలు వాడి మూటలోనివే. ఆ గుడ్డముక్కలు వాడి చిరిగిన చొక్కావే! గుల్‌మొహర్ చెట్టు కొమ్మల, మసీదు గోడల, ఆలయపు మెట్లకు, వాడికి తప్ప ఈ రహస్యం ఎవరికి తెలుసు!  వీటన్నింటికీ సాక్ష్యం ఎవరు ఇవ్వగలరు?

గుల్‌మొహర్ చెట్లు సాక్ష్యం ఇస్తూనే ఉన్నాయి. కానీ ఈ మూగ జీవుల మాటలు ఎవరు వింటారు? ఎవరు అర్థం చేసుకుంటారు?

గుల్‌మొహర్ చెట్టులోని ప్రతీ కొమ్మ, ప్రతీ ఆకు, ప్రతీ మొక్క మృత్యుశోకాన్ని పాటిస్తున్నాయి. 

పదే పదే ‘బ్యాన్ బ్యాన్ ’ అంటున్నాయి. 

“అయ్యో మనిషీ,  నీ ఈ మూర్ఖత్వం ఎప్పటి వరకు?” అని గొణుక్కుంటున్నాయి.

రంగనాధ రామచంద్రరావు

రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 29 అనువాద నవలలు, 22 అనువాద కథా సంకలనాలు, 5 సంచార జీవుల ఆత్మకథలు, మరాఠి దళిత రచయిత శరణ్‌కుమార్ లింబాలే ఆత్మకథ, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన 9 అనువాదాలు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి. ఇతర భాషల నుంచి కన్నడంలోకి అనువదించిన రచనలు 5 పుస్తకాలుగా వచ్చాయి. కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన ‘ఓం ణమో’ నవలానువాదానికి 2020 సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు.

Previous Post

ఆంగ్ల కవిత : దశలు

Next Post

హిందీ కథ: నన్ను పంచుకోండి

Next Post
హిందీ కథ: నన్ను పంచుకోండి

హిందీ కథ: నన్ను పంచుకోండి

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

by రమేశ్ రాచపూటి
September 14, 2026
0

...

హిందీ కథ : కొత్త గాలి

హిందీ కథ : కొత్త గాలి

by విఎల్ నరసింహం శివకోటి
September 10, 2026
0

...

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

by పి. శ్రీనివాస్ గౌడ్
September 10, 2026
0

...

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

by తిరువాయపాటి రాజగోపాల్
September 10, 2026
0

...

మళయాళ చిన్న కథలు

మళయాళ చిన్న కథలు

by ఎడిటర్
September 10, 2026
0

...

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

by డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
September 10, 2026
0

...

హిందీ కథ : ఓడిపోయాను 

హిందీ కథ : ఓడిపోయాను 

by వెన్నా వల్లభరావు
September 10, 2026
0

...

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

by కేశవ్ గోపాల్
September 10, 2026
0

...

కన్నడ కథ : చావు

కన్నడ కథ : చావు

by చందకచర్ల రమేశబాబు
September 10, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

by శివ చల్లా
September 10, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026
హిందీ కవిత: అడవిలో వర్షం
అనువాద కవితలు

హిందీ కవిత: అడవిలో వర్షం

September 10, 2026
హిందీ కవితలు: గోధుమ + గోవు
అనువాద కవితలు

హిందీ కవితలు: గోధుమ + గోవు

September 10, 2026
సచ్చిదానందన్ కవితలు రెండు..
అనువాద కవితలు

సచ్చిదానందన్ కవితలు రెండు..

August 15, 2026
హిందీ కవిత: నా చిరునామా
అనువాద కవితలు

హిందీ కవిత: నా చిరునామా

August 15, 2026

అభిప్రాయాలు

  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply