• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఆంగ్ల కవిత : వర్షంలో గాలి తెరలు

బొల్లిముంత వెంకటరమణారావు by బొల్లిముంత వెంకటరమణారావు
July 10, 2026
in అనువాద కవితలు
0
ఆంగ్ల కవిత : వర్షంలో గాలి తెరలు

ఆంగ్లమూలం: థామస్ హార్డీ
తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకటరమణారావు

వారు తమ ప్రియమైన గీతాలు పాడుతున్నారు—
ఆమె, అతడు, అందరూ కలిసి…
ఉన్నత స్వరం, గంభీర స్వరం, మధుర స్వరం—
ఒకరు వాయిద్యం వాయిస్తూ…

కొవ్వొత్తుల వెలుగు ప్రతి ముఖాన్ని తాకుతోంది…
అయ్యో… కాలమా! కాలమా!

అనారోగ్యపు ఆకులు గుంపులుగా రాలిపోతున్నాయి…

వారు నేలపై పెరిగిన పచ్చికను తొలగిస్తున్నారు—
పెద్దలు, చిన్నవారు కలిసి…
దారులను శుభ్రంగా చేస్తూ, తోటను అందంగా మారుస్తూ…

నీడనిచ్చే కూర్చునే చోటును నిర్మిస్తున్నారు…
అయ్యో… కాలమా! కాలమా!

తెల్లని తుఫాను పక్షులు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎగురుతున్నాయి…

వారు ఆనందంగా ఉదయభోజనం చేస్తున్నారు—
పురుషులు, యువతులు కలిసి…
వేసవి చెట్టు నీడలో కూర్చుని…
దూరంగా సముద్రతీరాన్ని చూస్తూ…

పెంపుడు పక్షులు వారి మోకాల దగ్గర చేరుతున్నాయి…
అయ్యో… కాలమా! కాలమా!

వాడిపోయిన గులాబి గోడ నుంచి విరిగిపడుతోంది…

వారు కొత్త గొప్ప ఇంటికి మారుతున్నారు—
ఆమె, అతడు, అందరూ కలిసి…
గడియారాలు, తివాచీలు, కుర్చీలు అన్నీ బయట నేలపై…
తమకు చెందిన ప్రకాశవంతమైన వస్తువుల మధ్య…

అయ్యో… కాలమా! ఓ నా నేస్తమా

చివరికి వర్షపు చుక్కలు వారి చెక్కిన పేర్లను చెరిపివేస్తున్నాయి…
కాలం మెల్లగా అన్నింటినీ మాయం చేస్తోంది…

ఈ కవితలో ప్రధాన భావం జీవితం ఎంత ఆనందంగా, అందంగా, క్రమబద్ధంగా కనిపించినా అది శాశ్వతం కాదని చూపించడం. ప్రారంభంలో కుటుంబ సభ్యులు కలిసి పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, తోటల్లో శుభ్రత చేస్తూ, ఉదయభోజనాలు చేస్తూ ఆనందంగా జీవిస్తారు. వారి జీవితం ప్రకృతి మధ్య సంతోషం, ఐక్యత, సౌందర్యంతో నిండిపోయి ఉంటుంది. కొత్త ఇల్లు, వస్తువులు వంటి అంశాలు జీవితం స్థిరంగా, సురక్షితంగా ఉంటుందనే భావనను కలిగిస్తాయి. కానీ ఈ ఆనంద దృశ్యాల వెనుకనే కాలం తన ప్రభావాన్ని చూపించడం మొదలవుతుంది. ఆకులు రాలిపోవడం, తుఫాన్లు వీచడం, పాడైపోయిన గులాబి గోడ నుండి విరిగిపడటం వంటి చిత్రాల ద్వారా జీవితం క్రమంగా క్షీణించిపోతుందని తెలుస్తుంది. చివరికి వారి పేర్లు కూడా వర్షపు చుక్కలతో చెరిపివేయబడటం ద్వారా కాలం అన్నిటినీ మాయం చేసే శక్తి స్పష్టమవుతుంది. మొత్తం కవిత మనిషి జీవితంలోని ఆనంద క్షణాలు ఎంత తాత్కాలికమో, కాలం ముందు ఏదీ నిలవదని గాఢంగా తెలియజేస్తుంది.

థామస్ హార్డీ (1840 జూన్ 2 – 1928 జనవరి 11) ప్రసిద్ధ ఇంగ్లీష్ రచయిత మరియు కవి. ఆయన ఇంగ్లాండ్‌లోని డార్సెట్ ప్రాంతంలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుంచే గ్రామీణ జీవితం, ప్రకృతి సౌందర్యం ఆయన రచనలపై గాఢమైన ప్రభావం చూపాయి. ప్రారంభంలో ఆయన వాస్తుశిల్పిగా పనిచేశారు, తరువాత పూర్తిగా సాహిత్య రచన వైపు మళ్లారు.

ఆయన నవలలు గ్రామీణ జీవితం, ప్రేమలోని విషాదం, సామాజిక నియమాలు మరియు విధి శక్తి వంటి అంశాలను లోతుగా ప్రతిబింబిస్తాయి. Tess of the d’Urbervilles, Far from the Madding Crowd వంటి రచనలు ఆయనకు విశేష ఖ్యాతిని తెచ్చాయి. తరువాతి జీవితంలో ఆయన కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన రచనల్లో మానవ జీవితంలోని అస్థిరత, విధి కాఠిన్యత  ప్రకృతి  నిర్లిప్త స్వభావం స్పష్టంగా కనిపిస్తాయి. 

బొల్లిముంత వెంకటరమణారావు
బొల్లిముంత వెంకటరమణారావు
Previous Post

హిందీ కథ: పెద్దక్క ప్రయాణం 

Next Post

గుజరాతీ కథ: కాకాజీ నీతికథ

Next Post
గుజరాతీ కథ: కాకాజీ నీతికథ

గుజరాతీ కథ: కాకాజీ నీతికథ

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • ఆంగ్ల కవిత : ఐనా ఉదయిస్తాను
  • రష్యన్ కథ : లాటరీ టికెట్టు 
  • కన్నడ కవిత: సీసా – ఓడ
  • ఆంగ్ల కవిత :  ఎవరూ…. (లేరు)
  • హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!
  • టర్కిష్ కథ : వలసపిట్ట
  • కన్నడ కథ: నాలుగో ఆయామం
  • ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !
  • హిందీ కథ: నన్ను పంచుకోండి
  • ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 
  • ఆంగ్ల కవిత : దశలు
  • ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న
  • గుజరాతీ కథ: కాకాజీ నీతికథ
  • ఆంగ్ల కవిత : వర్షంలో గాలి తెరలు
  • హిందీ కథ: పెద్దక్క ప్రయాణం 
  • ఆంగ్ల కవిత: గృహ గీతం
  • హిందీ కథ : కంఫర్ట్ జోన్
  • రష్యన్ కథ: భయం

అభిప్రాయాలు

  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply